Search Box

Mundadugu (1983)



చిత్రం: ముందడుగు (1983)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: మైలవరపు గోపి
గానం: యస్.పి.బాలు, సుశీల
నటీనటులు: కృష్ణ , శోభన్ బాబు, జయప్రద, శ్రీదేవి , రాజేంద్రప్రసాద్
దర్శకత్వం: కె.బాపయ్య
నిర్మాత: డి.రామానాయుడు
విడుదల తేది: 1983

కోడెకారు చిన్నవాడ వాడిపోని వన్నెకాడ
కోడెకారు చిన్నవాడ వాడిపోని వన్నెకాడ
కోటలోన పాగా లేసావా
చల్ పువులరంగా
మాతతోనే మనసుదోచావా
చల్ పువులరంగా
మాతతోనే మనసుదోచావా
చింతపూల రైకదాన చిలిపి చూపుల చిన్నదానా
చింతపూల రైకదాన చిలిపి చూపుల చిన్నదానా
కోరికలతో కోటేకట్టావా
చల్ నవ్వులరాణి
దోరవలపుల దోచుకున్నావా
చల్ నవ్వులరాణి
దోరవలపుల దోచుకున్నావా

చెట్టు మీద పిట్ట వుంది పిట్టనోటా పిలుపు వుంది
పిలుపు ఎవరికో తెలుసుకున్నావా
చల్ పువులరంగా తెలుసుకుంటే కలిసివుంటావా
చల్ పువులరంగా తెలుసుకుంటే కలిసివుంటావా
పిలుపు విన్నా తెలుసుకున్నా పిల్లదానా నమ్ముకున్నా
తెప్పలాగా తేలుతున్నానే
చల్ నవ్వులరాణి నాకు జోడుగా నావనడిపేవా
చల్ నవ్వులరాణి నాకు జోడుగా నావనడిపేవా

నేల వదిలి నీరు వదిలి నేను నువ్వను తలపుమాని
ఇద్దరొకటై ఎగిరి పోదామా
చల్ పువులరంగా గాలి దారుల తేలిపోదామా
చల్ పువులరంగా గాలి దారుల తేలిపోదామా
ఆడదాని మాతవింటే తేలిపోవటం తేలికంటే
తేల్చి తేల్చి ముంచుతారంట
చల్ నవ్వులరాణి మునుగుతుంటే నవ్వుతానంట
చల్ నవ్వులరాణి మునుగుతుంటే నవ్వుతానంట



*******  *******  *******


చిత్రం: ముందడుగు (1983)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: మైలవరపు గోపి
గానం: సుశీల

ప్రేమకు నేను పేదను కానూ...(2)
ఆకలిని దప్పికని అడగకు నాన్న
వేకువలు వెన్నెలలు లేవుర కన్నా...

కసితీరా నవ్వేందుకు లోకం ఉందీ
కడుపారా ఏడ్చేందుకు శోకం ఉందీ..(2)
అక్కరకే రానీ ఒక పాశం ఉందీ
అక్క అని తమ్ముడనీ భంధం ఉందీ..
ఈ బాధలో ఆ బందమే కడుపు నింపుతోంది కనులు తుడుస్తుంది కనులు తుడుస్తుంది.
ఆరారో...ఆరారో...ఆరారో...ఆరారో...


*******  *******  *******


చిత్రం: ముందడుగు (1983)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: మైలవరపు గోపి
గానం: యస్.పి.బాలు

నాకొక శ్రీమతి కావాలి..నీ అనుమతి దానికి కావాలి
నాకొక శ్రీమతి కావాలి..నీ అనుమతి దానికి కావాలి
మేనక అందం ఊర్వశి నాట్యం కలబోసి కాపురం చెయ్యాలి

మీటుతుంటే రాగాలు మోగాలి నీలో...
ముట్టుకుంటే మూడు ముళ్ళు కావాలి నీతో
మీటుతుంటే రాగాలు మోగాలి నీలో...
ముట్టుకుంటే మూడు ముళ్ళు కావాలి నీతో
సన్నజాజి వత్తిళ్ళు చందమామ రాత్రిళ్ళు
గడపాలిలే నువ్వు నాతో..
రోజులలో చలి మోజులలో అచ్చిబుచ్చి కోపాలు గుచ్చి గుచ్చి చూడాల ఊరించి ఉడికించుకుంటా...
అరె నీవైతె జంటా హ హ హ నాకేల రంభ
హెయ్ ధిం ధిం తారా ధిం ధిం తారా ధిం ధిం తారా
నాధిందిన్న నాధిందిన్న నాధిందిన్న

పొద్దుకాడ ముద్దిచ్చి లేపాలి నువ్వు
ముద్దు ముద్దు మీద ముద్దిచ్చి లేచేది నేను
పొద్దుకాడ ముద్దిచ్చి లేపాలి నువ్వు
ముద్దు ముద్దు మీద ముద్దిచ్చి లేచేది నేను
ఫిఫ్టీఫిఫ్టీ కాఫీల పిల్లదాని రాగాల సరసాల తో పొద్దు పోను
కౌగిలి లో తడి హారతులూ గిల్లీ గిల్లీ కజ్జాలు అల్లిబిల్లి కయ్యాలు తొలిసంధ్య సాయంత్రమంటా..
ఓయ్ ఏ కంటి చూపూ అరెరెరె నీకంటి కంటకుండా...
హెయ్ ధిం ధిం తారా ధిం ధిం తారా ధిం ధిం తారా
నాధిందిన్న నాధిందిన్న నాధిందిన్న


Most Recent

Default