Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Wanted (2011)



చిత్రం: వాంటెడ్ (2011)
సంగీతం: చక్రి
నటీనటులు: గోపిచంద్, దీక్షా సేథ్
కథ, స్క్రీన్ ప్లే, మాటలు,దర్శకత్వం: బి.వి.యస్. రవి
నిర్మాత: వి.ఆనంద్ ప్రసాద్
సినిమాటోగ్రాఫీ: రసూల్ ఎల్లోర్
ఎడిటర్: శంకర్
బ్యానర్: భవ్య క్రియేషన్స్
విడుదల తేది: 26.01.2011


చిత్రం:  వాంటెడ్ (2011)
సంగీతం: చక్రి
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: చక్రి , కౌశల్య

చెప్పనా చెప్పనా
నా కన్నా ఇష్టం నువ్వని
నువు లేక నేనే లేనని
చెప్పనా చెప్పనా
నా కనులకి స్వప్నం నువ్వని
నాలో సగ భాగం నువ్వని
మనసంటుంది నీతోడు కావాలని
నీతో నిండు నూరేళ్లు సాగాలని
ప్రాణమే నువ్వని

చెప్పనా - చెప్పనా
నా కనులకి స్వప్నం నువ్వని
నువు లేక నేనే లేనని

నీ చూపు నాపై ప్రసరించని
నీ ఊహ నాలో ప్రవహించని
గుండెలో కొత్తగా ఏమిటీ బరువని
అడిగితే అన్నది నువ్వు నిండావని
నా చేతి గీత నువ్వేనని
నీ వల్లే రాత మారిందని
దేవతే నువ్వని

చెప్పనా చెప్పనా
నా కన్నా ఇష్టం నువ్వని
నువు లేక నేనే లేనని

నీ నవ్వుల్లోన నది ఉందని
మది అందులోన మునిగిందని
నలుగురు ఎదురయి అడిగితే చెప్పని
అరుదుగా దొరికిన కానుకే నువ్వని
వదిలుండలేను నీ చేయిని
దాచుంచలేను ఈ మాటని
లోకమే నువ్వని

చెప్పనా చెప్పనా
నా కన్నా ఇష్టం నువ్వని
నువు లేక నేనే లేనని
చెప్పనా చెప్పనా
నా కనులకి స్వప్నం నువ్వని
నాలో సగ భాగం నువ్వని
మనసంటుంది నీతోడు కావాలని
నీతో నిండు నూరేళ్లు సాగాలని
ప్రాణమే నువ్వని

Most Recent

Default