Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Hanthakulu Devanthakulu (1972)
చిత్రం: హంతకులు దేవాంతుకులు (1972)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: రాజ శ్రీ, దాశరథి 
గానం: పి. సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి, యస్.పి. బాలు 
నటీనటులు: కృష్ణ, నాగేష్, కృష్ణం రాజు,  జ్యోతి లక్ష్మి, 
కథ: విజయ బాపనీడు
మాటలు: దాసరి నారాయణరావు
దర్శకత్వం: కె.యస్.ఆర్. దాస్ 
నిర్మాతలు: యన్.విత్. సుబ్బరాజు, యమ్. కె. రాధ 
విడుదల తేది: 02.06.1972Songs List:ఇది లక్కీ లక్కీ ఆట పాట సాహిత్యం

 
చిత్రం: హంతకులు దేవాంతుకులు (1972)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: రాజశ్రీ
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి

ఇది లక్కీ లక్కీ ఆట
ఆహ మూడు ముక్కల ఆట 
ఒక చెయ్యి కలిపి చూడు 
ఒక చుక్క వేసి ఆడు
యా! కమాన్ లెట్ అజ్ ప్లే 
యాః కమాన్ లెట్ అజ్ డ్రింక్ 
లాలాః ఓః లా ! హాయ్ 

కన్నె పిల్ల వుంది కన్ను గీటుతుంది
ఊపులోన వుంది కైపు రేపుతుంది 
దమ్ముంటే సొమ్మంతా నీదందిరా 
సై అంటే నువ్వు రమ్మంటే
నిన్ను కవ్వించి నవ్వించి 
ఊరించి తేలించురా

ఆడి చూడు జూదం 
కట్టవోయి పందెం
లక్కు వున్నదంటే ఒక్క దెబ్బలోనే
నీ జాతకం మారిపోతుందిరా
ఆడాలీ అంతు చూడాలి :
మోజు తీరాలి తాగాలి
ఊగాలి జల్సాలలో
ఆహ :
చిన్నోడా నీలో నన్నే చూసుకో పాట సాహిత్యం

 
చిత్రం: హంతకులు దేవాంతుకులు (1972)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: రాజ శ్రీ
గానం: యస్.పి. బాలు 

రా రా రు రూ
చిన్నోడా
నాలో నిన్నే చూసుకో
ఆ ఒంటిగా కలుసుకో 
ఆః జంటగా చేసుకో 

భా  బా బా: భీ: బీ:
భీ భీ: ఆహ 
లాః లాః
లా లా ఆ
లా: జో జో 
యాః వేశాను కన్ను వేశాను
గాల మేశాను నీ గుండెలో
లా లా లా
పోలేవు దాటిపోలేవు
చిక్కుకున్నావు నా కళ్ళలో
బా బా బా
ఖుషీ చేసాను
బా బా
నిషా యిస్తాను 
బా బా 
ఖుషీ చేసాను - నిషా యిసాను
నీ వెంట వుంటాను నీ మాట వింటాను 
రా రా. భ  భ 

వచ్చాను, తోడు వచ్చాను 
మోజు తెచ్చాను నీ కోసము
రారారా  రురూ 
ఓ వచ్చాను..ఆ నిన్ను మెచ్చాను
కానుకిచ్చాను నా అందము
రీరీరీ  రురూ  
నిఘా వేసెను
లా లా
భా భా  భా భా
చినుకు పడుతున్నది పాట సాహిత్యం

 
చిత్రం: హంతకులు దేవాంతుకులు (1972)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: దాశరథి 
గానం: పి. సుశీల,  యస్.పి. బాలు 

చినుకు పడుతున్నది 
వణుకు పుడుతున్నది 
తోడు కావాలి నీడ రావాలి
చలిగాలి కెరటాలలో
చెలి పెట తెరచాపలో
చినుకూ వణుకూ పారి పోయేనులే

యెవ్వరు లేని సమయం
నీకెందుకు యింతటి బిడియం
నిను రమ్మని పిలిచెను నీ చెలి అధరం 
రా! అందుకో

ఊరించు నీ మాటలు 
కవ్వించు నీ నడకలు
చాలులే ఓ చెలి నను వేధించకే
గంతులు వేసెను మనసు
నీ కౌగిలి కోరెను వయసు
ఈ చక్కిలిగింతల చల్లని వేళ 
వృధా చేయకు
తడవాలి జడివానలో కరగాలి కౌగిళ్ళలో
జగమే మరచీ కలసి పోవాలిలే
హరే రామ్ హరే రామ్ పాట సాహిత్యం

 
చిత్రం: హంతకులు దేవాంతుకులు (1972)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: రాజ శ్రీ
గానం:  యస్.పి. బాలు 

హరే రాం - హరే రాం
హరే క్రిష్ణా - హరే రాం 
హరే రాం హరే రాం 
హరే క్రిష్ణా - హరేరాం
-
ఆడామగా తేడాలేదు హరే రాం
దొంగా దొర భేదం లేదు హరే రాం
కడుపులు కొట్టె కడుపులు పెంచే
పేదలు వీరే హరేరాం
హరేరాం - హరేరాం
పేదల రక్తం  పీల్చేవారికి
మేడలు మిద్దెలు హరేరాం 
హరేరాం - హరేరాం
చెమటూడ్చేటీ శ్రమజీవులకూ
అహ నీడేలేదు బోలోరాం

మిత సంతానం అతి సంతోషం
అదియే స్వర్గం హరేరాం 
హరేరాం - హరేరాం 
అతి సంతానం అది భూభారం
నరజాతికి నరకం బోలోరాం

పెసా కోసం పార్టీ మార్చే
ఘనులదే రాజ్యం హరేరాం 
హరేరాం—హరేరాం
నీతులు పలికి గోతులుతీసే
దొంగలె దొరలు—హరేరాం
వేషాలకు మోసాలకు
ఇవి రోజులు భాయి బోలో రాంఅడుగులు కదిపి ఆడలేను పాట సాహిత్యం

 
చిత్రం: హంతకులు దేవాంతుకులు (1972)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: రాజ శ్రీ
గానం: సత్యనారాయణ, పి.సుశీల 

హహహ - ఊ ఆడు 
అడుగులు కదిపి ఆడలేను ఈ సాలి గూటిలో
పెదవులు తెరచి పాడలేను ఈ రాతికోటలో
ఏం ఆగావేం ఆడు
అధికారంతో నీవు అనుకున్నది పొందగలేవు 
ఆడది అబల కాదురా అది పగపడితే విషనాగురా 
ఇది తెలుసుకో గురుతుంచుకో
నీ మనసే మార్చుకో

య్ - ఇంకా ఆడు
కన్నులముందే వున్న నిజాన్ని కానక తిరిగేవు 
నీ కన్నులు పొడిచే కఠారి
ప్రక్కనే వుందని మరిచేవూ
నీ దారుణాలు యిక సాగవు నీ ఘాతకాలు యిక చెల్లవు 
ఆశ తీరగా ఆడేనూ
ఇక మంగళహారతి పాడేనూ

No comments

Most Recent

Default