Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Sankeertana (1987)





చిత్రం: సంకీర్తన (1987)
సంగీతం: ఇళయరాజా
నటీనటులు: నాగార్జున, రమ్యకృష్ణ
దర్శకత్వం: గీతా కృష్ణ
నిర్మాత: డాక్టర్. యమ్.గంగయ్య
విడుదల తేది: 26.02.1987



Songs List:



కలికి మేనులో పాట సాహిత్యం

 
చిత్రం: సంకీర్తన (1987)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి
గానం: యస్.పి.బాలు, జానకి


కలికి మేనులో



మనసే పాడెనులే పాట సాహిత్యం

 
చిత్రం: సంకీర్తన (1987)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి
గానం: యస్.పి.బాలు

తందన్న తానన్న తననననా నాన
తందన్న తానన్న తననననా నాన...
తందన్న తానన్న తందన్న తానన్న తందన్న తందన్ననా

మనసే పాడెనులే మైమరచి మనసే పాడెనులే
మనసే పాడెనులే మైమరచి మనసే పాడెనులే
సెలయేటి మలుపులా విరితోట పిలుపులా
ఏటి మలుపులా విరితోట పిలుపులా
సరసరాగ సంకీర్తనగా నేడే
మనసే పాడెనులే మైమరచి మనసే పాడెనులే

ఆ ఆ ఆ.....
కోయిలలై పలికే... తీయని నీ పిలుపే...
కురిసెను కోనల్లో రాగాలేవో
కోయిలలై పలికే... తీయని నీ పిలుపే
కురిసెను కోనల్లో రాగాలేవో

అందియలై మ్రోగే సందెలోనే... అంచులు తాకే అందాలేవేవో
జిలుగులొలుకు చెలి చెలువం.... లల్లా లల్లా లల్లా లల్లా
కొలను విడని నవ కమలం... లల్లా లల్లా లల్లా లల్లా
జిలుగులొలుకు చెలి చెలువం... కొలను విడని నవ కమలం
అది మీటే నాలో ఒదిగిన కవితల

మనసే పాడెనులే మైమరచి మనసే పాడెనులే
మనసే పాడెనులే మైమరచి మనసే పాడెనులే
సెలయేటి మలుపులా.. విరితోట పిలుపులా
ఏటి మలుపులా.. విరితోట పిలుపులా
సరసరాగ సంకీర్తనగా నేడే

మనసే పాడెనులే మైమరచి.. మనసే పాడెనులే
మనసే పాడెనులే మైమరచి.. మనసే పాడెనులే




మనసున మొలిచిన పాట సాహిత్యం

 
చిత్రం: సంకీర్తన (1987)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, జానకి

మనసున మొలిచిన సరిగమలే
ఈ గల గల నడకల తరగలుగా
నా కలలను మోసుకు నిను జేరీ
ఓ కమ్మని ఊసుని తెలిపేనే
కవితవు నీవై పరుగున రా
యెద సడితో నటియించగ రా

స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం

కూకూ చుకుచుకు కూకూ చుకుచుకు కూకూ చుకుచుకు కూకు
రా రా స్వరముల సోపానములకు పాదాలను జత చేసీ
కుకూ కుకూ కీర్తనా తొలి ఆమనివై రా
పిలిచే చిలిపి కోయిలా యెట దాగున్నావు
కూకూ చుకుచుకు కూకూ చుకుచుకు కూకూ చుకుచుకు కూకు
రా రా స్వరముల సోపానములకు పాదాలను జత చేసీ

మీ నృత్యం చూసి నిజంగ...నిజంగ

మువ్వల రవలి పిలిచింది కవిత బదులు పలికిందీ
కలత నిదుర చెదిరింది మనసు కలను వెతింకిందీ
వయ్యరాల గౌతమీ వయ్యరాల గౌతమి ఈ కన్యారూప కల్పనా
వసంతాల గీతినీ నన్నే మేలుకొల్పెనా
భావాల పూల రాగల బాట నీకై వేచేనే

కూకూ చుకుచుకు కూకూ చుకుచుకు కూకూ చుకుచుకు కూకు
యేదో స్వరగతి నూతన పదగతి చూపెను నను శృతి చేసీ
ఇది నా మది సంకీర్తనా కుకూ కుకూ కూ
సుధలూరే ఆలాపన కుకూ కుకూ కూ
యేదో స్వరగతి నూతన పదగతి చూపెను నను శృతి చేసీ
కూకూ చుకుచుకు కూకూ చుకుచుకు కూకూ చుకుచుకు కూకు

లలిత లలిత పదబంధం మదిని మధుర సుమగంధం
చలిత మృదుల పదలాస్యం అవని అధర దరహాసం
మరందాల గానమే మరందాల గానమే మృదంగాల నాదము
ప్రబంధాల ప్రాణమే నటించేటి పాదము
మేఘాల దారి వూరేగు వూహ వాలే ఈ మ్రోల

కూకూ చుకుచుకు కూకూ చుకుచుకు కూకూ చుకుచుకు కూకు
యేదో స్వరగతి నూతన పదగతి చూపెను నను శృతి చేసీ
ఇది నా మది సంకీర్తనా కుకూ కుకూ కూ
సుధలూరే ఆలాపన కుకూ కుకూ కూ
రా రా స్వరముల సోపానములకు పాదాలను జత చేసీ
కూకూ చుకుచుకు కూకూ చుకుచుకు కూకూ చుకుచుకు కూకు



వేవేలా వర్ణాలా పాట సాహిత్యం

 
చిత్రం: సంకీర్తన (1987)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, వాణీ జయరాం

వేవేలా వర్ణాలా
ఈ నేలా కావ్యాలా
అలలు శిలలు తెలిపే కధలు పలికే నాలో గీతాలై

వేవేలా వర్ణాలా
ఈ నేలా కావ్యాలా

ఓ తల్లి గోదరి తుళ్ళి తుళ్ళీ పారేటి పల్లే పల్లే పచ్చని పందిరి
పల్లే పచ్చని పందిరి
నిండు నూరేళ్ళు పండు ముత్తైదువల్లె ఉండు పంట లచ్చిమి సందడి
పంట లచ్చిమి సందడి

వాన వేలితోటి నేల వీణ మీటే నీలి నింగి పాటే ఈ చేలట
కాళిదాసు లాటి ఈ కొస వ్రాసుకున్న కమ్మనైన కవితలె ఈ పూలట
ప్రతి కదలికలో నాట్యమె కాదా
ప్రతి ౠతువూ ఒక చిత్రమె కాదా
యెదకే కనులుంటే

వేవేలా వర్ణాలా
ఈ నేలా కావ్యాలా
అలలు శిలలు తెలిపే కధలు పలికే నాలో గీతాలై

వేవేలా వర్ణాలా
ఈ నేలా కావ్యాలా



దేవి దుర్గా దేవి పాట సాహిత్యం

 
చిత్రం: సంకీర్తన (1987)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి
గానం: యస్.పి.బాలు, జానకి


దేవి దుర్గా దేవి



వందరూపాయల నోటు పాట సాహిత్యం

 
చిత్రం: సంకీర్తన (1987)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి
గానం: యస్.పి.శైలజ


వందరూపాయల  నోటు




దివి దారులు పాట సాహిత్యం

 
చిత్రం: సంకీర్తన (1987)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు


దివి దారులు





తిల్లాన (థిం తరన) పాట సాహిత్యం

 
చిత్రం: సంకీర్తన (1987)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి
గానం: యస్.పి.బాలు, శైలజ


తిల్లాన (థిం తరన)



గానం ఆగిపొదులే పాట సాహిత్యం

 
చిత్రం: సంకీర్తన (1987)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి
గానం: యస్.పి.బాలు


గానం ఆగిపొదులే



ఏ నావదే తీరమో...పాట సాహిత్యం

 
చిత్రం:  సంకీర్తన (1987)
సంగీతం:  ఇళయరాజా
సాహిత్యం:  ఆత్రేయ
గానం:  కె.జె.యేసుదాస్

పల్లవి:
ఏ..ఏ...ఏహే...ఓ....ఓ...ఓ...ఓ....
ఓ...ఓ...ఓ...ఓ...ఓ...

ఏ నావదే తీరమో... ఏ నేస్తమే జన్మవరమో
ఏ నావదే తీరమో... ఏ నేస్తమే జన్మవరమో
కలగానో...ఓ..ఓ... కథగానో.... ఓ.. ఓ..
మిగిలేది నీవే... ఈ జన్మలో... ఓ...
ఏ నావదే తీరమో... ఏ నేస్తమే జన్మవరమో

చరణం: 1
నాలోని నీవే నేనైనానో.... నీలోని నేనే నీవైనావో
నాలోని నీవే నేనైనానో.... నీలోని నేనే నీవైనావో

విన్నావా ఈ వింతను.... అన్నారా ఎవరైనను
విన్నావా ఈ వింతను.... అన్నారా ఎవరైనను
నీకు నాకే చెల్లిందను... ఉ.. ఉ...

ఏ నావదే తీరమో... ఏ నేస్తమే జన్మవరమో

చరణం: 2
ఆకాశమల్లె నీవున్నావు.... నీ నీలి రంగై నేనున్నాను
ఆకాశమల్లె నీవున్నావు.... నీ నీలి రంగై నేనున్నాను

కలిసేది ఊహేనను.... ఊహల్లో కలిసామను...
కలిసేది ఊహేనను.... ఊహల్లో కలిసామను...
నీవు... నేనే... సాక్షాలను...

ఏ నావదే తీరమో.... ఏ నేస్తమే జన్మవరమో
కలగానో... ఓ... కథగానో.... ఓ...
మిగిలేది నీవే ఈ జన్మలో...
ఏ నావదే తీరమో... ఏ నేస్తమే జన్మవరమో
ఏ నావదే తీరమో... ఏ నేస్తమే జన్మవరమో



ఓంకార వాక్యం పాట సాహిత్యం

 
చిత్రం: సంకీర్తన (1987)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, జానకి


ఓంకార వాక్యం

Most Recent

Default