Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Pujita Ponnada"
Joruga Husharuga (2023)



చిత్రం: జోరుగా హుషారుగా (2023)
సంగీతం: ప్రనీత్ మ్యూజిక్
నటీనటులు: విరాజ్ అశ్విన్ , పూజిత పొన్నాడ, సోనూ టాకూర్
దర్శకత్వం: అను ప్రసాద్ 
నిర్మాత: నీరేష్ తిరువీధుల
విడుదల తేది: 2023 



Songs List:



అలవాటో పొరపాటో పాట సాహిత్యం

 
చిత్రం: జోరుగా హుషారుగా (2023)
సంగీతం: ప్రనీత్ మ్యూజిక్
సాహిత్యం: కిట్టు విస్సప్రగడ
గానం: అర్జున్ కనుంగో

అలవాటో పొరపాటో



యువరాణి పాట సాహిత్యం

 
చిత్రం: జోరుగా హుషారుగా (2023)
సంగీతం: ప్రనీత్ మ్యూజిక్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: అర్మాన్ మాలిక్, నవ్య సమీర 

ఒక కలల నువ్వలా
నిజమయ్యవే నా బంగారు బొమ్మ
నిండుగా పండుగే
నీ కలయికతో పుర్తైనదే నా జన్మా
నా ఊపిరి నువ్వమ్మా, ఆ ఆ

నీ కోపమంటే నాకు పొద్దు పొడుపులే
నీ నవ్వులంటే నాకు వెండి వెన్నెలే
నువ్వంటూ లేకపోతె నేను లేనులే
అంతలాగ నువ్వు నాలో
కలిసి మెలిసి పోయావే

నా సంగతేమో నాకు గుర్తు రాదులే
నీ ఊసులేవి నేను మర్చిపోనులే
నీపైన పెంచుకుంది ప్రేమ కాదులే
అంతకన్న ఎక్కువైన పిచ్చిలోన ఉన్నాను

యువరాణి యువరాణి నువ్వు
నా కలల యువరాణి నువ్వు
నీలాంటి అరుదైనా నిన్ను
వరమల్లె కలిసాను నేను

బతుకంత నీతోనే నేను
నువ్వు లేక కదలాడలేను
కలనైనా క్షణమైన నేను
నీ చెలిమి చేజార్చుకోను

కోటి కలల కేంద్రబిందువల్లే
నువ్వలాగ నిలిచి ఉంటే చాలు
కాలమంత ప్రేమ ఉత్సవాలే
నా గుండెలో..!!

ప్రాణవాయువల్లే వెంట కదిలే
జంటలాగ నువ్వు ఉంటె చాలే
జ్ఞాపకల పూల పరిమళాలే
నా దారిలో..!!

నీ రాకతో నాకంత ఆనందమే
ఏనాటికి నువ్వు నా సొంతమే

నువ్వంటే ఎందుకంటే అంత ఇష్టమో
మాటల్లో చెప్పమంటే ఎంత కష్టమో
నీ ప్రేమ పొందకుంటే ఎంత నష్టమో
తలుచుకుంటే ఉన్నపాటు
ఊపిరాగుతుందేమో

నీ చూపే బాషలేని ప్రేమ పత్రమో
నువ్వే నా ఊహల ప్రాణ చిత్రమో
మన గతాలు తెలిసి ఏ మాయజాలమో
మరో సారి నిన్ను నన్ను
ఇలా కలుపుతుందేమో

అడగొద్దు అడగొద్దు నన్నే
నువ్వంటే ఎంతిష్టమంటూ
వేవేల జన్మాలు అయినా
బ్రతికేస్తా నీ కలలు కంటూ

యువరాణి యువరాణి నువ్వు
నా కలల యువరాణి నువ్వు
నీలాంటి అరుదైనా నిన్ను
వరమల్లె కలిసాను నేను

బతుకంత నీతోనే నేను
నువ్వు లేక కదలాడ లేను
కలనైనా క్షణమైన నేను
నీ చెలిమి చేజార్చుకోను

Palli Balakrishna Thursday, October 5, 2023
Song: Zanjeere



పాట: జంజిరే 
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: భీమ్స్ సిసిరోలియో, సాహితి గాలిదేవర 
ఆర్టిస్ట్స్: పూజిత పొన్నాడ 
కోరియోగ్రాఫర్: రామ్ (D 13 Winner)
ప్రొడ్యూసర్: జ్యోతి కున్నూరు
మ్యూజిక్ లేబుల్: నివ్రితి వైబ్స్
విడుదల: 08.03.2022



జంజిరే పాట సాహిత్యం

 
పాట: జంజిరే 
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: భీమ్స్ సిసిరోలియో, సాహితి గాలిదేవర 

జంజిరే నేను జంజిరే
జంజిరే జంజిరే జంజిరే
జంజిరే నేను జంజిరే
జంజిరే జంజిరే జంజిరే

వాడొచ్చిన వానవ్వొచ్చిన
కొన ఏదో మొదలేదో గుర్తుపట్టలేని
జంజిరే నేను జంజిరే
నా కాలి మడమల్ల ఆని నీడ గిలగిల్లా
నా పాణం పెదవుల్ల ఆని ప్రాణం విలవిల్లా

అద్దంలెక్కుంటావ్ అర్ధం కాకుంటావ్
ముద్దుగా ఉంటావ్ ముద్దివ్వనంటావ్
పందెమేసుకోని ఎందరొచ్చినా గాని
అందనే అందను అంగూర పండును జంజిరే

జంజిరే జంజిరే జంజిరే జంజిరే
జంజిరే జంజిరే జంజిరే జంజిరే
జంజిరే జంజిరే జంజిరే జంజిరే
జంజిరే జంజిరే జంజిరే జంజిరే

ఎదురుంగా సూడు ఎనుకంగా సూడు
అటుపక్క ఇటు పక్క ఎటుపక్క సూడూ
ఓరకంట సూత్తినా ఆని నోరు ఎండుకపోతది
ఒళ్ళు విరుచుకొంటినా ఆని కళ్ళు పేలిపోతయి

నా జడలా కుచ్చుల్లా ఆని చూపులు గిలగిల్లా
టెన్ టు ఫైవ్ నుండి సేకరణ
నా చీర కుచ్చిళ్ళ ఆని బతుకు విలవిల్లా

జంజిరే నేను జంజిరే
జంజిరే జంజిరే జంజిరే
జంజిరే నేను జంజిరే
జంజిరే జంజిరే జంజిరే

సెలకల్ల సూడు పొలమల్ల సూడు
మా ఇంటి మూల మలుపుళ్ళ సూడు
దూరం నుండి చూసినా
నాది గంధం సెక్క వాసన
దగ్గరకొచ్చి చూసినా నేను
అగ్గి పువ్వును తెలుసుగా

నా తీపి మాటల్లా
ఆని మనసు గిలగిల్లా
నా లోతు గుండెల్ల
ఆని బతుకే విలవిల్లా
జంజిరే జంజిరే జంజిరే

Palli Balakrishna Saturday, May 27, 2023
Ravanasura (2023)



చిత్రం: రావణాసుర (2023)
సంగీతం: హరివర్ధాన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో
నటీనటులు: రవితేజా , శుశాంత్, అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్ , దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ, ఫరియా అబ్దుల్లా 
దర్శకత్వం: సుదీర్ వర్మ 
నిర్మాతలు: అభిషేక్ నామ, రవితేజా 
విడుదల తేది: 07.04.2023



Songs List:



Ravanasura Anthem సాహిత్యం

 
చిత్రం: రావణాసుర (2023)
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
సాహిత్యం: ట్రెడిషినల్ 
గానం: స్వాతి పీపుల్, నోవ్లిక్, హారికా నారాయణ్, హర్షవర్ధన్ రామేశ్వర్

Ravanasura Anthem



ప్యార్ లోన పాగల్ పాట సాహిత్యం

 
చిత్రం: రావణాసుర (2023)
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
సాహిత్యం: కాసర్ల శ్యామ్ 
గానం: రవితేజా

ప్యార్ లోన పాగల్ 



వెయ్యిన్నొక్క పాట సాహిత్యం

 
చిత్రం: రావణాసుర (2023)
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: అనురాగ్ కులకర్ణి 

వెయ్యిన్నొక్క జిల్లాల వరకు
వింటున్నాము నీ కీర్తినే
ముల్లోకాల ఏమూల విన్నా
నీ అందాల సంకీర్తనే

హంపీలోని శిల్పాలకి
ఎల్లోరాల నాట్యాలకి
నువ్వే మోడల్
అయ్యావొ ఏమో వయ్యారీ

వెయ్యిన్నొక్క జిల్లాల వరకు
వింటున్నాము నీ కీర్తినే
ముల్లోకాల ఏమూల విన్నా
నీ అందాల సంకీర్తనే

కర్మకాలి రావణుండు
నిన్ను చూడలేదు గానీ
సీత ఊసునే తలచునా త్వరపడీ

భీష్ముడున్న కాలమందు
నువ్వు పుట్టలేదు గానీ
బ్రహ్మచారిగా బ్రతుకునా పొరబడీ

ఇంతగొప్ప అందగత్తె
ముందుగానె పుట్టి ఉంటె
పాత యుధ్ధగాధలన్నీ మారియుండేవే
అరెరెరె ఇంతగొప్ప అందగత్తె
ముందుగానె పుట్టి ఉంటె
పాత యుధ్ధగాధలన్నీ మారియుండేవే

పొరపాటు బ్రహ్మది గాని
సరిలేనిదీ అలివేణీ

వెయ్యిన్నొక్క జిల్లాల వరకు
వింటున్నాము నీ కీర్తినే
ముల్లోకాల ఏమూల విన్నా
నీ అందాల సంకీర్తనే

Hey Girl Come to Me Follow
Im Gonna Take You to the Top
Come on Feel Naa
I Like to Chit Chat
You are My Cutie Cat
Hey Baby Come Come
Hey Baby Come Come Love

అల్లసాని వారిదంత
అవకతవక టేస్టు గనక
వెళ్ళిపోయెనే చల్లగా ప్రవరుడూ
అయ్యయ్యయ్యె
వరూధినిని కాక నిన్నే
వలేసుంటె కళ్ళు చెదిరి
విడిచిపెట్టునా భామినీ బ్రాహ్మడూ

ఒక్కసారి నిన్నుచూస్తే
రెప్పవెయ్యలేరు ఎవరు
కాపురాలు గంగ కొదిలి
వెంటపడతారే
అరెరెరె ఒక్కసారి నిన్నుచూస్తే
రెప్పవెయ్యలేరు ఎవరు
కాపురాలు గంగ కొదిలి వెంటపడతారే

ముసలాడి ముడతలకైనా
కసి రేపగలదీ కూన

వెయ్యిన్నొక్క జిల్లాల వరకు
వింటున్నాము నీ కీర్తినే
ముల్లోకాల ఏమూల విన్నా
నీ అందాల సంకీర్తనే





డిక్క డిషుమ్ పాట సాహిత్యం

 
చిత్రం: రావణాసుర (2023)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం: కాసర్ల  శ్యామ్ 
గానం: స్వాతి రెడ్డి, భీమ్స్ సిసిరోలియో, నరేష్ మామిడ్ల

హే లాలు పూలసెట్టు కింద
లబ్బరు గాజుల లిల్లీ
డిక్క డిషుమ్ డిక్క డిషుమ్
డిక్కర డిక్కర డిక్క డిషుమ్

హ లబ్బరు గాజుల లిల్లీకొచ్చే
జబ్బల రైకల లొల్లి
డిక్క డిషుమ్ డిక్క డిషుమ్
డిక్కర డిక్కర డిక్క డిషుమ్

హే లాలు పూలసెట్టు కింద
లబ్బరు గాజుల లిల్లీ
లబ్బరు గాజుల లిల్లీకొచ్చే
జబ్బల రైకల లొల్లి

హే టిప్పరు లారీ ఒళ్ళు
టక్కరు పెట్టే దిల్లు
ఏ టిప్పరు లైట్లే కళ్ళు
లిక్కరు కంటే త్రిల్లు

హే గజ్జెలు కడితే ఏక్ బార్
గజ్జున మోగాలే తీన్ మార్
మార్ మార్ మార్ మార్

చిల్ లాకే మార్ మార్ మార్
ఇది క్రౌడ్ సాంగ్ కదా చిచ్చా
లౌడ్ సౌండ్ పెట్టరా మచ్చా
డిక్క డిషుమ్ డిక్క డిషుమ్
డిక్కర డిక్కర డిక్క డిషుమ్

హే లౌడ్ సౌండ్ పెట్టరా మచ్చా
క్రౌడ్ సాంగ్ కదా చిచ్చా
డిక్క డిషుమ్ డిక్క డిషుమ్
డిక్కర డిక్కర డిక్క డిషుమ్

డిక్క డిషుమ్ డిక్క డిషుమ్
డిక్కర డిక్కర డిక్క డిషుమ్
డిక్క డిషుమ్ డిక్క డిషుమ్
డిక్కర డిక్కర డిక్క డిషుమ్

హే పుట్టగానే దిష్టి సుక్క
పెరుగుతుంటే మిల్కు సుక్క
పెద్దగైతే విస్కీ సుక్క
రింకులు ఓ రింకులు

హే బుగ్గ మీద పెండ్లి సుక్క
ఫస్ట్ నైట్ పక్కన సుక్క
సిందుతుంటే సెమట సుక్క
టింకులు ఓ టింకులు

హే రింగుల మీద రింగులు
పెట్టేటోడు సింగిలు
రంగుల మీద రంగులు
మార్చేస్తుంటారు కింగులు

ఇది క్రౌడ్ సాంగ్ కదా చిచ్చా
లౌడ్ సౌండ్ పెట్టరా మచ్చా
డిక్క డిషుమ్ డిక్క డిషుమ్
డిక్కర డిక్కర డిక్క డిషుమ్

హే లౌడ్ సౌండ్ పెట్టరా మచ్చా
క్రౌడ్ సాంగ్ కదా చిచ్చా
డిక్క డిషుమ్ డిక్క డిషుమ్
డిక్కర డిక్కర డిక్క డిషుమ్

డిక్క డిషుమ్ డిక్క డిషుమ్
డిక్కర డిక్కర డిక్క డిషుమ్
డిక్క డిషుమ్ డిక్క డిషుమ్
డిక్కర డిక్కర డిక్క డిషుమ్

డిక్క డిషుమ్ డిక్క డిషుమ్
డిక్కర డిక్కర డిక్క డిషుమ్
డిక్క డిషుమ్ డిక్క డిషుమ్
డిక్కర డిక్కర డిక్క డిషుమ్

Palli Balakrishna Wednesday, April 5, 2023
Darsakudu (2017)

చిత్రం: దర్శకుడు (2017)
సంగీతం: సాయి కార్తీక్
సాహిత్యం: జక్కా హరిప్రసాద్
గానం: అనురాగ్ కులకర్ణి
నటీనటులు: అశోక్ బండ్రెడ్డి, నోయల్ సీన్, ఇషా రెబ్బా, పూజిత పొన్నాడ
దర్శకత్వం: జక్కా హరిప్రసాద్
నిర్మాతలు: బి.యన్.సి.యస్.పి.విజయ్ కుమార్, థామస్ రెడ్డి, ఆదూరి రవి చంద్ర సత్తి
విడుదల తేది: 04.08.2017

హై పిల్లలు మీకొక కొత్త కధ చెప్త
కొత్త కధ అని చెత్త కధ చెప్పావంటె నీకుంటదీ

అబ్భా ముందు వినండ్రా వింటె కద తెలిసేది

అనగనగా ఒక రాజు ఆ రాజు బిడ్డలు ఏడుగురు
వాల్లంతా కలిసి మెలిసి ఎదొ చేసార్రా

ఓల్డ్ స్టోరి మాక్ తెలీదా...

అనగనగా ఒక రాజు ఆ రాజు బిడ్డలు ఏడుగురు
వాల్లంతా కలిసి మెలిసి వేటకు వెల్లుంటారు

హారి పోట్టర్ లాంటివి చెప్తారంకుంటె
మీరేంటి అంక్ల్ రాజులు వాల్ల అబ్బాఇలు

అబ్బాఇలు అని ఎవరన్నారా అమ్మాఇలు

గల్సా... ఇంట్రెస్టింగ్...
అమ్మాఇలందరు వేటకి కాదు షాపింకెల్లారు

ఈ అమ్మాఇలెప్పుడు ఇంతె షాపింగ్ అని
డబ్బులు తగలేస్తారు

తమ టేస్టు కు తగ్గిన వరుడ్ని వెతకగ
వల్డ్ ఎ తిరిగారు
గూగ్ల్ ఫేస్బూక్ ఉండుండవులె పాపం పూర్ పీప్ల్

వరుడంటె అల్లు అర్జునా మిస్టర్ పెల్లి కొడుకులొ
సునిల్ ఆ కాదు రా రాజుల కాలం కద

వాల్లకి కావల్సిన అబ్బాఇ వీరుడై సూరుడై
గుర్రం మీద కత్తి యుధం చేసి వొంద మదిని
ఒడించాలని వాల్లకోరిక

ఓ మఘదీర

అవ్ను రా బుడ్గెట్ లేదు కద గ్రఫిక్స్ లేని మఘదీర

ఒక్కొక్కద్ని కాదు షేర్ఖాన్ ఏడుగురిని ఒకేసారి
పెల్లిచేస్కుంట...

ఇక్కడ ఒక పెల్లాన్నె మానేగ్ చేస్కొలేక పోతున్నాను
ఇంక ఏడుగురిని చేస్కుంటె ఇంటికెల్లడు దైరెక్టు అడవికే

అమ్మో అడివంటె సిమ్హాలుంటాయ్ కద ఉంచ్లె
అరె నో ఫియర్ యార్ అవన్ని గ్రఫిక్సె

హ స్టోరి మొత్తం మీరె చెప్పేస్కోండి రా
ఇంక నేనెందుకు ఇక్కడ తొక్కలాగ

ఏ ఇంకేముంది గ్రాఫిక్స్ లొ సిమ్హానె గెలిచాడు
హె నేనంటె నేనని రాజకుమార్తెలు ప్రపోస్ చేసేసారు

మరి మఘదీర ఏం చేసాడు
గ్రాఫిక్స్ ఉన్నాయ్ గా

ఆ గ్రాఫిక్స్ లొ ఆ ఏడుగురిని ఒక్కటిగ చేసేసాడు
ఆ అమ్మాఇని పెల్లాడేసి తన కింగ్డం వీల్లిపోయాడు....

హె అనగనగా ఒక రాజు ఆ రాజు బిడ్డలు ఏడుగురు
తమ హీరోనె పెల్లాడేసి తమ ఊరెల్లిపోయారు...

తననానాన తన నానా...


********  ********  ********


చిత్రం: దర్శకుడు (2017)
సంగీతం: సాయి కార్తీక్
సాహిత్యం: బాలాజి
గానం: దినకర్ కల్వల, సాయి చరణ్

నీ మనసింతేనా రవ్వంతైనా
కరిగేదేనా....

నీ చెలిమింతేనా క్షనమంతేనా
ఇది ప్రేమవ్నా...

ఎదను కోసి ఇంతగా కదగ మార్చితే ఎలా
భదులు లేని ప్రష్నలా మిగిలావు ఏంటిలా...

నా ఊహే ఊపిరిగా మారిందా
నా గుండెల్లొ చేరి గాయాన్నె చేసిందా

ఆది హ్రుదయం కాదు ప్రేమంటూ రాదు
తన గురుతే చేదూ...
పోనే పోదు నీతోడై ఉండే ఆహ్ గ్నాపకం
చీకట్లొ నీడై మిగిలిందిలే...

ఒ ఒ ఒ....

ఈ బాదే కన్నీరె మరిచిందా
ఎద లోతుల్లో ఉప్పెనలే దాచిందా

ఆదర్షకుడై నువ్వు కధ చిత్రించావు
బ్రతుకే కల చేసి భలి అయ్యావు

నీ గెలుపే ఓడే నీ ప్రేమతొ
ఈ చిత్రం నీకే ఇక అంకితం....

ఈ కధ ఇంతేనా కలలోనైనా
ముగిసేదేనా...

ఈ కధనంలోన మలుపేదైనా...
కధ మార్చేనా...


********  ********  ********


చిత్రం: దర్శకుడు (2017)
సంగీతం: సాయి కార్తీక్
సాహిత్యం: బాలాజీ
గానం: దనుంజయ్

తొక్కలొ స్క్రీన్ ప్లె నా తాట తీసిందె
నా మైండంత చెడగొట్టి మంట పెట్టిందె

ఎక్కడొ లోగిక్ ఎ మిస్ అయ్యిందె
నా బుర్రలొ కంఫ్యుజన్ మొదలయ్యిందె

నాటి సావిత్రి లొ నేటి సమంత వరకు
ఉన్న స్టోరి బోడ్ బ్రేక్ ఐందె

పాత కాంచనకైనా కొత్త కాజల్ కైనా
సేము స్టొరి ఎ బ్రేక్ ఇచ్చిందె దె దె దె

ఫస్ట్ సీన్లొ పట్టుకుంటె క్లాసు పీకిందె
పాప నెక్స్ట్ సీన్లొ సేవు చేస్తె తాంక్స్ చెప్పిందె

అంతలొనె కొత్త సీను క్లాపు కొట్టిందె
దీని బుర్రలోన హిచ్చు కాపు ప్లాను ఏతుందె

స్క్రిప్టు ఆరనెలేదు ట్రెండు సెట్టరు కాదు
పిల్ల కారెచ్తర్ మార్చేసిందె...

చిన్న టీసర్ లేదు పోస్టర్ అనుకోలేదు
అరె ఇంటర్వెల్లుకె షుభమంటుందె దె దె దె...

షోట్ గాపు లోనె పాప తాటు వొస్తదె
నెక్స్ట్ ఫ్రేము పెట్టనీక మూడు పాడు చేస్తదె

ట్విట్టర్ లోన సవండికి రోలింగు అంటుందె
నేను ఆక్షన్ అంటె కట్టు చెప్పినట్టు చూస్తుందె

ఉన్న కోల్లను చూస్తె మెంటల్ ఎక్కుతున్నాదె
ఇష్క్ ఇరగేద్దాం అనిపిస్తాందె

పిల్ల సిగ్గుని చూస్తె ఎన్నొ పెగ్గులకైనా
కిక్కు ఎక్కదుగ దిగిపోతాదె...


Palli Balakrishna Saturday, September 23, 2017

Most Recent

Default