Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Mayalo (2022)




చిత్రం: మాయలో (2022)
సంగీతం: డెన్నిస్ నార్టన్ : 
నటీనటులు:  నరేష్ అగస్త్య, భావన, వజ్హపందాల్, జ్ఞానేశ్వరి కండ్రేగుల 
దర్శకత్వం: మేఘ మిత్ర పెర్వార్
నిర్మాతలు: షాలిని నంబు, RK నంబు 
విడుదల తేది: 2022



Songs List:



ఔనన్నా కాదన్నా పాట సాహిత్యం

 
చిత్రం: మాయలో (2022)
సంగీతం: డెన్నిస్ నార్టన్ 
సాహిత్యం: కడలి 
గానం: సిద్ శ్రీరాం బ్రిందా 

తెలిసిందే తెలియందై
కథే మారిపోయెనే
మనకింకా మిగిలింది
ఎటూ కాని యాతనే

ఔనన్నా కాదన్నా కాలం సాగిపోయే
నడిచిన దూరాలే గమ్యం లేనివాయే
ఇప్పుడేమో లోలోన ప్రశ్న ఊరుకోదే
నాకే నేనే లేనే

గుండెలోన దాగున్న మాటలన్నీ
నేరుగానే నిలదీసాయే
ఓ ఓ, నిన్న మొన్న మామూలు నేను కానే
మారిపోయి వేరయ్యానే

నాపైనా ఇన్నాళ్ళు ఉన్నా
ఆ మేఘాలే తొలిగాయంటా
ఆకాశం రంగంత జారే
అద్దాలేవో పట్టిందటా

అవునన్నా కాదన్నా కాలం సాగిపోయే
నడిచిన దూరాలే గమ్యం లేనివాయే

ఔనన్నా కాదన్నా కాలం సాగిపోయే
నడిచిన దూరాలే గమ్యం లేనివాయే
ఇప్పుడేమో లోలోన ప్రశ్న ఊరుకోదే
నాకే నేనే లేనే

ఏదో ఏదో ఏమయ్యిందో
నాలోపలేదో ఓ కొత్త తీరే
పంతాలే పోయి… పందాలే మాని
నా ఇంకో నేనే… నన్నే చూసేనే

సరిపోతాయే గత గమ్యాలవే
తగు పాఠాలే మరుపే రావులే
ఇకపైన హాయిలే

తెలిసిందే తెలియందై
కథే నాది ఔననీ
ఇకపైనా మనలేనే పరాయైన పాత్రనై

ఔనన్నా కాదన్నా కాలం ఆగిపోదే
దూరంగా నిల్చున్నా రేపే నాదే నాదే
ఔనన్నా కాదన్నా కాలం ఆగిపోదే
దూరంగా నిల్చున్నా రేపే నాదే నాదే

ఇప్పుడిలా లోలోన
చిన్న నవ్వు చేరే
చాలే… ఇంతే చాలే




ఎదో హాయి కొత్తగా పాట సాహిత్యం

 
చిత్రం: మాయలో (2022)
సంగీతం: డెన్నిస్ నార్టన్ 
సాహిత్యం: కడలి 
గానం: శిరీషా భాగవతుల 

ఎదో హాయి కొత్తగా



మాయలో పాట సాహిత్యం

 
చిత్రం: మాయలో (2022)
సంగీతం: డెన్నిస్ నార్టన్ 
సాహిత్యం: కడలి 
గానం: బ్రిందా , జాసన్ 

మాయలో


No comments

Most Recent

Default