Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Sabash Satyam (1969)
చిత్రం: శాబాష్ సత్యం  (1969)
సంగీతం: శ్రీ విజయ కృష్ణమూర్తి
నటీనటులు: కృష్ణ , రాజశ్రీ , విజయలలిత
దర్శకత్వం: జి.విశ్వనాధం 
నిర్మాత: ఎం.డి.నజీం
విడుదల తేది: 19.04.1969Songs List:నాలో నిన్ను చూడూ పాట సాహిత్యం

 
చిత్రం: శాబాష్ సత్యం (1969)
సంగీతం: శ్రీ విజయ కృష్ణమూర్తి
సాహిత్యం: దాశరధి
గానం: పి. సుశీల, యస్.పి. బాలు 

నాలో నిన్ను చూడూ నేనే నీకు తోడూ
మనలో వెచ్చని వలపులూగులాబీ పూలె హమేషా ఇలాగే విరియాలి

నాలో నిన్ను చూడూ నేనే నీకు తోడూ
మనలో వెచ్చని వలపులూ గులాబీ పూలె హమేషాఇలాగే విరియాలీ 
కలే నిజమై మనం ఒక టై కుషీగా సాగాలీ
ఒకే మనసు ఒకే మాట బలేగా మెలగాలీ సరదాలా ల ల్లా  ల ల్లా
సరసాలా ల ల్లా ల ల్లా
రేయి పగలూ తేలాలి కలకాలం వెలగాలీ

నాలో నిన్ను చూడూనేనే నీకు తోడూ 
మనలో వెచ్చని వలపులూ  గులాబీపూవులై హమేషా ఇలాగే విరియాలి 
ఇలా చూడు - అలా నవ్వు అవన్నీ నా వేలే
అలా పిలువు - ఇలా గెలువు.. ఇవన్నీ నీవెలే
కలనైనా ల ల్లా ల ల్లా
ఇలనైనా ల ల్లా ల ల్లా
మనదే మనదే ఆనందం - మారనిదే అనురాగం

నాలో నిన్ను చూడూ నేనే నీకు తోడూ
మనలో వెచ్చని వలపులు గులాబీ పూవులై ఇలాగే విరియాలి
మెకొలా మెకొలా పాట సాహిత్యం

 
చిత్రం: శాబాష్ సత్యం (1969)
సంగీతం: శ్రీ విజయ కృష్ణమూర్తి
సాహిత్యం: దాశరధి
గానం: పి.సుశీల

మెకొలా మెకొలా బుం బుంక బుం
వయసూ సొగసూ నీకేలే ఆ ఏ ఓ ఏ
విరిసే వలపూ నీదేలే ఆ ఏ ఓ ఏ
మనదే మనదే ఈ రేయీ ఆ ఏ ఓ ఏ
మనదే మనదే ఈ రేయీ ఆ ఊం ఆ ఊం   ఆ ఊం
బు బు బు బు బు బం
బు బు బు బు బు బుం
చెంతకూ చేరుకో ఒక మాటున్నదీ
దోచుకో దాచుకో - ఇది నీదై నది
చెలరేగేను కోరికలూ విరబూసెను మల్లి యలూ
వయసూ సొగసూ నీకేలే  ఏ ఏ ఓ ఆ

అందుకో అందుకో ఇక జాగెందుకు?
ఒంటిగా ఉంటినీ ఇటు రావెందుకు?
నా మధువుంది నీ కోసం అందించేను ఆవేశం 
వయసూ సొగసూ నీకేలే ఆ ఏ ఓ ఆ

విరిసే వలపూ నీదేలే ఆ ఏ ఓ ఆ
మనదే మనదే ఈ రేయీ
ఆ హ హ ఆహహా ఓ హ హ హా
మనదే మనదే ఈ రేయి
యిటు రావె రావె పాట సాహిత్యం

 
చిత్రం: శాబాష్ సత్యం (1969)
సంగీతం: శ్రీ విజయ కృష్ణమూర్తి
సాహిత్యం: కొసరాజు
గానం: రాఘవన్ & ఎల్.ఆర్. ఈశ్వరి.

యిటు రావె రావె బంగారు చిలకమ్మా !
ఒక్కమాటుంది మూట దించి పలకవమ్మా !
లంగారి బంగారి లచ్చి!!
ఒయ్ వస్తా వస్తా వుండు టిప్పుటప్పయ్యా !
నాతొ సరసమాడ వీపు కాస్త చదునయ్యా !
రంగారి సింగారి రాజా !!

తల బిరుసేలా ? నిలువుము బాలా !
ఎరుగని  వాడనా  యీ బిగువేలా
వయ్యారి చిన్నోడా ఒంటూ పిరున్నోడా
యేళా పాళా చూడక యేందీ పీడా !!

ఒంటిగ సమయం చిక్కెను నాకూ
ఓ వగలాడీ కాదనబోకూ
మా వోళ్లు చూస్తేనూ వాడంత గోలేనూ 
వచనం : రామారావు సినిమా కో
నాగేశ్వరావు సినిమా కో
రెండో ఆట సినీమాకు రమ్మంటాను

యిటు రావే రావె - ఒయ్ వస్తా వస్తా
కలలు నిజాలై పాట సాహిత్యం

 
చిత్రం: శాబాష్ సత్యం (1969)
సంగీతం: శ్రీ విజయ కృష్ణమూర్తి
సాహిత్యం: ఆత్రేయ
గానం: పి. సుశీల, యస్.పి. బాలు 

కలలు నిజాలై కనులు వరాలై
సరాగ సరాలై - పడుచు దనాలె
పవలూ రేయీ - ఒకటే హాయీ !

నీ మగసిరిలో గడుసరి నీవై
నా పరువంలో నీ సరి నేనై
నీ అందమే పై పందెమై
నువు గెలిచి నన్నోడి పోనీ !

నీ అధరంలో కెంపులు దోచీ
నా ప్రణయంలో లోతులు చూచీ
నులి వెచ్చగ నువు మెచ్చగా పురి విప్పి నన్నాడు కోనీ
ఎక్కడికో ఎందుకో పాట సాహిత్యం

 
చిత్రం: శాబాష్ సత్యం (1969)
సంగీతం: శ్రీ విజయ కృష్ణమూర్తి
సాహిత్యం: ఆత్రేయ
గానం: ఘంటసాల

ఎక్కడికో ఎందుకో ఈ పరుగు
ఎవరికి వారై పోతున్నాము ఓ దేవా !
మంచి పెంచవయ్య మా మనసుపెంచవయ్య
స్వార్థాలు చివికి పోగా స్వర్గాలు భువికి రాగా
మా మేలు కోరి మాకు మతి నిచ్చినావయా
అది మరచి నిన్ను మరచిగతితప్పినామాయ
మన్నించు కరుణ నీవే నడిపించు వెలుగువే

హృదయాన్ని మూత బెట్టి గుడి తెరచినామయా
కనులుండి మూసుకొని నిన్ను
వెతికినామయా
దేవా నీవే తెరిపించవలెను రెండు
కాలు వేశావా? పాట సాహిత్యం

 
చిత్రం: శాబాష్ సత్యం (1969)
సంగీతం: శ్రీ విజయ కృష్ణమూర్తి
సాహిత్యం: ఆత్రేయ
గానం: పి. సుశీల

కాలు వేశావా? కాటు వేస్తాను
కళ్లు కలిపావా? కలసి వస్తాను 
నేను ఎల నాగనోయ్ నేనే కర్రి నాగునోయ్
అనురాగా మేరా నాగ స్వరము
అది ఆలాపించు - నన్నాడిపించు
నారివలె సాగుతా నడుమంతా వూపుతా
విల్లువలె వంగుతా వంపులన్నీ చూపుతా
పడగవిప్పి పరువమంతా రేపుతా 

నా వలపు నీవు రుచి చూడలేదు
ఎటువాడుకున్నా విషమంత చేదు
మనసిస్తా వా! మరణాన్ని కూడ ఆపు తాను
పగ రగిలితే? పడగకొట్టి చంపుతా 

No comments

Most Recent

Default