చిత్రం: విక్రమ్ (1986)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, సుశీల
నటీనటులు: నాగార్జున, శోభన
దర్శకత్వం: వి.మధుసూదనరావు
నిర్మాత: అక్కినేని వెంకట్
విడుదల తేది: 23.05.1986
నీవె రాగం నేనె గీతం
శ్రుతి చేసింది అనురాగమే
యెవరేమన్నా యెదురేదైనా
నాలో రాగలన్ని నీకే అంకితం
నాలో రాగలన్ని నీకే అంకితం
నీవె రాగం నేనె గీతం
శ్రుతి చేసింది అనురాగమే
యెవరేమన్నా యెదురేదైనా
నాలో రాగలన్ని నీకే అంకితం
నాలో రాగలన్ని నీకే అంకితం
కలాలకు అది కరగదు లే
దైవాలకే అది బెదరదు లే
నడి వేసవికి వసి వాడదు లే
సుడి గాలులకి ఇలా రాలదు లే
కరీదిచ్చె షరాబేడి
గరీబైనా వరిస్తుందీ
అదే ప్రేమా అదే అనురాగం అనుబంధం
నీవె రాగం నేనె గీతం
శ్రుతి చేసింది అనురాగమే
యెవరేమన్నా యెదురేదైనా
ఒక జ్వాలగా అధి రగులునులే
ప్రియ జ్యోతిగా అది మిగిలెనులే
అది యెరుగనిది భయమొకటేలే
మనసెరుగందీ బ్రతుకెందుకులే
అదే సత్యం అదే నిత్యం
అదే ప్రాణం అదే సర్వం
అదే ప్రేమా అదే అనురాగం అనుబంధం
నీవె రాగం నేనె గీతం
శ్రుతి చేసింది అనురాగమే
యెవరేమన్నా యెదురేదైనా
నాలో రాగలన్ని నీకే అంకితం
నాలో రాగలన్ని నీకే అంకితం