Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Lakshmi Nivasam (1968)




చిత్రం: లక్ష్మీ నివాసం (1968)
సంగీతం: కె.వి.మహదేవన్ 
నటీనటులు: కృష్ణ, శోభన్ బాబు, అంజలీ దేవి, వాణిశ్రీ, భారతి , విజయ లలిత 
దర్శకత్వం: వి.మధుసూదనరావు
నిర్మాత: టి.గోవింద రాజన్ 
విడుదల తేది: 19.07.1968



Songs List:



నవ్వు నవ్వించు పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ నివాసం (1968)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: పి. సుశీల 

నవ్వు..నవ్వించు..ఆ నవ్వులు పండించు
ఉహు..ఉహూహూ..నా ఊహలు లాలించు
నవ్వు..నవ్వించు..ఆ నవ్వులు పండించు
ఉహు..ఉహూహూ..నా ఊహలు లాలించు
నవ్వు..నవ్వించు..ఆ నవ్వులు పండించు

చరణం: 1
నాలో వయసుంది నవనవలాడింది
నీలో మనసుంది నిగనిగలాడింది
నాలో వయసుంది నవనవలాడింది
నీలో మనసుంది నిగనిగలాడింది
కువకువలాడే కోరికలన్నీ ఘుమఘుమలాడాలి
కువకువలాడే కోరికలన్నీ ఘుమఘుమలాడాలి

నవ్వు..నవ్వించు..ఆ నవ్వులు పండించు
ఉహు..ఉహూహూ..నా ఊహలు లాలించు
నవ్వు..నవ్వించు..ఆ నవ్వులు పండించు

చరణం: 2
ఎదుటను నీవుంటే ఏదో సిగ్గు సుమా
చిలిపిగ చూస్తూంటే..తలపులు రేగు సుమా
ఎదుటను నీవుంటే ఏదో సిగ్గు సుమా
చిలిపిగ చూస్తూంటే..తలపులు రేగు సుమా
రెక్కలు విప్పి టక్కరి వలపు రెపరెపలాడాలి 
రెక్కలు విప్పి టక్కరి వలపు రెపరెపలాడాలి

నవ్వు..నవ్వించు..ఆ నవ్వులు పండించు
ఉహు..ఉహూహూ..నా ఊహలు లాలించు
నవ్వు..నవ్వించు..ఆ నవ్వులు పండించు

చరణం: 3
ఆశలు పొంగాయి అల్లరి చేశాయి
నీలో ఉబలాటం..నాలో చెలగాటం
ఆశలు పొంగాయి అల్లరి చేశాయి
నీలో ఉబలాటం..నాలో చెలగాటం
తొందరచేసే అందం పూచి పందిరి వేయాలి
తొందరచేసే అందం పూచి పందిరి వేయాలి

నవ్వు..నవ్వించు..ఆ నవ్వులు పండించు
ఉహు..ఉహూహూ..నా ఊహలు లాలించు
నవ్వు..నవ్వించు..ఆ నవ్వులు పండించు




గువ్వలాంటి చిన్నది పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ నివాసం (1968)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: పి. సుశీల 

గువ్వలాంటి చిన్నది తారా..జువ్వలాంటి చిన్నది
వెతుక్కొని వస్తే వెన్నలా కరిగిస్తే!
ఏంచేస్తావ్‌ ఏం చేస్తావ్‌..ఓ మొనగాడా
నువ్‌ ఏంచేస్తావ్‌ ఏం చేస్తావ్‌..ఓ మొనగాడా 

గువ్వలాంటి చిన్నది తారా..జువ్వలాంటి చిన్నది
వెతుక్కొని వస్తే వెన్నలా కరిగిస్తే!
ఏంచేస్తావ్‌ ఏం చేస్తావ్‌..ఓ మొనగాడా
నువ్‌ ఏంచేస్తావ్‌ ఏం చేస్తావ్‌..ఓ మొనగాడా
నువ్‌ ఏంచేస్తావ్‌ ఏం చేస్తావ్‌..ఓ మొనగాడా

చరణం: 1
మనసైనవాడివని సొగసైనవాడివని
ఆ నోట ఆ నోట విన్నదట
మనసైనవాడివని సొగసైనవాడివని
ఆ నోట ఆ నోట విన్నదట
ఆ విన్నదంత కళ్లారా కన్నదట
నీ గడుసుతనం చూడాలని నీ భరతం పట్టాలని
నిన్న రాత్రి కలలో..కన్నుగీటి పిలిచావని 
నలుగురిలో నిలవేస్తే 
ఏంచేస్తావ్‌ ఏం చేస్తావ్‌ ఓ మొనగాడా
నువ్‌ ఏం చేస్తావ్‌ ఏం చేస్తావ్‌ ఓ మొనగాడా
నువ్‌ ఏంచేస్తావ్‌ ఏం చేస్తావ్‌..ఓ మొనగాడా

చరణం: 2
ముచ్చటైన పొగరుబోతు కుర్రది..అది
పొంకమైన బింకమైన చిన్నది
ముచ్చటైన పొగరుబోతు కుర్రది..అది
పొంకమైన బింకమైన చిన్నది
ఆ పెంకిపిల్ల నిన్నే కోరుకున్నది 

నీ గుండె దొలుచుకుంది..నిన్ను వలచుకుంది
చల్లగాలి వీచువేళ..చందమామ కాచువేళ
చలిచలిగా వుందంటే..
ఏంచేస్తావ్‌ ఏం చేస్తావ్‌ ఓ మొనగాడా
నువ్వేం చేస్తావ్‌ ఏం చేస్తావ్‌ ఓ మొనగాడా
నువ్‌ ఏంచేస్తావ్‌ ఏం చేస్తావ్‌..ఓ మొనగాడా

చరణం: 3
సిరిసిరి మువ్వసుమా..చకుముకి రవ్వసుమా
చలగాటం పండించే గవ్వసుమా
సిరిసిరి మువ్వసుమా..చకుముకి రవ్వసుమా
చలగాటం పండించే గవ్వసుమా
నీ కన్నుల్లో నిలిచి వెలుగు దివ్వే సుమా
నీ జంటబాయనంది..నీ వెంటతిరుగుతుందీ
అందర్నీ మరచిపోయి..అయినవాళ్ళ నిడిచిపెట్టి
తనవేంతే రమ్మంటే
ఏంచేస్తావ్‌ ఏం చేస్తావ్‌..ఓ మొనగాడా
నువ్‌ ఏంచేస్తావ్‌ ఏం చేస్తావ్‌..ఓ మొనగాడా

ఆ..గువ్వలాంటి చిన్నది తారా..జువ్వలాంటి చిన్నది
వెతుక్కొని వస్తే వెన్నలా కరిగిస్తే!
ఏంచేస్తావ్‌ ఏం చేస్తావ్‌..ఓ మొనగాడా
నువ్‌ ఏంచేస్తావ్‌ ఏం చేస్తావ్‌..ఓ మొనగాడా 



బొట్టిరో మేనక పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ నివాసం (1968)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: మాధవపెద్ది సత్యం 

బొట్టిరో మేనక 



కాలేజ్ జీతమ్ము పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ నివాసం (1968)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: మాధవపెద్ది సత్యం 

కాలేజ్ జీతమ్ము 




చేయి చేయి కలుపు పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ నివాసం (1968)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: పి.సుశీల, పి.బి.శ్రీనివాస్ 

పల్లవి:
చేయీ చేయీ కలుపు..చెంపా చెక్కిలి కలుపు
కేరింతలతో వూరింపులతో..కిలకిల కలకల నవ్వు

చేయీ చేయీ కలుపు..చెంపా చెక్కిలి కలుపు
కేరింతలతో వూరింపులతో..కిలకిల కలకల నవ్వు

చరణం: 1
నా కోర్కెలు గుర్రాలైతే..ఎగరేసుకుపోతా నిన్నే
నా కోర్కెలు గుర్రాలైతే..ఎగరేసుకుపోతా నిన్నే
నీవంతటి మగసిరివైతే..నా అందాలిచ్చెద నీకే
నీ కన్నుల కాపురముంటా..కనురెప్పల తలుపులు తియ్యి
నీ కన్నుల కాపురముంటా..కనురెప్పల తలుపులు తియ్యి
నీ నీడకు తోడుగ వుంటా..నీ బాసలు బాసట చెయ్యి 

చేయీ చేయీ కలుపు..చెంపా చెక్కిలి కలుపు
కేరింతలతో వూరింపులతో..కిలకిల కలకల నవ్వు

చరణం: 2
నీ వలపులు ఎంతో యింపు..నా దోసిలి నిండా నింపు
నీ వలపులు ఎంతో యింపు..నా దోసిలి నిండా నింపు
నిను వీడని మైకమునవుతా..నా మమతల మధువులచేత
నిను వీడని మైకమునవుతా..నా మమతల మధువులచేత
పది చేతులు నాకే వుంటే..బంధించెద బిగువుగ నిన్నే
పది చేతులు నాకే వుంటే..బంధించెద బిగువుగ నిన్నే
జవరాలిని పిడికిట నిలిపే..మొనగాడివి నువ్వే నువ్వే 

చేయీ చేయీ కలుపు..చెంపా చెక్కిలి కలుపు
కేరింతలతో వూరింపులతో..కిలకిల కలకల నవ్వు

చేయీ చేయీ కలుపు..చెంపా చెక్కిలి కలుపు
కేరింతలతో వూరింపులతో..కిలకిల కలకల నవ్వు
హా హా హా హా హా హా 




ఓహో ఊరించే అమ్మాయి పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ నివాసం (1968)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: పి.సుశీల, పి.బి.శ్రీనివాస్ 

పల్లవి:
ఓహో..ఊరించే అమ్మాయీ..నేనేమి చేసేది
అందాల కన్నులు నన్ను..తొందర చేశాయి
నీ అందాల కన్నులు నన్ను..తొందర చేశాయి

ఓహో..వేధించే అబ్బాయి..నేనేమి చేసేది
చూపుల్లో కైపులు..నన్ను బిత్తర చేశాయి
నీ చూపుల్లో కైపులు..నన్ను బిత్తర చేశాయి
ఓహో..ఓఓఓఓఓఓఓఓ

చరణం: 1
నీ పైట చెంగు కొస ఎగిరింది
నా పడుచుగుండె ఉసి కొలిపింది
నీ పైట చెంగు కొస ఎగిరింది
నా పడుచుగుండె ఉసి కొలిపింది

నీ చిలిపి పెదవి నను పిలిచింది
నా చెక్కిలి ఓయని పలికింది
నీ చిలిపి పెదవి నను పిలిచింది
నా చెక్కిలి ఓయని పలికింది

ఓహో..ఊరించే అమ్మాయీ..నేనేమి చేసేది
అందాల కన్నులు నన్ను..తొందర చేశాయి
నీ చూపుల్లో కైపులు..నన్ను బిత్తర చేశాయి
ఓహో..ఓఓఓఓఓఓఓఓ

చరణం: 2
నీ ఓర చూపులో ఒగరుంది
నా దోర మనసులో పొగరుంది
నీ ఓర చూపులో ఒగరుంది
నా దోర మనసులో పొగరుంది 

నీ కోడె వయసులో వేడుంది
నా కొంటె తలపుతో రగిలింది
నీ కోడె వయసులో వేడుంది
నా కొంటె తలపుతో రగిలింది

ఓహో..వేధించే అబ్బాయి..నేనేమి చేసేది
చూపుల్లో కైపులు..నన్ను బిత్తర చేశాయి
నీ అందాల కన్నులు నన్ను..తొందర చేశాయి
ఓహో..ఓఓఓఓఓఓఓఓ

చరణం: 3
నీ లేత వలపు చిగురేసింది
విరజాజిలాగ పెనవేసింది
నీ లేత వలపు చిగురేసింది
విరజాజిలాగ పెనవేసింది

నా మేని సొగసు విరబూచింది
నీ కంటికి కానుక చేసింది
నా మేని సొగసు విరబూచింది
నీ కంటికి కానుక చేసింది

ఓహో..ఊరించే అమ్మాయీ..నేనేమి చేసేది
అందాల కన్నులు నన్ను..తొందర చేశాయి
నీ అందాల కన్నులు నన్ను..తొందర చేశాయి

ఓహో..వేధించే అబ్బాయి..నేనేమి చేసేది
చూపుల్లో కైపులు..నన్ను బిత్తర చేశాయి
నీ చూపుల్లో కైపులు..నన్ను బిత్తర చేశాయి
ఓహో..ఓఓఓఓఓఓఓఓ ఓహో..ఓఓఓఓఓఓఓఓ
ఓహో..ఓఓఓఓఓఓఓఓ....




ధనమేరా అన్నిటికీ మూలం పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ నివాసం (1968)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: ఘంటసాల 

ధనమేరా అన్నిటికి మూలం 
ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం
ధనమేరా అన్నిటికి మూలం

మానవుడే ధనమన్నది స్రుజియించెనురా 
దానికి తానే తెలియని దాసుడాయెరా
ధనలక్ష్మిని అదుపులోన పెట్టినవాడే
గుణవంతుడు బలవంతుడు భగవంతుడురా

ధనమేరా అన్నిటికి మూలం

ఉన్ననాడు తెలివికలిగి పొదుపుచేయరా 
లేనినాడు ఒడలు వంచి కూడబెట్టరా
కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే
హయ్యో కూలి పోవు కాపురాలు ఇది తెలియకుంటే..

ధనమేరా అన్నిటికీ మూలం
కూలివాని చెమటలో ధనమున్నదిరా
పాలికాపు కండల్లొ ధనమున్నదిరా
శ్రమజీవికి జగమంతా లక్శ్మీనివాసం
ఆ శ్రీదేవిని నిరశించుత తీరని ద్రొహం

ధనమేరా అన్నిటికి మూలం 
ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మంం 




ఇల్లే కోవెల పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ నివాసం   (1968)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: యస్. జానకి 

ఇల్లే కోవెల చల్లని వలపే దేవత
ఇల్లూ వలపూ వనితే వనిత
ఇల్లే కోవెల చల్లని వలపే దేవత
ఇల్లూ వలపూ నోచిన వనితే వనిత

నుదుట కుంకుమరేఖ కంటికి కాటుకరేఖ..
నుదుట కుంకుమరేఖ కంటికి కాటుకరేఖ
జడలో తెల్లని విరులు యువతికి తరగని సిరులు
జడలో తెల్లని విరులు యువతికి తరగని సిరులు
ఇల్లే కోవెల చల్లని వలపే దేవత
ఇల్లూ వలపూ నోచిన వనితే వనిత

తులసికోటలో దీపము
కలకాలము వెలిగే వరము
తులసికోటలో దీపము
కలకాలము వెలిగే వరము
చెలుని నవ్వుల స్నేహము
చెలుని నవ్వుల స్నేహము
నెలతకు జీవన భాగ్యము
ఇల్లే కోవెల చల్లని వలపే దేవత
ఇల్లూ వలపూ నోచిన వనితే వనిత

చదువులు ఎన్నో చదివిన
పదవులు ఎన్నో ఏలిన
చదువులు ఎన్నో చదివిన
పదవులు ఎన్నో ఏలిన
చివరకు గృహిణిగ మారే
పడతుల బ్రతుకే - ధన్యం
చివరకు గృహిణిగ మారే
పడతుల బ్రతుకే - ధన్యం
ఇల్లే కోవెల చల్లని వలపే దేవత
ఇల్లూ వలపూ నోచిన వనితే వనిత





సోడా సోడా ఆంధ్రా సోడా పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ నివాసం   (1968)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: పిఠాపురం నాగేశ్వరరావు 

పల్లవి:
సోడా సోడా ఆంధ్రసోడా గోలిసోడా జిల్ జిల్ సోడా
సోడా సోడా ఆంధ్రసోడా గోలిసోడా జిల్ జిల్ సోడా
సోడా సోడా ఆంధ్రసోడా గోలిసోడా జిల్ జిల్ సోడా
సోడాతాగు తెలుగోడా చల్లని సోడా
దీని మహిమ చెప్పలేడు దేవుడు కూడా
సోడాతాగు తెలుగోడా చల్లని సోడా
దీని మహిమ చెప్పలేడు దేవుడు కూడా
సోడా సోడా ఆంధ్రసోడా గోలిసోడా జిల్ జిల్ సోడా

చరణం: 1
సోడా నెత్తి మీద గంగవున్న ఈశ్వరుడైనా అహ
నిత్య సుధలు తాగుతున్న దేవతలైనా
నేత్తి మీద గంగవున్న ఈశ్వరుడైనా అహ
నిత్య సుధలు తాగుతున్న దేవతలైనా
ఆంధ్రసోడా కోరికోరి తాగుతారోయ్
అది లేకుంటే వడదెబ్బకు వాడుతారోయ్
సోడా సోడా ఆంధ్రసోడా గోలిసోడా జిల్ జిల్ సోడా

చరణం: 2
నాయకులు చెప్పేది ఉత్తగ్యాసు..ఊ..
వినాయకుల చప్పట్లు శుద్ధ గ్యాసు
నాయకులు చెప్పేది ఉత్తగ్యాసు
వినాయకుల చప్పట్లు శుద్ధ గ్యాసు
పోసుకోలు పాలిటిక్స్ పరమ గ్యాసు
వాటికన్నా ఉపయోగం సోడా గ్యాసు
సోడా సోడా ఆంధ్రసోడా గోలిసోడా జిల్ జిల్ సోడా

చరణం: 3
ఒక్క గుక్క తాగి చూడు మండుటెండలో అహ
హిమాలయం చల్లదనం నీ గొంతుకలో
ఒక్క గుక్క తాగి చూడు మండుటెండలో అహ
హిమాలయం చల్లదనం నీ గొంతుకలో
రాళ్ళు తిని తాగితే జీర్ణమవ్వాలి
నీళ్ళు తాగితే సగం కడుపు నిండాలి
సోడా సోడా ఆంధ్రసోడా గోలిసోడా జిల్ జిల్ సోడా
సోడాతాగు తెలుగోడా చల్లని సోడా
దీని మహిమ చెప్పలేడు దేవుడు కూడా
సోడా సోడా ఆంధ్రసోడా

No comments

Most Recent

Default