Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "K. Pratyagatma"
Kamalamma Kamatham (1979)



చిత్రం: కమలమ్మ కమతం (1979)
సంగీతం: టి.చలపతి రావు 
సాహిత్యం: వేటూరి కొసరాజు, జాలాది
గానం: యస్.పి.బాలు, పి.సుశీల, జానకి, విజయలక్ష్మి శర్మ 
నటీనటులు: కృష్ణం రాజు, జయంతి, పల్లవి, విజయ లలిత, రామకృష్ణ 
దర్శకత్వం: ప్రత్యగాత్మ 
నిర్మాత: ఏ.వి.సుబ్బారావు 
విడుదల తేది: 01.03.1979



Songs List:



ఏమౌతుంది ఇప్పుడేమౌతుంది పాట సాహిత్యం

 
చిత్రం: కమలమ్మ కమతం (1979)
సంగీతం: టి.చలపతి రావు 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

ఏమౌతుంది.... యిప్పు డేమౌతుంది
ఇటా ఇట్టిట్టా యిది ఎందాకా పోతుంది
అహ .... నాకు తెలీక అడుగుతాను
పిల్లగాడి రిమరిమలు
పులిహోర ఘమఘమలు.... పిల్లగాడి ....
పిల్లదాని చెక్కిళ్ళు
నా చెక్కర పొంగళ్ళూ.... పిల్లదాని....
ఆకేసి వడ్డిస్తా
అవుపోసన పడతావా.... ఆ కేసి....
అవుపోసన ఆనక చూద్దాం
ఆరగింపు మొదలెడతా
ఆరగింపు మొదలెడతా.... అవుపోసన....
గోవిందా గోవిందా
ఏందయ్యా ఆచార్లూ ఏం జరిగింది
అబ్బా చెయ్యి కడిగేశాడండీ
ఎట్టా యిప్పుడేమౌతుందయ్య
రావే అరకు రాణీ
నీకు చేస్తానే వలపు బోణీ
రారా నా రాజ నిమ్మలపండు
నిన్ను రమ్మంది నా తల్లో మల్లెచెండు రారా ....
పట్టా రాసిస్తావా కమలమ్మా నీ కమతం పట్టా...
అడగాలా రామయ్య నువ్వు అడగాలా
నన్ను అడగాలా
యీ కొండ్రంతా నీ సొంతం
ఈ కొండ్రంతా నీకే సొంతం
పోయిందయ్యో పోయింది
ఏంటా గోల
కమ్మలమ్మా పోయింది కమతమూ పోయిందీ

అహ యిప్పుడే మౌతుంది
మేడెత్తు ఎదిగావు కోడెగాడా
నీకే ఓటిచ్చుకుంటాను అందగాడా

వయ్యారి కమలమ్మా
వలపుల్లో గెలిపిస్తే
నిన్నేలు కుంటానే కుతితీరా

ఎన్నికలలో ఎందరెన్ని కలలోకన్నా ఎన్నికలలో :
ఏనాటికీ నువ్వే ప్రెసిడెంటువి
నా ప్రెసిడెంటువి.




అత్తకూతురా చిట్టి మరదలా పాట సాహిత్యం

 
చిత్రం: కమలమ్మ కమతం (1979)
సంగీతం: టి.చలపతి రావు 
సాహిత్యం: జాలాది
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

హోయ్ హోయ్-హోయ్.
అత్తకూతురా చిట్టిమరదలా

కొత్త చీరలో నిన్ను చూస్తుంటే
ఏదో అవుతాదే యెర్రెత్తి పోతాదే
ఏదో అవుతాదే యెర్రెత్తి పోతాదే
హోయ్ మేనత్త కొడకా మీసాల బావా
కోడె గిత్తలా కుమ్ముకొస్తుంటే
గుబులెత్తి పోతాదే గుండెగిరి పడతాదే
గుబులెత్తి పోతాదే గుండెగిరి పడతాదే
నీ చిలిపి కౌగిళ్ళే నా చలువ పందిళ్లు

నీ గుండె లోగిళ్ళే నా నూరేళ్ళ సిరులూ
నా వయసులోని బిగువు నీ అడుగులోని బరువు
చూసి చూసి కళ్ళు రెండు సోలి పోతున్నాయ్

కళ్ళంటే కళ్ళా అవికలువ పువ్వుల్లా -
కళ్ళంటే.....
వొళ్ళంటే వొళ్ళా అది దొంతు మల్లెల్లా
హాయ్.... హాయ్ - హాయ్

ఆ నడక చూస్తుంటే - నీ నడుము వూగుతుంటే
ఆ నడక ....
తిమ్మిరి తిమ్మిరి జింగిరి బింగిరి అవుతోందే పిల్లా
హేయ్ అత్తకూతురా !
కల్ల బొల్లి మాటలంటే కప్పచేత కరిపిస్తా
అయ్య బాబోయ్
అల్లరి చేశావంటే పుట్టి నింటికె ఎల్లిపోతా
ఎల్లిపో
కల్లబొల్లి మాటలంటే కప్పచేత కరిపిస్తా
అల్లరి చేశావంటే పుట్టినింటికె ఎల్లిపోతా
తాళికట్టి నెత్తిమీద తలంబ్రాలు పోస్తా తాళికట్టి....
పల్లకీలో నీ పక్కన వూరేగుతు వస్తా
తిక్క రేగిందంటే 
ఏంటా పోర్సు
బుగమేట్లో దూకేస్తా
నిన్ను దాటి యేరుదాటి
దాటి దాటి
ఏం చేస్తావ్
నీకు సవితిని తెచ్చేస్తా
ఎట్టా - ఎట్టా
నిన్ను దాటి యేరు దాటి నీకు సవితిని తెచ్చేస్తా
నిన్ను దాటి....
నీకు సవితిని తెచ్చేస్తా
నీకు సవితిని తెచ్చేస్తా



ఇంటి ముందు ఈత చెట్టు పాట సాహిత్యం

 
చిత్రం: కమలమ్మ కమతం (1979)
సంగీతం: టి.చలపతి రావు 
సాహిత్యం: కొసరాజు
గానం: విజయలక్ష్మి శర్మ , యస్.పి.బాలు

ఇంటి ముందూ యీత సెట్టూ
ఇంటి ఎనకా తాడి సెట్టూ
ఇంటిముందూ ....

యీత పెట్టూ యిల్లు కాదూ
తాడి సెటూ తల్లి కాదూ
తగులు కోనోడే మొగుడౌతాడా
ఆచారీ — ఓ ఆచారీ 
ముద్దుల ఆచారీ - గుళ్ళో పూజారీ
అట్టాగా అట్టయితే యిదికూడా ఇనుమరి
ఆ....వూరి ముందర వుల్లితోట
వూరిబైట మల్లితోట
వుల్లి తల్లి అవుతుందా మల్లె
మందు కొస్తుందా....
మూడు ముళ్ళస్తేనే మొగుడౌతాడా!
చుక్కా ... చుక్కా .... చుక్కా
చల్లని గంధపు చెక్కా....ముద్దుల ముద్దుల
చుక్కా .... చుక్కా .... చుక్కా
తీయని కొబ్బరిముక్కాముక్కముక్కముక్క
హద్దు యిడిసిన ఆడదానికి పద్దులు రాసి
పెట్టడానికి .... హద్దు

మొగుడో మొద్దులో ఎవడో ఒకడుండాలి.
నాలాంటి వాడెవడో అండగా నిలవాలి
అయితే ఒక పని చేత్తా
ఏంటీ
పగటిపూట నా పక్కన బజారెంట వస్తావా ఆచారీ
కొంపలంటుకు పోతాయమ్మో --
ఆచారీ పూజారీ వూరి ముందర వుల్లితోట వూరి...
ఉల్లి తల్లి అవుతుందా మల్లె మందుకొస్తుందా
మూడు ముళ్ళేస్తేనే మొగుడౌతాడా.. చుక్కా - చుక్కా- చుక్కా
చల్లని గంధపు చెక్కా ముద్దుల ముద్దుల చుక్కా
తీయని కొబ్బరి ముక్కా
సల్ల సల్లగా పక్కన చేరి సరిగమలే -
వాయించుకుంటే అయ్యబాబోయ్
సల్ల సల్లగా పక్కన చేరి, సరిగమలే -
వాయించుతుంటే
పరువు మర్యాదా పందిరెక్కి కూచుందా
నడి బజారులో మాత్రం నామోషీ వచ్చిందా
అమ్మమ్మమ్మమ్మో తప్పు అంత మాటనకే
చుక్కా-చుక్కా-చుక్కా చల్లని గంధపు చెక్కా
ముద్దుల ముద్దల అబ్బ చుక్క
తీయని కొబ్బరి ముక్కా - - ఇంటిముందు

ఇంటి ముందూ యీత సెట్టూ ఇంటి వెనకా-
తాడి సెట్టూ
ఈత సెట్లూ ఇల్లుకాదూ తాడి సెట్టూ తల్లి కాదూ
తగులు కొన్నోడే మొగుడౌతాడా ఆచారీ - ఓ ఆచారీ
ముద్దుల ఆచారీ - - గుళ్ళో పూజారీ --

ఊరు పేరూ ఉన్నవాణ్ణి ప్రెసిడెంటుకి కుడిభుజాన్ని
హోయ్ : ఊరూ పేరూ....
కొండమీద కోతినైనా తెప్పించే గొప్పోణ్ణి
గుడిలో దేముడికే నామం పెట్టేవోణ్ణి...
కొండమీద
ఆ యింకా చెప్పనా మన గొప్ప....
పేరు గొప్ప ఊరు దిబ్బ ఆపవయ్య సొంతడబ్బా -
ఆశారీ... ఓ ఆశారీ .... ముద్దుల ఆచారీ ....
ఆశారీ.... ఆశారీ - పూజారీ 

యింటి ముందూ ఈత సెట్టూ
యింటి వెనకా తాడి సెటూ
ఈత సెట్టూ ఇల్లు కాదూ తాడి సెట్టూ తల్లికాదు
తగులుకున్నోడే మొగుడౌతాడా ఆచారీ ఓ ఆచారీ 
ముద్దుల ఆచారీ....గుళ్ళో పూజారీ




నిమ్మ చెట్టుకు నిచ్చెనేసి పాట సాహిత్యం

 
చిత్రం: కమలమ్మ కమతం (1979)
సంగీతం: టి.చలపతి రావు 
సాహిత్యం: కొసరాజు
గానం: యస్.జానకి

నిమ్మచెట్టుకు నిచ్చేనేసి నిమ్మపళ్ళు కొయ్యబోతే
నిమ్మముళ్లు రోమ్మునాటెనురా. హాయ్ హాయ్ హాయ్ హాయ్

నిమ్మముళ్ళు రొమ్ము నాటెనురా ఓ రందగాడా
సన్న రైక సగం చిరెగెనురా
రెకెందుకు చిరిగిందని
కొప్పెందుకు చెదిరిందని రై కెందుకూ........
అత్తముందూ అంద రడిగితే
ఆ - అడిగితే ఏమైందట 
ఆ - చెప్పడాని కేముందిరా
ఆ - చెప్పడానికేముందిరా
ఓరందగాడా - సిగ్గు ముంచుకొస్తుందిరోయ్.. నిమ్మచెట్టుకు..

చెలమయ్యా చేనుకాడ నిన్ను తలచుకుంటూ కూచునుండే
చెలమయ్యా చేను ....
ఈల వేసి.... నన్ను పిలిచి చెంగుపట్టి లాగావనీ
వూరు నోరు.... వూరు నోరూ చేసుకొందిరా
వూరు నోరు చేసుకొందిరా ఓ రందగాడా
తూరుపార పట్టిందిరా హాయ్ .... హాయ్..... నిమ్మచెట్టుకు...
మావ కొడకా వస్తావని
మంచమేసి కాసుకుంటే మావకొడకా....

ఇంటిపక్క ఎంకటేసు
చెమ్మ చెక్కలాడి ఆడి ఆడి ఆడి
అబ్బా ఎవరితోటి చెప్పుకుందురా ఎవరితోటి
ఓ రండగాడ యీది పాలు చేశావురో నిమ్మచెట్టుకు



తొలిసారి మొగ్గేసింది పాట సాహిత్యం

 
చిత్రం: కమలమ్మ కమతం (1979)
సంగీతం: టి.చలపతి రావు 
సాహిత్యం: వేటూరి
గానం: పి.సుశీల, యస్.పి.బాలు

తొలిసారి మొగేసింది సిగ్గూ -పాడుసిగ్గు తొలిసారి..
ఆ సిగ్గే మొగై పిండై కాయై సండై అమ్మో
కోకకొత్త బరువేసింది రైక కాస్త బిగు వేసింది
కోకకొత్త ....
ఆ సూపే సిటుకూ సిటుకూ గుండెలో దరువేసింది

నాకు సిగ్గేసింది.... తొలిసారి మొగ్గేసింది .......

కొత్తగా చూసిందేముంది సరికొత్తగా చూడని
దేముంది కొత్తగా

చూపూ చూపూ కలిసింది. అది చుట్టరికం —
కలిపేసింది. చూపూ చూపూ....
నీ చూపుల రాపిడిలో సిగ్గుకే సిగ్గేసింది..
సిగ్గే మొగ్గేసింది.....
తొలిసారి మొగ్గేసింది సిగ్గుః పాడు సిగ్గుః ....

దాచినా దోచని దేముంది
నువ్వు దోచితే దొరకని దేముంది, దాచినా
గువ్వకు గువ్వే దొరికింది
తన గుండె గూడుగా మలచింది
తొలిరాతిరి తెలారగానే

నెలవంక కనిపించింది.
నెల యింక తప్పిస్తుంది..
తొలిసారి మొగ్గేసింది
ఎనక జన్మ ఒక పులకింత
అది తలుచుకుంటే గిలి ఒళ్ళంత.... ఎనక జన్మ....
ముందు జన్మ తెలియని వింత
అది వుందో లేదో తేలన చింత ముందుజన్మ....
ఈ జన్మల వూసులు వింటే ఎందుకో నవొచ్చింది
తొలిసారి మొగ్గేసింది సిగ్గూ.... పాడు సిగూ....

Palli Balakrishna Monday, October 30, 2023
Alludochadu (1976)




చిత్రం: అల్లుడొచ్చాడు (1976)
సంగీతం: టి. చలపతి రావు
నటీనటులు: రామకృష్ణ , రాజబాబు, నాగభూషణం, జయసుధ, ప్రభ, కృష్ణ కుమారి
కథ: భమిడిపాటి రాధాకృష్ణ
దర్శకత్వం: కె. ప్రత్యగాత్మ
బ్యానర్: ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్
నిర్మాత: ఎ. వి. సుబ్బారావు
విడుదల తేది: 10.06.1976



Songs List:



లేత కొబ్బరి నీళ్ళల్లే పాట సాహిత్యం

 
చిత్రం: అల్లుడొచ్చాడు (1976)
సంగీతం: టి. చలపతిరావు
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి.బాలు

పల్లవి:
లేత కొబ్బరి నీళ్ళల్లే
పూత మామిడి పిందల్లే
లేత కొబ్బరి నీళ్ళల్లే 
పూత మామిడి పిందల్లే
చెప్పకుండా వస్తుంది చిలిపి వయసు
నిప్పుమీద నీరౌతుంది పాడు మనసు.. మనసూ

చరణం: 1 
పొంగువస్తుంది నీ బాల అంగాలకు ఏహే
రంగు తెస్తుంది నీ పాల చెక్కిళ్ళకు

కోక కడతావు మొలకెత్తు అందాలకు ఏహే
కొంగు చాటేసి గుట్టంత దాచేందుకు
దాగలేనివి ఆగలేనివి
దారులేవో వెతుకుతుంటవి

చరణం: 2 
కోటి అర్ధాలు చూసేవు నా మాటలో ఓ...
కోర్కెలేవేవో రేగేను నీ గుండెలో
నేర్చుకుంటాయి నీ కళ్ళు దొంగాటలు
ఆడుకుంటాయి నాతోటి దోబూచులు

చూచుకొమ్మని దోచుకొమ్మని
చూచుకొమ్మని దోచుకొమ్మని
దాచుకున్నవి పిలుస్తుంటవి

చరణం: 3 
ఓ...వయసు తెస్తుంది ఎన్నెన్నో పేచీలను ఏహే...
మనసు తానొల్లనంటుంది రాజీలను

ఆహా...పగలు సెగబెట్టి వెడుతుంది లోలోపల...ఓహో
రాత్రి ఎగదోస్తు ఉంటుంది తెల్లారులు
రేపు ఉందని తీపి ఉందని
ఆశలన్నీ మేలుకుంటవి




మా తెలుగు తల్లికీ మల్లె పూదండ పాట సాహిత్యం

 
చిత్రం: అల్లుడొచ్చాడు (1976)
సంగీతం: టి. చలపతిరావు
సాహిత్యం:  
గానం: సుశీల

మా తెలుగు తల్లికీ మల్లె పూదండ
మా కన్న తల్లికీ మంగళారతులు

కడుపులో బంగారు కినుచూపులో కరుణ
చిరునవ్వులో సిరులు పొరలించు మా తల్లి 

మా తెలుగు తల్లికీ మల్లె పూదండ
మా కన్న తల్లికీ మంగళారతులు

గలగలా గోదారి కదిలి పోతుంటేనూ
బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
దింగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలుతాయి 

మా తెలుగు తల్లికీ మల్లె పూదండ
మా కన్న తల్లికీ మంగళారతులు

అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కన్న కలములో తీయందనాలు
నిత్యమై, నిఖిలమై నిలిచి వుండేదాక 

మా తెలుగు తల్లికీ మల్లె పూదండ
మా కన్న తల్లికీ మంగళారతులు



కొడితే పులినే కొట్టాలి పాట సాహిత్యం

 
చిత్రం: అల్లుడొచ్చాడు (1976)
సంగీతం: టి. చలపతిరావు
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి
గానం: యస్.పి.బాలు, పి. సుశీల

కొడితే పులినే కొట్టాలి
పడితే చెలినే పటాలి
ఆ చెలి కౌగిలిలో
చలిమంటలు పుట్టాలి
గిలిగింతలు పెట్టాలి

కొడితే పులినే కొట్టాలి.
పడితే చెలినే పట్టాలి.

ఆరె చెలి కౌగిలి కై
పది జన్మలు కావాలి
పడిగాపులు కాయాలి

నీలాటి రేవుకాడ నీలాంటి చిన్నది
నీళ్ళల్లో రగిలే నిప్పల్లే వున్నది
చూపు చూసింది చురక వేసింది
మేను కదిలింది. మెరుపు మెరిసింది
పిల్లనుకౌనూ పిడుగే నన్నది
పడితే ఆ పిడుగు నేపట్టాలి...పట్టాలి...పట్టాలి....

కొడితే పులినే కొట్టాలి

కోటప్ప కొండమీద కోలాటమాడుతుంటే
కొవ్వెక్కి కోడెగిత నా వెకి దూకుతుంటే
గడుసైన చినవాడే తొడగొటి నిలిచాడే
కొమ్ములు విరిచేశాడే కోడెను తరిమేశాడే
ఈలవేసి నే రమ్మంటే ఎటో జారిపోయాడే

పడితే ఆ గడుసోన్నే పట్టాలి... పట్టాలి...పటాలి...

కొడితే పులినే కొట్టాలి

గోల్కొండ ఖిల్లా పైన గొంతెత్తి పాడితే
ఆకాశం అంచులదాకా నా పాటే మోగితే
మోగితే ఏమయింది?
ఆకాశం కూలిందా,
పాతాళం పేలిందా,
కాకమ్మ మెచ్చిందా ?
కోకిలమ్మ చచ్చిందా ?
కాదు; కాదు-
కాలేజీ పిల్లికూన కౌగిట్లో వాలింది
పడితే ఆ పిల్లికూననే పట్టాలి...పట్టాలి... పట్టాలి...

కొదితే పులినే కొట్టాలి




వేళా పాళా ఉండాలమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: అల్లుడొచ్చాడు (1976)
సంగీతం: టి. చలపతిరావు
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు

వేళా పాళా ఉండాలమ్మా దేనికైనా 
నువ్వు వేగిరపడితే రాదమ్మా తేరగ వచ్చేదైనా
కోరిక నీలో ఎంతవున్నా
తీర్చే మొనగా డెదుట వున్నా
వేడి ఎక్కడో పుట్టాలి
నీ వేడుక అప్పుడు తీరాలి

వేళా పాళా ఉండాలమ్మా దేనికైనా 
నువ్వు వేగిరపడితే రాదమ్మా తేరగ వచ్చేదైనా

పొదలో తుమ్మెద రొద పెడితే
మొగ్గకు తేనె వచ్చేనా
ఎదలో ఏదో సొదపెడితే
ఎంకి పాటగా పలికేనా
పెదవులూ రెండూ కలవాలి
నీ ఎదలోని కుతి తీరాలి

వేళా పాళా ఉండాలమ్మా దేనికైనా
నువ్వు వేగిరపడితే రాదమ్మా తేరగ వచ్చేదైనా


పదహారేళ్ళ ప్రాయంలోన పైటజారక నిలిచేనా
ఎదిగే పొంగు ఏనాడైనా అదిమిపట్టితే ఆగేనా !
ఆగని వన్నీ రేగాలి
అప్పుడు మన కథ సాగాలి....

వేళా పాళా ఉండాలమ్మా దేనికైనా 
నువ్వు వేగిరపడితే రాదమ్మా తేరగ వచ్చేదైనా




ఉరకల పరుగుల పాట సాహిత్యం

 
చిత్రం: అల్లుడొచ్చాడు (1976)
సంగీతం: టి. చలపతిరావు
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, పి. సుశీల

ఉరకల పరుగుల పరుగుల ఉరకల ప్రాయం
దీనిదుంప తెగ వాడకపోతే ఎంతో ఎంతో
నష్టం
ఉరకల పరుగుల పరుగుల ఉరకల ప్రాయం
దీన్దుంప తెగ వాడకపోతే ఎంతో ఎంతో
నష్టం

వద్దు వద్దు వద్దు వయస్సు పోనీయొద్దూ
ఇంత వాటంగా నీకు నాకు మళ్ళీ మళ్ళీ దొరకదు

ఉరకల పరుగుల పరుగుల ఉరకల ప్రాయం
దీన్దుంప తెగ వాడకపోతే ఎంతో ఎంతో
నష్టం

కోడె వయసుకున్నవీ కొండగుర్తులు
ఎన్నో కొండగురులు
ఏమిటవి?
కోర్కె పుట్టేది గుండె చెదిరేది
తోడు వెతికేది దుడుకు పెరిగేది
ఆ వయసుకే వస్తాయి కొంటెచేష్టలు
ఎన్నో కొంటెచేష్టలు
ఏమిటవి ,
కళ్ళు కలిపేది నీళ్ళు నమిలేది
వొళ్ళు విరిచేది తల్లడిల్లేది...

ఉరకల పరుగుల పరుగుల ఉరకల ప్రాయం
దీన్దుంప తెగ వాడకపోతే ఎంతో ఎంతో
నష్టం

ప్రేమకే వస్తాయి పిచ్చి ఊహలు
ఎన్నో పిచ్చి ఊహలు
ఏమిటవి?
పంటి నొక్కుల్లో పెడవి కాటుల్లో
కంటిపాపల్లో కలలమాపుల్లో
ఆ ఊహలకొస్తాయి రూపు రేఖలు
ఎన్నో రూపురేఖలు
ఏమిటవి?
జగమే మనదని సగమూ సగమని
జన్మజన్మ లకు మనదే జంటని

ఉరకల పరుగుల పరుగుల ఉరకల ప్రాయం
దీన్దుంప తెగ వాడకపోతే ఎంతో ఎంతో నష్టం
ఉరకల పరుగుల పరుగుల ఉరకల ప్రాయం




ఎలా చెప్పేదెలా చెప్పేది పాట సాహిత్యం

 
చిత్రం: అల్లుడొచ్చాడు (1976)
సంగీతం: టి. చలపతిరావు
సాహిత్యం: కొసరాజు
గానం: పి. సుశీల

ఎలా చెప్పేదెలా చెప్పేది
చల్ మోహన రంగా
చెప్పబో తే సిగ్గు ముంచుకు వస్తుంది
చాటు చాటుగా చెబుదామంటే
మాయదారి చంద్రుడున్నాడు
చల్లచల్లగా చెప్పాలంటే
అల్లరిగాలి వింటున్నాడు
తిక్క రేగుతుంది. వేడెక్కిపోతుంది
వళ్ళు తెలియకుంది గుండెల్లో గుబులుంది
ఊపిరాడదయ్యో అయ్యో
ఉక్కిరి బిక్కిరి అవుతుంది

ఎలా చెప్పేదెలా చెప్పేది
చల్ మోహన రంగా

పక పక నువ్వు నవ్వితే
నా చెక్కిలి ఎరుపెక్కుతుంది
చిలిపిగ నువ్వు చూస్తే
నా కళ్ళకు కై పెక్కుతుంది.

నువ్వంటే పిచ్చి నీమాటంటే పిచ్చి
నువ్వుంటేను పిచ్చి లేకుంటేను పిచ్చి
నీ పాటంటే అబ్బో అబ్బో
మరీ మరీ పిచ్చి

ఎలా చెప్పేదెలా చెప్పేది
చల్ మోహన రంగా




అంతే నాకు చాలు పాట సాహిత్యం

 
చిత్రం: అల్లుడొచ్చాడు (1976)
సంగీతం: టి. చలపతిరావు
సాహిత్యం: దాశరథి
గానం: పి. సుశీల

అంతే నాకు చాలు
తమలపాకు తొడిమే పదివేలు
నే నేదింక కోరేదిక లేదు
అందరివోలె అడిగేదాన్ని కాను
కొందరివోలె కొసరేదాన్ని కాను
ఓహో బంగారు మావా ఓహో బంగారు మావా
ముక్కుకు ముక్కెర లేక
ముక్కు చిన్నబోయినాది
ముద్దుటుంగరం కుదువబెట్టి
ముక్కుకు చక్కని ముక్కెర తేరా...మావా 

అంతే నాకు చాలు
తమలపాకు తొడిమే పదివేలు

నడుమా వడ్డాణం లేక
నడుము చిన్నబోయినాది
నాణ్యమైన ధాన్యం అమ్మీ
నడుముకు వడ్డాణం తేరా.....మావా
|
అంతే నాకు చాలు
తమలపాకు తొడిమే పదివేలు

కాళ్ళకు కడియాలు లేక
కాళ్ళు చిన్నబోయినాయి
కోడి ఎద్దుల నమ్ముకోని
కాళ్ళకు కడియాలు తేరా....మావా 

అంతే నాకు చాలు
తమలపాకు తొడిమే పదివేలు

పట్టెమంచం పరుపు లేక
మనసూ చిన్నబోయినాది
పంట భూములమ్ముకోని
పట్టెమంచం పరుపూ తేరా... మావా

అంతే నాకు చాలు
తమలపాకు తొడిమే పదివేలు

Palli Balakrishna Tuesday, May 18, 2021
Bharya Bhartalu (1961)




చిత్రం: భార్యా భర్తలు (1961)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
నటీనటులు:  అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ కుమారి
దర్శకత్వం: కె. ప్రత్యగాత్మ
నిర్మాత: ఏ.వి. సుబ్బారావు
బ్యానర్: ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్
విడుదల తేది: 31.03.1961



Songs List:



జోరుగా హుషారుగా షికారు పోదామా! పాట సాహిత్యం

 
చిత్రం:  భార్యాభర్తలు (1961)
సంగీతం:  సాలూరి. రాజేశ్వరరావు
సాహిత్యం:  శ్రీశ్రీ
గానం: ఘంటసాల

జోరుగా హుషారుగా షికారు పోదామా!
హాయి హాయిగా తీయ తీయగా
జోరుగా హుషారుగా షికారు పోదామా!
హాయి హాయిగా తీయ తీయగా

ఓ ...బాల నీ వయ్యార మెంచి మరులుకొంటి నే
చాల ప్రేమ పాఠములను చదువుకొంటినే
మరువనంటినే

 ||జోరుగా॥

నీ ... వన్నె చిన్నె లన్ని చూచి వలచినాడనే
వయసు సొగసు తలచి తలచి మురిసినాడనే
కలసి రాగదే

 ||జోరుగా॥

నా ...కలలలోన చెలియ నిన్నె పిలచినాడనే
కనులు తెరచి ఎదుట నిన్నె కాంచినాడనే
వరించువాడనే




ఓ..సుకుమారా పాట సాహిత్యం

 
చిత్రం:  భార్యాభర్తలు (1961)
సంగీతం:  సాలూరి. రాజేశ్వరరావు
సాహిత్యం:  శ్రీశ్రీ
గానం: ఘంటసాల, సుశీల

పల్లవి:
ఓ..సుకుమారా నను చేరా రావోయి ఇటు రావోయి
నిలువగ లేని వలపులరాణి నీ కొరకే తపించునులే
నిలువగ లేని వలపులరాణి నీ కొరకే తపించునులే

ఓ..జవరాలా ప్రియురాలా ఈనాడే మనదే హాయి
తనువుగ నేడు ఈ చెలికాడు 
నీ దరినే సుఖించునులే

చరణం: 1
కోటి కిరణముల కోరిన గాని
భానుని చూడదు కలువ చెలి
కోటి కిరణముల కోరిన గాని
భానుని చూడదు కలువ చెలి
వెన్నెల కాంతి వెలిగిన వేళా
వెన్నెల కాంతి వెలిగిన వేళా
విరుయునుగా విలాసముగా

నిలువగ లేని వలపులరాణి 
నీ కొరకే తపించునులే

చరణం: 2
వేయి కనులతో వెదికిన గాని
తారకు జాబిలి దూరమేగా
వేయి కనులతో వెదికిన గాని
తారకు జాబిలి దూరమేగా
కలువల రాణీ వలపులలోనే
కలువల రాణీ వలపులలోనే
కళకళలాడి చేరునుగా

తనువుగ నేడు ఈ చెలికాడు 
నీ దరినే సుఖించునులే




మధురం మధురం పాట సాహిత్యం

 
చిత్రం:  భార్యాభర్తలు (1961)
సంగీతం:  సాలూరి. రాజేశ్వరరావు
సాహిత్యం:  శ్రీశ్రీ
గానం: ఘంటసాల, సుశీల

మధురం మధురం ఈ సమయం
ఇక జీవితమే ఆనందమయం
మధురం మధురం ఈ సమయం 

చల్లని పున్నమి వెన్నెలలో
ఎన్నడు వీడని కౌగిలిలో
చల్లని పున్నమి వెన్నెలలో
ఎన్నడు వీడని కౌగిలిలో
కన్నుల వలపు కాంతులు మెరయగ

 ||మధురం||

కరగిపోయె పెను చీకటి పొరలు
కరగిపోయె పెను చీకటి పొరలు
తొలగిపోయె అనుమానపు తెరలు
తొలగిపోయె అనుమానపు తెరలు

పరిమళించె అనురాగపు విరులు
పరిమళించె అనురాగపు విరులు
అలరెనే మనసు నందనవసము

|| మధురం...||

సఫల మాయెనే మన తియ్యని కలలు
సఫల మాయెనే మన తియ్యని కలలు
జగము నిండె నవజీవన కళలు
జగము నిండె నవజీవన కళలు

పొంగిపొరలె మన కోర్కెల అలలు
పొంగిపొరలె మన కోర్కెల అలలు
భావియే వెలిగె పూవుల బాటగ 

||మధురం... !!



ఏమని పాదేదనో ఈ వేళ పాట సాహిత్యం

 
చిత్రం:  భార్యాభర్తలు (1961)
సంగీతం:  సాలూరి. రాజేశ్వరరావు
సాహిత్యం:  శ్రీశ్రీ
గానం:  సుశీల

ఏమని పాదేదనో ఈ వేళ
మానస వీణ మౌనముగా
నిదురించిన వేళ
ఏమని పాడెదనో

జగమే మరచి హృదయ విపంచి
గారడిగా వినువీధి చరించి
కలత నిదురలో కాంచిన కలలే
గాలి మేడలై కూలిన వేళ
ఏమని పాడెదనో

వనసీమలలో హాయిగ ఆడే
రాచిలుకా నిను రాణిని చేసే
పసిడితీగల పంజరమిదిగో
పలుక వేమని పిలిచే వేళ



రంగ రంగేళీ పాట సాహిత్యం

 
చిత్రం:  భార్యాభర్తలు (1961)
సంగీతం:  సాలూరి. రాజేశ్వరరావు
సాహిత్యం:  ఆరుద్ర 
గానం:  సుశీల

రంగ రంగేళీ సుఖాలను తేలి
రావోయి మధుర మీరేయి
రంగ రంగేళీ

నిన్ను కోరే గులాబులు
ఈయ వేల జవాబులు
నిన్ను కోరే గులాబులు
ఈయ వేల జవాబులు
మనసులోని మమత లేవో
మనసులోని మమత లేవో
తెలుపునే మెరిసే కనులు
పరాకేలనోయి ప్రియా

భరింపజాల ఈ విరహ జ్వాల
వహవ్వా
వలపుల బాలననీ బేలననీ రమ్మనవు
వలపుల బాలననీ బేలననీ రమ్మనవు
వలచి చేరితి నే కోరితినే చిరునగవు
తొలగిపోయెదవు చాలునులే యీ బిగువు
సరసాలు మురిపాలు మరి రానేరావు 



చూచి చూచి కళ్లు కాయలే కాచాయి పాట సాహిత్యం

 
చిత్రం:  భార్యాభర్తలు (1961)
సంగీతం:  సాలూరి. రాజేశ్వరరావు
సాహిత్యం:  కొసరాజు
గానం:  ఘంటసాల, జిక్కీ

జో జో జో జోజో
చూచి చూచి కళ్లు కాయలే కాచాయి
గా నీ తండ్రి ఊడి పడ్డాడూ
చక్కనీ నా బాబు జోజో
చల్లనీ నా తండ్రి జోజో

రెక్కలూ గట్టుకొని రివ్వునా వాలాను
రేయింబగళ్ళు నిను తలచుకొని మురిశాను
మురిపాల మొలకవూ జోజో
ముద్దులూరించేవు జోజో

|| చూచి చూచి||

కాకితో ఒక సారి కబురంపినావని
కాకితో ఒక సారి కబురంపినావని
కలలోన నిను చాల కలవరించాను
కాశీకి పోయినా గంగలో మునిగినా
నిను మరువ కున్నాను జో జో
నిలువలేకున్నాను జో జో

|| చూచి చూచి||

ఏ వూళ్ళు తిరిగావు  ఏమేమి చేశావు
ఏ వూళ్ళు తిరిగావు  ఏమేమి చేశావు
ఎవరితో సరదాలు తీర్చుకొచ్చావు
ఇంత చక్కని రంభ ఇంటిలో ఉండగా
ఇతరులతో పని ఏమి జోజో
ఇది మంచి సమయము జోజో 
ఇది మంచి సమయము జోజో




కనకమా ! చిట్టి కనకమా! పాట సాహిత్యం

 
చిత్రం:  భార్యాభర్తలు (1961)
సంగీతం:  సాలూరి. రాజేశ్వరరావు
సాహిత్యం:  కొసరాజు
గానం: మాధవపెద్ది సత్యం, స్వర్ణలత

కనకమా ! చిట్టి కనకమా!
ముద్దు కనకమా ! నామాట వినుమా !
మనము కలసి మెలిసుంటే అప్పీలు లేదుసుమా !
కనకమా ! చిట్టి కనక మా ! నామాట వినుమా !

కలసి మెలిసున్నందు కేగా 
నీవు కరుణ జూపించావు బాగా
కలసి మెలిసున్నందు కేగా 
నీవు కరుణ జూపించావు బాగా


కల్లకపటం లేని నా కన్న తండ్రిని
వేటాడి వేధించి వెళ్ళగొట్టావుగా !
ఆలు మగలకు మధ్య చూడు
మామ అడ్డముంటే ఎంతో గోడు
ఆలు మగలకు మధ్య చూడు
మామ అడ్డముంటే ఎంతో గోడు

ఆనందముగ మనము అనుభవించాలంటే
ఆనందముగ మనము అనుభవించాలంటే
అడుగడుగునా మనకు గుదిబండ అయినాడు

కనకమా ! చిట్టి కనక మా ! నామాట వినుమా !

అల్లారు ముద్దుగా నా కోరికలు తీర్చి
అన్యాయమగు మాట లేల
అవ్వ అపహాస్యములు చేయ నేల
అన్యాయమగు మాట లేల
అవ్వ అపహాస్యములు చేయ నేల

ఉల్లాసముగ నన్ను ఓదార్చ వేల
మెడనిండ సొమ్ములు పెడతాను
కంచి పట్టు చీరలు కట్టబెడతాను
మెడనిండ సొమ్ములు పెడతాను
కంచి పట్టు చీరలు కట్టబెడతాను

ఇల్లంత స్వర్గంగ మార్చి వేస్తాను
ఇల్లంత స్వర్గంగ మార్చి వేస్తాను
ఇంతకన్నా మంచి ఏమి చేస్తాను

Palli Balakrishna
Manchi Manishi (1964)


చిత్రం: మంచిమనిషి (1964)
సంగీతం: టి.చలపతి రావు & సాలూరి రాజేశ్వర రావు
సాహిత్యం: దాశరధి
గానం: పి.బి.శ్రీనివాస్
నటీనటులు: యన్.టి.రామారావు, జమున
దర్శకత్వం: కె.ప్రత్యగాత్మ
నిర్మాత: కె.సుబ్బరాజు
విడుదల తేది: 11.11.1964

ఓ ఓ ఓ... గులాబి...
ఓ ఓ ఓ... గులాబి

వలపు తోటలో విరిసిన దానా
లేత నవ్వుల... వెన్నెల సోన
ఓహో గులాబి బాల అందాల ప్రేమమాల
సొగసైన కనులదానా సొంపైన మనసుదానా
నీవారెవరో తెలుసుకో తెలుసుకో తెలుసుకో

ఓహో గులాబి బాల అందాల ప్రేమమాల

కొంటె తుమ్మెదల వలచేవు...
జుంటి తేనెలందించేవు
మోసం చేసి మీసం దువ్వి
మోసకారులకు లొంగేవు లొంగేవు

ఓహో గులాబి బాల అందాల ప్రేమమాల

రూపం చూసి వస్తారు...
చూపుల గాలం వేస్తారు
రేకుల చిదిమీ సొగసులు నులిమీ
చివరకు ద్రోహం చేస్తారు
చివరకు... ద్రోహం... చేస్తారు...

ఓహో గులాబి బాల అందాల ప్రేమమాల
సొగసైన కనులదానా సొంపైన మనసుదానా
నీవారెవరో తెలుసుకో తెలుసుకో తెలుసుకో"





Palli Balakrishna Friday, February 22, 2019
Srimanthudu (1971)

చిత్రం:  శ్రీమంతుడు (1971)
సంగీతం:  టి. చలపతిరావు
సాహిత్యం:  దాశరథి
గానం: పి. సుశీల, జిక్కి (పి.జి.కృష్ణవేణి)
నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, జమున, బేబీ శ్రీదేవి,
దర్శకత్వం: కె.ప్రత్యగాత్మ
నిర్మాత: జి.రాధా కృష్ణమూర్తి
విడుదల తేది: 16.07.1971

పల్లవి:
చిట్టి పొట్టి బొమ్మలు.. చవ్ిన్నారీ బొమ్మలు
చిట్టి పొట్టి బొమ్మలు.. చిన్నారీ బొమ్మలు
బుల్లిబుల్లి రాధకు.. ముద్దు ముద్దు రాజుకు
బుల్లిబుల్లి రాధకు.. ముద్దు ముద్దు రాజుకు
పెళ్లండి.. పెళ్ళి ముచ్చటైన పెళ్ళి.. బహు ముచ్చటైన పెళ్ళి . . .

చిట్టి పొట్టి బొమ్మలు.. చిన్నారీ బొమ్మలు..
చిట్టి పొట్టి బొమ్మలు.. చిన్నారీ బొమ్మలు

చరణం: 1
కొంగులు ముడి వేసీ కోర్కెలు పెన వేసీ
బుగ్గలపై సిగ్గుతో కన్నులలో వలపుతో..
అడుగులలో మడుగులతో నడిచిపోవు బొమ్మలు.. 
చిట్టి పొట్టి బొమ్మలు..  చిన్నారీ బొమ్మలు..
చిట్టి పొట్టి బొమ్మలు..  చిన్నారీ బొమ్మలు

చరణం: 2
మెరిసిపోవు తాళితో మెడలో పూమాలతో మేళాలూ..
తాళాలూ సన్నాయీ.. బాజాలూ
లాలలలాల......లాలలలాల
రాజు వెంట రాణీ కాళ్ళకు పారాణీ
చేయి చేయి కలుపుకొని చిందులేయు బొమ్మలు

చిట్టి పొట్టి బొమ్మలు .. చిన్నారీ బొమ్మలు..
చిట్టి పొట్టి బొమ్మలు .. చిన్నారీ బొమ్మలు

చరణం: 3
పూల పల్లకీలో ఊరేగే వేళలో
కూ.. కోయిలమ్మ పాటతో.. చిలకమ్మల ఆటతో
అంతులేని ఆశలతో గంతులేయు బొమ్మలు

చిట్టి పొట్టి బొమ్మలు.. చిన్నారీ బొమ్మలు..
చిట్టి పొట్టి బొమ్మలు.. చిన్నారీ బొమ్మలు
బుల్లిబుల్లి రాధకు.. ముద్దు ముద్దు రాజుకు
బుల్లిబుల్లి రాధకు.. ముద్దు ముద్దు రాజుకు
పెళ్లండి.. పెళ్ళి ముచ్చటైన పెళ్ళి.. బహు ముచ్చటైన పెళ్ళి


********  ********  ********


చిత్రం:  శ్రీమంతుడు (1971)
సంగీతం:  టి. చలపతిరావు
సాహిత్యం:  కొసరాజు
గానం:  ఘంటసాల

పల్లవి:
బులి బులి ఎర్రని బుగ్గలదాన…
బులి బులి ఎర్రని బుగ్గలదాన…
చెంపకు చారెడు కన్నుల దాన
మరచి పోయవా నువ్వే మారిపొయవా…
ఆయ్యొ… మరచి పోయవా నువ్వే మారి పోయవా…

చరణం: 1
చెడ్డ దారిలో తిరిగానే… నీ చెంప దెబ్బలే తిన్నానే
చెడ్డ దారిలో తిరిగానే… నీ చెంప దెబ్బలే తిన్నానే
మంచి మాట… నీ నోట వినాలని
ఓహొ రాధా… ఒక మంచి మాట
ఒక మంచి మాట.. నీ నోట వినాలని
మనసు మార్చుకుని వచ్చానే… వచ్చానే…

బులి బులి ఎర్రని బుగ్గలదాన.. చెంపకు చారెడు కన్నుల దాన
మరచి పోయవా నువ్వే మారిపొయవా..
ఆయ్యొ..  మరచి పోయవా నువ్వే మారిపొయవా

చరణం: 2
బొమ్మల పెళ్ళి చేశావే... ఈ బొమ్మకు హారం వేశావే
చచ్చి బ్రతికి.. నీ చెంతకు వస్తే..
ఆయ్యొ రాధా...  నే చచ్చి బ్రతికి నీ చెంతకు వస్తే
నన్నె కాదని అంటావే...  అంటావే
బులి బులి ఎర్రని బుగ్గలదాన
చెంపకు చారెడు కన్నుల దాన
మరచి పోయవా నువ్వే మారిపొయవా
ఆయ్యొ… మరచి పోయవా నువ్వే మారిపొయవా

చరణం: 3
ఎవడో రాజా అంటవే.. నీ రాజానే కాదంటావే
ఎవడో రాజా అంటవే.. నీ రాజానే కాదంటావే
కళ్ళు తెరుచుకో.. కళ్ళు తెరుచుకో.. నిజం తెలుసుకో
కావాలంటే పరీక్ష చేసుకో.. చూసుకో
బులి బులి ఎర్రని బుగ్గలదానా
చెంపకు చారెడు కన్నుల దానా
మరచి పోయవా నువ్వే మారిపొయవా
ఆయ్యొ... మరచి పోయవా నువ్వే మారిపొయవా

Palli Balakrishna Thursday, November 30, 2017
Manasu Mangalyam (1971)


చిత్రం: మనసు మాంగల్యం (1971)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: దాశరధి
గానం: ఘంటసాల, పి.సుశీల
నటీనటులు: నాగేశ్వరరావు, జమున
దర్శకత్వం: కె.ప్రత్యగాత్మ
నిర్మాత: కోగంటి కుటుంబరావు
విడుదల తేది: 28.01.1971

ఏ శుభ సమయం లో ఈ కవి హృదయం లో
ఏ కాలి అందెలు మోగినావో
ఎన్నెని ఆశలు పొన్గినవొ
ఏ శుభ సమయం లో ఈ చెలి హృదయం లో
ఏ ప్రేమ గీతం పలికిన్దొ ఎన్నెన్ని మమతలు చిలికిన్దొ

అహా అహా ..అహా అహా..అహాహా అహాహా ఆ హా హ.

కలలో నీవె వూర్వసివే ఇల లో నీవు ప్రేయసివే
ఆ..ఆ..ఆ..నీడె లేని నాకోసం తొడై ఉన్న డెవుడవె
చిక్కని చీకటి లోన అతి చక్కని జాబిలి నీవె ఏ శుభ సమయం లో...ఓ..

మనిషై నన్ను దాచావు
కవివై మనసు దోచావు
నిన్నే గెలుచుకున్నాను
నన్నే తెలుసు కున్నాను

పందిరి నోచని లతకు
నవ నందన మేతీవి నీవె...ఏ శుభ సమయం లో ..ఓ

నీలో వీరిసీ హరివిల్లు నాలోకురిసే విరిజల్లు
కనులె కాంచి స్వప్నాలు నిజమై తొచే స్వర్గాలు
నవ్వుల ఊయల లోనే..నవయవ్వన శోభవు నీవె..
ఏ శుభ సమయం లో ..ఓ


*******  *********   ********


చిత్రం: మనసు మాంగల్యం (1971)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: ఆత్రేయ
గానం: ఘంటసాల

ఆవేశం రావాలి  ఆవేదన కావాలి
గుండెలోని గాయాలు మండించే గేయాలు
గుండెలోని గాయాలు మండించే గేయాలు
వేదనలై శోధనలై రగలాలి విప్లవాలు
రగలాలి విప్లవాలు
ఆవేశం రావాలి  ఆవేదన కావాలి

నరజాతిని భవితవ్యానికి నడిపేదే ఆవేశం
పదిమందికి భవితవ్యాన్ని పంచేదే ఆవేదన
వేగంతో వేడిమితో సాగేదే జీవితం
సాగేదే జీవితం

ఆవేశం రావాలి  ఆవేదన కావాలి

రణదాహం ధనమోహం కాలి కూలిపోవాలి
సమవాదం నవనాదం ప్రతి ఇంటా పలకాలి
ప్రతి మనిషీ క్రాంతి కొరకు రుద్రమూర్తి కావాలి
రుద్రమూర్తి కావాలి

ఆవేశం రావాలి  ఆవేదన కావాలి

తరతరాల దోపిడీల ఉరితాళ్ళను తెగతెంచి
నరనరాల అగ్నిధార ఉప్పెనలా ఉరికించి
మరో కొత్త ప్రపంచాన్ని మనిషి గెలుచుకోవాలీ
నిదురించిన నా కవితను కదలించిన ఆవేశం
మరుగు పడిన నా మమతకు తెర విప్పిన ఆవేదన
కన్నుగప్పి వెళ్ళింది నన్ను మరచిపోయింది
నన్ను మరచిపోయింది


********   ********   ********


చిత్రం: మనసు మాంగల్యం (1971)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: దాశరథి
గానం: ఘంటసాల

సన్నని వెన్నెల జలతారువలే
కన్నుల కమ్మెను కన్నీటి చెల
ఆ తెరలో  ఈ రాతిరిలో
నిన్ను నేను చూస్తున్నా నిన్ను నేను చూస్తున్నా
నీలో నన్ను నేను చూస్తున్నా

ఇద్దరిలో జగతిలోన ప్రేమ కొరకు వేగిపోవు
వేలవేల హృదయాలే చూస్తున్నా
నిన్ను నేను చూస్తున్నా  నీలో నన్ను నేను చూస్తున్నా
కదలీ కదలక కదలే నీ కదలికలో
కదలీ కదలక కదలే నీ కదలికలో
చిరుగాలికి ఊగాడే వరి మడినే చూస్తున్నా
ఆ వరి మడిలో  ఆ ఒరవడిలో
వంగి వంగి కలుపుతీయు కాపు కన్నె వంపులన్ని చూస్తున్నా

నిన్ను నేను చూస్తున్నా  నీలో నన్ను నేను చూస్తున్నా

విరిసీ విరియని విరివంటి పరువంలో
కెరటాల గోదారి ఉరకలనే కంటున్నా
ఆ ఉరకలలో  ఆ నుఱుగులలో
ఆ ఉరకలలో నుఱుగులలో జడవేస్తూ పడవ నడుపు
పల్లెపడుచు పకపకలే వింటున్నా

నిన్ను నేను చూస్తున్నా నీలో నన్ను నేను చూస్తున్నా

చిదుమని చెక్కిలి చిందే సిగ్గుల్లో
సందెవేళ అలముకునే ఎఱ్ఱజీర చూస్తున్నా
ఆ ఎఱ్ఱదనంలో  ఆ కుర్రతనంలో
ఆ ఎఱ్ఱదనంలో  ఆ కుర్రతనంలో
వెనకజన్మలెన్నెన్నో పెనవేసిన వెచ్చదనం కంటున్నా

నిన్ను నేను చూస్తున్నా నీలో నన్ను నేను చూస్తున్నా
నీలో నన్ను నేను చూస్తున్నా

Palli Balakrishna Thursday, August 3, 2017

Most Recent

Default