Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Jyothi K"
Song: Naa Friendhemo Pelli



పాట: నా ఫ్రెండుదేమో పెళ్లి...
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం: కాసర్ల శ్యామ్ 
గానం: శ్రావణ భార్గవి
ఆర్టిస్ట్స్: జయంతి 
కోరియోగ్రాఫర్: భాను మాస్టర్ 
దర్శకత్వం: శ్రీ కోనేటి 
ప్రొడ్యూసర్: జ్యోతి కున్నూరు
మ్యూజిక్ లేబుల్: నివ్రితి వైబ్స్
విడుదల: 17.05.2023



నా ఫ్రెండుదేమో పెళ్లి...పాట సాహిత్యం

 
పాట: నా ఫ్రెండుదేమో పెళ్లి...
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం: కాసర్ల శ్యామ్ 
గానం: శ్రావణ భార్గవి

ఓ ఎలగెలగెలగెలగెలగా ఓ పిలగా - ఓ పిలగా
హో ఎలగెలగెలగెలగెలగా ఓ పిలగా - ఓ పిలగా

ఓ ఎలగెలగెలగెలగెలగా ఓ పిలగా - ఓ పిలగా
హో ఎలగెలగెలగెలగెలగా ఓ పిలగా - ఓ పిలగా

సుట్టపోళ్ల పిల్లగా… ఒరి సుట్టపోళ్ల పిల్లగా
నచ్చేసావు సూపు గుచ్చేసావు
సెంప గిచ్చేసావు ఎలగా
నన్నూ ఎలగా ఎలగెలగెలగా

ఇంటిముందు పిల్లగా… మా ఇంటిముందు పిల్లగా
నన్ను పట్టుపట్టి ఇల్లగా
సుట్టుముట్టి ఎల్లగా
నిప్పు పెట్టి పోతవెందిరా
లోనా ఎలగా ఎలగెలగెలగా

మీసం కుర్రా కుర్రాగా
పోరడు ఎర్రా ఎర్రాగా
అంగీ బిర్రూ బిర్రూగ
అరె సూటు బూటు హైటు వెయిటు
అందరు వస్తుంటే

నా ఫ్రెండుదేమో పెళ్లి  నాకేందిర ఈ లొల్లీ
నా లగ్గమెప్పుడె చెల్లి  పూసిందే లవ్ లిల్లీ
నా ఫ్రెండుదేమో పెళ్లి  నాకేందిర ఈ లొల్లీ
నా లగ్గమెప్పుడె చెల్లి  పూసిందే లవ్ లిల్లీ

ఓ ఎలగెలగెలగెలగెలగా ఓ పిలగా - ఓ పిలగా
హో ఎలగెలగెలగెలగెలగా ఓ పిలగా - ఓ పిలగా

హే కుర్తా పైజామా, ఆ
జోర్తారా మామా, ఆ
అ, రస్తాలొస్తుంటే, ఆ
తిరిగీ సూత్తునా

వాని అత్తరు హంగామా, ఆ
వారేవ్వా మామా, ఆ
అరె గుప్పున గుంజిందే,ఆ
ఎనకే పోదునా

ఈ గూటాకు గున్న పోరడు
చాకులెక్కుండే
పెండ్లిపిల్లగాని దోస్తు వాడు
దస్తీ ఏద్దునా

నా ఫ్రెండుదేమో పెళ్లి  నాకేందిర ఈ లొల్లీ
నా లగ్గమెప్పుడె చెల్లి  పూసిందే లవ్ లిల్లీ
నా ఫ్రెండుదేమో పెళ్లి  నాకేందిర ఈ లొల్లీ
నా లగ్గమెప్పుడె చెల్లి  పూసిందే లవ్ లిల్లీ

హెయ్ డోలు బాజా, డోలు బాజా డోలు బాజా
డోలు బాజ, డోలు బాజా డోలు బాజా, బజారే
పిపి పీ పిపి పీ సన్నాయి మోగింది
పిపి పీ డుం డుం బాజా బాదండీ

యే, టీ-షర్ట్ ఏసున్నా,ఆ
జిమ్ బాడీ ఉందా, ఆ
ఫిట్నెస్నే చూసి, ఆ
పరేషానైతున్నా

పందిరి గుంజోలే, ఆ
పొడుగే ఉన్నోన్ని, ఆ
పక్కన నిల్సోనీ, ఆ
కొలుసుకుంటున్నా

బ్యాండు మోగినట్టు
గుండె ఇట్టా కొట్టుకుంటుందే
సిటికేనేలు పట్టే కొంటెగాడు
వీళ్ళల్లో ఎవడే..?

నా ఫ్రెండుదేమో పెళ్లి  నాకేందిర ఈ లొల్లీ
నా లగ్గమెప్పుడె చెల్లి  పూసిందే లవ్ లిల్లీ
నా ఫ్రెండుదేమో పెళ్లి  నాకేందిర ఈ లొల్లీ
నా లగ్గమెప్పుడె చెల్లి  పూసిందే లవ్ లిల్లీ

Palli Balakrishna Saturday, May 27, 2023
Song: Mosame Cheyyaku Prema



పాట: మోసమే చేయకే ప్రేమా 
సంగీతం: మదీన్ SK
సాహిత్యం: నవ సందీప్ 
గానం: నవ సందీప్ 
ఆర్టిస్ట్స్: ప్రేమలత, నవ సందీప్ 
దర్శకత్వం: రాజ్ నరేంద్ర 
ప్రొడ్యూసర్: జ్యోతి కున్నూరు
మ్యూజిక్ లేబుల్: నివ్రితి వైబ్స్
విడుదల: 21.01.2021



మోసమే చేయకే ప్రేమా పాట సాహిత్యం

 
పాట: మోసమే చేయకే ప్రేమా 
సంగీతం: మదీన్ SK
సాహిత్యం: నవ సందీప్ 
గానం: నవ సందీప్ 

ఓ ముద్దూ ముద్దూ గుమ్మా నా మాయలమారీ బొమ్మా
నువ్వు గారడి చెయ్యకె కొమ్మా నన్ను ఆడించమాకే అమ్మా
గుండెల్లొ తన్నావు నొప్పిలేదె నా సొమ్మంత తిన్నావు బాధలేదే
మనసుని కాల్చావె మంటలేదె నాపరువంత తీసావు మరపురాదే
ఎన్ని చేసినా ఎమి జరిగినా నీపై ఆశ చావదే
మోసమే చేయకే ప్రేమా ప్రేమా ఆ ప్రేమకే ద్రోహమే చేయొద్దమ్మా
మోసమే చేయకే ప్రేమా ప్రేమా ఆ ప్రేమకే ప్రాణమే తీయొద్దమ్మా
ఓ ముద్దూ ముద్దూ గుమ్మా నా మాయలమారీ బొమ్మా
నువ్వు గారడి చెయ్యకె కొమ్మా నన్ను ఆడించమాకే అమ్మా

ఊరిలో గాలికే తిరిగేటి నన్నే 
సక్కనీ దారిలో నడిపించినావే
మొద్దుగా మొరటుగా ఉండేటి నాకే
స్టైలుగా బ్రతకడం నేర్పించినావే
నాపసిడి పాలపిట్టా బంగారు పూలబుట్టా
నన్నొదిలిపోతె ఎట్టా నామీద నీకు బెట్టా
నాజింక పూల చెట్టా సొగసైన సిరులగుట్టా 
నువువె ల్లిపోతె ఎట్టా నేనుండలేను ఇట్టా
తిట్టినా కొట్టినా సర్దుకుపోతానే
ఇల ఒంటరిగా ఒదిలేస్తే తట్టుకోలేనే
మోసమే చేయకే ప్రేమా ప్రేమా ఆ ప్రేమకే ద్రోహమే చేయొద్దమ్మా
మోసమే చేయకే ప్రేమా ప్రేమా ఆ ప్రేమకే ప్రాణమే తీయొద్దమ్మా
ఓ ముద్దూ ముద్దూ గుమ్మా నా మాయలమారీ బొమ్మా
నువ్వు గారడి చెయ్యకె కొమ్మా నన్ను ఆడించమాకే అమ్మా

అనాదగా ఉన్న నన్ను ఆదరించినావే
ఆలనా పాలనా చూసుకున్నావే
ముందు వెనక ఎవరు లేని ఏకాకి నేను
తల్లిలా నీఒడిలో జోలపాడినావే
నువు రావన్న మాటా అది అగ్నిశకలకూట
నిను పొందలేని చోట ఆగిపోదా నాపాట
నే కలలు కన్న కోట కూల్చేస్తివె ఈపూట
ఇది బొమ్మ బొరుసు ఆట అనుకుంటివె నా తాతా
సచ్చినా బతికినా నీతో ఉంటానే
నువు లేకుంటే ఈ క్షణమే సచ్చిపోతానే
మోసమే చేయకే ప్రేమా ప్రేమా ఆ ప్రేమకే ద్రోహమే చేయొద్దమ్మా
మోసమే చేయకే ప్రేమా ప్రేమా ఆ ప్రేమకే ప్రాణమే తీయొద్దమ్మా
ఓ ముద్దూ ముద్దూ గుమ్మా నా మాయలమారీ బొమ్మా
నువ్వు గారడి చెయ్యకె కొమ్మా నన్ను ఆడించమాకే అమ్మా

Palli Balakrishna
Song: Neeli Neeli



పాట: నీలి నీలి కల్లవాడే
సంగీతం: మదీన్ SK
సాహిత్యం: మానుకోట ప్రసాద్ 
గానం: బాసని మమత
ఆర్టిస్ట్స్: దేతడి హారిక 
కోరియోగ్రాఫర్: రఘు మాస్టర్ 
ప్రొడ్యూసర్: జ్యోతి కున్నూరు
మ్యూజిక్ లేబుల్: నివ్రితి వైబ్స్
విడుదల: 13.03.2021



నీలి నీలి కల్లవాడే పాట సాహిత్యం

 
పాట: నీలి నీలి కల్లవాడే
సంగీతం: మదీన్ SK
సాహిత్యం: మానుకోట ప్రసాద్ 
గానం: బాసని మమత


నీలి నీలి కల్లవాడే
వాని మాయన నిలువున దించినాడే
నిండు పున్నమి ఎన్నెల తీరు
వాడు నిండు మనసు అందగాడే

నీలి నీలి కల్లవాడే
వాని మాయన నిలువున దించినాడే
నిండు పున్నమి ఎన్నెల తీరు
వాడు నిండు మనసు అందగాడే

పట్టేసుకుందునా పట్టు జారిపోదునా
కట్నాలు ఇయ్యకుండ కట్టేసుకుందునా
పట్టేసుకుందునా పట్టు జారిపోదునా
కట్నాలు ఇయ్యకుండ కట్టేసుకుందునా

నీలి అరె నీలి… అరె నీలి నీలి కల్లవాడే
వాని మాయన నిలువున దించినాడే
నిండు పున్నమి ఎన్నెల తీరు
వాడు నిండు మనసు అందగాడే

వాని సూపులు సన్నని కత్తుల తీరు
అగొ తియ్యని గాయాలు సేసెను నాకు
వాని మాటలు మాయలు సేసెను సూడు
ఇగ తీరని ఆరాటమయ్యెను నాకు (2)

పట్టేసుకుందునా పట్టు జారిపోదునా
కట్నాలు ఇయ్యకుండ కట్టేసుకుందునా (2)
నీలి అరె నీలి… అరె నీలి నీలి కల్లవాడే
వాని మాయన నిలువున దించినాడే
నిండు పున్నమి ఎన్నెల తీరు
వాడు నిండు మనసు అందగాడే

నిద్దుర పట్టదు ఇదేం రోగం
వాని గురుతులే నాకు నిరంతరం
ఆకలి లేదు దాహం లేదు
నన్నాగం చేసెను పోరాగాడు (2)

పట్టేసుకుందునా పట్టు జారిపోదునా
కట్నాలు ఇయ్యకుండ కట్టేసుకుందునా (2)
నీలి అరె నీలి… అరె నీలి నీలి కల్లవాడే
వాని మాయన నిలువున దించినాడే
నిండు పున్నమి ఎన్నెల తీరు
వాడు నిండు మనసు అందగాడే

సీకటి కమ్మిన సిత్రం సూడు
నాకు పగలే రాత్రై పోయెను సూడు
నిన్నెట్టాగైనా ఏలుకుంటా
ఏడేడు జన్మల బంధం అట (2)

రారా ఓ పిలగా రాలుగాయి పొల్లగా
రంధి లేని రాత నాకు రాసిపోరాదురా (2)
నీలి అరె నీలి… అరె నీలి నీలి కల్లవాడే
వాని మాయన నిలువున దించినాడే
నిండు పున్నమి ఎన్నెల తీరు
వాడు నిండు మనసు అందగాడే

Palli Balakrishna
Song: Yeme Pilla



పాట: ఏమే పిల్ల అంటాటే 
సంగీతం: మదీన్ SK
సాహిత్యం: మానుకోట ప్రసాద్ 
గానం: శ్రీలత యాదవ్
ఆర్టిస్ట్స్: భాను శ్రీ 
కోరియోగ్రాఫర్: రఘు మాస్టర్ 
ప్రొడ్యూసర్: జ్యోతి కున్నూరు
మ్యూజిక్ లేబుల్: నివ్రితి వైబ్స్
విడుదల: 23.03.2021



ఏమే పిల్ల అంటాటే ఏదో ఏదో ఐతాందే పాట సాహిత్యం

 
పాట: ఏమే పిల్ల అంటాటే 
సంగీతం: మదీన్ SK
సాహిత్యం: మానుకోట ప్రసాద్ 
గానం: శ్రీలత యాదవ్

ఏమే పిల్ల అంటాటే ఏదో ఏదో ఐతాందే
నువు ఓరా కంట సూస్తాంటే ఊపిరాగిపోతున్నాదే
ఏమే పిల్ల అంటాటే ఏదో ఏదో ఐతాందే
నువు ఓరా కంట సూస్తాంటే ఊపిరాగిపోతున్నాదే
సెయ్యి పట్టుకొని సెరదీస్తే సిగ్గుపుట్టుకొచ్చే సెంపలోన
సీరకొంగు వట్టి ఇడవకుంటే గాలికావరయే గుండెలోన
బొట్టుపెట్టుకున్న ఓరిదేవ ఎండికొండలాంటి పోరాడేరా
కట్టుకుంటేగాని కట్నమియ్యా కంటిపాపాలెక్క సూసుకుంటా

ఏమే పిల్ల అంటాటే ఏదో ఏదో ఐతాందే
నువు ఓరా కంట సూస్తాంటే ఊపిరాగిపోతున్నాదే

గుట్ట గుట్ట గుండెదరువు తిండీతిప్పలే నాకు బరువు
ఎండ వానలు మారిపాయే సల్లని సలిలో సేమాటలాయె
గుట్ట గుట్ట గుండెదరువు తిండీతిప్పలే నాకు బరువు
ఎండ వానలు మారిపాయే సల్లని సలిలో సేమాటలాయె
వాని మటలింటే మాయాజాలం మత్తులోకి జారుకుంటా గోలం
వాని నవ్వు సూస్తేనే లేనిరోగం వెయ్యిజన్మలైన పోదుభందం
ఒట్టు వెట్టుకున్న ఓరిదేవ ఎండికొండలాంటి పోరాడేర
కట్టుకుంటేగాని కట్నమియ్యా కంటిపాపాలెక్క సూసుకుంటా

ఏమే పిల్ల అంటాటే ఏదో ఏదో ఐతాందే
నువు ఓరా కంట సూస్తాంటే ఊపిరాగిపోతున్నాదే

కట్టమీద కాలినడకన నెత్తిమీదనే ఎండ మోత
సూపుకు నచ్చినపోరాడీడు సూసిగూడ సుడనట్టు సూడు
కట్టమీద కాలినడకన నెత్తిమీదనే ఎండ మోత
సూపుకు నచ్చినపోరాడీడు సూసిగూడ సుడనట్టు సూడు
గుంజుకొని జర్రనీడనిస్తే కాదంట అన్నాసెప్పునువ్వు
ఎండతాపానికి దాహమిస్తే వద్దంట అన్నాసెప్పునువ్వు
వోట్టువెట్టుకున్న ఓరిదేవ ఎండికొండలాంటి పోరాడేర
కట్టుకుంటేగాని కట్నమియ్యా కంటిపాపాలెక్క సూసుకుంటా

ఏమే పిల్ల అంటాటే ఏదో ఏదో ఐతాందే
నువు ఓరా కంట సూస్తాంటే ఊపిరాగిపోతున్నాదే

కచ్చెగట్టి సెయ్యిమీద పచ్చబొట్టునే నే ఏసుకున్న
కట్టే వట్టుకొని దారిలో వానికోసమే కాసుకున్న
కచ్చెగట్టి సెయ్యిమీద పచ్చబొట్టునే నే ఏసుకున్న
కట్టే వట్టుకొని దారిలో వానికోసమే కాసుకున్న
వాడులేకుండా నా రతం ఆరువాలు శాతం మురువాలు
వాడు ఎదురుగాఉంటే అమ్మతోడు మాటన్నరాదు ఏమిగోరం
వోట్టువెట్టుకున్న... 
వొట్టు వోట్టువెట్టుకున్న ఓరిదేవ ఎండికొండలాంటి పోరాడెర
కట్టుకుంటేగాని కట్నమియ్యా కంటిపాపాలెక్క సూసుకుంటా
వొట్టు వోట్టువెట్టుకున్న ఓరిదేవ ఎండికొండలాంటి పోరాడెర
కట్టుకుంటేగాని కట్నమియ్యా కంటిపాపాలెక్క సూసుకుంటా

ఏమే పిల్ల అంటాటే ఏదో ఏదో ఐతాందే
నువు ఓరా కంట సూస్తాంటే ఊపిరాగిపోతున్నాదే

Palli Balakrishna
Song: Zanjeere



పాట: జంజిరే 
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: భీమ్స్ సిసిరోలియో, సాహితి గాలిదేవర 
ఆర్టిస్ట్స్: పూజిత పొన్నాడ 
కోరియోగ్రాఫర్: రామ్ (D 13 Winner)
ప్రొడ్యూసర్: జ్యోతి కున్నూరు
మ్యూజిక్ లేబుల్: నివ్రితి వైబ్స్
విడుదల: 08.03.2022



జంజిరే పాట సాహిత్యం

 
పాట: జంజిరే 
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: భీమ్స్ సిసిరోలియో, సాహితి గాలిదేవర 

జంజిరే నేను జంజిరే
జంజిరే జంజిరే జంజిరే
జంజిరే నేను జంజిరే
జంజిరే జంజిరే జంజిరే

వాడొచ్చిన వానవ్వొచ్చిన
కొన ఏదో మొదలేదో గుర్తుపట్టలేని
జంజిరే నేను జంజిరే
నా కాలి మడమల్ల ఆని నీడ గిలగిల్లా
నా పాణం పెదవుల్ల ఆని ప్రాణం విలవిల్లా

అద్దంలెక్కుంటావ్ అర్ధం కాకుంటావ్
ముద్దుగా ఉంటావ్ ముద్దివ్వనంటావ్
పందెమేసుకోని ఎందరొచ్చినా గాని
అందనే అందను అంగూర పండును జంజిరే

జంజిరే జంజిరే జంజిరే జంజిరే
జంజిరే జంజిరే జంజిరే జంజిరే
జంజిరే జంజిరే జంజిరే జంజిరే
జంజిరే జంజిరే జంజిరే జంజిరే

ఎదురుంగా సూడు ఎనుకంగా సూడు
అటుపక్క ఇటు పక్క ఎటుపక్క సూడూ
ఓరకంట సూత్తినా ఆని నోరు ఎండుకపోతది
ఒళ్ళు విరుచుకొంటినా ఆని కళ్ళు పేలిపోతయి

నా జడలా కుచ్చుల్లా ఆని చూపులు గిలగిల్లా
టెన్ టు ఫైవ్ నుండి సేకరణ
నా చీర కుచ్చిళ్ళ ఆని బతుకు విలవిల్లా

జంజిరే నేను జంజిరే
జంజిరే జంజిరే జంజిరే
జంజిరే నేను జంజిరే
జంజిరే జంజిరే జంజిరే

సెలకల్ల సూడు పొలమల్ల సూడు
మా ఇంటి మూల మలుపుళ్ళ సూడు
దూరం నుండి చూసినా
నాది గంధం సెక్క వాసన
దగ్గరకొచ్చి చూసినా నేను
అగ్గి పువ్వును తెలుసుగా

నా తీపి మాటల్లా
ఆని మనసు గిలగిల్లా
నా లోతు గుండెల్ల
ఆని బతుకే విలవిల్లా
జంజిరే జంజిరే జంజిరే

Palli Balakrishna
Song: Ringu Juttu Ranguloda



పాట: రింగు జుట్టు 
సంగీతం: మదీన్ SK
సాహిత్యం: రాజేందర్ కొండా
గానం: ప్రభా
ఆర్టిస్ట్స్: అక్షా ఖాన్
కోరియోగ్రాఫర్: టీనా
ప్రొడ్యూసర్: జ్యోతి కున్నూరు
మ్యూజిక్ లేబుల్: నివ్రితి వైబ్స్
విడుదల: 15.07.2022



రింగు జుట్టు పాట సాహిత్యం

 
పాట: రింగు జుట్టు 
సంగీతం: మదీన్ SK
సాహిత్యం: రాజేందర్ కొండా
గానం: ప్రభా

పల్లవి:
రింగు జుట్టు రంగులోడా మావల్లో
ఏమైయ్యిందో పాడుగాను నీవల్లో
ఎంకల నువ్వొస్తావుంటే మావల్లో
ఎద బరువైతుందిరా మామా ఎందుల్లో

ఆ రింగు జుట్టు రంగులోడా గుండెల్లోన నీదే గోల
నిను ఇడిసి ఉండదంట నా మనసు అడ ఇడ

రింగు జుట్టు
అరెరె రింగు జుట్టు
అబబ్బా రింగు జుట్టు
రింగు జుట్టు రంగులోడా మావల్లో
ఏమైయ్యిందో పాడుగాను నీవల్లో
ఎంకల నువ్వొస్తావుంటే మావల్లో
ఎద బరువైతుందిరా మామా ఎందుల్లో

చరణం: 1
గా ఎంకటి తాత పొలము ఆ పక్కనే పులా వనము
ఆ పువ్వొలే నీ గుణముర నా కెంత సక్కటి వరము
నిను సూడకుండ దినము ఇడిసుంటాన ఓ క్షణము
నువ్వు గాణరాకపోతే రా బావోత్తది నాకు జొరము 
నువ్వేడుంటే గా సోట ని తొవ్వెంటే నా బాట
ను సెప్పిందే నే ఇంట నేనుంటారా ని జంట
కాసుకుంటా ఓర కంట ఎన్ని తంటలైన నీతోనుంటా

రింగు జుట్టు
అరెరె రింగు జుట్టు
అబబ్బా రింగు జుట్టు
రింగు జుట్టు రంగులోడా మావల్లో
ఏమైయ్యిందో పాడుగాను నీవల్లో
ఎంకల నువ్వొస్తావుంటే మావల్లో
ఎద బరువైతుందిరా మామా ఎందుల్లో

చరణం: 2
మట్టిపెళ్ల లాంటి తనము దిట్టంగా ఉందే ధనము
ఒట్టేసి సెబుతా ఇనవు మావ నిన్నే గోరె తనువు
ఎంత సెప్పుకున్న ఇనవు సక్కాగున్నావన్న పొగరు
గి సిగ్గులు నాకు తెగవు నిన్నే జేసుకుంటా మనువు
నా కళ్ళల్లో నీ ధ్యాసే నా కలల్లో నీ ఊసే
నా కళ్ళల్లో నీ ధ్యాసే నా కలల్లో నీ ఊసే
గిదేందయ్య నా గోసే నేనుంటారా నీతోటే

రింగు జుట్టు
అరెరె రింగు జుట్టు
అబబ్బా రింగు జుట్టు రంగులోడా మావల్లో
ఏమైయ్యిందో పాడుగాను నీవల్లో
ఎంకల నువ్వొస్తావుంటే మావల్లో
ఎద బరువైతుందిరా మామా ఎందుల్లో

ఆ రింగు జుట్టు రంగులోడా గుండెల్లోన నీదే గోల
రింగు జుట్టు రంగులోడా గుండెల్లోన నీదే గోల
నిను ఇడిసి ఉండదంట నా మనసు అడ ఇడ

రింగు జుట్టు
రింగు రింగు రింగు జుట్టు
అబబ్బా రింగు జుట్టు రంగులోడా మావల్లో
ఏమైయ్యిందో పాడుగాను నీవల్లో
ఎంకల నువ్వొస్తావుంటే మావల్లో
ఎద బరువైతుందిరా మామా ఎందుల్లో

Palli Balakrishna
Song: Nuvve Kavali Amma



పాట: నువ్వే కావలి అమ్మ 
సంగీతం: సందీప్ సన్ను
సాహిత్యం: రంజిత్ కుమార్ రిక్కి
గానం: సందీప్ సన్ను, సోనీ ఆరే
ఆర్టిస్ట్స్: మానస్ , ఆమని, లికిత్ సాయిరాం కాసర్ల
దర్శకత్వం: సందీప్ సన్ను
ప్రొడ్యూసర్: జ్యోతి కున్నూరు
మ్యూజిక్ లేబుల్: నివ్రితి వైబ్స్
విడుదల: 21.02.2023



నువ్వే కావలి అమ్మ పాట సాహిత్యం

 
పాట: నువ్వే కావలి అమ్మ 
సంగీతం: సందీప్ సన్ను
సాహిత్యం: రంజిత్ కుమార్ రిక్కి
గానం: సందీప్ సన్ను, సోనీ ఆరే

లాలి జోజో కన్నా
జోజో లాలీ కన్నా
నాకన్నీ నువ్వే నాన్న
నీకంటే ఏదీ మిన్నా

ప్రాణమంత పోసి నాకు ఇచ్చినావే జన్మ
నువ్వు లేని లోకమంత చిమ్మచీకటమ్మ
కంటి నీరు పిలుపుకైనా పలకవెందుకమ్మ
దేవుడైనా ఇవ్వలేడు అమ్మలాంటి ప్రేమ

తిరిగివచ్చి నాకు జోల పాడవమ్మ
అమ్మలేని ప్రేమకు ఆయువెందుకమ్మ
వెలుగు లేక వెల్లిపోయే నింగి జాబిలమ్మ
మళ్ళి వచ్చి ఒక్కసారి ప్రేమ పంచవమ్మ

నువు లేక ఆగిపోయే
కాలమంతా ఏకాంతంగా
పసివాన్ని వదిలేసి వెళ్లిపోకమ్మా

నువ్వే కావాలమ్మా
నీతో ఉండాలమ్మా
నా ప్రాణం నువ్వేనమ్మా
నా సర్వం నువ్వేనమ్మా

విశ్వమంతా నువ్వు లేని క్షణం
ఆగిపోయే అంతులేని జీవం
జాలి చూపి టెన్ టు ఫైవ్ తిరిగిరావమ్మా
క్షణమే చూపలేవా నిండు చందమామ
గుర్తు లేదు కన్నపేగు ప్రేమ
గుండె నిండా కొలువు తీరేనా కన్నీరే

నడిపించావులే లాలించావులే
నేనే ప్రాణమని జీవించావులే
ఆనందమేదో చూపించావులే
గతమే మళ్ళీ రాదే హో

కవ్వించావులే సహించావులే
నాకోసమే నువు తపించావులే
నీ త్యాగమేదో తెలిసెలోపలే
తనువు వదిలినావే హే

Palli Balakrishna

Most Recent

Default