Home Movies / Albums Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Sashi (2021)

చిత్రం: శశి (2021)
సంగీతం: అరుణ్ చిలువేరు
సాహిత్యం: చంద్రబోస్
గానం: సిద్ శ్రీరామ్
నటీనటులు: ఆది సాయికుమార్, సురభి, రాశి సింగ్
దర్శకత్వం: శ్రీనివాస్ నాయుడు నడికట్ల
నిర్మాతలు: ఆర్.పి. వర్మ, రామాంజనేయులు, చింతల పూడి శ్రీనివాస్
విడుదల తేది: 12.02.2021

ఒకే ఒక లోకం నువ్వే లోకంలోన అందం నువ్వే
అందానికే హృదయం నువ్వే నాకే అందావే
ఎకాఎకీ కోపం నువ్వే కోపంలోన దీపం నువ్వే
దీపం లేని వెలుతురు నువ్వే ప్రాణాన్నిలా
వెలిగించావే

నిన్ను నిన్నుగా ప్రేమించనా
నన్ను నన్నుగా అందించనా
అన్ని వేలా తోడుండనా
జన్మజన్మలా జంటవ్వనా

ఒకే ఒక లోకం నువ్వే లోకంలోన అందం నువ్వే
అందానికే హృదయం నువ్వే నాకే అందావే
ఎకాఎకీ కోపం నువ్వే కోపంలోన దీపం నువ్వే
దీపం లేని వెలుతురు నువ్వే ప్రాణాన్నిలా
వెలిగించావే

నిన్ను నిన్నుగా ప్రేమించనా
నన్ను నన్నుగా అందించనా
అన్ని వేళలా తోడుండనా
జన్మజన్మలా జంటవ్వనా

ఓ.. కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా
కాలమంతా నీకే నేను కావలుండనా...
ఓ.. కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా
కాలమంతా నీకే నేను కావలుండనా...

నిన్నా మొన్నా గుర్తె రాని సంతోషాన్నే పంచైనా
ఎన్నాళైనా గుర్తుండేటి ఆనందంలో ముంచైనా
చిరునవ్వులే సిరిమువ్వగా కట్టనా

క్షణమైనా కనబడకుంటే ప్రాణమాగదే
అడుగైనా దూరం వెళితే ఊపిరాడదే...
ఎండే నీకు తాకిందంటే చెమటే నాకు పట్టేనే
చలే నిన్ను చేరిందంటే వణుకు నాకు పుట్టేనే
దేహం నీది నీ ప్రాణమే నేనులే

ఒకే ఒక లోకం నువ్వే లోకంలోన అందం నువ్వే
అందానికే హృదయం నువ్వే నాకే అందావే
ఎకాఎకీ కోపం నువ్వే కోపంలోన దీపం నువ్వే
దీపం లేని వెలుతురు నువ్వే ప్రాణాన్నిలా
వెలిగించావే

నిన్ను నిన్నుగా ప్రేమించనా
నన్ను నన్నుగా అందించనా
అన్ని వేళలా తోడుండనా
జన్మజన్మలా జంటవ్వనాచిత్రం: శశి (2021)
సంగీతం: అరుణ్ చిలువేరు
సాహిత్యం: భాస్కర భట్ల
గానం: హరిచరణ్

దింతానా దింతాన 
ఇది మనసుపండగని అనుకోనా
దింతాన దింతాన 
కల ఎదుట వాలినది నిజమేనా

దింతాన దింతాన 
ఇది మనసు పండగని అనుకోనా
దింతాన దింతాన 
కల ఎదుట వాలినది నిజమేనా

కనురెప్పల కోలాటామిది
ఎద చప్పుడు ఆరాటమిది
నువ్విచ్చిన ఆనందమిది
నులివెచ్చగా బాగుందిది
హే.. నిన్నింక వదలనులే
నీ చెయ్యి విడవనులే
నీలోంచి కదలనులే

దింతానా దింతాన
ఇది మనసు పండగని అనుకోనా
దింతాన దింతాన
కల ఎదుట వాలినది నిజమేనా

పాలసంద్రంలా పొంగిపోతున్న
పాలపుంతల్లో తేలిపోతున్న
విరిసే తోటలన్నీ తూనీగలా తిరిగేస్తున్న
కురిసే తారాలన్నీ దోసిళ్లల్లో నింపేస్తున్న

చెట్టు కొమ్మల్లే ఊగిపోతున్న
కొత్త జన్మేదో అందుకుంటున్న
రెక్క విప్పుకుంటూ గువ్వలన్నీ గుండెలోకి
దూకినట్టు ఉత్సవాలు జరుపుతున్న
నింగి అంచు మీద రంగు రంగు చేపలుగా
గెంతుతున్న ఓ...

దింతానా దింతాన
ఇది మనసు పండగని అనుకోనా
దింతాన దింతాన
కల ఎదుట వాలినది నిజమేనా

ఇంత కాలంగా ఎక్కడున్నావే
ఉన్నఫళంగా ఊడి పడ్డావే
తెలిసీ తెలియనట్టు నా మనసునే లాలించేశావే
అసలేం ఎరగ నట్టు నీ వెనకనే తిప్పించావే
నిన్ను చూశాకే ప్రాణ మొచ్చిందే
వింతలోకంలో కాలు పెట్టిందే
నిన్ను తాకుతున్న గాలి వచ్చి
నా చెంప గిల్లుతుంటే 
అంతకన్న హాయి ఉండదే
అరె నిన్ను తప్ప కన్ను ఇంక
నన్ను కూడ చూడనందే

దింతాన దింతాన 
ఇది మనసు పండగని అనుకోనా
దింతాన దింతాన 
కల ఎదుట వాలినది నిజమేనా

కనురెప్పల కోలాటామిది
ఎద చప్పుడు ఆరాటమిది
నువ్విచ్చిన ఆనందమిది
నులివెచ్చగా బాగుందిది
హే.. నిన్నింక వదలనులే
నీ చెయ్యి విడవనులే
నీలోంచి కదలనులే

దింతానా దింతాన
ఇది మనసు పండగని అనుకోనా
దింతాన దింతాన
కల ఎదుట వాలినది నిజమేనా


No comments

Most Recent

Default