చిత్రం: శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర (1984) సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి నటీనటులు: యన్. టి.రామారావు, బాలక్రిష్ణ , రతి అగ్నిహోత్రి దర్శకత్వం: యన్. టి.రామారావు నిర్మాత: యన్. టి.రామారావు విడుదల తేది: 29.11.1984
Songs List:
పంచముడని నిను పాట సాహిత్యం
చిత్రం: శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర (1984) సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: వి. రామకృష్ణ పంచముడని నిను కించపరచిరని బాధపడకురా కక్కా పంచముడని నిను కించపరచిరని బాధపడకురా కక్కా తిట్టిన నోరే నిను పొగడుతున్నప్పుడు వదిలేనురా వాళ్ళ తిక్క వదిలేనురా వాళ్ళ తిక్క పంచముడని నిను కించపరచిరని బాధపడకురా కక్కా ఆది లోన కులమతాలు లేవు వాడు వీడని తేడాల్లేవు దేహానికే ఈ బేదాలన్ని అంటరాని తనం ఆత్మకు లేదు పంచముడని నిను కించపరచిరని బాధ పడకురా కక్కా జగతిన వెలిగే సూర్యచంద్రులు నీ గూడేన వెలగనంటార భవనాల మండే అగ్నిదేవుడు నీ గుడిసెలో మండనంటాడ చల్లగ వీచే వాయు దేవుడు మిమ్మంటకుండ పోతున్నాడా ఆ దేవుళ్ళకే లేని అంటు ఈ మనుషులకేలరా కక్కా పంచముడని నిను కించపరచిరని బాధ పడకురా కక్కా జీవనాధారమైన నీరు మిము తాగవద్దు పొమ్మంటుందా అందరికందని ఆకాశం అది నీకే అందక పోతుందా సస్యశ్యామలమైన నేల నువ్వు దున్నితే పండక పోతుందా పంచ భూతాలకే లేని పక్షపాతము మనలో ఎందుకు కక్కా పంచముడని నిను కించపరచిరని బాధ పడకురా కక్కా బాధ పడకురా కక్కా అందరు మీకే దాసోహం అను కాలం దగ్గరలో ఉంది అగ్రగాములై రాజ్యాలేలే అదృస్టము పడుతుంది తప్పదురా నా మాట నే చూపింది సూటి బాట
No comments
Post a Comment