Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Bharya Bhartalu (1961)





చిత్రం: భార్యా భర్తలు (1961)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
నటీనటులు:  అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ కుమారి
దర్శకత్వం: కె. ప్రత్యగాత్మ
నిర్మాత: ఏ.వి. సుబ్బారావు
బ్యానర్: ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్
విడుదల తేది: 31.03.1961



Songs List:



జోరుగా హుషారుగా షికారు పోదామా! పాట సాహిత్యం

 
చిత్రం:  భార్యాభర్తలు (1961)
సంగీతం:  సాలూరి. రాజేశ్వరరావు
సాహిత్యం:  శ్రీశ్రీ
గానం: ఘంటసాల

జోరుగా హుషారుగా షికారు పోదామా!
హాయి హాయిగా తీయ తీయగా
జోరుగా హుషారుగా షికారు పోదామా!
హాయి హాయిగా తీయ తీయగా

ఓ ...బాల నీ వయ్యార మెంచి మరులుకొంటి నే
చాల ప్రేమ పాఠములను చదువుకొంటినే
మరువనంటినే

 ||జోరుగా॥

నీ ... వన్నె చిన్నె లన్ని చూచి వలచినాడనే
వయసు సొగసు తలచి తలచి మురిసినాడనే
కలసి రాగదే

 ||జోరుగా॥

నా ...కలలలోన చెలియ నిన్నె పిలచినాడనే
కనులు తెరచి ఎదుట నిన్నె కాంచినాడనే
వరించువాడనే




ఓ..సుకుమారా పాట సాహిత్యం

 
చిత్రం:  భార్యాభర్తలు (1961)
సంగీతం:  సాలూరి. రాజేశ్వరరావు
సాహిత్యం:  శ్రీశ్రీ
గానం: ఘంటసాల, సుశీల

పల్లవి:
ఓ..సుకుమారా నను చేరా రావోయి ఇటు రావోయి
నిలువగ లేని వలపులరాణి నీ కొరకే తపించునులే
నిలువగ లేని వలపులరాణి నీ కొరకే తపించునులే

ఓ..జవరాలా ప్రియురాలా ఈనాడే మనదే హాయి
తనువుగ నేడు ఈ చెలికాడు 
నీ దరినే సుఖించునులే

చరణం: 1
కోటి కిరణముల కోరిన గాని
భానుని చూడదు కలువ చెలి
కోటి కిరణముల కోరిన గాని
భానుని చూడదు కలువ చెలి
వెన్నెల కాంతి వెలిగిన వేళా
వెన్నెల కాంతి వెలిగిన వేళా
విరుయునుగా విలాసముగా

నిలువగ లేని వలపులరాణి 
నీ కొరకే తపించునులే

చరణం: 2
వేయి కనులతో వెదికిన గాని
తారకు జాబిలి దూరమేగా
వేయి కనులతో వెదికిన గాని
తారకు జాబిలి దూరమేగా
కలువల రాణీ వలపులలోనే
కలువల రాణీ వలపులలోనే
కళకళలాడి చేరునుగా

తనువుగ నేడు ఈ చెలికాడు 
నీ దరినే సుఖించునులే




మధురం మధురం పాట సాహిత్యం

 
చిత్రం:  భార్యాభర్తలు (1961)
సంగీతం:  సాలూరి. రాజేశ్వరరావు
సాహిత్యం:  శ్రీశ్రీ
గానం: ఘంటసాల, సుశీల

మధురం మధురం ఈ సమయం
ఇక జీవితమే ఆనందమయం
మధురం మధురం ఈ సమయం 

చల్లని పున్నమి వెన్నెలలో
ఎన్నడు వీడని కౌగిలిలో
చల్లని పున్నమి వెన్నెలలో
ఎన్నడు వీడని కౌగిలిలో
కన్నుల వలపు కాంతులు మెరయగ

 ||మధురం||

కరగిపోయె పెను చీకటి పొరలు
కరగిపోయె పెను చీకటి పొరలు
తొలగిపోయె అనుమానపు తెరలు
తొలగిపోయె అనుమానపు తెరలు

పరిమళించె అనురాగపు విరులు
పరిమళించె అనురాగపు విరులు
అలరెనే మనసు నందనవసము

|| మధురం...||

సఫల మాయెనే మన తియ్యని కలలు
సఫల మాయెనే మన తియ్యని కలలు
జగము నిండె నవజీవన కళలు
జగము నిండె నవజీవన కళలు

పొంగిపొరలె మన కోర్కెల అలలు
పొంగిపొరలె మన కోర్కెల అలలు
భావియే వెలిగె పూవుల బాటగ 

||మధురం... !!



ఏమని పాదేదనో ఈ వేళ పాట సాహిత్యం

 
చిత్రం:  భార్యాభర్తలు (1961)
సంగీతం:  సాలూరి. రాజేశ్వరరావు
సాహిత్యం:  శ్రీశ్రీ
గానం:  సుశీల

ఏమని పాదేదనో ఈ వేళ
మానస వీణ మౌనముగా
నిదురించిన వేళ
ఏమని పాడెదనో

జగమే మరచి హృదయ విపంచి
గారడిగా వినువీధి చరించి
కలత నిదురలో కాంచిన కలలే
గాలి మేడలై కూలిన వేళ
ఏమని పాడెదనో

వనసీమలలో హాయిగ ఆడే
రాచిలుకా నిను రాణిని చేసే
పసిడితీగల పంజరమిదిగో
పలుక వేమని పిలిచే వేళ



రంగ రంగేళీ పాట సాహిత్యం

 
చిత్రం:  భార్యాభర్తలు (1961)
సంగీతం:  సాలూరి. రాజేశ్వరరావు
సాహిత్యం:  ఆరుద్ర 
గానం:  సుశీల

రంగ రంగేళీ సుఖాలను తేలి
రావోయి మధుర మీరేయి
రంగ రంగేళీ

నిన్ను కోరే గులాబులు
ఈయ వేల జవాబులు
నిన్ను కోరే గులాబులు
ఈయ వేల జవాబులు
మనసులోని మమత లేవో
మనసులోని మమత లేవో
తెలుపునే మెరిసే కనులు
పరాకేలనోయి ప్రియా

భరింపజాల ఈ విరహ జ్వాల
వహవ్వా
వలపుల బాలననీ బేలననీ రమ్మనవు
వలపుల బాలననీ బేలననీ రమ్మనవు
వలచి చేరితి నే కోరితినే చిరునగవు
తొలగిపోయెదవు చాలునులే యీ బిగువు
సరసాలు మురిపాలు మరి రానేరావు 



చూచి చూచి కళ్లు కాయలే కాచాయి పాట సాహిత్యం

 
చిత్రం:  భార్యాభర్తలు (1961)
సంగీతం:  సాలూరి. రాజేశ్వరరావు
సాహిత్యం:  కొసరాజు
గానం:  ఘంటసాల, జిక్కీ

జో జో జో జోజో
చూచి చూచి కళ్లు కాయలే కాచాయి
గా నీ తండ్రి ఊడి పడ్డాడూ
చక్కనీ నా బాబు జోజో
చల్లనీ నా తండ్రి జోజో

రెక్కలూ గట్టుకొని రివ్వునా వాలాను
రేయింబగళ్ళు నిను తలచుకొని మురిశాను
మురిపాల మొలకవూ జోజో
ముద్దులూరించేవు జోజో

|| చూచి చూచి||

కాకితో ఒక సారి కబురంపినావని
కాకితో ఒక సారి కబురంపినావని
కలలోన నిను చాల కలవరించాను
కాశీకి పోయినా గంగలో మునిగినా
నిను మరువ కున్నాను జో జో
నిలువలేకున్నాను జో జో

|| చూచి చూచి||

ఏ వూళ్ళు తిరిగావు  ఏమేమి చేశావు
ఏ వూళ్ళు తిరిగావు  ఏమేమి చేశావు
ఎవరితో సరదాలు తీర్చుకొచ్చావు
ఇంత చక్కని రంభ ఇంటిలో ఉండగా
ఇతరులతో పని ఏమి జోజో
ఇది మంచి సమయము జోజో 
ఇది మంచి సమయము జోజో




కనకమా ! చిట్టి కనకమా! పాట సాహిత్యం

 
చిత్రం:  భార్యాభర్తలు (1961)
సంగీతం:  సాలూరి. రాజేశ్వరరావు
సాహిత్యం:  కొసరాజు
గానం: మాధవపెద్ది సత్యం, స్వర్ణలత

కనకమా ! చిట్టి కనకమా!
ముద్దు కనకమా ! నామాట వినుమా !
మనము కలసి మెలిసుంటే అప్పీలు లేదుసుమా !
కనకమా ! చిట్టి కనక మా ! నామాట వినుమా !

కలసి మెలిసున్నందు కేగా 
నీవు కరుణ జూపించావు బాగా
కలసి మెలిసున్నందు కేగా 
నీవు కరుణ జూపించావు బాగా


కల్లకపటం లేని నా కన్న తండ్రిని
వేటాడి వేధించి వెళ్ళగొట్టావుగా !
ఆలు మగలకు మధ్య చూడు
మామ అడ్డముంటే ఎంతో గోడు
ఆలు మగలకు మధ్య చూడు
మామ అడ్డముంటే ఎంతో గోడు

ఆనందముగ మనము అనుభవించాలంటే
ఆనందముగ మనము అనుభవించాలంటే
అడుగడుగునా మనకు గుదిబండ అయినాడు

కనకమా ! చిట్టి కనక మా ! నామాట వినుమా !

అల్లారు ముద్దుగా నా కోరికలు తీర్చి
అన్యాయమగు మాట లేల
అవ్వ అపహాస్యములు చేయ నేల
అన్యాయమగు మాట లేల
అవ్వ అపహాస్యములు చేయ నేల

ఉల్లాసముగ నన్ను ఓదార్చ వేల
మెడనిండ సొమ్ములు పెడతాను
కంచి పట్టు చీరలు కట్టబెడతాను
మెడనిండ సొమ్ములు పెడతాను
కంచి పట్టు చీరలు కట్టబెడతాను

ఇల్లంత స్వర్గంగ మార్చి వేస్తాను
ఇల్లంత స్వర్గంగ మార్చి వేస్తాను
ఇంతకన్నా మంచి ఏమి చేస్తాను

No comments

Most Recent

Default