Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Abbayigaru Ammayigaru (1972)
చిత్రం: అబ్బాయి గారు అమ్మాయి గారు (1972)
సంగీతం: కె. వి. మహదేవన్ 
సాహిత్యం: ఆరుద్ర, ఆచార్య ఆత్రేయ, కొసరాజు, డా॥ సి. నారాయణరెడ్డి 
పద్యాలు: చెర్వు ఆంజనేయ శాస్త్రి 
గానం: యస్.పి. బాలు, మాధవపెద్ది సత్యం , ఎల్.ఆర్.ఈశ్వరి 
నటీనటులు: కృష్ణ , వాణిశ్రీ , గీతాంజలి, జ్యోతి లక్ష్మి 
దర్శకత్వం: వి. రామచంద్ర రావు 
నిర్మాత: డి. బి. నారాయణ 
విడుదల తేది: 31.08.1972Songs List:తొలి చూపు దోచింది పాట సాహిత్యం

 
చిత్రం: అబ్బాయి గారు అమ్మాయి గారు (1972)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి:
తొలిచూపు చూసింది హృదయాన్ని
మరుచూపు వేసింది బంధాన్ని
ప్రతి చూపు చెరిపింది మధ్య దూరాన్ని
ఇక పెళ్ళిచూపులే కలపాలి ఇద్దరిని

చరణం: 1
ఒక చూపు తూపులా గాయాన్ని చేసింది 
వే రొక చూపు వెన్నెల మావులా మెరిసింది 
ఒక చూపు చిలిపిగా గిలిగింతలు పెట్టింది 
నే రాక చూపు నిలువునా గెలుచుకొని వెళ్ళింది 

చరణం: 2
చూపు లున్నందుకు చూసుకోవాలి 
చూచుకున్నది తనది చేసుకోవాలి 
వలపు మొలకెత్తేది ఒక చూపులోనే 
మనసు మనసయ్యేది ఆ చూపుతోనే 

చరణం: 3
ఈడు జోడుగ మనమిద్దరం వెళుతుంటే 
ఎన్నెన్ని చూపులో ఈసుతో చూస్తాయి 
తోడు నీడగ మన మేకమైనామంటే
దేవతల చూపులే దీవెనలు అవుతాయి
నా మీద దయరాదా పాట సాహిత్యం

 
చిత్రం: అబ్బాయి గారు అమ్మాయి గారు (1972)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: కొసరాజు
గానం: మాధవపెద్ది సత్యం

నామీద దయరాదా ఇక నైన
నన్ను మైవెయ్యరాదా
నమ్ముకొన్నవాణ్ణి - నీ
నామ జపం చేయువాణి

ఆటిన్ రాణిఅమ్మా
హారతి చెల్లిస్తాను 
జోకరు బొమ్మా నీకూ
జోహారులు చేస్తాను
సెట్టులోకి రావాలి
చేరులోనె కావాలి
పేకాటలో రామదాసు
పేరుమోగి పోవాలి

ఏలాగో చాన్సుతగిలి
ఇల్లరికం వచ్చాను
బావగారి డబ్బంతా క్లబ్బుల్లో పోశాను

పోయిన డబ్బంత తిరిగి 
జేబులోకి రాకుంటె
అప్పుల్లో  మునిగిపోయి
అల్లరిపాలవుతాను
అలాటిలంటి ఆడదాన్ని కాదు పాట సాహిత్యం

 
చిత్రం: అబ్బాయి గారు అమ్మాయి గారు (1972)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: కొసరాజు
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి 

అలాటిలాంటి ఆడదాన్ని కాను అబ్బాయో 
ఎలాటిదాన్నొ నా తడాఖ సూపుతానయో 
సాయిత్రీ యేసమేస్తే  యముడు అదిరిపోవాలా 
శిత్తరాంగి ఎత్తులేస్తే  రాజే సిత్తవ్వాలా

వా శిత్తరాంగి మేడలోకి
పావరాయిని పట్టుకోను సారంగయ్యేస్తే
రాజులేనప్పుడు సారంగో - 
నువ్వు రారాదా పోరాదా సారంగో
అంటే
మొగాళ్ళందరూ గుటకలు మింగాలా అమ్మమ్మో
ఈలలు గొట్టి గంతులు యెయ్యాలా అమ్మమ్మో

నా కులుకు సూసినోడూ
నా తళుకు సూసినోదూ
నా సుట్టూతా తిరక్కుండ ఇంటికెల్లలేడూ... 
అలాటిలాంటి.

కత్తి రొణి లావోస్తే  కన్ను సెదిరిపోవాలా
నన్ను గుర్రంపై సూసినోళ్ళ గుండె జారిపోవాలా

ఆ సందున యిలనుగాడొచ్చి 
రావే సెలీ యిలా రావే సెలీ 
నా ప్రాణాలన్నిగూడ నీకే బలీ 
అని మీసం దిప్పితే
మీసాలూ రొయ్యకు లేవంట్రా ఓ సచ్చినోడ
నీ నెత్తురు కళ్ళసూత్తారా - రా - రా డిష్ డిష్ డిష్ డిష్
ఇలా సిత్ర యిసిత్రంగా నే టేజీ ఎక్కానంటే
బస్తీ మీద సవాల్ - గోలుకొండ జమాల్
టీకాసులమ్మ దెబ్బంటె. కాసుకోర బుల్ బుల్ 
అలాటిలాంటి
అమ్మాయిగోరు పాట సాహిత్యం

 
చిత్రం: అబ్బాయి గారు అమ్మాయి గారు (1972)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆరుద్ర
గానం: యస్.పి.బాలు

అమ్మాయ్గారు ... ఓహో .... అమ్మాయిగోరూ 
అవుతారు త్వరలోనే అమ్మగారూ తమరు అమ్మగారు
ఉంగా ఉంగా సంగీతాలే వింటారు.... అహ
ఉయ్యాల జంపాల అంటారు
ఉళ ఉళ హాయీ పాడతారు 
నా ఉబలాటాన్ని జో జో జోల కొడతారు

రాని విద్యలే నేర్పుకుంటారు 
అవి నాని గాడికే నేర్పుకుంటారు 
ముదులన్నీ బాబుకే అంటారు 
నే వద్దకొస్తే వద్దు వద్దు పొమ్మంటారు 

అలసి సొలసి ఒడిలోన వాలేరు 
మన అనురాగ కెరటాల తేలేడు
ఉళ ఉళ హాయీ హాయీ హాయీ పాడుతాను 
మీ ఉబలాటాన్నే జో జో జో కొడతాను.
ఊగకురోయ్ మావ పాట సాహిత్యం

 
చిత్రం: అబ్బాయి గారు అమ్మాయి గారు (1972)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి 

ఊగకురోయ్ మాఁవా ఊగకురోయ్
ఊగుచు తూగుచు చచ్చేటట్టు తాగకురోయ్
తప్ప తాగకురోయ్
కొప్పు లాగకురోయ్

నడివీధిలో అవ్వ! నన్ను ముట్టకు 
పుచ్చపువ్వులాంటిదాని రెచ్చగొట్టకు 
రైకలిస్తానంటివి కోకలిస్తానంటివి 
చీకటిపడగానే కల్లుపాక వెంటబడితివి 
ఆ కల్లుతోనే బాసలన్నీ గడగడ తాగేస్తిని 

తిమ్మిరి తలకెక్కేదాకా తీసుకుంటావు 
ఆ తీసుకుంది దిగితే చెంపలేసుకుంటావు 
ఈ తాగుళ్ళు మానేసి ఈ తందానాలు తగ్గిస్తే 
ఇద్దరమూ జోడుకట్టి ఒద్దికగా వుందాము
యెన్నాలకే యే డెక్కించి ఉహుఁ ఉహుఁ ఉహూ 
నవ్వరా నువ్వైనా నవ్వరా పాట సాహిత్యం

 
చిత్రం: అబ్బాయి గారు అమ్మాయి గారు (1972)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: పి.సుశీల

నవ్వరా నువై నా నవ్వరా బాబూ 
ఆ నవ్వే నిను పెంచు పాలబువ్వరా బాబూ 

మొలకగా పుట్టావు ఒక తల్లి కడుపులో 
మొగ్గగా పెరిగేవు ఒక కన్నె చేతిలో
ఎందుకు పుట్టావో - ఎందుకు పెరిగేవో 
బదులైనా జెప్పలేని పరమాత్ముని తలచుకొని - నవ్వరా 

మీయమ్మ ఏవని ఎవరైనా అడిగితే
కన్నీరు నింపక నన్నే చూపించరా 
కన్నంత మాత్రాన అమ్మలు కారురా 
కమ్మని మనసున్న ప్రతి ఆడది అమ్మేరా

No comments

Most Recent

Default