చిత్రం: అందాల రాశి (1980)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం: సినారె
గానం: యస్.పి.బాలు, సుశీల
నటీనటులు: రాజ్ కుమార్ , రతి అగ్నిహోత్రి (నూతన తారలు)
మాటలు ( డైలాగ్స్ ):
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె.ఆర్.వి.భక్త
నిర్మాత: కె.ఆర్.వి.భక్త
సినిమాటోగ్రఫీ: కె.ఆర్.వి.భక్త
ఎడిటర్:
బ్యానర్: బిన్నీ ఇంటర్ నేషనల్
విడుదల తేది: 1980
పల్లవి:
కోయిల పిలుపే కోనకు మెరుపు...
మాయని వలపే మనసుకు మెరుపు...ఊ..
కోయిల పిలుపే కోనకు మెరుపు...
మాయని వలపే మనసుకు మెరుపు...
చరణం: 1
ఆఆ...అహహా...ఆ..ఆ..అహహా..ఆ..§ ≥
ఆఆ...అహహా...ఆ..ఆ..అహహా..ఆ..
నీలి నింగికెంత ఆశ నేలపైన వాలాలనీ...
గాలి అలలకెంత ఆశ పూలపైన తేలాలనీ...
నీలి నింగికెంత ఆశ నేలపైన వాలాలనీ...
అలలకెంత ఆశ పూలపైన తేలాలనీ...
పెదవులకెంత ఆశ... ఎంత ఆశ.... ఎంత ఆశా...
పెదవులకెంత ఆశ... ఎంత ఆశ.... ఎంత ఆశా...
పదే పదే పదే పదే ఒదిగి ఉండాలని...
కోయిల పిలుపే కోనకు మెరుపు...
మాయని వలపే మనసుకు మెరుపు...
కోయిల పిలుపే కోనకు మెరుపు...
మాయని వలపే మనసుకు మెరుపు...
చరణం: 2
కడలి పొంగు కోరుతుంది కన్నె వాగు కావాలనీ...
వయసు జల్లు కోరుతుంది వలపు పంట పండాలనీ...
కడలి పొంగు కోరుతుంది కన్నె వాగు కావాలనీ...
వయసు జల్లు కోరుతుంది వలపు పంట పండాలనీ...
హృదయం కోరుతుంది... కోరుతుంది... కోరుతుంది...
హృదయం కోరుతుంది... కోరుతుంది... కోరుతుంది...
ఇలా ఇలా ఇలా ఇలా కలిసి ఉండాలనీ....
కోయిల పిలుపే కోనకు మెరుపు...
మాయని వలపే మనసుకు మెరుపు...
కోయిల పిలుపే కోనకు మెరుపు...
మాయని వలపే మనసుకు మెరుపు.