Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Rangula Ratnam (2018)చిత్రం: రంగుల రాట్నం (2018)
సంగీతం: శ్రీచరణ్ పాకల
సాహిత్యం: రాకేందు మౌళి
గానం: యాజిన్ నజీర్, యామిని ఘంటసాల
నటీనటులు: రాజ్ తరుణ్ , చైత్ర శుక్ల
దర్శకత్వం: శ్రీ రంజిని
నిర్మాణం: అన్నపూర్ణా స్టూడియోస్
విడుదల తేది: 2018

ఏమైంది బుజ్జి కన్నా ప్రేమైందా చెప్పమన్నా
నీతోటే నేను అన్నా సందేహం వద్దు చిన్నా
అయ్య బాబోయ్ ప్రీమెక్కినట్టుగ పిచ్చయి పొందెనే
మా ఇంట్లోన ఏకంగా వింతలు ఏడూ చూడగ
రా ముద్దు లియ్యవా హద్దు దాటవా
యుద్ధమే లిప్పుతో చెయ్యవా

ఏదో గిలి - మాయరోగమా మళ్ళీ
గదిలో కెళ్ళి - తంతా గిచ్చి గిల్లి
ఇది న్యాయమా చెలి - పోరా డోంట్ బి సిల్లీ
చలిగాలికె బలి కోరే కౌగిలి

రావా ముద్దు లియ్యవా హద్దు దాటవా
యుద్ధమే లిప్పుతో చెయ్యవా

అందాల ఆడపిల్ల
తాకేవో ఆడపిల్ల
చూపుల్తో గుండె గుల్ల
చేద్దాం రా లల్ల లాల

నాతో పదా - ఒల్లే కొవ్వెక్కిందా
ఫీలింగ్ లేదా నీకేదో అయ్యిందా
ఏమైనా బాగుందా - పో పోరా నా బొంద
అందలూరిస్తుంటే పిచ్చె పట్టదా

ఏమైంది బుజ్జి కన్నా ప్రేమైందా
నీతోటే నేను అన్నా సందేహం
అయ్య బాబోయ్ ప్రీమెక్కినట్టుగ పిచ్చయి పొందెనే
మా ఇంట్లోన ఏకంగా వింతలు ఏడూ చూడగా
రా ముద్దు లియ్యవా హద్దు దాటవా
యుద్ధమే లిప్పుతో చెయ్యవా


******  *******  *******


చిత్రం: రంగుల రాట్నం (2018)
సంగీతం: శ్రీచరణ్ పాకల
సాహిత్యం: కిట్టు విస్సప్రాగడ
గానం: శ్రీచరణ్ పాకల

ఎన్నో ఎన్నో సందేహాలే ప్రేమా
ఉందో లేదు ఈ లోకంలో ప్రేమా
ఎన్నెనెన్నో యుద్దాలునా ప్రేమా
నీదో కాదో గెలుపే లేని ప్రేమా
నీలో ఉన్నా నీతో ఉన్నా
నీ సొంతం కాదే ప్రేమా

గుండెల్లొ దాగి నిప్పల్లె మారి
రెప్పల్నె దాటె ప్రేమా
ముంచేస్తున్న కాల్చేస్తున్నా
మౌనంగ చూస్తూనే ఉందీ ప్రేమా
నిషబ్దంలో ఓ స్వప్నంలా
నిద్దట్లో నీ వెంటె ఉందీ ప్రేమా

ఎన్నో ఎన్నో సందేహాలే ప్రేమా
ఉందో లేదు ఈ లోకంలో ప్రేమా

సమరం ప్రేమా...సమరం ప్రేమా
సరసం ప్రేమా...విరహం ప్రేమా

ఎన్నో ఎన్నో సందేహాలే ప్రేమా
ఉందో లేదు ఈ లోకంలో ప్రేమా
ఎన్నెనెన్నో యుద్దాలునా ప్రేమా
నీదో కాదో గెలుపే లేని ప్రేమా
నీలో ఉన్నా నీతో ఉన్నా
నీ సొంతం కాదే ప్రేమా

దారే కాని తీరం లేని
గోరంలా తోచె ప్రేమా
ఏ కాంతి లేని ఏకాంతం లోన
నిన్నుచి చూసే ప్రేమా
బంధాలన్నీ బందిస్తున్నా
నిందిస్తు చూస్తూనే ఉందీ ప్రేమా
గుర్తొస్తున్నా మరిపిస్తున్నా
పోనట్టు నీలోనె దాగే ప్రేమా

ఎన్నో ఎన్నో సందేహాలే ప్రేమా
ఉందో లేదు ఈ లోకంలో ప్రేమా
ఎన్నెనెన్నో యుద్దాలునా ప్రేమా
నీదో కాదో గెలుపే లేని ప్రేమా


******  *******  *******


చిత్రం: రంగుల రాట్నం (2018)
సంగీతం: శ్రీచరణ్ పాకల
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కాల భైరవ

నువ్వు లేని రోజు నాకు ఎదురైతె
పట్టుకున్న వేలు నన్ను వదిలేస్తె
ఏమవాలో చెప్పలేదు ఏమమ్మ
ముందుగానె నేర్పలేదు ఏలాగమ్మా
ఏం చేయనమ్మా ఏం తోచదే
ఎటు వెల్లనమ్మా అంతా చీకటె
నమ్మేదెలాగమ్మ నువు లేవంటే
బతికేదెలాగమ్మ అది నమ్మితే
ఒడిని వీడి అడుగైన నడవలేదెటూ

సుడిని పడిన పడవైనాను చూడిటూ
అమ్మ ఉందిగా మరింక నాకేం లోటు
అనుకోవడమేనేమొ నా పొరపాటు

పాతికేల్ల నుంచి నేను చంటి పాపనే
ఉన్నపాటుగా ఇవాలెలాగ ఎదగనే
నువ్వే తినిపించగా మెతుకే దిగదే
నువ్వే కనిపించక పగలు రేయి దిగులే

సుడిని పడిన పడవైనాను చూడిటూ
అమ్మ ఉందిగా మరింక నాకేం లోటు
అనుకోవడమేనేమొ నా పొరపాటు

రెప్పదాటి వెల్లకంటు కంటి పాపలా
నన్ను దాచి కన్ను తెరవనంటె ఇంకెలా
పిలిచా అమ్మా అనీ విననే వినవా
ఎదరే నిలిచా మరీ చూసా నాన్న అనవా

సుడిని పడిన పడవైనాను చూడిటూ
అమ్మ ఉందిగా మరింక నాకేం లోటు
అనుకోవడమేనేమొ నా పొరపాటు
******  *******  *******


చిత్రం: రంగుల రాట్నం (2018)
సంగీతం: శ్రీచరణ్ పాకల
సాహిత్యం: రాజ్ తరుణ్
గానం: పూజన్ కోహ్లీ

ప్రేమ ప్రేమ ప్రేమా
హా...ప్రేమ ప్రేమ ప్రేమా
ప్రేమ ప్రేమ ప్రేమా
హా...ప్రేమ ప్రేమ ప్రేమా
ప్రేమ ప్రేమ ప్రేమా
హా...ప్రేమ ప్రేమ ప్రేమా

నీహ్రుదయం మొదటి సారి ఎగసే చిరు గాలిలా
తాకెనులే మలుపు తిరిగి ఎదకేదొ హాయిలా
కల కాదె ఇది నిన్న లాగా
కదిలాడె మది ఊరుకోదా
కడలై పొంగె మనసులో మాటలు తీరం కోరవా
కనులలో నిండుగా నువ్విల చేరగా
మాటలే పాటగా మనసులో మారవా

నీడ వెంబడే నడిచిన నిండు వెన్నెలవి నీవా
చీకటన్నదె తెలుపనివెలుగువి నీవయ్యవా
కదిలే కాలమంతా నీకై బ్రతకనా
కడనే దాటి నీతో అడుగులు వేయనా
ఈ లోకం సగం జంట చేర్చి నీ పాదము వద్ద విడిచిపోనా
నీ ప్రేమలొ అది సగము తూగి ఆ రుణమే తీరునా
అందని స్నేహమే వీడని బంధమై
అమ్మలో ప్రేమనే ఇచ్చనే కానుకై

Most Recent

Default