Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Govinda Govinda (1994)చిత్రం: గోవిందా గోవిందా (1994)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి. బాలు, చిత్ర
నటీనటులు: నాగార్జున, శ్రీదేవి
దర్శకత్వం: రాంగోపాల్ వర్మ
నిర్మాత:  సి. అశ్వనీదత్
విడుదల తేది: 21.01.1994

అందమా అందుమా అందనంటే అందమా
చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా
ప్రాణమున్న పైడిబొమ్మ పారిజాత పూలకొమ్మ
పరవశాలు పంచవమ్మ పాల సంద్రమా

అందమా అందుమా అందనంటే అందమా
చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా
ప్రాణమున్న పైడిబొమ్మ పారిజాత పూలకొమ్మ
పరవశాలు పంచవమ్మ పాల సంద్రమా
ఆడుమా పాడుమా మౌనమే మానుకోవమ్మ
అందమా అందుమా అందనంటే అందమా

ఆకలుండదే దాహముండదే
ఆకతాయి కోరిక కొరుక్కుతింటదే
ఆగనంటదే దాగనంటదే
ఆకుచాటు వేడుక కిరెక్కమంటదే
వన్నెపూల విన్నపాలు విన్నానమ్మి
చిటికనేలు యిచ్చి ఏలుకుంటానమ్మి
రాసి పెట్టి ఉందిగనక నిన్నే నమ్మి
ఊసులన్ని పూసగుచ్చి ఇస్తాసుమ్మి
ఆలనా పాలనా చూడగా చేరనా చెంత

అందమా అందుమా అందనంటే అందమా
చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా

వెయ్యి చెప్పినా లక్ష చెప్పినా
లక్ష్య పెట్టదే ఎలా ఇదేమి విలవిలా
తియ్య తియ్యగా నచ్చ చెప్పని
చిచ్చి కోట్టనీ ఇలా... వయ్యారి వెన్నెల
నిలవనీదు నిదరపోదు నారాయణ
వగల మారి వయసు పోరు నా వల్లన
చిలిపి ఆశ చిటికలోన తీర్చేయ్యనా
మంత్రమేసి మంచి చేసి లాలించనా
ఆదుకో నాయనా... ఆర్చవా... తీర్చవా... చింత

అందమా అందుమా అందనంటే అందమా
చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా
ప్రాణమున్న పైడిబొమ్మ పారిజాత పూలకొమ్మ
పరవశాలు పంచవమ్మ పాల సంద్రమా
ఆడుమా పాడుమా మౌనమే మానుకోవమ్మ


********  ********  ********


చిత్రం: గోవిందా గోవిందా (1993)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, చిత్ర, మాల్గాడి శుభ

పల్లవి:
హుయ్ ఢముకెయ్ డుం డుం డిగా డిగా సందడి సెయ్ తమాసగా
అంగ రంగ వైభవంగా సంబరం వీధుల్లో సేరి సివమెత్తంగా
హుయ్.. దరువేయ్ తధినకా అడుగేయరా అదిలెక్కా
సామిరంగా సిందాడంగా సీనయ్య యేడుకొండలు దిగికిందికిరాగా
అమ్మ బ్రహ్మ దేవుడో.. కొంప ముంచినావురో
ఎంత గొప్ప సొగసురో ఏడ దాచినావురో
పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు
రంగరిస్తివో ఇలా బొమ్మ చేస్తివో
అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా
కనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా

చరణం: 1
కనురెప్పలు పడనప్పుడు కల కళ్లపడదుగా
కనుకిప్పుడు ఎదరున్నది కల్లై పోదుగా
ఒహొహొ... ఒహొ ఒహో ఒహో. ఒహొహొ.. ఒహొహొ
కనురెప్పలు పడనప్పుడు కల కళ్లపడదుగా
కనుకిప్పుడు ఎదరున్నది కల్లై పోదుగా

ఒకటై సిన్నా పెద్దా అంతా చుట్టూ చేరండి…
తకథై ఆటాడించే చోద్యం చూడండి

చంద్రుళ్లో కుందేలు సందెల్లో అందాలు
మన ముంగిట్లో కథాకళి ఆడేనా

అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా
కనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా
అమ్మ బ్రహ్మ దేవుడో.. అరే కొంప ముంచినావురో
ఎంత గొప్ప సొగసురో ఏడ దాచినావురో

చరణం: 2
మహ గొప్పగ మురిపించగ సరికొత్త సంగతి
తల తిప్పగ మనసొప్పక నిలిచే జాబిలి
ఒహొహొ... ఒహొ ఒహో ఒహో. ఒహొహొ.. ఒహొహొ
మహ గొప్పగ మురిపించగ సరికొత్త సంగతి
తల తిప్పగ మనసొప్పక నిలిచే జాబిలి

అప్పన్న తనామనా కధం తొక్కే పదానా
తప్పన్న తనా మనా తేడా లేదోయ్ నా

తందానా తాళానా కిందైనా మీదైనా
తలవంచేనా తెల్లారులూ తిల్లానా

హోయ్.. హోయ్.. హోయ్...
అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా
కనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా
అమ్మ బ్రహ్మ దేవుడో కొంప ముంచినావురో
ఎంత గొప్ప సొగసురో ఏడ దాచినావురో
పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు
రంగరిస్తివో ఇలా బొమ్మ చేస్తివో
అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా

హుయ్ ఢముకెయ్ డుం డుం డిగా డిగా సందడి సెయ్ తమాసగా
అంగ రంగ వైభవంగా సంబరం వీధుల్లో సేరి సివమెత్తంగా

హుయ్.. హుయ్.. హుయ్..
దరువేయ్ తధినకా అడుగేయరా అదిలెక్కా
సామిరంగా సిందాడంగా సీనయ్య యేడుకొండలు దిగికిందికిరాగా


********  ********  ********


చిత్రం: గోవిందా గోవిందా (1993)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర

ఈందిర మందిర శుందర ఖారా
ఎందుక హొందర సందిట చేరా
ఇందిర మందిర శుందర ఖారా
అందుకె తొందర సందిట చెరా
మానస చోర మల్లెల వీరా మాటరా
మాపటి సూరా మన్మధ వీరా మోతరా... ఒ ...ఒ

ఈందిర మందిర శుందర ఖారా
ఎందుక హొందర సందిట చేరా
ఇందిర మందిర శుందర ఖారా
అందుకె తొందర సందిట చెరా

ఆరు బయటా తక్ తక్ తాకదిమి
కన్నె జారె పైటా తిక్ తక్ తికదిన్
టెల్ల ఛీరా తక్ తక్ తకదిమి
టెల్ల వారెదాకా దిక్ దిక్ తికదిన్
తాలాలు తప్పెట్లు ఆగాలిలే
పూల దుప్పట్లు చప్పట్లు మోగాలిలే
కౌగిట్లొ కాలాలు కాగాలిలె
చిమ్మ చికట్లొ శిగ్గమ్మ ఖరగాలిలె
కొట్టినా తిట్టినా గుట్టుగా కట్టుకొ కుర్రడో
కట్టినా పట్టినా ప్రేమగా తట్టుకొ ఆమ్మడో
కొత్త నీ జోడుకి కొక్కరొ కోడుకి
పొత్తులె రద్దురా నన్ను లేపొద్దురా

ఈందిర మందిర శుందర ఖారా
ఎందుక హొందర సందిట చేరా
ఇందిర మందిర శుందర ఖారా
అందుకె తొందర సందిట చెరా

వైషాకంలొ తత్ తత్ తరిగిట
వచ్చి ఆషాడంలో దిత్ దత్ తిరగిట
కార్తికంలొ తత్ తత్ తరిగిట
వస్తె హేమంతంలో దిత్ దత్ తరిగిట
నీ గుండె గుప్పిల్లు విప్పాలిలే
ప్రేమ ఊప్పంటు సందేల రేగాలిలే
మంత్రాలు తంత్రాలు మానాలిలే
ప్రేమ సూత్రాల కావ్యాలు రాయాలిలే
తప్పులె ఒప్పులు పెట్టకె తిప్పలు ఆమ్మడో
గొప్పలె చెప్పినా పప్పులె ఉడుకునా కుర్రడో
అబ్బని పట్టులొ ఖమ్మని హాయిరో
చెతలె ముద్దులె మాటలింకొద్దులే

ఈందిర మందిర శుందర ఖారా
ఎందుక హొందర సందిట చేరా
ఇందిర మందిర శుందర ఖారా
అందుకె తొందర సందిట చెరా
మానస చోర మల్లెల వీరా మాటరా
మాపటి సూరా మన్మధ వీరా మోతరా... ఒ ...ఒ


*******  *******  *******


చిత్రం: గోవిందా గోవిందా (1993)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర

ఓ నవీన నవీన నవీన ఓ
ఈ జగాన నువ్వెనా హసీన ఓ ఓ ఓ
ఏమి పులకింతా ఇది ఎంత గిలిగింతా
ఇది ఎంత ఘాటు ప్రేమ తాకిడో

ఓ నవీన నవీన నవీన ఓ ఓ ఓ
ఈ జగాన నువ్వెనా హసీన ఓ ఓ ఓ
ఏమి పులకింతా ఇది ఎంత గిలిగింతా
ఇది ఎంత ఘాటు ప్రేమ తాకిడో

ఓ నవీన నవీన నవీన

కొకనైన కాకపోతి
కొమ్మ చాటు సోకులన్ని తడిమె వేడిలో
కౌగిలైన కాకపోతి
ఆకలైనా అందమంతా అడిగే వెలలో

నీలొని తడి అందాలు శ్రుంగార మకరందాలు
నీ తీపి బలవంతాలు దోచేసె నా సొంతాలు

వసంతమాడే వయస్సు నీదే
అది తెలిసిన సరసుడు
కలసిన పురుషుడు జత పడిటె

ఓ నవీన
ఓ నవీన నవీన నవీన ఓ ఓ ఓ
ఈ జగాన నువ్వెనా హసీనా

ఒంపులోన సొంపులిచ్చి
చెంపలోన కెంపులిచ్చి ఒదిగే వేలలో
నిద్దరోని కొత్త పిచ్చి
నిన్ను చూసి కన్ను గిచ్చి కరిసే ఆశలో

అల్లారు వయ్యరాలె
అల్లాడి పోయెవేల
చల్లారు పొద్దుల్లోన
ఊపెయ్యన ఉయ్యాల

ఇదేమి గోలా వారించు వేలా
మనసెరిగిన సొగసరి
మధనుడి మగసిరి తలబడితే

ఓ నవీన నవీన నవీన
ఓ నవీన నవీన నవీన ఓ ఓ ఓ
ఈ జగాన నువ్వెనా హసీనా ఓ ఓ ఓ
గాలి గిలిగింత చెలి గాలిపులకింత
తొలి ప్రేమదెంత ఘాటు తాకిదో


*******  *******  *******


చిత్రం: గోవిందా గోవిందా (1993)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, చిత్ర

ప్రేమంటె నిజంగ ఏమంటె
ఇదంటు ఎట్టా చెప్పగలం
ప్రేమించె యెదల్లొ ఏముందొ
పదాల్లొ ఎట్టా చూపగలం.

తొలి చినుకుల తడి ఇదనీ
తొలి కిరనపు తనుకిదనీ
తొలి వలుపుల తలపడనీ.
ఎట్టగ పోల్చడం...

ప్రేమంటె నిజంగ ఏమంటె
ఇదంటు ఎట్టా చెప్పగలం
ప్రేమించె యెదల్లొ ఏముందొ
పదాల్లొ ఎట్టా చూపగలం.
ఆఆ... ఆ. ఆ...
ఆఅ... ఆ. అ...

పోటికైన చెమటలుపట్టె.
దీటుంది ఈ ప్రేమలొ...
ఉప్పెనకైనా ఒనుకులు పుట్టె.
ఊపుంది ఈ ప్రేమలొ...
వెను తిరగని వేగాలతో.
తొలికదలిక ఏ నాటిదో...
మునుపెరగని రాగాలతో...
పిలిచిన స్వరం ఏమంటదో...
జత కుదిరిన క్షణం ఇదనీ...
ముడి బిగిసిన గునమిదనీ...
కద ముదిరిన విదం ఇదని ఎట్టగ తేల్చడం...
హొ హొ... హొ... హూ...

ప్రేమంటె నిజంగ ఏమంటె
ఇదంటు ఎట్టా చెప్పగలం

శంకరుడైన. కింకరుడైన...
లొంగాలి love ధాటికీ... హ
పండితుడైనా... పామరుడైనా...
పసివాడి సయ్ దాటకీ...
తుది ఎరుగని ప్రేమాయనం...
మొదలెప్పుడని ఊహించడం...
గత చెరితల పారాయనం...
గతులెన్నని వివరించడం...
పరులెరగని అనుభవమై .
పద పద మను అవసరమై...
పయనించె ప్రణయ రదం...
ఎటు పరుగు తీయునో...
హొ హొ హొ హొ హొ హొ హొ హొ...

ప్రేమంటె నిజంగ ఏమంటె
ఇదంటు ఎట్టా చెప్పగలం
ప్రేమించె యెదల్లొ ఏముందొ
పదాల్లొ ఎట్టా చూపగలం.

తొలి చినుకుల తడి ఇదనీ
తొలి కిరనపు తనుకిదనీ
తొలి వలుపుల తలపడనీ.
ఎట్టగ పోల్చడం...
హొ హొ హొ హొ హొ హొ హొ... ఆ...
హొ హొ హొ హొ.ఆఅ...


Most Recent

Default