Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Tholi Prema (2018)


చిత్రం: తొలిప్రేమ (2018)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: శ్రీమణి
గానం: అర్మాన్ మాలిక్ , యస్.యస్.థమన్
నటీనటులు: వరుణ్ తేజ్ , రాశిఖన్నా
మాటలు ( డైలాగ్స్ ):
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వెంకీ అట్లూరి
నిర్మాత: బి.వి.యస్.యన్. ప్రసాద్
సినిమాటోగ్రఫీ: 
ఎడిటర్: 
బ్యానర్: శ్రీ వెంక‌టేశ్వర సినీ చిత్ర 
విడుదల తేది: 09.02.2018

నిన్నిలా నిన్నిలా చూసానే
కళ్ళలో కళ్ళలో దాచానే
రెప్పలే వెయ్యనంతగా కనుల పండగే

నిన్నిలా నిన్నిలా చూసానే
అడుగులే తడబడే నీవల్లే
గుండెలో వినపడిందిగా ప్రేమ చప్పదే

నిన్ను చేరి పోయే నా ప్రాణం
కోరేనేమో నిన్నే ఈ హృదయం
నా ముందుందే అందం నాలో ఆనందం
నన్ను నేను మరచిపోయేలా ఈ క్షణం

ఈ వర్షానికి స్పర్శవుంటే నీ మనసే తాకెనుగా
ఈ ఎదలో నీ పేరే పలికెనే ఇవాళే ఇలా (2)

తొలి తొలి ప్రేమ దాచేయికల
చిరు చిరు నవ్వే ఆపేయకీలా
చలి చలి గాలి వీచేంతలా
మరి మరి నన్నే చేరేంతలా

నిన్ను నీ నుంచి నువ్వు బైటకు రానివ్వు
మబ్బు తెరలు తెంచుకున్న జాబిలమ్మలా

ఈ వర్షానికి స్పర్శవుంటే నీ మనసే తాకెనుగా
ఈ ఎదలో నీ పేరే పలికెనే ఇవాళే ఇలా (2)


*******  *******   *******


చిత్రం: తొలిప్రేమ (2018)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: శ్రీమణి
గానం: అర్మాన్ మాలిక్, దేవన్ ఏకాంబరన్

లవ్లీ లవ్లీ మెలొడీ ఏదొ మదిలో బట్టర్ ఫ్లై చేసా 
ఎన్నో ఎన్నో రోజులు వేచిన నిమిషలో అడుగేసా 
కాలాన్నే కాలాన్నే ఆపేసా ఆపేసా 
ఆకాసాన్నే దాటేశా 

విన్నానే విన్నానే నీ పెదవే చెబుతుంటె విన్నానే 
ఉన్నానే ఉన్నానే తొలి ప్రేమై నీలోనె ఉన్నానే
నీ ఎదలో ఎదలో పుట్టేసింద ప్రేమ నా పైనా 
నా మనసే మనసే కనిపించిందా కాస్త లేటయినా 
నీ వెనకే వెనకే వచ్చేస్తున్న దూరమెంతున్నా 
మరి ఎపుడీ ఎపుడీ రోజు వస్తుందని వేచి చూస్తున్నా 

అరె ఎందరున్న అందమైన మాటె నాకు చెప్పేశావుగా 
అరె వంద చంద మామలున్న చోటుల్లోకె నెట్టేశావుగా 

విన్నానే విన్నానే నీ పెదవే చెబుతుంటె విన్నానే 
ఉన్నానే ఉన్నానే తొలి ప్రేమై నీలోనె ఉన్నానే

నీ పలుకే వింటు తేనెలనే మరిచాలే 
నీ అలకే కంటు ఆకలినే విడిచాలే 
నీ నిద్దుర కోసం కలల తెరే తెరిచాలే 
నీ మెలుకువ కోసం వెలుతురులే పరిచాలే 

నువ్ మెరిసే మెరిసే హరివిల్లే నీ రంగు నేంటా 
నువ్ కురిసే కురిసే వెన్నెలవే నీ రేయి నేనవుతా 
నా పేరే పిలిచే అవసరమైనా నీకు రాదంటా 
కన్నీరే తుడిచే వేలు నేనై నీకు తోడుంటా 

అరె ఎందరున్న అందమైన మాటె నాకు చెప్పేశావుగా 
అరె వంద చంద మామలున్న చోటుల్లోకె నెట్టేశావుగా 

విన్నానే విన్నానే నీ పెదవే చెబుతుంటె విన్నానే 
ఉన్నానే ఉన్నానే తొలి ప్రేమై నీలోనె ఉన్నానే*******  *******   *******చిత్రం: తొలిప్రేమ (2018)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: శ్రీమణి
గానం: రాహుల్ నంబియర్

సునోనా సునైనా నీ హైపెర్ హార్టె నేనె కొల్ల గొట్టనా 
సునోనా సునైనా నా వెంటె నువ్వె వచ్చే లాగ చెయ్యనా 
నీ ట్రింకిల్ ట్రింకిల్ తారలకి లింకవ్వనా 
నీ సింగిల్ సింగిల్ మనసుతో మింగిల్ అవనా 
నీ సింపుల్ సింపుల్ లైఫులో వండర్ అవనా 
సునైనా నీతో రానా 

సునోనా సునైనా నీ హైపెర్ హార్టె నేనె కొల్ల గొట్టనా 
సునోనా సునైనా నా వెంటె నువ్వె వచ్చే లాగ చెయ్యనా 

ఈ ఏజే పోతె మళ్ళీ రాదె నువ్వేం చేసినా 
ఇది ఓపెన్ చేసి బోటిల్ బేబి కాలి చేసెయనా 
ఓ లవ్లి లేడి నువ్వే ఎంత బెట్టే చేసినా 
మన ఇద్దరి మద్య లందన్ బ్రిడ్జె నేనె దాటెయ్ నా 
నాలో సరిగమ నీలో పదనిస కలపవ నువ్ పలకవా 
ఆతో పాటుగ నాతో పాటగ మారవ నువ్ పాడవా 

నీ ట్రింకిల్ ట్రింకిల్ తారలకి లింకవ్వనా 
నీ సింగిల్ సింగిల్ మనసుతో మింగిల్ అవనా 
నీ సింపుల్ సింపుల్ లైఫులో వండరవ్వనా 
సునైనా నీతో రానా *******  *******   *******


చిత్రం: తొలిప్రేమ (2018)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: శ్రీమణి
గానం: రఘు దీక్షిత్

Break the rules Break the rules 
Just break the rules 
రోదసీ లో దూసుకెల్లు రాకెట్ లా
Make the rules make the rules 
Lets make the rules 
మనము కోరుకుంటె దొరికె చాక్లెట్ లా

సోడియ రేడియ రోడియ హీలియం బేరియం తోరియం ఉంది ఫార్ములా 
ఫార్ములా...ఫార్ములా...ఫార్ములా 
మన పాటల్లొ లిరిక్స్ మాటల్లొ ఎతిక్స్ గుండెల్లొ ఫ్రీడంకి లేదు ఫార్ములా 
ఫార్ములా...ఫార్ములా...ఫార్ములా 
క్షణాల జిందగీలో no compromise అనేలా 
మన విరగ బరువు తరగ నురగ తిరుగు లేని గోలా 

Break the rules break the rules 
Just break the rules 
రోదసీ లో దూసుకెల్లు రాకెట్ లా
Make the rules make the rules 
Lets make the rules 
మనము కోరుకుంటె దొరికె చాక్లెట్ లా

మోహన మురలిని వలచిన వాడూ 
తియ్య రాధని పిలిచిన వాడూ 
కమ్మని వేలల కురిసిన ఆడు 
పరిమల వనమున ప్రియమగు వాడు 

చిన్ని కృష్నుడు మా చేతికందాడు 
చిలిపి కృష్నుడు మా మనసు వదలడు 
చిన్ని కృష్నుడు మా చేతికందాడు 
చిలిపి కృష్నుడు మా మనసు వదలడు 

హరే హరే మురారే...హరే హరే మురారే 
హరే హరే మురారే...హరే హరే మురారే 
హరే హరే మురారే...హరే హరే మురారే 

క్లాసు రూంలో బెంచీకే అతుక్కు పోకురా 
రెక్కలే విప్పి చూడరా 
ఓ ర్యాంకు కోసం పోటినే కాసేపు ఆపరా 
రొమాన్సుకీ స్పేసు ఇవ్వరా 
తీయ్ పరదా...చేయ్ సరదా 
వెలిగి పోదా కలల పరదా 

ఆ ఫైరుకి లైఫుకి నీరుకి జోరుకి 
స్పీడుకి ఉందొక ఫార్ములా 
మనలో తెగువ పొగరు జిగురు వగరు లేదంట ఫార్ములా 
యుగాల యువతరంలో సరైన హిష్టరీలా 
మన విరగ బరువు తరగ నురగ తిరుగు లేని గోలా 

Break the rules Break the rules 
Just break the rules 
రోదసీ లో దూసుకెల్లు రాకెట్ లా
Make the rules make the rules 
Lets make the rules 
మనము కోరుకుంటె దొరికె చాక్లెట్ లాMost Recent

Default