Home Movies / Albums Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Chaavu Kaburu Challaga (2021)


 

చిత్రం: చావు కబురు చల్లగా (2021)
సంగీతం: జకెస్ బిజాయ్
నటీనటులు: కార్తికేయ, లావణ్య త్రిపాఠి, ఆమని, బద్రం
దర్శకత్వం: కౌశిక్ పెగల్లపాటి
నిర్మాత: బన్నీ వాసు
సమర్పణ: అల్లు అరవింద్
విడుదల తేది: 19.03.2021చిత్రం: చావు కబురు చల్లగా (2021)
సంగీతం: జకెస్ బిజాయ్
సాహిత్యం: కరుణాకర్ అడిగర్ల
గానం: రేవంత్

పల్లవి:
ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టాగా పుట్టావురో
అట్టా అట్టా అట్టా అట్టా అట్టాగే పోతావురో
ఇట్టే ఇట్టే ఇట్టే ఇట్టే ఫీలైపోతారేందిరో
సత్తే సత్తే సత్తే సత్తే సత్తే ఏమౌతాదిరో

గాల్లో దీపం గుండెల్లో ప్రాణం
ఎప్పుడు తుసంటుందో ఎవడికీ తెలుసును లేరా
ఒంట్లో జీవం కాదె మన సొంతం
ఉన్నన్నాళ్ళు పండగ చేసి పాడెక్కేయిరా
పోయేవాడిని పోనివ్వక నీ ఏడుపు ఎందుకు రా
నీ ఆస్తి గీస్తి ఏమైనా ఆడట్టుకుపోతాడా
కోటల్లోని రారాజైన కాటికి పోవాలా
నువ్వు నేను ఎవడైనా కట్టెల్లో కాలాల

మై నేమ్ ఈజు రాజూ బస్తి బాలరాజు
చావు కబురు చల్లగా చెబుతా ప్రతి రోజూ
మై నేమ్ ఈజు రాజూ బస్తి బాలరాజు
చావు కబురు చల్లగా చెబుతా ప్రతి రోజూ

చరణం: 1
చుట్టం చూపుకు వస్తాం పెట్టిందల్లా తింటాం
పెర్మనెంటుగా ఆ ఇంట్లోనే బైఠాఇంచముగా
సినిమా పోస్టరు చూస్తాం ఓ టిక్కెట్ తీసి వెళతాం
అయిపోయాక కుర్చీ ఖాళీ చెయ్యక తప్పదుగా
ఆరడుగుల బాడీ అంతే అద్దెకు ఉంటున్నామంతే
ఈ బాడీ కంపనీ వదిలేయాలి టైమే అయిపోతే
పుట్టేటప్పుడు ఊపేస్తారు నిన్నే ఉయ్యాల
పోయేటప్పుడు నలుగురువచ్చి చక్కా మోయాలా
ఉన్నన్నాళ్ళు ఆ నలుగురిని సంపాదించాలా
ఊరాంతా నిను ఊరేగించి టాటా సెప్పలా

స్వర్గానికి తొలి మెట్టు నా బండేరా ఒట్టు
ఎవ్వడైనా సచ్చాడంటే నాకే ఫోనూ కొట్టు
స్వర్గానికి తొలి మెట్టు నా బండేరా ఒట్టు
ఎవ్వడైనా సచ్చాడంటే నాకే ఫోనూ కొట్టు

చరణం: 2
సన్ను డాటారు అవుతాం సిస్టర్ బ్రదరు అంటాం
అందరితోనూ బంధాలెన్నో కలుపుకుపోతుంటాం
అప్పుల్లో మునిగుంటాం అంబానీ కల కంటాం
చిల్లర కోసం ఎన్నో ఎన్నో వేషాలే వేస్తాం
ఈ లైఫ్ ఒక నాటకమేలే
మన ఆక్టింగులు అయిపోతే
ఈ ఊరు పేరు మేకప్ తీసి చెక్కేయాలంతే
శివుడాగ్నే లేకుండా చీమైనా కుడుతుందా
అంటూ మహాభాగా ఎదంతం సెబుతావంట
అన్ని ఇచ్చిన ఆ సామె సావుని గిఫ్ట్ ఇవ్వంగ
అయ్యయ్యయ్యో ఒద్దంటా వేందయ్యో సిత్రంగా

జజ్జనకా జజ్జనకా తోడుంటా నీ ఎనకా
పువ్వుల్లోన మోసుకెళ్లి పూడ్చేస్తా పద కొడకా
జజ్జనకా జజ్జనకా తోడుంటా నీ ఎనకా
పువ్వుల్లోన మోసుకెళ్లి పూడేస్తా పద కొడకా

మై నేమ్ ఈజు రాజూ బస్తి బాలరాజు
ఆ చావు కబురు చల్లగా చెబుతా ప్రతి రోజూచిత్రం: చావు కబురు చల్లగా (2021)
సంగీతం: జకెస్ బిజాయ్
సాహిత్యం: కౌశిక్ పెగళ్లపాటి, సనరే
గానం: గౌతమ్ భరద్వాజ్, షశ తిరుపతి

పడవై కదిలింది మనసే ఆకాశం వైపే
గొడవే పెడుతూ ఉందే నువ్వు కావాలనే
నువ్వొచ్చావనీ వచ్చావని వచ్చావనీ
నా ప్రాణం చెప్పిందే

కదిలే కాలాన్నడిగా ఈ చోటే పరుగాపమని
తిరిగే భూమిని అడిగా నీ వైపే నను లాగమని
నా ప్రాణం ఎక్కడో దాచిందా సందడే
నీ తోడే చేరగా తెలిసిందా నేడే
మహారాజై మురిసానే ఆకాశ దేశాన
నీ మాట విన్నాకా....
మెరుపల్లే మెరిసానే ఆ నీలిమేఘాన
తెలిసేలా నీదాకా....

ఈ వర్షంలో పురివిప్పే నెమలి వలే
నా హృదయాన్నే తడిపేసే చినుకు ఇదే
ఈ వర్షములో పురివిప్పే నెమలి వలే
నా హృదయాన్నే తడిపేసే చినుకువి నువ్వే

కదిలే కాలాన్నడిగా ఈ చోటే పరుగాపమని
తిరిగే భూమిని అడిగా నీ వైపే నను లాగమని

ఆశలే ఆవిరై ఎగిరిపోతుంటే
చెలిమితో చేరువై వెతికి తెచ్చేసానలా
మనసావాచా మనసిచ్చాగా
నీ తలరాతే మార్చేస్తాన చిరునామాగా
కలలో కూడా కలిసుంటాగా
ఏ దూరాలు రాలేవడ్డంగా

నిజంగానే మరో లోకం సమీపిస్తోందా
మళ్ళీ నీలా నన్నే కాలం పరీక్షిస్తుందా
బ్రతుకైనా చితికైనా నీ లోపలి హృదయాన్ని 
నిన్నంటే నేనుంటా
చనిపోయే క్షణమైనా విడిపోని ప్రణయాన్నై
నీడల్లే తోడుంటా

ఈ వర్షంలో పురివిప్పే నెమలి వలే
నా హృదయాన్నే తడిపేసే చినుకు ఇదే
ఈ వర్షములో పురివిప్పే నెమలి వలే
నా హృదయాన్నే తడిపేసే చినుకువి నువ్వే
కదిలే కాలాన్నడిగా ఈ చోటే పరుగాపమని
తిరిగే భూమిని అడిగా నీ వైపే నను లాగమనిNo comments

Most Recent

Default