Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Pattabhishekam (1985)





చిత్రం: పట్టాభిషేకం (1985)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి (All)
నటీనటులు: బాలకృష్ణ , విజయశాంతి
దర్శకత్వం: కె. రాఘవేంద్ర రావు
నిర్మాత: నందమూరి హరికృష్ణ
విడుదల తేది: 19.12.1985



Songs List:



గుడ్ షాట్ పాట సాహిత్యం

 
చిత్రం: పట్టాభిషేకం (1985)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, యస్. జానకి

గుడ్ షాట్




కళ్యాణ ఘడియ పాట సాహిత్యం

 
చిత్రం: పట్టాభిషేకం (1985)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, యస్. జానకి

పల్లవి:
కళ్యాణ ఘడియ వచ్చే కౌగిల్లకి
సన్నాయి పిలుపు వచ్చె మద్దెళ్లకి
రెప్పంటు అంటుకోని నా కళ్ళలో
నిప్పంటుకున్న ఈడు వాకిల్లలో
ప్రేమగా ప్రేమనే పెళ్ళాడుకో
లేతగా మోతగా ముద్దాడుకో

కళ్యాణ ఘడియ వచ్చే కౌగిల్లకి
చెంగావి బిడియమొచ్చే చెక్కిల్లకి
ఏ వడ్డు ఆపలేని పరవళ్ళలో
ఏ పైట వెయ్యలేని పందిల్లలో
ప్రేమగా ప్రేమనే పెళ్ళాడుకో
లేతగా మోతగా ముద్దాడుకో

చరణం: 1
చుక్కమ్మ చేరాలి చంద్రయ్య ఊర్లోకి ఆ నింగిలో
హాయ్యో నా వళ్ళు నీ వళ్ళు వాటేసి కోవాలి
నీ కొంగులో
పడుచుదనపు సరసాలు పడగలెత్తు కెరటాలు
ఎవడంట ఆపేది ఈ జోరుని
ఎన్నెట్లో కలిసేటి గోదారిని
దమ్ముంటే రమ్మను మన పెళ్ళికి
బ్రహ్మైన జరపడు మన ప్రేమని

కళ్యాణ ఘడియ వచ్చే కౌగిల్లకి
చెంగావి బిడియమొచ్చే చెక్కిల్లకి
రెప్పంటు అంటుకోని నా కళ్ళలో
ఏ పైట వెయ్యలేని పందిల్లలో
ప్రేమగా ప్రేమనే పెళ్ళాడుకో
లేతగా మోతగా ముద్దాడుకో

చరణం: 2
కళ్యాణ గీతల్ని రాసేది స్వర్గంలో  తెలుసా మరీ
ఆ గీత చెరిపేది ఏ అడ్డు గీతైన రద్దేమరి
హో వయసు కడిగిన అందాలు
వలపు లిపిలో గ్రంధాలు
ప్రే అంటే మా అంటూ మనమే కల
ప్రేమించుకున్నప్పుడే సుందరం
తాటాకు తెచ్చుకో పందిళ్లకి
తాంబూలమిచ్చుకో మన పెళ్ళికి

కళ్యాణ ఘడియ వచ్చే కౌగిల్లకి
చెంగావి బిడియమొచ్చే చెక్కిల్లకి
ఏ వడ్డు ఆపలేని పరవళ్ళలో
ఏ పైట వెయ్యలేని పందిల్లలో
ప్రేమగా ప్రేమనే పెళ్ళాడుకో
లేతగా మోతగా ముద్దాడుకో

కళ్యాణ ఘడియ వచ్చే కౌగిల్లకి
సన్నాయి పిలుపు వచ్చె మద్దెళ్లకి
రెప్పంటు అంటుకోని నా కళ్ళలో
నిప్పంటుకున్న ఈడు వాకిల్లలో
ప్రేమగా ప్రేమనే పెళ్ళాడుకో
లేతగా మోతగా ముద్దాడుకో




ఇక్కడే ఇలాగే పాట సాహిత్యం

 
చిత్రం: పట్టాభిషేకం (1985)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, యస్. జానకి

ఇక్కడే ఇలాగే




సూర్యుడా వెళ్ళిపో పాట సాహిత్యం

 
చిత్రం: పట్టాభిషేకం (1985)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, యస్. జానకి

పల్లవి:
సూర్యుడా వెళ్ళిపో చూడకు మా ప్రేమా
చంద్రుడా చెల్లిపో వెన్నెలే మా మీద
చిలిపి వలపు చినుకులే 
తడుపుతున్న వేళలో
తారలన్ని సాక్షిగా తనువు కలుపు వేళలో

సూర్యుడా వెళ్ళిపో చూడకు మా ప్రేమా
చంద్రుడా చెల్లిపో వెన్నెలే మా మీద

చరణం: 1
ఏ పక్క చూసినా ఒక్కొక్క అందము
ఎడా పెడా ఎడా పెడా ఊరించగా
ఏ వంక చూసినా నీ చేతి వాటమే
అలా అలా చలకిగా  కవ్వినంచగా
అమ్మాయి నడుములో సన్నాయి వనుకులే
రగిలి రగిలి వగలు తగిలి వేదించగా
వలపే ఆరటమై వయసే పోరాటమై
ఎదలే కలిపేటి ఈ ముద్దు ముంగిల్లలో
గుబులు గుబులు గుబులుగా గుండెలయలు ముదరగా
గుబులు గుబులు గుబులుగా గుండెలయలు ముదరగా

సూర్యుడా వెళ్ళిపో చూడకు మా ప్రేమా
చంద్రుడా చెల్లిపో వెన్నెలే మా మీద

చరణం: 2
తొలిసారి పరిచయం చలిపువ్వు పరిమళం
ఘుమా ఘుమా ఘుమా ఘుమా
ఘుప్పించగ
ప్రలయంలో పరవశం పెదవుల్లో మదురసం
సల సల సల సల ఉప్పొంగగా
వత్తిడిలో వదగటం తాకిడితో తడవటం
తిరికి సొగసు కరిగి మరిగి ప్రేమించగా
చెలినే సంగీతమై,  చలిలో సౌందర్యమే
ఎదలే పొంగేటి ఈ చిలిపి రాగాలలో

ఎవరికెవరు ఇద్దరం చివరివరకు  ఒక్కరం
ఎవరికెవరు ఇద్దరం చివరివరకు  ఒక్కరం

సూర్యుడా వెళ్ళిపో చూడకు మా ప్రేమా
చంద్రుడా చెల్లిపో వెన్నెలే మా మీద

చిలిపి వలపు చినుకులే 
తడుపుతున్న వేళలో
తారలన్ని సాక్షిగా తనువు కలుపు వేళలో

సూర్యుడా వెళ్ళిపో చూడకు మా ప్రేమా
చంద్రుడా చెల్లిపో వెన్నెలే మా మీద




వేణుగాన లోలుడికి పాట సాహిత్యం

 
చిత్రం: పట్టాభిషేకం (1985)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, యస్. జానకి

వేణుగాన లోలుడికి



ఓ ప్రియతమా.... పాట సాహిత్యం

 
చిత్రం: పట్టాభిషేకం (1985)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, యస్. జానకి

పల్లవి:
ఓ ప్రియతమా....
నీవు లేని రాతిరి నిలిచిపోయే ఊపిరి
నీవు లేని రాతిరి నిలిచిపోయే ఊపిరి
కన్నీట తడిచే కౌగిలి...

నా ప్రాణమా....
నీవు రాని రాతిరి నిలిచిపోయే జాబిలి
నీవు రాని రాతిరి నిలిచిపోయే జాబిలి
సుడిగాలి గుడిలో హారతి...

నీవు లేని రాతిరి నిలిచిపోయే ఊపిరి

చరణం: 1
తెల్లవారి వెన్నెలల్లే తెళ్ళబోవు కన్నులతో
ఈ ఎడారిదారిలో ఎదురుచూపు నౌతున్నా
కోటలోని రాతిగా మీటలేని వీణలలో
రాలిపోవు రాగమేదో నేను పాడుకుంటున్నా
నీవు నన్ను చేరిన నాడే బ్రతుకుతుంది అనురాగం
నీవు నన్ను చేరిన నాడే బ్రతుకుతుంది అనురాగం
ఈ విషాద వీధుల్లో....
అతిధి లాగ ఒక్కసారి వచ్చివెల్లి పోరాదా

నీవు రాని రాతిరి నిలిచిపోయే జాబిలి
నీవు లేని రాతిరి నిలిచిపోయే ఊపిరి

చరణం: 2
పంజరాన రామచిలుక రెక్కలంటి ఊహలతో
నిన్ను చేరలేకనేను నివురులాగ అవుతున్నా
వేణువైన ఊదలేను వానకారు కోయిలల్లే
వేధనతో వేగలేక వెదురులాగ అవుతున్నా
నీవు వచ్చి కలిసిన నాడే తారలకి సంగమం
నీవు వచ్చి కలిసిన నాడే తారలకి సంగమం

ఈ నిశీధి వీధుల్లో....
మమతలాగ ఒక్కసారి కుశలమడిగి పోరాద

నీవు లేని రాతిరి నిలిచిపోయే ఊపిరి
నీవు రాని రాతిరి నిలిచిపోయే జాబిలి
కన్నీట తడిసే కౌగిలి....
నీవు రాని రాతిరి 
ఉలికిపోయే ఊపిరి


No comments

Most Recent

Default