Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Drohi (1948)
చిత్రం: ద్రోహి (1948)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: తాపీ ధర్మారావు 
నటీనటులు: సి.లక్ష్మీరాజ్యం, కె.ఎస్.ప్రకాష్ రావు, జి.వరలక్ష్మి, ఎల్.వి.ప్రసాద్
దర్శకత్వం: ఎల్.వి.ప్రసాద్
నిర్మాణ సంస్థ: స్వతంత్ర ఫిల్మ్స్
విడుదల తేది: 10.12.1948

( పెండ్యాల నాగేశ్వరరావు గారికి  మ్యూజిక్ డైరెక్టర్ గా ఇది మొదటి సినిమా )Songs List:ఆలకించండి బాబూ పాట సాహిత్యం

 
చిత్రం: ద్రోహి (1948)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: తాపీ ధర్మారావు 
గానం: కె.జమునారాణి

ఆలకించండి బాబూ
ఆదరించండి బాబూ
అదుష్టమున్నా అయ్యల్లారా
అదుష్టమున్నా అమ్మల్లారా

పాలు నేయి పాయసాలతో
చాలినంత భోం చెయ్యండి
పల్చని గంజయినా
మాపాలిటికింత పోయండి

రంగు రంగుల చీరలు పేరులు
సింగారంగా కట్టండి
చింకి పేలికలతోనైనా
మా మానము కాచుకపోనీండి

కారులమీదను జోరుజోరుగా
జోరుజోరుగా భయ్యిభయ్యిమని
హాయిహాయిగా తిరగండి
దారిపక్క నొలమూలను
మమ్ము కాళ్లీడ్చుకొని పోనీండి
నీ తేటలేనిదే చిత్రానికి గీటు లేదు పాట సాహిత్యం

 
చిత్రం: ద్రోహి (1948)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: తాపీ ధర్మారావు
గానం: జి. వరలక్ష్మి

నీ తేటలేనిదే చిత్రానికి గీటు లేదు
నీ పానమే లేకున్న గానమే సున్న
నీ సువాసన సోకక కవితరాదు
కళలకు మూలము నీవే
కాఫీ కళారూపినే కదా ఆహా

ఆహారమే లేకున్న
ప్రేమగాథ లెటు పోయినా
ప్రాణాలు పోయినా సరే
నీవుమాత్రం కావాలి
సిగరెట్ మహావ్యాపివేకదా ఆహా
తృణమో పణమో వెయ్యండి పాట సాహిత్యం

 
చిత్రం: ద్రోహి (1948)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: తాపీ ధర్మారావు
గానం:కె. జమునారాణి  & బృందం

తృణమో పణమో వెయ్యండి 
దీనుల బాధలు తీర్చండి
ఉండడాని కిల్లు లేక
తిండి మాట మొదలె లేక
గాలివాన చేత చాల
గట్టి బాధ పొందినారు
కట్టుకోను గుడ్డలేక 
చెట్టుకొమ్మ నీడలేక 
ముక్కు చివర ఊపిరితో
దిక్కుమాలి యున్నారుపూవు చేరి పలుమారు తిరుగుచు పాట సాహిత్యం

 
చిత్రం: ద్రోహి (1948)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: తాపీ ధర్మారావు 
గానం: ఘంటసాల, జి.వరలక్ష్మి 

పూవు చేరి పలుమారు తిరుగుచు 
పాట పాడునది ఏమె తుమ్మెద
పూవులోన తన పోలిక కన్గొని 
మోదము గాంచిన దేమో తుమ్మెద

ఆ సెల ఏటిని తాకుచు తట్టుచు 
చెప్పుచున్నదది ఏమో పూపొద
ఒక క్షణమైనా ఆగి పల్కవని 
కొరకొర లాడునో ఏమో పూపొద

అలరు కౌగిటను అదిమి మావితో
మంతన మాడునదేమో మాలతీ
ఏకాంతముగా ప్రణయ మంత్రమును 
ఉపదేశించునో ఏమో మాలతీ
ఏదిచూచినా ప్రేమయె జగతి 
కాదను వారలు పాషాణాలే
నేడే తీరె నా వాంఛా పాట సాహిత్యం

 
చిత్రం: ద్రోహి (1948)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: తాపీ ధర్మారావు 
గానం: జి.వరలక్ష్మి 

నేడే తీరె నా వాంఛా 
నేడే యీ డేరే
జీవితాశ చేకూరే
ఒంటరిపాటిక నుండదుగా 
జంట తలంపుల పంటగదా 
యింటా బయటా ఎపుడూ
హాయిగ ఉంటామే
సుఖములు గంటామే

ఒకరి మనసులో ఒకరై ఆహా
కలసి మెలసి యీ కాలంబంతా
విలాసములలో వినోదములలో
గడుపుదుమే గడుపుదుమే ఆహా
ప్రేమ నడుపుదు మే
ప్రేమయే కదా సదా విలాసీ పాట సాహిత్యం

 
చిత్రం: ద్రోహి (1948)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: తాపీ ధర్మారావు 
గానం: యం.యస్.రామారావు , జి.వరలక్ష్మి 

ప్రేమయే కదా సదా విలాసీ
ప్రేమే కదా మహా పిపాసి
ఎంతో తనకుండినా యింకా తాకోరునే
ప్రేమతో సాటి నహీఁ జగానా దివినైనా

నిజమీ ప్రేమే కలయీ ప్రేమే
సాధ్యమే కాదే ఏరికైనా
యీ ప్రేమా మహిమా
నోరారా పాడా

యీ ప్రేమాగరిమా
లో కాలా చాటా
యీప్రేమాలీలా విలసాలున్నా
సౌఖ్యాలికేలా స్వర్గాలేలా
ఆహా ప్రేమే కదోయి
జనాళి జీవన మహా
నవ్వనైన నవ్వరాదే బుల్ బుల్ పాట సాహిత్యం

 
చిత్రం: ద్రోహి (1948)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: తాపీ ధర్మారావు 
గానం: పిఠాపురం

నవ్వనైన నవ్వరాదే బుల్ బుల్ బుల్ బుల్ 
నాతో మాటలైన ఆడరాదే బుల్ బుల్ బుల్ బుల్
నిన్ను నమ్ముకున్నా నే బుల్ బుల్ బుల్ బుల్ 
కన్నుగీటి ఔననవే బుల్ బుల్ బుల్ బుల్ 
లోకులేమి అనుకున్నా బుల్ బుల్ బుల్ బుల్ 
నీకేమె నా కేమె బుల్ బుల్ బుల్ బుల్
కన్నుగీటి ఔననవే బుల్ బుల్ బుల్ బుల్ 
ఎందరొస్తె మనకేమె బుల్ బుల్ బుల్ బుల్ 
అందర్నీ తందామె బుల్ బుల్ బుల్ బుల్
చక్కలి గింతలు లేవా పాట సాహిత్యం

 
చిత్రం: ద్రోహి (1948)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: తాపీ ధర్మారావు 
గానం: జి.వరలక్ష్మి 

చక్కలి గింతలు లేవా
చక్కని ఊహలు రావా 
పౌరుచు తారుచు పంతాలాడే
కీర దంపతుల కనగా
తీవలమాఃవుల కౌగలింతలో
పూలు పూచునది కనగా 
జోడును వీడక ఆడే పాడే
జంట జంటలను చూడా

చక్కరు కొట్టుకు వచ్చావా పాట సాహిత్యం

 
చిత్రం: ద్రోహి (1948)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: తాపీ ధర్మారావు
గానం: శివరావు, జి.వరలక్ష్మి

చక్కరు కొట్టుకు వచ్చావా
బలె టక్కరి పిల్ల వె చినదానా
టమారి మాటల పిలవాడా
నీ దిమాకు చూపకు నామీద

చక్కరు కొట్టుకు వచ్చావా 
బలె టక్కరి పిల్ల వె చినదానా 
ఊసుపోక అటు తిరిగివచ్చితే 
మీసం తిప్పా వెందుల కోయ్
రోసం చూపావెందులకోయ్

పన్ను నొప్పికై నిన్న వచ్చిన 
చిన్న వాడికై పోలేదా 
పోతేనేం ?
అహ పోలేదా?
పోయాను
పన్ను నొప్పి పోగొట్టావా ? 
ఒళ్లూ నొప్పని చెప్పాడోయ్ 
సెంటు వాసనలు గుమ్మంటున్నాయ్ 
ఆఁ అత్తరు సాయెబు
అతడొకడా
మచ్చుచూపినా డంతేనోయ్
అయితే నాపని యింతేనా
ఓహోరోజా పూలా రాజా పాట సాహిత్యం

 
చిత్రం: ద్రోహి (1948)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: తాపీ ధర్మారావు
గానం:

ఓహోరోజా పూలా రాజా పూలారాజా 
ఆహా నీదే జన్మ
పూచావే తావినించా నే
శిరసుల పై మెరసితివే
ఆహా చిన్నారివే
ఆహా పొన్నారివే
ఓదినమైనా లోకులు పొగిడే
జీవనమహా
బ్రతుకనగా యిదియే యిదియే
ఎందుకీ బ్రతుకూ పాట సాహిత్యం

 
చిత్రం: ద్రోహి (1948)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: తాపీ ధర్మారావు 
గానం: కె.జమునారాణి

ఎందుకీ బ్రతుకూ 
ఆశలేని ఎడారియేకదా
ప్రాణమిచ్చిన తాతపోయె 
అంత పెంచిన అమ్మ బాసె
ఆదరించిన బాబు మారెను
ఆప్తులే చెడ తిట్టిరే

ఎంత భ క్తిని సేవ చేసినా
యింతగా ఆపనింద వచ్చె
ఎవరు నాయను వారులేరే
ఏమనందునిక
యిది యేనా నీ న్యాయము దేవా పాట సాహిత్యం

 
చిత్రం: ద్రోహి (1948)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: తాపీ ధర్మారావు 
గానం: యం.యస్.రామారావు 

యిది యేనా నీ న్యాయము దేవా
యీ వలపక్షము తగునా
పాలు నేయీ కొందరికిచ్చి
పచ్చని గంజీలేకెందరినో
పస్తులలో పడిచావమందువా దేవా
పేరులు చీరలు కొందరికిచ్చి
పేలికలైనా లేకెందరినో
మానహానితో బ్రతుకమందువా దేవా

సరిసరి మాటల మూట పాట సాహిత్యం

 
చిత్రం: ద్రోహి (1948)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: తాపీ ధర్మారావు
గానం:

సరిసరి మాటల మూట
సాలును తెల్చె జోలికి రాకోయి
సిరసిర లాడత వేల
సంగ తేమిటో సెప్పగరాదే
తెస్తానని చూపితివాళ
ఏది ఏది కూడూ గుడ్డ
మరిసితివ ఆడినమాట
సాలును తెల్చె జోలికి రాకోయి
స్వరాజ్యము వచ్చెనుకదా 
కూటికి గుడ్డకు లోటేలేదే
స్వరాజ్యమొ గిరాజ్య మొ 
మాటల కేమి కోరినదీవోయి

సరాసరి సూడగ రాదే
పరుగులతో వస్తాయన్నీ
అదేకదా కోరినదంతా
ఒంటికి గుడ్డ తింటకి కూడు
స్వరాజ్యము వచ్ఛెనుగదా 
కూటికి గుడ్డకు లోటేలేదే

నరులకు ప్రేమతో చేసిన సేవే పాట సాహిత్యం

 
చిత్రం: ద్రోహి (1948)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: తాపీ ధర్మారావు
గానం:

నరులకు ప్రేమతో చేసిన సేవే
నారాయణ సేవా
మహాత్ములంతా పాటించినదీ 
మర్మసూత్ర మొకటే 
జీవన్ముక్తులకున్న కీలకము
పావనజీవుల పరమరహస్యము
ఎంత సూక్ష్మము ఆహా 
దేశంబం టే మట్టికాదు
దేశంబంటే మనుష్యులే
మనుషులు సేవే దేశ సేవయౌ
అదియే మాధవ సేవ
ఎంత సూక్ష్మము ఆహా

మనోవాంఛలు యీగతి కూలిపోయె పాట సాహిత్యం

 
చిత్రం: ద్రోహి (1948)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: తాపీ ధర్మారావు
గానం: జి. వరలక్ష్మి

మనోవాంఛలు యీగతి కూలిపోయె 
హృదయ వేదన యీగతి మారిపోయె
లోకము చీకటాయె
సౌఖ్యము మాయమాయె
ఆశా ... జీవి తాశ ఎటో పారిపోయె
ఏదరి చేరుదానా
ఎవ్వరి వేడుదానా
దీనా నేనే గానా
యిక యీ జగానా
ధన్యవహో మాతాసీతా పాట సాహిత్యం

 
చిత్రం: ద్రోహి (1948)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: తాపీ ధర్మారావు
గానం:

ధన్యవహా
ధన్యవహో మాతాసీతా
మరణించిననూ చిరంజీవి వహ
సత్యమహింసయే శాశ్వత సుఖమని 
స్వాతంత్ర్యానికి రాజమార్గమని
సకలలోకముల శాంతి మూలమని
చావునకూడా చాటి చెప్పితివే మాతా సీతా


No comments

Most Recent

Default