చిత్రం: బాలగోపాలుడు (1989) సంగీతం: రాజ్-కోటి నటీనటులు: బాలక్రిష్ణ , సహాసిని మణిరత్నం దర్శకత్వం: కోడి రామకృష్ణ నిర్మాత: యమ్.ఆర్.వి.ప్రసాద్ విడుదల తేది: 13.10.1989
Songs List:
ఒకటే తనువంతా పాట సాహిత్యం
చిత్రం: బాలగోపాలుడు (1989) సంగీతం: రాజ్-కోటి సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం: యస్.పి. బాలు, చిత్ర ఒకటే తనువంతా ఒక వింత తకధింతా ఒడిలో చెలరేగే సరికొత్త గిలిగింత సందేల పొద్దట్టా చల్లారిపోతే సందిళ్ళ ముద్దుల్లో సన్నాయి మోగే వెన్నెల్లోనే వెచ్చాలిస్తాలే, ఓ ఓ కౌగిళ్ళమ్మ గంధాలిస్తాలే ఈనాడే ఒకటే తనువంతా ఒక వింత తకధింతా ఒడిలో చెలరేగే సరికొత్త గిలిగింత నీ చూపు పడ్డనాడే చుక్కలాడే నీ ముగ్గు పచ్చలన్నీ ఎర్రనాయే నీ గాలి సోకగానే సోకులాడే నీ ఒంపుసొంపులన్నీ ఒళ్ళు చేసే ఈ తాకిడి ఒక తారంగము ముద్దాడితే తొలి తాంబూలము హత్తుకుంటే హాయి పుట్టసాగే గుడ్డు పిట్ట కూతే పెట్టసాగే శృంగార వీధుల్లో ఊరేగుతుంటే అందాలు కళ్ళల్లో ఆరేసుకుంటే ఒయ్యారంగా ఒళ్ళోకొస్తాలే,హో ఓ వన్నే చిన్నె మెల్లో వేస్తాలే ఈనాడే ఒకటే తనువంతా ఒక వింత తకధింతా ఒడిలో చెలరేగే సరికొత్త గిలిగింత నీ కాటుపడ్డ బుగ్గ కందిపోయే నీ చాటు అందమంత చిందిపోయే నీరెంట పడ్డ నీడ నిన్ను కోరే నీ వెన్ను పూస మీద గవ్వలాడే ఈ చీమలే చలి నారింజలై పండించిన తొలి గోరింటలై మత్తుగాలి వీచే మాపటేలా కొత్త ఊపుకొచ్చే రాసలీల సయ్యాట తోటల్లో సంపెంగ పూసే నీ కంటి పాపల్లో జాబిల్లి కాసే కళ్యాణాలే కల్లోకొస్తుంటే, ఓ ఓ కట్నాలన్నీ ముందే ఇస్తాలే ఈనాడే ఒకటే తనువంతా ఒక వింత తకధింతా ఒడిలో చెలరేగే సరికొత్త గిలిగింత సందేల పొద్దట్టా చల్లారిపోతే సందిళ్ళ ముద్దుల్లో సన్నాయి మోగే వెన్నెల్లోనే వెచ్చాలిస్తాలే, ఓ ఓ కౌగిళ్ళమ్మ గంధాలిస్తాలే ఈనాడే ఒకటే తనువంతా ఒక వింత తకధిం తా ఒడిలో చెలరేగే సరికొత్త గిలిగింత
బావా బావా బంతిపువ్వా పాట సాహిత్యం
చిత్రం: బాలగోపాలుడు (1989) సంగీతం: రాజ్-కోటి సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం: యస్.పి. బాలు, యస్. జానకి బావ బావ బంతిపువ్వ పండెక్కినా బండెక్కవ మావ మావ చందమామ సందేళ్ళకి చాపెక్కవ మనసోటి ఉందిక్కడ వరసేరో నీజిమ్మడ బామ బామ బంతి రెమ్మ బండెక్కనా లాగించన గుమ్మ గుమ్మ గూట్లో బొమ్మ దుమ్మిప్పుడే దులిపెయ్యన దరువేస్తే ఎడపెడ గొడవేలె ఊరువాడ బావ బావ బంతిపువ్వ పండెక్కినా బండెక్కవ బామ బామ బంతి రెమ్మ బండెక్కనా లాగించన పాలుగారే సొగసోచ్చింది పంచుకుంటావా పూలుకోరే వయసోచ్చింది పుచ్చుకుంటావా పండే పైరమ్మలో వయ్యారమె చూశా వచ్చే గౌరమ్మతో వసంతమాడేసా అందమే జత చేసుకో అందులో గిచ్చి చూసుకో కదలాడే నడుమెక్కడో అదిలాగే వడుపక్కడే బావ బావ బంతిపువ్వ పండెక్కినా బండెక్కవ బామ బామ బంతి రెమ్మ బండెక్కనా లాగించన చేను దున్నే పదునోచ్చింది చేతికోస్తావా పంట కోసే అదునొచ్చింది పక్కకోస్తావా మల్లె పూదోటలో నయ్యన మాటేసా సంధ్య పొద్ధిల్లలో సయ్యన వాటేస గుమ్మగా గురి చూడని కమ్మగా కసి తీరని వలవేసే వలపెక్కడో పరువాల పరుపక్కడే బావ బావ బంతిపువ్వ పండెక్కినా బండెక్కవా హ హహ… హహహ బామ బామ బంతి రెమ్మ బండెక్కనా లాగించన ఎహే హే ఎహే…ఎహే హే మనసోటి ఉందిక్కడ వరసేరో నీజిమ్మడ
చక్కనమ్మ పక్కనుంటే పాట సాహిత్యం
చిత్రం: బాలగోపాలుడు (1989) సంగీతం: రాజ్-కోటి సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం: యస్.పి. బాలు, యస్. జానకి చక్కనమ్మ పక్కనుంటే
చిటికమీద చిటికలలే పాట సాహిత్యం
చిత్రం: బాలగోపాలుడు (1989) సంగీతం: రాజ్-కోటి సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం: యస్.పి. బాలు చిటికమీద చిటికలలే
సువ్వి సువ్వి పాట సాహిత్యం
చిత్రం: బాలగోపాలుడు (1989) సంగీతం: రాజ్-కోటి సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం: యస్.పి. బాలు, పి. సుశీల సువ్వి సువ్వి
Don't worry be happy పాట సాహిత్యం
చిత్రం: బాలగోపాలుడు (1989) సంగీతం: రాజ్-కోటి సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం: యస్.పి. బాలు, యస్. జానకి Don't worry be happy
No comments
Post a Comment