Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Kathula Rathaiah (1972)




చిత్రం: కత్తుల రత్తయ్య (1972)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: దాశరథి, కొసరాజు, ఆరుద్ర, డా॥ సి.నారాయణరెడ్డి, వీటూరి వెంకటసత్య సూర్యనారాయణమూర్తి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల, వి.రామకృష్ణ, ఎల్.ఆర్.ఈశ్వరి, వసంత 
నటీనటులు: కృష్ణ, చంద్రమోహన్, యస్.వి.రంగారావు, వెన్నిరాడై నిర్మల, 
కథ, మాటలు: విశ్వప్రసాద్ 
దర్శకత్వం: కె.యస్.ఆర్ దాస్ 
నిర్మాత: ఎన్.ఎన్.భట్ 
విడుదల తేది: 26.10.1972

(గమనిక: వేటూరి సుందరరామ మూర్తి, వీటూరి వెంకట సత్య సూర్యనారాయణమూర్తి ఇద్దరు వేరు వేరు, కానీ వీరిద్దరు పాటలు రచయితలు. ఈ సినిమాలో  పాట రాసింది వీటూరి వెంకట సత్య సూర్యనారాయణమూర్తి)



Songs List:



ఎత్తుకుంటావా నన్నెత్తమంటావ పాట సాహిత్యం

 
చిత్రం: కత్తుల రత్తయ్య (1972)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: దాశరధి 
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి

ఎతుకుంటావా నన్నెత్తమంటావా
నీ కత్తి చూస్తే  గుండెలోన గుబులౌతుందయ్యో
ఓ రత్తయ్యో

ముట్టుకుంటే కందిపోయె
పట్టుకుంటే వాడిపోయె
పసిడివన్నె చిన్న దాన్ని నేనయ్యో 
సన్నజాజి సొగసుదాన్ని
కందిరీగ నడుముదాన్ని 
దోరవయసు పిల్ల దాన్ని నేనయ్యో

షోకుగా నాజూకుగా
మెలమెల్లగా నను రమ్మనవయ్యో 

చెయ్యి పట్టుకున్నావంటె 
చెంత చేర్చుకున్నావంటె
రేయంతా వదలవు నీవు ఓరయ్యో
మనసు బెదరిపోయేదాకా
వళ్ళు సోలిపోయేదాకా
కౌగిట్లో ఉక్కిరి బిక్కిరి చేస్తావయ్యో

మెత్తగా సుతిమెత్తగా
గమ్మత్తగా నను చేరాలయ్యో




ఎంతో మంచి రోజు సంతోషించే రోజు పాట సాహిత్యం

 
చిత్రం: కత్తుల రత్తయ్య (1972)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల, వి.రామకృష్ణ, వసంత 

ఎంతో మంచి రోజు 
సంతోషించే రోజు
మళ్ళీ మళ్ళీ రావాలి ఈ రోజు 
మనసారా తీరాలి మా మోజు

హేపీ దిర్ డే టూ యూ

పుట్టిన రోజు వస్తుంది ప్రతి మనిషికి 
అట్టహాసం చేయకుంటే అది దేనికి 

రంగులెన్నో వెలగాలి హంగులెన్నో జరగాలి 
హంగుచేసేదెవరో తేలాలి 

హేపీ బరే టూ యూ 

ఏడేటా చేసారు పండుగలు 
ఈ ఏడు తీరేను కోరికలు

ఎవరెవరో వచ్చారు వింతలెన్నో చేస్తారు 
వేచిచూడు మొదలవును వేడుకలు
మంచివాళ్ళ మద్యలోన సైతాను
పొంచి పొంచి వుంటాడు అంటారు
సీసాలోని సైతాను చెరుపేమీ చేయకుండ
అగిపుల్ల గీసి నుపు తరిమేయీ

హేపీబర్ డే టూ యూ




హేయ్ ఓహోహో చామంతి పాట సాహిత్యం

 
చిత్రం: కత్తుల రత్తయ్య (1972)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి
గానం: యస్.పి.బాలు

హేయ్: ఓహోహో చేమంతీ 
ఒయ్యారి పూబంతి 
మురిపాల ముద్దబంతి 
ముద్దుల రబ్బరుబంతి
హేయ్ నువు కసిరితె ఒక అందం
జడ విసిరితె ఒక అందం

నడుమే చేసెను నాట్యం 
నీ అడుగులు వేసెను తాళం 
జతులకు గతులకు సరిపోతావె 
నువు ఊగితె ఒక అందం 
చెలరేగితె ఒక అందం

ఏం పిల్లో జింకిరి బింకిరి గున్నావు 
యేటు తగలని జింకలాగున్నావు.
సందెకాడ పొదలనీడ
కూడితె ఒక అందం 
పోట్లాడితె ఒక అందం





రత్తయ్య మావా పాట సాహిత్యం

 
చిత్రం: కత్తుల రత్తయ్య (1972)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: కొసరాజు
గానం: పి.సుశీల & కోరస్ 

రత్తయ్య మామా 
రంజైన మామా
అందాల ఈ లెలా
నీదేగా గరమ్ మసాలా

నీ పేరు వింటే గుండెలో ఝలు 
నీ జోరు చూసే వెర్రెతు ఒళ్ళు 
వేస్తావు - ఎత్తు చేసావు - చిత్తు
నీ దెబ్బకే ఠాసాలు బందు
గరమ్ మసాలా

ఒక పూలబాణం వదిలాను నీపై
అది నీకు గాలం అవుతుంది ఆపై
చూపిస్తా మజాఖా చూస్కోరా - తడాఖా
కాజాలు తినిపిస్తా తాజాగా గరమ్ మసాలా




సరసకు వచ్చే పాట సాహిత్యం

 
చిత్రం: కత్తుల రత్తయ్య (1972)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: వీటూరి వెంకటసత్య సూర్యనారాయణమూర్తి 
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి

సరసకు వచ్చే సోగ్గాడు వరుసకుచూస్తే నావాడు 
సరసంలోనా మొనగాడు. సమయంచూసివస్తాడు 
రానంటె పోనివ్వడూ - నామాట పడనివ్వడు

పొంగె సొంపులు చూసెనే అయ్యో చాటుకు లాగెనే
తరిమి వెంటతరిమి బుగలు చిదిమి గుండెలదిమి
కైపులోన నన్ను ముంచెనే

ఎంతో చలిగా వుందనీ వేడి కౌగిలి ఇమ్మనీ
మీటి, వయసుమీటి, వలపునాటి, హద్దుదాటి
నిషా, ఖుషీ, మజాచేసెనే

No comments

Most Recent

Default