చిత్రం: రంగ్ దే (2021)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: కపిల్ కపిలన్, హరిప్రియ
నటీనటులు: నితిన్, కీర్తి సురేష్
దర్శకత్వం: వెంకీ అట్లూరి
నిర్మాత: సూర్యదేవర నాగ వంశీ
విడుదల తేది: 26.03.2021
ఏమిటో ఇది వివరించలేనిది
మది ఆగమన్నది తనువగానన్నది
భాష లేని ఊసులాట సాగుతున్నది
అందుకే ఈ మౌనమే భాష అయినది
కోరుకోని కోరికేదో తీరుతున్నది
ఏమిటో ఇది వివరించలేనిది
మది ఆగమన్నది తనువగానన్నది
అలలా నా మనసు తేలుతుందే...
వలలా నువు నన్ను అల్లుతుంటే...
కలలా చేజారిపోకముందే...
శిలలా సమయాన్ని నిలపమందే...
నడక మరిచి నీ అడుగు ఒడిన
నా అడుగు ఆగుతుందే
నడక నేర్చి నీ పెదవి పైన
నా పెదవి కదులుతుందే
ఆపలేని ఆట ఏదో సాగుతున్నదీ ఓ ఓ ఓ
ఏమిటో ఇది వివరించలేనిది
మది ఆగమన్నది తనువగానన్నది
మెరిసే ఒక కొత్త వెలుగు నాలో....
కలిపే ఒక కొత్త నిన్ను నాలో...
నేనే ఉన్నంత వరకు నీతో....
నిన్నే చిరునవ్వు విడవదనుకో...
చినుకు పిలుపు విని నెమలి పింఛమున
రంగులెగసినట్టు
వలపు పిలుపు విని చిన్ని మనసు చిందేసే
ఆగనంటూ
కోరుకున్న కాలమేదో చేరుతున్నది ఓ ఓ ఓ
ఏమిటో ఇది వివరించలేనిది
మది ఆగమన్నది తనువగానన్నది
No comments
Post a Comment