Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Induvadana (2021)
చిత్రం: ఇందువదన (2021)
సంగీతం: శివ కాకాని
నటినటులు: వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి
దర్శకత్వం: MSR
నిర్మాత: శ్రీమతి మాధవి ఆదుర్తి
విడుదల తేది: 25.12.2021Songs List:వడి వడిగా పాట సాహిత్యం

 
చిత్రం: ఇందువదన (2021)
సంగీతం: శివ కాకాని
సాహిత్యం: తిరుపతి జావన
గానం: జావేద్ ఆలీ, మాళవిక

వడి వడిగా సుడిగాలిగా వచ్చి
గుచ్చి గుచ్చి చూస్తావు భలే భలేగా
సరసర రావే సరాసరి సునామీలా
చుట్టేశావు హడావిడిగా

ఓసినా గువ్వలా చెన్నా… ఊడిపడ్డ వెన్నెల వానా
తోడుకున్న తియ్యనీ తేనా… తననే తందానే తానా
పట్టుకోన మువ్వలా గున్నా… తేలుతున్న తెల్లనీ మైనా
ఆకతాయి అల్లరేదైనా ఎక్కించేసైనా మేనా

వడివడిగా సుడిగాలిగా వచ్చి
గుచ్చి గుచ్చి చూస్తావు భలే భలేగా

ఒక్క చూపుని చూసి నీళ్ళల్లో తోసి నన్నే ముంచావే
నీ చేతితో తాకి కొత్తగ మళ్ళీ ఊపిరి పోసావే
పదపద పదమందే నీ వెనకే నా హృదయం
పదిమందెదురైనా నీ తోనే నా పయనం
ప్రాణం అయ్యావే ఆ నిమిషంలో నువ్వే
పాదం కదిలిందే నీ వెంటే… ఆగవే ఆగవే ఆగవే

పడిపడిపోయా ఓ పిల్లా నిన్నే చూసి
పంచ ప్రాణాలిస్తా నీకే పోగేసి

నీ పెదవులు తాకి తేనెల తీపి నన్నే చేరిందే
నాలోకం దాటి నీలోకానికి తీసుకువచ్చిందే
మరి మరి మరిచేదే లేదసలు ఈ సమయం
మది నన్నే విడిచి నిను చేరే క్షణం
ఎటు చూస్తూ ఉన్నా కనిపిస్తావు నువ్వే
వెళ్ళిపోమాకే తిరిగి చూడవే… చూడవే చూడవే

వడి వడిగా సుడిగాలిగా వచ్చి
గుచ్చి గుచ్చి చూసాక భలే భలేగా
సరసర రా సరే సరాసరి సునామీలా
చుట్టేశావ హడావిడిగా

నేను నీ గువ్వలా చెన్నా… ఊడిపడ్డ వెన్నెల వాన
తోడుకో తియ్యనీ తేనా… తననే తందానే తానా
పట్టుకుంటె మువ్వ నేనేనా… తూలుతున్న తెల్లనీ మైనా
ఆకతాయి అల్లరేదైనా ఎక్కేస్తా నేను మేనా

వడివడిగా సుడిగాలిగా వచ్చి
గుచ్చి గుచ్చి చూసానా భలే భలేగా

చిలిపి చూపుల పాట సాహిత్యం

 
చిత్రం: ఇందువదన (2021)
సంగీతం: శివ కాకాని
సాహిత్యం: తిరుపతి జావన
గానం: జాస్ప్రీత్ జస్జ్, దివ్య ఐశ్వర్య
.

చిలిపి చూపుల కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడు పాట సాహిత్యం

 
చిత్రం: ఇందువదన (2021)
సంగీతం: శివ కాకాని
సాహిత్యం: భాస్కర భట్ల
గానం: ఎస్.పి. చరణ్, సాహితి చాగంటి

కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడు
గుండెల్లోకి దూరి పోయి చూడు
నాలో నిన్ను తొంగి తొంగి చూడు, హాయి హాయిగా
చెంపల్లోన సిగ్గునడిగి చూడు
ముద్దుల్లోనా వేడినడిగి చూడు
నిన్నే నాలో గుర్తుపట్టి చూడు… తనివి తీరగ
నువ్వు చూడు చూడు అంటే… మనసు ఆగదే
నిన్ను చూడకుండ ఉంటే… ఏమి తోచదే, అసలేమి తోచదే
కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడు
గుండెల్లోకి దూరి పోయి చూడు
నాలో నిన్ను తొంగి తొంగి చూడు, హాయి హాయిగా

గురుతైన లేదు కదా… నువ్వు లేని జీవితం
మరుపైన రావు కదా… ఒక్క నిమిషం
నీ రాకతోనే కదా… మారిపోయే జాతకం
నీ తోడులోనే కదా.. నేను నవ్వడం

ఈ ప్రేమ జీవనది… ఇద్దరము కలిసి ఈదుదాం
ఏ కన్ను చూడలేని.. కొత్తలోకం కలిసి వెతుకుదాం
కోరికేదో బాగున్నది… కొత్తగ ఉన్నది
పిచ్చి ప్రేమేదో ప్రేమేదో అందుట్లో దాగున్నది

కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడు
గుండెల్లోకి దూరి పోయి చూడు
నాలో నిన్ను తొంగి తొంగి చూడు, హాయి హాయిగా

ఆనందమెక్కడున్న… జల్లెడేసి పట్టనా
నీ కాలి మువ్వలాగ తెచ్చి కట్టనా
తేనీగలెక్కడున్నా వెంటపడి అడగనా
ఆ తీపి అద్దుకొని ముద్దులెట్టనా
నువ్వంటే ఇందువలే అందువలే నాకు ఇష్టమే
నువ్వింత ఆశ పెట్టి… చంపుతుంటే అడ్డుచెప్పనే
నన్ను వచ్చి అల్లేసుకొ పట్టి లాగేసుకో
నిండు నూరేళ్ళు నూరేళ్ళు నీలోనే దాచేసుకో

కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడు
గుండెల్లోకి దూరి పోయి చూడు
నాలో నిన్ను తొంగి తొంగి చూడు, హాయి హాయిగా
# పాట సాహిత్యం

 
చిత్రం: ఇందువదన (2021)
సంగీతం: శివ కాకాని
సాహిత్యం: అసిరయ్య, గిరిధర్ రాగొలు, భాస్కరభట్ల
గానం: సాహితి గాలిదేవర
కోరస్: MSR, ధనరాజ్, పార్వతీశం

నా కాళ్ళకు పట్టీల్లేవండి… మా కన్నోళ్ళింటికి పోనండి
నా సేతికి గాజుల్లేవండి… మా సెల్లోళ్ళింటికి పోనండి
నా సెవులకి రింగుల్లేవండి… మా సుట్టాలింటికి పోనండి
నాకు ఎత్తు సెప్పులు లేవండి… పొరుగోల్లింటికి పోనండి

నిన్న సెప్పరాదే గుంట
మొన్న సెప్పరాదే గుంట
కల్లు కొట్టుకాడ నువ్వు సిరాకు పడతావా

నాకు పట్టు సీరలే లేవండి
మా జగలీడింటికి పోనండి
నా ఏలికుంగరం లేదండి
పక్కోలింటికి పోనండి
నిన్న సెప్పరాదే గుంట
మొన్న సెప్పరాదే గుంట
కల్లు కొట్టుకాడ నువ్వు తగాద పడతావా, హా

మా ఈది కుర్రోళ్ళు… నా ఒంపుసొంపులు సూసారు
నా నడుమున సెయ్యెట్టి… ఇట్టే సప్పబడి పోయారు
మా ఊరి కర్ణాలు… నా బుగ్గన సుక్కే సూసాడు
నా బుగ్గలు నలిపేసి… అట్ట సతికిలపడి పోయాడు

నా ఎనకాల మగమంద… తిరుగుతూ ఉంటారు
నా అందాలు కాటేసే… మొనగాడే లేడు
ఇట్టాంటోల్ని ఏలల్లో సూసాను
మీ దగ్గర ఏముందిలే కొత్తగా, హాయ్

బొట్టుబిల్లలిస్తా పిల్లా… మట్టి గాజులిస్తా పిల్లా
పట్టీలట్టుకొస్తా పిల్లా… నాతోటి వస్తావా
ముక్కుపుడకలిస్తా పిల్లా… ఎత్తు సెప్పులిస్తా పిల్లా
పట్టు సీరలిస్తా పిల్లా… నాకోటి ఇస్తావా

నీ సూపులకు నీ వలపులకు… మా గుండెలే అదిరాయే
పట్టీలెందుకే మా మనసుకి… వడ్డీ కలిపి సొగసే ఇస్తే
నా ఒంటిమీద రంగు… నా కల్లుకుండ పొంగు
నా ఎత్తుపల్లమెక్కి… లాగించు లేత భంగు
నా నడుము కింద ఒంపు… నా పెదవికున్న మెరుపు
అడిగింది తెచ్చిపెట్టి తిప్పేసుకోరా సూపు

నీకుందంత రాసిస్తే… స్వర్గమే నీదట
నా పైటనక పరువాలు సొంతమే నీకట
ఇంకెవరైనా ఉన్నారా ఈ పూట
నా కొంపకి వచ్చేది ఆ విందుకి, హాయ్

మరి నిన్న సెప్పలేదే గుంట
మొన్న సెప్పలేదే గుంట
యేటి కాడ ఎకరాల తోట నీ పేరు రాసేస్తా
నాకున్నదంతా నీకే గుంట… అలకమాని రావే జంట
పంపుషెడ్డు కాడ నీతో పనుంది వస్తావా

No comments

Most Recent

Default