Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Achu Rajamani"
Month Of Madhu (2023)



చిత్రం: మంత్ ఆఫ్ మధు (2023)
సంగీతం: అచ్చు రాజమణి 
నటీనటులు: నవీన్ చంద్ర, స్వాతి రెడ్డి, శ్రేయా నవిలే
దర్శకత్వం: శ్రీకాంత్ నగోటి
నిర్మాత: యశ్వంత్ ములుకుట్ల
విడుదల తేది: 2023



Songs List:

Palli Balakrishna Thursday, October 5, 2023
Urvasivo Rakshasivo (2022)



చిత్రం: ఊర్వశివో రాక్షసివో (2022)
సంగీతం: అచ్చు రాజమణి 
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: అనూప్ రూబెన్స్
నటీనటులు: అల్లు శిరీష్, అను ఇమాన్యుయెల్ 
దర్శకత్వం: రాకేష్ శశి 
నిర్మాత: బన్నీ వాసు 
విడుదల తేది: 04.11.2022



Songs List:



ధీంతనన ధీంతనన పాట సాహిత్యం

 
చిత్రం: ఊర్వశివో రాక్షసివో (2022)
సంగీతం: అచ్చు రాజమణి 
సాహిత్యం: పూర్ణాచారి 
గానం: సిద్ శ్రీరాం 

అనగా అనగనగ కనులే కలగనగా
నిజమయ్యే మెరుపల్లే వాలెగా
నా ఊపిరి నడక తన ఊపిరి జతగ
కలగలిసి మొదలయ్యే నాలో అలజడిగా

అరెరే అరెరె మనసే అదిరే
నీవల్ల నాలోన ఈ అల్లరే
ఎవరే ఎవరే కుదురే చెదిరే
తొలిసారి తనువంత ఓ జాతరే

ఆరాటము మెహమాటము
జతగా కలిగే నాకెందుకో
అలవాటులో పొరపాటుగా
నను నేను దాస్తున్నానెందుకో..!

ధీంతనన ధీంతనన నీచూపుల దాడి
చేసిందే చేసిందే ఈ గారడి
ధీంతనన ధీంతనన
నన్నే నే వీడి నీతో కలిసే (2)

నీ అడుగుల వెంట నే గురుతై ఉంటా
నీ పాదమే దాటు ప్రతి చోటున
నీ పెదవులు తాకే నా పేరును వింట
ఓ స్పర్శకే పొంగి పోతానట

కాలం కలిపింది ఈ జోడి బాగుందని
ప్రాణం అడిగింది నీతోడు సాగాలని
దూరం దూరం అయ్యే దారే చూపిస్తుంది
ఒకటవ్వనే, ఓ ఓ ఓ ఓ

ధీంతనన ధీంతనన నీచూపుల దాడి
చేసిందే చేసిందే ఈ గారడి
ధీంతనన ధీంతనన
నన్నే నే వీడి నీతో కలిసే

ఆకాశం తానే చినుకల్లే మారి
అక్షింతలై పైన రాలాయిగా
ఆ ఉరుముల శబ్దం మనసున నిశ్శబ్దం
మోగాయిలే మేళతాళాలుగా

రాయబారాలు పంపాను నా భాషలో
రాయలేనన్ని భావాలు నా ఊహలో
మౌనం మౌనం వీడి మాటే నేర్పిస్తుంది
ఈ ప్రేమలో, ఓ ఓ ఓ ఓ

ధీంతనన ధీంతనన నీచూపుల దాడి
చేసిందే చేసిందే ఈ గారడి
ధీంతనన ధీంతనన
నన్నే నే వీడి నీతో కలిసే




మాయారే ఈ అమ్మయిలంతా పాట సాహిత్యం

 
చిత్రం: ఊర్వశివో రాక్షసివో (2022)
సంగీతం: అచ్చు రాజమణి 
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: రాహుల్ సిప్లిగంజ్

పోరిల ఎంట పోకు ఫ్రెండు
ఆడుకుంటరు నిన్నో రౌండు
ఎందుకలా వై వై ఎందూకలా

పడిపోకురా ఇస్తే స్మైలు
బతుకైతది గూడ్స్ రైలు
ఎందుకలా వై వై ఎందూకలా

చేసేదంతా చేసేసి
జారుకుంటదమ్మాయి
దిక్కు మొక్కు ఏం లేక
బారుకాడ అబ్బాయి

మాయారే ఈ అమ్మాయిలంతా మాయారే
గాయలే ఈళ్ళతోటి పెట్టుకుంటే గాయలే
మాయారే ఈ అమ్మయిలంతా మాయారే

మాయ మాయ మాయ మాయ
జిందగీ గయా గయా
మాయ మాయ మాయ మాయ
బతుకే గయా గయా

ఏ ఆకలుండదు నిద్దరుండదు
వీళ్ళ వల్ల మైండే దొబ్బి లైఫే ఉండదు
ఫ్రెండు అంటరు లవ్వు అంటరు
డైలీ వాట్సాప్ స్టాటస్ లాగ మారిపోతారు

మంటల కలిసి పోయేది మనం
మనల్నే తిడతారు ఎర్రి జనం
పబ్జీ లాగ ఆడేస్తు బుజ్జికన్న అంటారు
బ్రిడ్జిలాగా మనముంటే రైలే ఎక్కి పోతారు

మాయారే ఈ అమ్మయిలంతా మాయారే
గాయలే ఈళ్ళతోటి పెట్టుకుంటే గాయలే
మాయారే ఈ అమ్మయిలంతా మాయారే

మాయ మాయ మాయ మాయ
జిందగీ గయా గయా
మాయ మాయ మాయ మాయ
బతుకే గయా గయా

పోరిల ఎంట పోకు ఫ్రెండు
ఆడుకుంటరు నిన్నో రౌండు
ఎందుకలా వై వై ఎందూకలా

పడిపోకురా ఇస్తే స్మైలు
బతుకైతది గూడ్స్ రైలు
ఎందుకలా వై వై ఎందూకలా
ఎందూకలా ఎందూకలా ఎందూకలా

వద్దుర పోరిల జోలికి
పోరి దూల తీర్చి పోతది
ఫుల్ టార్చరు పెడ్తది మెంటల్లీ
ఇగ రాడ్డేరా జిందగి టోటల్లీ

వీళ్ళ ఫోన్లు బ్లాకైపోను
వీళ్ళ అకౌంట్లు హ్యాకైపోను
షాపింగ్ మాల్లు లాకైపోను
పబ్బుల్లో పోరిల్ని చెయ్యాలి బ్యాను
మేకప్ కిట్లు కాకెత్క పోను
బ్యూటీ పార్లర్లు బందైపోను

కురాళ్ళ ఉసురు వీళ్లకి తగిలి
ఉన్న జుట్టు ఊడిపోను
అమ్మాయిలందరు వచ్చే జన్మల
అబ్బాయిలుగ మారిపోను మారిపోను
పోను పోను పోను పోను



కలిసుంటే నువ్వు నేనిలా పాట సాహిత్యం

 
చిత్రం: ఊర్వశివో రాక్షసివో (2022)
సంగీతం: అచ్చు రాజమణి 
సాహిత్యం: కృష్ణకాంత్
గానం: అర్మాన్ మాలిక్ 

కలిసుంటే నువ్వు నేనిలా
కలలాగే ఉంది నమ్మవా
ఎప్పటికి నా మనసే ఇక నీకే

ఓ ఓ ప్రతి రోజు కొత్త జన్మలా
అల్లావే అన్ని వైపులా
నిను చూసే ప్రతిసారి పడతానే

ఓ ఓ చెలివే చెలివే
సరిపోదే గుప్పెడు గుండె
చెలివే చెలివే
మరు హృదయం అప్పడిగానే

నను తాకే ఊపిరి
ఓ ఓఓ అలవాటే అయినది
నదిలో అలలా కలిసేపోనీ

స స సస స ని ని స
కవిత్వాలు నేర్పే సొగసా
సస స సస ని ని స ని ని స
మాటే మూగబోయెను తెలుసా

స సస ని ని స
కొంచెం తెలుగునడిగే చూసా
సస స సస ని ని స ని ని స
సరిపోదులే పొగడగా ఓ భాష

వెతికే నన్నే నన్నే కదిలే అద్ధంలోనే
సగమే సగమే దొరికావ్ మసకుంది ఇన్నాల్లే
బతికే ఇన్నాళ్లు నే కరిగే ఊహల్లోనే
మరిచా మరిచా గతమే వెలుగొచ్చే నీవల్లే

ఓ ఓ సొంతం అని అనుకుంటూనే
పంతానికి పోతుంటావే
కొంచెం కొంచెం చనువే పెంచి
నువ్వుండి పోవే

సంతోషమే ఇకపై నాదే
సందేహమే నాకిక లేదే
సమానమై పోదాం రావే
నువ్వుండి పోవే

స స సస స ని ని స
కవిత్వాలు నేర్పే సొగసా
సస స సస ని ని స ని ని స
మాటే మూగబోయెను తెలుసా

స సస ని ని స
కొంచెం తెలుగునడిగే చూసా
సస స సస ని ని స ని ని స
సరిపోదులే పొగడగా ఓ భాష





సీతాకోక చిలుక పాట సాహిత్యం

 
చిత్రం: ఊర్వశివో రాక్షసివో (2022)
సంగీతం: అచ్చు రాజమణి 
సాహిత్యం: శ్రీమణి 
గానం: శ్రీకృష్ణ 

సీతాకోక చిలుక 

Palli Balakrishna Monday, October 17, 2022
Janaki Ram (2022)



చిత్రం: జానకి రామ్ (2022)
సంగీతం: అచ్చు రాజమణి 
నటినటులు: విజయ్ నవీన్ కృష్ణ , కీర్తి సురేష్ 
దర్శకత్వం: రాంప్రసాద్ రగుతు
నిర్మాత: తమటం కుమార్ రెడ్డి
విడుదల తేది: 2022



Songs List:



ఒక్కసారి నిన్నే నిన్నే పాట సాహిత్యం

 
చిత్రం: జానకి రామ్ (2022)
సంగీతం: అచ్చు రాజమణి 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: అచ్చు రాజమణి 

ఒక్కసారి నిన్నే నిన్నే చూడాలని వచ్చానే జానకి 



నేను పైటేసిన ఫస్టు రోజే పాట సాహిత్యం

 
చిత్రం: జానకి రామ్ (2022)
సంగీతం: అచ్చు రాజమణి 
సాహిత్యం: అవధాని 
గానం:వైకోమ్ విజయలక్ష్మి

నేను పైటేసిన ఫస్టు రోజే
మా ఇంటికి పెద్ద నేమొచ్చింది
నేను బజారులో నడుస్తుంటే
నా ఒంటికి ఫేమొచ్చింది

మా అమ్మకు పవరున్న
పెద్దసార్లే ఫోనొచ్చింది
ఆ బెంజ్ కార్లో బ్లాంక్ చెక్కు ఇంటికొచ్చింది
కరెన్సీలూ కార్లు అక్కర్లేదు
ఆస్థులు అంతస్థులు అసలొద్దు

(మరి ఏటి కావాలేటి నీకు)
ఎట్టా చెప్పనయ్యో
వయసే వచ్చింది పదిహేడు
ఇంకా నచ్చలేదే
నాకు ఇట్టాంటి కుర్రాడు

ఎట్టా చెప్పనయ్యో
వయసే వచ్చింది పదిహేడు
ఇంకా నచ్చలేదే
నాకు ఇట్టాంటి కుర్రాడు

కంటి నిండా కునుకు లేదు
ఒంటికేమో అంటు లేడు
నిద్దరైనా పడతలేదు
ఒంటి పానం ఉంటలేదు

(సరె సరే ఎలాంటోడు కావాలేటి నీకు)
అద్ధంలాంటి… దగదగ అద్ధంలాంటి
నిగనిగ అద్ధంలాంటి అందం నాది
బద్దలుకొట్టే వాడు మొగోడే
నా అందం చందం
బద్దలుకొట్టే వాడు మొగోడే

నిద్దర రాని సంపద నాది
బద్దలుకొట్టే వాడు మొగోడే
నా లెఫ్ట్ రైటు చూపు చూసే వాడు కుర్రోడే
నా ఫ్రంట్ బ్యాక్ చూపు చూసే వాడు చిన్నోడే

(అబ్బా దీనికి ఈడున్నోడు
ఎవడూ సరిపోయేటట్టు లేడురోయ్)
ఆదివారం నాడు వత్తనె పిల్ల
నీకు అద్ధం బరినెలు తెత్తనె పిల్లా
సోమవరం నాడు వత్తనె పిల్ల
నీకు చీర జాకెట్టు తెత్తనె పిల్లా

మగళవారం నాడు వత్తానే పిల్ల
నీకు మువ్వల పట్టీలు తెత్తనె పిల్లా
బుధవారం నాడు వత్తనే పిల్ల
నీకు బంగారు గొలుసులు తెత్తనె పిల్లా

ఒయ్, గురువరం నాడు వత్తనే పిల్ల
నీ సేతికి గాజులు తెత్తనె పిల్లా
శుక్రరాం నాడు వత్తనే పిల్ల
నీ చెవులకు దుద్దులు తెత్తనె పిల్లా
శనివారం నాడు వత్తనె పిల్ల
నిన్ను సినిమాకే తీసుకెల్తనె పిల్లా, ఒయ్

వాడు టచ్ చేస్తే… (ఆహా టచ్ చేస్తే)
వాడు టచ్ చేస్తే… (ఏంటి టచ్ చేస్తే)
వాడు టచ్ చేస్తే… చీర కొంగులు జారిపోవాలి
వాడి రాపిడికి… రైక ముడులు ఊడిపోవాలి

హొయ్, ఆదివారం వాడు రావాలి
ఆ, ఆత్రంగా నా వంక చూడాలి
సోమవారం వాడు రావాలి
నా చీర చెంగును లాగాలి

మగళవారం వాడు రావాలి
ముగ్గులోకి నన్ను దించాలి
బుధవారం వాడు రావాలి
నా బుగ్గని గిల్లి పోవాలి

గురువారం వాడు రావాలి
నా గుండెని మీటి పోవాలి
శుక్రవారం వాడు రావాలి
నా ఒంటికి చెమటలు జారాలి



తొలి తొలిగా పాట సాహిత్యం

 
చిత్రం: జానకి రామ్ (2022)
సంగీతం: అచ్చు రాజమణి 
సాహిత్యం: వశిష్ట శర్మ 
గానం: రాహుల్ నంబియర్

ఓఓ ఓ ఓ ఓ ఓ హో
ఓఓ ఓ ఓ ఆ ఆ హా
తొలి తొలిగా మొదలైనదే మొదలైనదే
కనులు ఇలా నిన్నే చూసిన మనసే నమ్మదే
నా ఊపిరంత నన్ను వీడి పోతు ఉన్నది
నీ నీడలాగా నిన్ను చేరి నీతో ఉన్నదే
కన్నుల్లోనా వెన్నెల్లోనా గుండెల్లోనా నువ్వే నిందావే

దిర ధీంతనాన ధీంతనాన దిరన
ధీంతనాన ధీంతనాన దిరన
ధీంతనాన ధీంతనాన ధీంత ధీంతనా

ఇప్పుడే ఇక్కడే కొత్తగా ఉన్నదే
ప్రపంచాన్ని మార్చేసిందే అది నీమాయేలే
ఎందుకో ఇప్పుడే గుండెలో చప్పుడే హటాత్తుగా
పెరిగిందేంటో అంతా నీవల్లే

కాలం నీవైపే నేడుతు ఉందే
నీ అడుగుల్లో అడుగేయమందే
క్షణమైన ఆగని తొందర
నీతో మొదలైందే

చూపులే నన్నిలా నేరుగా తాకగా
మరో జన్మల పుట్టిందే మనసే ఇవ్వాలె
చిన్నగా నువ్విలా నవ్వితే చాలుగా
ఆ నవ్వులో తేలిందే నా ప్రాణం నీవల్లే

నా ఊహలు నువ్వే… నా ఊపిరి నువ్వే
ఆశలు పంచె నిజమయ్యావే
నాకోసమే నువ్వంటూ పరిచయమయ్యావే

Palli Balakrishna Tuesday, August 2, 2022
Gaali Sampath (2021)


చిత్రం: గాలి సంపత్ (2021)
సంగీతం: అచ్చు రాజమణి
నటీనటులు: శ్రీ విష్ణు, లవ్లీ సింగ్ (ఆశ్య), రాజేంద్ర ప్రసాద్
దర్శకత్వం: అనీష్ కృష్ణ
నిర్మాతలు: ఎస్. కృష్ణ , హరీష్ పెద్ది, సాహు గారపాటి
విడుదల తేది: 11.03.2021






చిత్రం: గాలి సంపత్ (2021)
సంగీతం: అచ్చు రాజమణి
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: రాజేంద్ర ప్రసాద్, రాహూల్ నంబియార్, శ్రీకృష్ణ విష్ణుబొట్ల, అచ్చు రాజమణి

ఫిఫీఫీ ఫిఫీఫీ ఫిఫీఫీ ఫిఫీఫీ
ఫిఫీఫీ ఫిఫీఫీ 

రాజా రాజా శ్రీ గాలి సంపత్ గారు
మై డియర్ డాడీ బాబండి
మా బాబు గారు చేసే డైలీ విన్యాసాలు
ఊహాతీతం సుమండీ

అరే కొక్కొరొక్కో తెల్లారిందా ఎదో ఒక ప్రాబ్లెమ్
ఇంటిమీదకి తీసుకురానిదే నిదరొడండి
అరే తిట్టికొట్టి మంచి చెడ్డ చెప్పే వయసు కాదే
ఈయన గారితో ఎట్టా వేగాలండి

ఫిఫీఫీ ఫిఫీఫీ ఫిఫీఫీ ఫిఫీఫీ
క్రేజీ డాడీ... ఫిఫీఫీ 
ఫిఫీఫీ ఫిఫీఫీ ఫిఫీఫీ ఫిఫీఫీ
క్రేజీ క్రేజీ క్రేజీ డాడీ ఫిఫీఫీ 

హే తుస్సు బుస్సు చాటర్ బాక్సు
యుజ్లెస్ గ్యాంగ్ కు బాసూ
ఏడాది మొత్తం పేలే లక్ష్మి టపాసు
కాస్త చూసుకో వయ్య అట్టే ఈ మాస్టర్ ని
ఊరి మీదకు వదలమాకయ్య
హే ఊసుపోని మేకప్ రంగు
ఊడిపోయ్యే మీసాల కింగు
బాహుబలినంటాడు ఈ డ్రామా బిగ్ బాసు
జర జాగ్రత్త భయ్యా పొద్దునలేస్తే
ఇంట్లో ఈయనతో ఉండేది నువ్వేనయ్యా
అరె ఒంట్లో ఉండే ఎనర్జీ లు చాలా ఓవరుడోసు
పని పాత లేని పల్లకి సిలబస్సు

రాజా రాజా శ్రీ గాలి సంపత్ గారు
మై డియర్ డాడీ బాబండి
మా బాబు గారు చేసే డైలీ విన్యాసాలు
ఊహాతీతం సుమండీ

అరే కొక్కొరొక్కో
తెల్లారిందా ఎదో ఒక ప్రాబ్లెమ్
ఇంటిమీదకి తీసుకురానిదే నిదరొడండి
అరే తిట్టికొట్టి మంచి చెడ్డ చెప్పే వయసు కాదే
ఈయన గారితో ఎట్టా వేగాలండి

ఫిఫీఫీ ఫిఫీఫీ ఫిఫీఫీ ఫిఫీఫీ
క్రేజీ డాడీ... ఫిఫీఫీ 
ఫిఫీఫీ ఫిఫీఫీ ఫిఫీఫీ ఫిఫీఫీ
క్రేజీ క్రేజీ క్రేజీ డాడీ ఫిఫీఫీ 


Palli Balakrishna Tuesday, March 16, 2021
DK Bose (2013)



చిత్రం: DK బోస్ (2013)
సంగీతం: అచ్చు రాజమణి
నటీనటులు: సందీప్ కిషన్, నిషా అగర్వాల్
దర్శకత్వం: AN బోస్
నిర్మాతలు: ఆనంద్ రంగా, శేషు రెడ్డి
విడుదల చేయాలనుకున్నది: సెప్టెంబర్.2013


విడుదల చేయాలనుకున్నది సెప్టెంబర్ 2013
కానీ ఎందుకు రిలీజ్ లేట్ అయ్యింది 7 సంవత్సరాల తరువాత OTT లో ఎందుకు రిలీజ్ చేశారు. దానికి కారణాలు ఏంటి?

అత్తారింటికి దారేది సినిమా  ఫస్ట్ హాఫ్ లీక్ అయిపోయింది నెట్ లో హై క్వాలిటీ లో అందుబాటులో ఎవరో పెట్టారు. అందుకు ఆ సినిమాని అనుకున్న దానికంటే 10 రోజులు ముందుగా రిలీజ్ చేయడానికి ఆ చిత్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్,  నిర్మాత బి. వి ఎస్. యన్ ప్రసాద్ గారు సిద్ధమయ్యారు. 27.సెప్టెంబర్.2013 లో రిలీజ్ చేశారు. 

దానికంటే ముందేరిలీజ్ చేయాలంటే వీళ్ళకి కుదరలేదు అందుకోసం DK బోస్ సినిమా రిలీజ్ వాయిదా వేశారు ఆ తరువాత కొన్ని సమస్యలతో 
రిలీజ్ చేయలేక పోయారు. కానీ 7 సంవత్సరాల తరువాత OTT లో రిలీజ్ చేశారు, కారణం కరోనా కారణంగా లాక్ డౌన్ వలన OTT ప్లాట్ ఫామ్స్ కు కొంచెం ఆధరణ రావటం తో OTT లో రిలీజ్ అయింది.







చిత్రం: DK బోస్ (2013)
సంగీతం: అచ్చు రాజమణి
సాహిత్యం: వనమాలి
గానం: హరి చరణ్, సుచిత్ర

పద పద మన్నది నా అడుగే నీవైపు
అటు ఇటు చూడకు అంటుందే నా చూపు
నా మది కూడా ఎపుడో జారిందే,
అది ప్రేమో ఏమో తెలిసేలోపు

నే పడిపోయా పడిపోయా పడిపోయా పడిపోయా
నిలువెల్లా నీతోనే ముడిపడిపోయా 
నే చెడిపోయా చెడిపోయ చెడిపోయ చెడిపోయా 
తరిమే నీ ఊహలతో మతి చెడిపోయా
పద పద మన్నది నా అడుగే నీవైపు
అటు ఇటు చూడకు అంటుందే నా చూపు

నా గతము చెరిపి నిజము తెలిపి
పోల్చనంతగా నన్నే ఆణువణువూ 
మార్చెను నీ ప్రణయం
ఈ కరుకు మనసు కరిగి కరిగి రేయి పగలు
నా కళలను నీ తలపుతో మున్చినదీ సమయం
నీ ప్రేమే... నీ ప్రేమే...
ఓ వరమల్లె గుండెల్లోన కొలువు తీరద
నా ప్రేమే... నా ప్రేమే...
నను గెలిపించి నిను నాతో నడిపిస్తుందా

పద పద మన్నది నా అడుగే నీవైపు
అటు ఇటు చూడకు అంటుందే నా చూపు
నా మది కూడా ఎపుడో జారిందే,
అది ప్రేమో ఏమో తెలిసేలోపు

నే పడిపోయా పడిపోయా పడిపోయా పడిపోయా
నీతోనే ఈ నిమిషం ముడిపడిపోయా
నే చెడిపోయా చెడిపోయ చెడిపోయ చెడిపోయా
ప్రేమించే నీ కొరకే మతి చెడిపోయా 


Palli Balakrishna Friday, February 12, 2021
Ra Ra... Krishnayya (2014)



చిత్రం: రారా... కృష్ణయ్య (2014)
సంగీతం: అచ్చు రాజమణి
నటీనటులు: సందీప్ కిషన్, రెజీనా కాసాండ్రా, జగపతి బాబు, కళ్యాణి
దర్శకత్వం: మహేష్. పి
నిర్మాతలు: వంశీ కృష్ణ, శ్రీనివాస్
విడుదల తేది: 04.07.2014



Songs List:



హీరో హీరో పాట సాహిత్యం

 
చిత్రం: రారా... కృష్ణయ్య (2014)
సంగీతం: అచ్చు రాజమణి
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: కార్తీక్ , అచ్చు రాజమణి

హీరో హీరో



రా రా కృష్ణయ్య పాట సాహిత్యం

 
చిత్రం: రారా... కృష్ణయ్య (2014)
సంగీతం: అచ్చు రాజమణి
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: అచ్చు రాజమణి, శ్రేయా ఘోషల్ , యాజిన్ నిజార్

రా రా కృష్ణయ్య



ఓనం ఓనం పాట సాహిత్యం

 
చిత్రం: రారా... కృష్ణయ్య (2014)
సంగీతం: అచ్చు రాజమణి
సాహిత్యం: శ్రీ మణి
గానం: అచ్చు రాజమణి, చిన్మయి

ఓనం ఓనం




వడరేయ్ మచాన్ పాట సాహిత్యం

 
చిత్రం: రారా... కృష్ణయ్య (2014)
సంగీతం: అచ్చు రాజమణి
సాహిత్యం: శ్రీ మణి
గానం: సుచిత్ర, అచ్చు రాజమణి

వడరేయ్ మచాన్



Come on Baby పాట సాహిత్యం

 
చిత్రం: రారా... కృష్ణయ్య (2014)
సంగీతం: అచ్చు రాజమణి
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: సౌమ్య, శ్రీ చిత్ర, సూరజ్ సంతోష్

Come on Baby



సీతా కల్యాణం పాట సాహిత్యం

 
చిత్రం: రారా... కృష్ణయ్య (2014)
సంగీతం: అచ్చు రాజమణి
సాహిత్యం: Treditional
గానం: మహతి

సీతా కల్యాణం

Palli Balakrishna Thursday, February 11, 2021
Dynamite (2015)


చిత్రం: డైనమైట్ (2015)
సంగీతం: అచ్చు రాజమణి
నటీనటులు: విష్ణు మంచు, ప్రణిత సుభాస్, జె.డి.చక్రవర్తి
దర్శకత్వం: విష్ణు మంచు, విజయన్ మాస్టర్
నిర్మాత: మంచు విష్ణు
విడుదల తేది: 04.09.2015


Palli Balakrishna Tuesday, February 19, 2019
Neevevaro (2018)

చిత్రం: నీవెవరో (2018)
సంగీతం: ప్రసన్  ప్రవీణ్, అచ్చు రాజమణి, శ్యామ్
సాహిత్యం: శ్రీజో
గానం: సిద్ శ్రీరామ్
నటీనటులు: ఆది పినిశెట్టి, తాప్సి పన్ను, రితిక సింగ్
దర్శకత్వం: హరినాథ్
నిర్మాత: ఎమ్.వి.వి.సత్యన్నారాయణ
విడుదల తేది: 24.08.2018

వెన్నెలా…. ఓ వెన్నెలా
నా నీడై నడిచే నేస్తం నువ్వయ్యావెలా
నిన్నలా… నే లేనుగా
ఈ రోజే చూస్తున్నాగా నన్నే కొత్తగా.. ఓ ఓ
ప్రాణం కదిలించిందే నీ స్వరం
అడుగేస్తూ నాతో వచ్చే స్నేహం, నీ వరం
ఒక మాయ నీ పరిచయం … ఓ ఓ ఓ ఓ

వెన్నెలా…. ఓ వెన్నెలా
నా నీడై నడిచే నేస్తం నువ్వయ్యావెలా
నిన్నలా… నే లేనుగా
ఈ రోజే చూస్తున్నాగా నన్నే కొత్తగా..

మాటే విననీ మనసెగిరిపోనీ
చెలిమే రెక్కలివ్వగా
నీకే తెలియదంటున్న
నిజమే లోకం చూడగా
సందేహం వీడనీ
ఈ మాయే మదిలో నిండనీ
సంతోషం పొంగనీ
నీ హృదయం నీలో లేదనీ

ఓ మాటల్లోనే, మోమాటం కరిగించి
నిన్నూ నన్నూ స్నేహం పెనవేసింది
అలావాటే లేదుగా అడిగేది కాదుగా
ఈ వింతల వేడుక చెలిమికి ఋజువేగా
ఎన్నో ఊహల్లో మన ఉనికే వెతికానే
నువ్వే ఎదురైతే
ఆ ఏకాంతంలో నాలో మౌనం మోగదే

వెన్నెలా…. ఓ వెన్నెలా
నా నీడై నడిచే నేస్తం నువ్వయ్యావెలా
నిన్నలా… నే లేనుగా
ఈ రోజే చూస్తున్నాగా నన్నే కొత్తగా.. ఓ ఓ

ఏ చోటున్నా నను నీలో చూస్తున్నా
నువులేవన్నా తలపే చెరిపేస్తున్నా
అడుగడుగే చీకటై నిశిలో ముంచేసినా
నీ రాకే వేకువై నను నడిపెను ప్రేమా
నీతో క్షణకాలం కలకాలంలా ఉందే
అందం ఆనందం కలగలిపి చూపిస్తున్నా
అద్దం మన కథే!

వెన్నెలా…. ఓ వెన్నెలా
నా నీడై నడిచే నేస్తం నువ్వయ్యావెలా
నిన్నలా… నే లేనుగా
ఈ రోజే చూస్తున్నాగా నన్నే కొత్తగా.. ఓ ఓ
ప్రాణం కదిలించిందే నీ స్వరం
అడుగేస్తూ నాతో వచ్చే స్నేహం, నీ వరం
ఒక మాయ నీ పరిచయం … ఓ ఓ ఓ ఓ
వెన్నెలా.

Palli Balakrishna Friday, January 25, 2019
Mama Manchu Alludu Kanchu (2016)


చిత్రం: మామ మంచు అల్లుడు కంచు (2016)
సంగీతం: అచ్చు , కోటి, రఘు కుంచె
సాహిత్యం: శ్రీమణి , అనంత శ్రీరామ్
నటీనటులు: అల్లరి నరేష్ , మోహన్ బాబు, వరుణ్ సందేశ్, మీనా, రమ్యకృష్ణ , పూర్ణ
దర్శకత్వం: శ్రీనివాస రెడ్డి
నిర్మాత: మంచు విష్ణు
విడుదల తేది: 2016

చిత్రం: మామ మంచు అల్లుడు కంచు (2016)
సంగీతం: కోటి
సాహిత్యం: శ్రీమణి
గానం: శ్రీచరన్ , శృతిహాసన్

నిను చూశాకే తెలిసిందే ప్రేమంటే
నా మనసే కావాలందే నీ జంటే
కల నిజమైతే నీలా ఉంటుందే
ఆ సంతోషం నాలా ఉంటుందే
నీ గుచ్చే గుచ్చే చూపే నచ్చిందే
నిను గిచ్చే గిచ్చే మందే నా మనసే
నా హృదయాన్నే కానుకిస్తున్నా
నిను ప్రాణంగా ప్రేమిస్తున్నా

ప్రేమా....
నిజమా...

నా కనులకు పెదవులు ఉంటే పలికేవే
తొలిప్రేమకు అర్ధం అంటే నువ్వేలే
నీ గుండెల్లో చిన్ని చోటున్నా
ఈ జన్మంతా సర్దుకు పోతాలే

మనసా... ఓ...
నీ తీయటి జ్ఞాపకమల్లె ఉంటానే
నీ మాటను సంగీతంలా వింటానే
నీ కన్నుల్లో ఓ నలుసైనా
నే పడనీనే ఏ నిమిషాన

నిను చూశాకే తెలిసిందే ప్రేమంటే
నా మనసే కావాలందే నీ జంటే
కల నిజమైతే నీలా ఉంటుందే
ఆ సంతోషం నాలా ఉంటుందే


Palli Balakrishna Wednesday, March 14, 2018
Venkatapuram (2017)


చిత్రం: వెంకటాపురం (2017)
సంగీతం: అచ్చు రాజమణి
సాహిత్యం: వనమాలి
గానం: యాసిన్ నిజార్, కెక ఘోషల్
నటీనటులు: రాహుల్ హరిదాస్, మహిమా మక్వాన
దర్శకత్వం: వేణు మదికంటి
నిర్మాత: శ్రేయాస్ శ్రీనివాస్
విడుదల తేది: 12.05.2017

ఎవరో ఎవరో ఎదురుగ
కలలా కలలా కనపడి
ఎపుడూ ఎరగని మాయే చేస్తున్నట్టూ
ఎదలో ఎదలో ఇపుడిక
నిజమై నిజమై నిలిచిన

తనతో నడిచా అన్నీ నువ్వేనంటూ
ఇది ముందెరుగని సంతోషం
ఉంటుందా ప్రతి నిమిషం
అనుకోకుండా నాకు ఎదురయ్యిందా
నా గుండెల్లో అడుగేసీ లోనంతా తిరిగేసీ
నన్నిట్టా తను బైటికి లాగేసిందా

ఎగిరే ఎగిరే నా మనసే
అలలా లేచి పైపైకెగిరే
ఉరికే ఉరికే అది వరదై
తనతో చేరి జతగా ఉరికే

ఎగిరే ఎగిరే నా మనసే
అలలా లేచి పైపైకెగిరే
ఉరికే ఉరికే అది వరదై
తనతో చేరి జతగా ఉరికే
దినమే క్షణమై కరుగుతు
సమయం అసలే తెలియదు
నీతో గడిపే ఈవేళలోనా

నువు చూపే స్నేహంలో
నాలో ఈభారం నేడు మాయమాయెనా
పరుగో నడకో తేలక
పగలో రేయో చూడక
మనసే మునిగే ఒక హాయిలోనా
సిరివానా నీరెండా కలిసి
నా కంటా ఏడు రంగులేసెనా
నువు చూసే లోకంలో
ప్రతి చోటా నేనున్నాలే

ఎగిరే ఎగిరే నా మనసే
అలలా లేచి పైపైకెగిరే
ఉరికే ఉరికే అది వరదై
తనతో చేరి జతగా ఉరికే

ఎగిరే ఎగిరే నా మనసే
అలలా లేచి పైపైకెగిరే
ఉరికే ఉరికే అది వరదై
తనతో చేరి జతగా ఉరికే

Palli Balakrishna Tuesday, November 21, 2017
Pandavulu Pandavulu Tummeda (2014)


చిత్రం: పాండవులు పాండవులు తుమ్మెద (2014)
సంగీతం: అచ్చు రాజమని, బప్పా. బి.లహరి
సాహిత్యం: చంద్రబోస్
గానం: ఉదిత్ నారాయణ్
నటీనటులు: మోహన్ బాబు, విష్ణు, మనోజ్, వరుణ్ సందేశ్, తనీష్ , వెన్నెల కిషోర్, హన్సిక, ప్రణీత, రవీనా టండన్
దర్శకత్వం: శ్రీవాస్
నిర్మాత: మంచు విష్ణు, మంచు మనోజ్
విడుదల తేది: 31.01.2014

అచ్చ తెలుగంటి  పెదవుల్ని వెలుగంటి బుగ్గలని
దగ్గరగా చూశాను నేనే
పచ్చి పసుపంటి పాదాల్ని పాలంటి గుండెల్ని
పిచ్చెక్కి చూశాను నేనే
చూశా నేనే చూశా నేనే అందం మొత్తం చూసేశానే
రాశా నేనే రాశా నేనే హృదయం నీకే రాసిచ్చానే

చరణం: 1
ఓ నా కళ్ళలో మెరుపొచ్చేలా నీ కళ్ళు చూశాను నేనే
నా వెన్నులో ఉడుకొచ్చేలా నీ వెన్ను చూశాను నేనే
నీ ఒంపులో ఆపేశావే కాలాన్నే
నీలో సంద్రాల లోతుల్ని శిఖరాల ఎత్తుల్ని
నిఖరంగా చూశాను నేనే
పిల్లా నీ పీఠభూముల్ని  నునులేత కనులన్నీ
నిశ్చంగా  చూశాను నేనే

చూశా నేనే చూశా నేనే అందం మొత్తం చూసేశానే
రాశా నేనే రాశా నేనే హృదయం నీకే రాసిచ్చానే

చరణం: 2
ఆ ఊబిలో  దిగిపోయేలా నీ నాభి చూశాను నేనే
ఆ మడతలో మునకేసేలా  నీ నడుమే చూశాను నేనే
నీ రూపుతో పిండేసావే ప్రాణాన్నే
అబ్బో  ఆ సూర్య చంద్రుల్ని చూల్లేని  చోటుల్ని
అడ్డంగా  చూశాను నేనే
అమ్మో నువ్వైన నీలోన చూల్లేని  సోకుల్ని
అద్దంలా చూశాను నేనే

చూశా నేనే  చూశా నేనే   అందం మొత్తం చూసేశానే
రాశా నేనే రాశా నేనే హృదయం నీకే రాసిచ్చానే

అచ్చ తెలుగంటి  పెదవుల్ని వెలుగంటి బుగ్గలని దగ్గరగా చూశాను నేనే
పచ్చి పసుపంటి పాదాల్ని పాలంటి గుండెల్ని  పిచ్చెక్కి చూశాను నేనే

చూశా నేనే చూశా నేనే అందం మొత్తం చూసేశానే
రాశా నేనే రాశా నేనే హృదయం నీకే రాసిచ్చానే
చూశా నేనే చూశా నేనే అందం మొత్తం చూసేశానే
రాశా నేనే రాశా నేనే హృదయం నీకే రాసిచ్చానే

Palli Balakrishna Sunday, October 1, 2017
Potugadu (2013)



చిత్రం: పోటుగాడు (2013)
సంగీతం: అచ్చు రాజమని
నటీనటులు: మంచు మనోజ్, సాక్షి చౌదరి, సిమ్రాన్ కౌర్, రాచెల్ , అనుప్రియ
దర్శకత్వం: పవన్ వాడేయర్
నిర్మాత: శిరీషా లగడపాటి
విడుదల తేది: 14.09.2013



Songs List:



ప్యార్ మే పడిపోయా మై పాట సాహిత్యం

 
చిత్రం: పోటుగాడు (2013)
సంగీతం: అచ్చు రాజమని
సాహిత్యం: భాషా శ్రీ
గానం: ఇందు నాగరాజు, మంచు మనోజ్

పల్లవి:
ప్యార్ మే పడిపోయా మై
ఓ మియా తేరే ప్యార్ మే పడిపోయా మై
ప్రాణమే చోడ్ దియా మై
ఓ జాను మేరే ప్రాణమే చోడ్ దియా మై

ఖానా పీనా నహిరే బావా కడుపుకే
నిద్ర గిద్ర ఆతీ నైరే కళ్ళకే
జిందగీ హలాల్ అయిందిరో

ప్యార్ మే పడిపోయా మై
ఓ మియా తేరే ప్యార్ మే పడిపోయా మై
ప్రాణమే చోడ్ దియా మై
ఓ జాను మేరే ప్రాణమే చోడ్ దియా మై

చరణం: 1
దిల్ దిల్ ధడకే బుగ్గలు చూస్తే
జిల్ జిల్ ఆడే నడుముని చూస్తే
దిల్ మేర లాగేత్తాందిరే
ఓ పిల్లా తేరే ప్యార్ కోసం దేఖేతున్నానే

హేయ్.. దిల్ దిల్ ధడకే బుగ్గలు చూస్తే
జిల్ జిల్ ఆడే నడుముని చూస్తే
దిల్ మేర లాగేత్తాందిరే
ఓ పిల్లా తేరే ప్యార్ కోసం దేఖేతున్నానే

దేకుడు గీకుడు నక్కోజీ
ప్యార్ మాత్రం కర్లో జీ
మై భీ నీతో ఇష్క్ చేస్తి హూన్

ప్యార్ మే పడిపోయా మై
ఓ మియా తేరే ప్యార్ మే పడిపోయా మై
ప్యార్ మే పడిపోయా మై
ఓ మియా తేరే ప్యార్ మే పడిపోయా మై


చరణం: 2
బేగుం మై తుంకో ఇష్క్ కర్తా హూన్

చంకి గింకి కొట్టుకుని
షాదీ గీదీ చేసేస్కొని
చోటా ఇల్లే కట్టేస్కుందాము
కుషి లో క్రికెట్ టీమే పుట్టించేద్దాము

చంకి గింకి కొట్టుకుని
షాదీ గీదీ చేసేస్కొని
చోటా ఇల్లే కట్టేస్కుందాము
కుషి లో క్రికెట్ టీమే పుట్టించేద్దాము

షాదీ గీదీ చోడో జీ చుమ్మా ఇప్పుడే దేదో జీ
టక్కున నువ్వే మమ్మీవవుతావు
నక్కో నక్కో

ప్యార్ మే పడిపోయా మై
ఓ మియా తేరే ప్యార్ మే పడిపోయా మై
ప్రాణమే చోడ్ దియా మై
ఓ జాను మేరే ప్రాణమే చోడ్ దియా మై

ఖానా పీనా నహిరే బావా కడుపుకే
నిద్ర గిద్ర ఆతీ నైరే కళ్ళకే

జిందగీ హలాల్ అయింది రో
ప్యార్ మే
ప్యార్ మే టిక్కుం టిక్కుం మై
ప్యార్ మే టిక్కుం టిక్కుం మై





దేవత ఓ దేవత పాట సాహిత్యం

 
చిత్రం: పోటుగాడు (2013)
సంగీతం: అచ్చు రాజమని
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: కార్తీక్

పల్లవి:
ఇదివరకిటు వైపుగా రాలేదుగా నా కలా
చేజారినదేమిటో తెలిసిందిగా ఈ వేళా
చిమ్మ చీకటి నిన్నలో దాగింది నా వెన్నెల
మరు జన్మము పొందేలా సరికొత్తగా పుట్టానే మరలా
దేవత ఓ దేవత నా మనసునే మార్చావే
ప్రేమతొ నీ ప్రేమతో నను మనిషిగ మలిచావే
దేవత ఓ దేవత నా మనసునే మార్చావే
ప్రేమతొ నీ ప్రేమతో నను మనిషిగ మలిచావే

చరణం: 1
ఓ… నా గుండె కదలికలో వినిపించే స్వరము నువ్వే
నే వేసే అడుగు నువ్వే నడిపించే వెలుగు నువ్వే
నా నిన్నలనే మరిపించేలా మాయేదో చేసావే
అనురాగపు తీపిని నాకు రుచి చూపించావే అమ్మల్లే
దేవత ఓ దేవత నా మనసునే మార్చావే
ప్రేమతొ నీ ప్రేమతో నను మనిషిగ మలిచావే
దేవత ఓ దేవత నా మనసునే మార్చావే
ప్రేమతొ నీ ప్రేమతో నను మనిషిగ మలిచావే

చరణం: 2
ఓ… నీవల్లే కరిగిందీ మనసంతా కను తడిగా
నిజమేదో తెలిసేలా నలుపంతా చెరిగెనుగా
గతజన్మల రుణ బంధముగా కలిసావే చెలి తీగా
ఇకపై నెనెప్పటికి నీ ఊపిరి గాలల్లే ఉంటాగా
దేవత ఓ దేవత నా మనసునే మార్చావే
ప్రేమతొ నీ ప్రేమతో నను మనిషిగ మలిచావే
దేవత ఓ దేవత నా మనసునే మార్చావే
ప్రేమతొ నీ ప్రేమతో నను మనిషిగ మలిచావే




బుజ్జి పిల్లా తెల్ల పిల్లా ఐ లవ్ యూ పిల్లా పాట సాహిత్యం

 
చిత్రం: పోటుగాడు (2013)
సంగీతం: అచ్చు రాజమని
సాహిత్యం: అచ్చు, మంచు మనోజ్, రామజోగయ్య శాస్త్రి
గానం: శింబు (సీలంబరసన్)

పల్లవి:
One two three four
Why not shake your booty
అమ్మమ్మో పిచ్చ బ్యూటీ
I am the driving in the city oh my naugthy
మనము వెళ్దాం ఊటి
అరే కం కం దా నాతోటి
ఈ పోటుగాడికి నో పోటీ
ఓకే లవ్ లవ్ లవ్ లవ్ లవ్
ఆఫ్టర్ లవ్ హాట్ స్టవ్ నో టెన్షన్ బేబీ

నువ్వు నా బుజ్జి పిల్లా తెల్ల పిల్లా ఐ లవ్ యూ పిల్లా
ఇక నువ్వూ నేను కప్లింగ్ అయితే
బూం బూం బూం బూం
బుజ్జి పిల్లా తెల్ల పిల్లా ఐ లవ్ యూ పిల్లా
ఇక నువ్వూ నేను కప్లింగ్ అయితే
సలాం నమస్తే వణక్కం బేబీ

చరణం: 1
You wearing you wearing
You wearing dress it so short where are the rest అమ్మా,,,
అరే i wanna tell you i wanna tell you you so hot అమ్మా.. మామ
స్లీపింగ్ లేదే ఈటింగ్ లేదే చలి జ్వరమొస్తుందే
అరే you have the curves i have the packs let's sing duet ma
నువ్వు ఫారెన్ చాక్లెట్ మా నేను లోకల్ బిస్కట్ మా
అరే don't go my heart rate down foreign figure అమ్మా

నువ్వు నా బుజ్జి పిల్లా తెల్ల పిల్లా ఐ లవ్ యూ పిల్లా
ఇక నువ్వూ నేను కప్లింగ్ అయితే
బూం బూం బూం బూం
బుజ్జి పిల్లా తెల్ల పిల్లా ఐ లవ్ యూ పిల్లా
ఇక నువ్వూ నేను కప్లింగ్ అయితే
సలాం నమస్తే వణక్కం బేబీ

చరణం: 2
Your so bright i am not white its ok alright
అరే love is blind love is god rest all bull shit shit
నువ్వు ఇంగ్లీష్ నేను లోక్లాస్స్ టుగేదర్ బిందాస్
You are the flight i am the pailet lets go love route
మిలేజ్ చాలా గుడ్ అమ్మా
హార్స్ పవర్ పిచ్చ హై అమ్మా
అరే వైట్ బ్యూటీ సూపర్ హాట్టీ నేను పిచ్చోడైపోయా

నువ్వు నా బుజ్జి పిల్లా తెల్ల పిల్లా ఐ లవ్ యూ పిల్లా
ఇక నువ్వూ నేను కప్లింగ్ అయితే
బూం బూం బూం బూం
బుజ్జి పిల్లా తెల్ల పిల్లా ఐ లవ్ యూ పిల్లా
ఇక నువ్వూ నేను కప్లింగ్ అయితే
సలాం నమస్తే వణక్కం బేబీ





సూపర్ ఫిగరు పాట సాహిత్యం

 
చిత్రం: పోటుగాడు (2013)
సంగీతం: అచ్చు
సాహిత్యం: మంచు మనోజ్
గానం: హేమచంద్ర , గీతా మాధురి

బేబీ నువ్వంటె పడిసస్తా
బేబీ నీకోసం దూకేస్తా
బేబీ నువ్వు లేకపోతే నా లైఫ్ మొత్తం వేస్ట్ అయిపొతాదే
బేబీ ఈ జన్మ నీదేలే
బేబీ ఆ పైన నీదేలే
బేబీ నా హార్ట్ నీదే అనీ నిన్ను చూసాకే తెలిసిందే

ఎల్లా??
అరే ఎల్లా?
మరీ ఇంత డేంజర్ అయిపోతే ఎల్లా
అలా ఇలా లవ్ చేసేయ్ మల్ల
ఆపై ఇంకా గిరిగిల్లా

రాయె రాయె సూపర్ ఫిగరు
నిన్ను సేత్తా నా పిల్లల మదరూ
రాయె రాయె రాయె సూపర్ ఫిగరు
నిన్ను సేత్తా నా పిల్లల మదరూ

నువ్వే నా హార్టు బీటు
నువ్వే నా పల్సూ రేటూ
నువ్వులేక పోతే ఎందుకే ఈ హార్ట్ బీటూ
నువ్వే నా సర్వం పిల్లా
నేనే నీ సొంతం మల్లా
వచ్చెయ్ వే ఇచ్చెయ్ వే నీ ముద్దుల వర్షాన్ని

మాయ చేసి మంత్రం వేసి ఇట్టా నా మనసుకి
కళ్ళెమేసి ప్రేమలోకి లాగినావుగా
తల్లడిల్లిపోతున్నాను తెల్లార్లూ పిల్లడా

My heart says baby i need you

రాయె రాయె సూపర్ ఫిగరు
నిన్ను సేత్తా నా పిల్లల మదరూ
రాయె రాయె రాయె సూపర్ ఫిగరు
నిన్ను సేత్తా నా పిల్లల మదరూ

నువ్వే నా రసగుల్లా
లవ్ చేద్దాం ఓపెన్ గా ఇల్లా
ఈ లైఫ్ ఆపై లైఫ్ నువ్వే నా వైఫ్
నువ్వే నా గ్లాస్లో వైను
నువ్వే నా మోస్ట్ పెయిన్
నువ్వే నాకు ముద్దివ్వకపోతే వేస్తానే ఫైన్

అరే హీరోలంతా ఒక్క చోట పోగేసి చూసినా
నిన్ను మించి ఉండరే పోటుగాడా
మూడు ముళ్ళు వేసుకుని ఎంచక్కా మనము

Lets go high into the sky

రాయె రాయె సూపర్ ఫిగరు
నిన్ను సేత్తా నా పిల్లల మదరూ
రాయె రాయె రాయె సూపర్ ఫిగరు
నిన్ను సేత్తా నా పిల్లల మదరూ




బిందాస్ పాట సాహిత్యం

 
చిత్రం: పోటుగాడు (2013)
సంగీతం: అచ్చు రాజమని
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: టిప్పు

పల్లవి:
Start it!!
బిందాస్, ఫుల్ మాస్ గోవిందా
వీడు హై క్లాస్, టైం పాస్ గోవిందా
లేడీస్ ఫొకస్సు గోవిందా
వీడికి లవ్ అంటే వీక్నెస్ గోవిందా
That's right!!

బిందాస్, ఫుల్ మాస్ గోవిందా
వీడు హై క్లాస్, టైం పాస్ గోవిందా
లేడీస్ ఫొకస్సు గోవిందా
వీడికి లవ్ అంటే వీక్నెస్ గోవిందా

చరణం: 1
పైపై చూపులకేమో మామూలోడు
కామన్ గా కనిపించేఎ పోరగాడు
వీడి మైండ్ లోతుకెళ్ళినోదు
రామ రామ మళ్ళీ తిరిగేరాడు

గీత గీసారంటే దాటేస్తాడు
వద్దు గిద్దు అంటే చేసేస్తాడు
నాకంటే పొటుగాడు లేదంటాడు
అబ్బ కన్ను కొట్టి కలర్ ఎగరేస్తాడు.

పోటుగాడు!!
గోవిందా!!

బిందాస్, ఫుల్ మాస్ గోవిందా
వీడు హై క్లాస్, టైం పాస్ గోవిందా
లేడీస్ ఫొకస్సు గోవిందా
వీడికి లవ్ అంటే వీక్నెస్ గోవిందా

చరణం: 2
ఏ స్కూల్ డ్రాప్ అవుట్ పిల్లగాడు A B C X
ఫేస్ బుక్ లన్నీ చదివేసాడు
ఏ స్కూల్ డ్రాప్ అవుట్ పిల్లగాడు A B C X
ఫేస్ బుక్ లన్నీ చదివేసాడు
ఆల్గీబ్రా లెక్కల్లో వీకే వీడు
కాని ఆల్బిత్తర్ లెక్కల్లో జాదూగాడు

Actually very good boy వీడు
పాపం ఏ పని చేసిన బ్యాడ్ అవుతాడు
జస్టే సెకండ్ కొంచెం ఫీల్ అవుతాడు
మళ్ళీ ఫుల్ హార్స్ పవర్ తో రైజ్ అవుతాడు.

పోటుగాడు!!
గోవిందా!!

బిందాస్, ఫుల్ మాస్ గోవిందా
వీడు హై క్లాస్, టైం పాస్ గోవిందా
లేడీస్ ఫొకస్సు గోవిందా
వీడికి లవ్ అంటే వీక్నెస్ గోవిందా

Palli Balakrishna Thursday, September 21, 2017
Current Theega (2014)



చిత్రం: కరంట్ తీగ (2014)
సంగీతం: అచ్చు
నటీనటులు: మంచు మనోజ్ , జగపతిబాబు, రకూల్ ప్రీత్ సింగ్, సన్నీలియోన్
దర్శకత్వం: జి.నాగేశ్వర రెడ్డి
నిర్మాత: మంచు విష్ణు
విడుదల తేది: 31.10.2014



Songs List:



అమ్మాయి నడుము పాట సాహిత్యం

 
చిత్రం: కరంట్ తీగ (2014)
సంగీతం: అచ్చు
సాహిత్యం: రామ జోగయ్య శాస్త్రి 
గానం: అచ్చు, యం.యం. మానసి 

అమ్మాయి నడుము




కళ్ళల్లో ఉంది ప్రేమ పాట సాహిత్యం

 
చిత్రం: కరంట్ తీగ (2014)
సంగీతం: అచ్చు
సాహిత్యం: వరికుప్పల యాదగిరి గౌడ్
గానం: కార్తిక్

కళ్ళల్లో ఉంది ప్రేమ
గుండెల్లో ఉంది ప్రేమ
మాటలే పెదవులు దాటవు
ఎందుకమ్మా బాపు బొమ్మ

సొగసులా రోజా కొమ్మ 
ముల్లులా గుచ్చోద్దమ్మా
మనసుకే గాయం చేసే
మౌనం ఇంకా ఎన్నాళ్ళమ్మా

భూమ్మీదిలా నేనుండాలి
నీ ప్రేమను పొందేందుకే
నా ప్రేణమే చూస్తున్నది
నీ శ్వాసలో కలిసేందుకే
ఊరికే ఊరూరికే చెలియా
నా ప్రేమతో అటాడకే

కళ్ళల్లో ఉంది ప్రేమ
గుండెల్లో ఉంది ప్రేమ
మాటలే పెదవులు దాటవు
ఎందుకమ్మా బాపు బొమ్మ




నేనే కరెంట్ తీగ పాట సాహిత్యం

 
చిత్రం: కరంట్ తీగ (2014)
సంగీతం: అచ్చు
సాహిత్యం: రామ జోగయ్య శాస్త్రి 
గానం: రంజిత్ 

నేనే కరెంట్ తీగ 




పదహారేళ్లైనా పసి పాపై ఉన్న పాట సాహిత్యం

 
చిత్రం: కరంట్ తీగ (2014)
సంగీతం: అచ్చు
సాహిత్యం: అనంత్ శ్రీరాం 
గానం: చిన్మయి 

పదహారేళ్లైనా పసి పాపై ఉన్న
నీ వెచ్చని చూపే తగిలేదాకా
పరువం లో ఉన్న పరవాలేదన్న
నీ కల నా వైపే కదిలే దాకా
అరేయ్ ఏమైందో ఏమైందో సరిగ్గా
ఏమైందో నే మొదట నిన్ను కలిసినక
నాలో ఏం జరిగిందో
హయ్యో హయ్యో ఇది ఏం మాయో
అంటూ అంత మారిందయ్యో
హయ్యో హయ్యో ఇది ఏం మాయో
నన్నే నీల మార్చిందయ్యో

తెలుగు ఏ కాకుండా చాలా బాషల్లోనా
వెతికా ఈ జబ్బుని ఏమంటారో
తెలిపే వాళ్లెవరు లేరే ఈ లోకాన
నువ్వే చెప్పాలది అది నీవల్లే రో
ఎన్నో చేసి చేసి ఎంతో సన్న బడిన
బరువే తగ్గదు ఈ గుండెల్లోనా
హయ్యో హయ్యో ఇది ఏం మాయో
అంటూ అంత మారిందయ్యో
హయ్యో హయ్యో ఇది ఏం మాయో
నన్నే నీల మార్చిందయ్యో

చదువేం అవుతుందని గుబులైన రాదేంటో
నిన్నే చదవాలని ఆరాటంలో
రేపేమవుతుందని దిగులైన రాదేంటో
నిన్నని మరిపించే ఆనందంలో
చుట్టూ ఉన్న వాళ్ళు తిట్టే కన్నా వాళ్ళు
ఎవరు గుర్తు రారు ని తలపుల్లో
హయ్యో హయ్యో ఇది ఏం మాయో
అంటూ అంత మారిందయ్యో
హయ్యో హయ్యో ఇది ఏం మాయో
నన్నే నీల మార్చిందయ్యో




పిల్ల ఓ పిల్ల పాట సాహిత్యం

 
చిత్రం: కరంట్ తీగ (2014)
సంగీతం: అచ్చు
సాహిత్యం: వరికుప్పల యాదగిరి గౌడ్
గానం: కార్తిక్

అదిరెను అదిరెను ఎద సడి అదిరెను
కలిగెను కలిగెను అలజడి కలిగెను
గిరా గిరా తిరిగెడి భూమి నిలిచెను
గల గల కదిలేటి గాలి నిలిచెను
మనసులో తొలకరి మొక్క మొలిచెను
వయసున్న మగసిరి పొద్దు పొడిచెను
నర నర నరములు సల సల మరిగెను
నిన్న లేని నిప్పు లాంటి తుఫాను

గుండెల్లోనా వెయ్యి వేళా పిడుగులు పగిలెను
కోటి కోట్ల మెరుపులా కత్తి దాడి జరిగెను
నా పై నా పై నా పై
కాళీ కింది నెల కూడా
నన్ను వీడి కదిలెను
ప్రాణమంతా పిండుతున్న
తీపి బాధ రగిలెను
ఏమైందో ఏమైందో రెప్ప మూసి తీసేలోగా
ఏమైందో చూసేలోగా
నాలో నేను లేనే లేను
పిల్ల ఓ పిల్ల
నా చూపుల్లోనే మెరిసావే
పిల్ల ఓ పిల్ల
నా ఊపిరి లోన కలిసేవే
పిల్ల ఓ పిల్ల
నా దేవత నువ్వై నిలిచావే
అయ్యో ఓ ఓఓఓ
పాద రసమునే పోత పోసి
నీ మెరుపు దేహమే మలిచారు
పూల పరిమళం ఊపిరి ఊదిన
పైకి నిన్నిలా వదిలారు
అద్భుతాలు అన్ని ఒక చోటే
వెతికి నిన్ను చేరినాయేమో
పోలికలు సోలిపోయే రూపం నిధే
పిల్ల ఓ పిల్ల
నా గుండె తలుపు తట్టావే
పిల్ల ఓ పిల్ల
నా ప్రేమ దారి పట్టవే
పిల్ల ఓ పిల్ల
నా కల్లో దీపం పెట్టావే
అయ్యో ఓ ఓ

హోరు గాలిలో నెమలి కన్నుల
తేలుతోంది మది నీవల్లే
జోరు వానలో ఆడుతున్న
నా అంతరంగం ఒక హరివిల్లే
పసిడి పరువాల పసి పాప
మరువదె నిన్ను కను పాప
జన్మకే జ్ఞాపకం గ చూసా నిన్నే
పిల్ల ఓ పిల్ల
నా లోకం లో అడుగెట్టావే
పిల్ల ఓ పిల్ల
నీ అందం తో పడగొట్టావే
పిల్ల ఓ పిల్ల
నా కోసమే నువ్వు పుట్టవే
అయ్యో ఓ ఓ
పిల్ల ఓ పిల్ల
నీ అందం దెబ్బ తిన్నానే
పిల్ల ఓ పిల్ల
నే తేరుకోలేకున్నానే
పిల్ల ఓ పిల్ల
నీ ప్రేమలో పడుతున్నానే
అయ్యో ఓ ఓ ఓ




పొతే పోనీ పోరా పాట సాహిత్యం

 
చిత్రం: కరంట్ తీగ (2014)
సంగీతం: అచ్చు
సాహిత్యం: వరికుప్పల యాదగిరి గౌడ్
గానం: మంచు మనోజ్ 

పొతే పోనీ పోరా




ఓ యెర్ర యెర్ర చీర పాట సాహిత్యం

 
చిత్రం: కరంట్ తీగ (2014)
సంగీతం: అచ్చు
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: జస్సి గిఫ్ట్ ,కమలజ 

ఓ యెర్ర యెర్ర చీర ఓ రెండే రెండు జల్లు
ఓ తెల్ల మల్లె పూలు
ఓ గుండె కోసి చూడు సిలకా
ఓ బొమ్మ వేసి వుందే రామశిలకా సిలకా
ఓ గుండె కోసి చూడు సిలకా
నీ బొమ్మ వేసి వుందే రామ సిలకా సిలకా
పచ్చ పూల చొక్కా సన్న గళ్ళ లుంగీ
నల్ల కళ్ళజోడు కిర్రు కిర్రు చెప్పు
సొట్ట బుగ్గల సచ్చినోడా
నా ఏంటా ఏంటా పడమాకు ఆడ ఈడ

ఇట్టాగే నిను చుసిన సంధి
నా మనసు న మాటినకుందే
చీరలిస్త రైకళిస్తా లైఫ్ లాంగ్ ముద్దులిస్తా
ఒక్కసారి ఎస్ చెప్పవే
బాగుందయ్యో నీ జబ్బర్దస్థ్య్
నా కొద్దు నీ కిరి కిరి దోస్తీ
ఎలిసేస్తే కాలికేసి కాలికేస్తే ఎలికేసి లొల్లి లొల్లి చేయమాకురా
కీలు గుర్రం ఎక్కినట్టుగా
లోకమంతా చుట్టినట్టుగా అవుతున్నదే
ఏందే ఇది పిచ్చి నాకు ఎక్కినాథే నీది
తాటి ముంజులాంటి పిల్ల నువ్వు
తిప్పుకుంటూ వెళ్ళిపోతే ఏళ్ళ ఇళ్ల
తాటి ముంజులాంటి పిల్ల
నువ్వు తిప్పుకుంటూ వెళ్ళిపోతే ఏళ్ళ ఇళ్ల

ఏ మూన్నాళ్ళ కేరళ కుట్టి మోసేస్తివే గుండెను పట్టి
రాణిలాగా చూసుకుంటా రాజ్యమంతా ఇచ్చుకుంటా
బెట్టు చేసి నన్ను సంపకే
నా ఎనకాల చాల మంది
పడ్డారులే దందేముంది
ఆడపిల్లను చుడగ్గానే కోడిపిల్ల దొరికినట్టు పండగేదో చేసుకుంటారే
ఓ చిచ్చుబుడ్డి పేలినట్టుగా రెక్కలొచ్చి
ఎగిరినట్టుగా వుందే పిల్ల
కాంగోత్తగా కొంగుకేసి కట్టుకోవే గట్టిగా
చీప్ కన్నులున్న పిల్ల నువ్వు చేపలాగా జారిపోతే ఏళ్ళ ఇళ్ల


Palli Balakrishna
Nenu Meeku Telusa..? (2008)


చిత్రం:  నేను మీకు తెలుసా (2008)
సంగీతం: అచ్చు
సాహిత్యం: సిరివెన్నెల
గానం: శ్రీరామ్ పార్థసారధి
నటీనటులు: మనోజ్ మంచు, రియసేన్
దర్శకత్వం: అజయ్ శాస్త్రి
నిర్మాత: లక్ష్మీ మంచు
విడుదల తేది: 08.10.2008

ఏమయిందొ గాని చూస్తు చూస్తు
చేజారి వెళ్ళిపోతోంది మనసెలా
ఏం మాయ వల వేస్తు వేస్తు
ఏ దారి లాగుతూ ఉందొ తననలా

అదుపులో ఉండదే చెలరేగె చిలిపితనం

అటు ఇటూ చూడదే గాలిలొ తేలి పోవడం
అనుమతి కోరదే పడి లేచె పెంకితనం
అడిగినా చెప్పదే ఎమిటో అంత అవసరం
ఎం చెయ్యడం మితిమీరే ఆరాటం
తరుముతూ వుంది ఎందుకిలా హ

ఏమయిందొ గాని చూస్తు చూస్తు
చేజారి వెళ్ళిపోతోంది మనసెలా

తప్పో ఏమో అంటుంది తప్పదు ఏమో అంటుంది
తడబాటు తేలని నడక
కోరే తీరం ముందుంది చేరాలంటె చేరాలి కద
బెదురుతు నిలబదక

సంకెళ్ళుగా సందేహం బిగిసాక
ప్రయాణం కదలదు గనక
అల లాలాగ మదినుయ్యాల ఊపే భావం
ఏమిటో పోల్చుకో త్వరగా

లోలో ఏదో నిప్పుంది దాంతో ఏదో ఇబ్బంది
పడతావటె తొలి వయసా
ఇన్నాళ్లుగ చెప్పంది నీతొ ఏదో చెప్పింది కద
అది తెలియద మనసా
చన్నీళ్లతో చల్లారను కాస్తైన సంద్రంలో రగిలెనె జ్వాల
చినుకంత ముద్దు తనకందిస్తే చాలు అంతే
అందిగా అంతేగా తెలుసా

ఏం మాయ వల వేస్తు వేస్తు
ఏ దారి లాగుతూ ఉందొ తననలా

అదుపులో ఉండదే చెలరేగె చిలిపితనం
అటు ఇటూ చూడదే గాలిలొ తేలి పోవడం
అనుమతి కోరదే పడి లేచె పెంకితనం
అడిగినా చెప్పదే ఎమిటో అంత అవసరం

ఏమయిందొ గాని చూస్తు చూస్తు
చేజారి వెళ్ళిపోతోంది మనసెలా

Palli Balakrishna Saturday, August 19, 2017
Om 3D (2013)



చిత్రం: ఓం 3D (2013)
సంగీతం: అచ్చు రాజమణి, సాయి కార్తీక్
నటీనటులు: కళ్యాణ్ రామ్ , కృతి కర్బందా, నికీషా పటేల్
దర్శకత్వం: సునీల్ రెడ్డి
నిర్మాత: కళ్యాణ్ రామ్
విడుదల తేది: 19.07.2013



చిత్రం: ఓం 3D (2013)
సంగీతం: అచ్చు రాజమణి
సాహిత్యం: బాలాజీ
గానం: హరిహరన్ , చిన్మయి

నన్ను నేనే చూస్తున్నాను ఉన్న చోటే ఉన్నా నేను
ఎందుకో మరి ఏమవుతుందో తెలియని పరవశం  ఓ
నిన్న దాకా నువ్వే లోకం నేటి నుంచి నాకిక ప్రాణం
ఒకరికొకరని తెలిసిన సమయం యుగమిపుడొక క్షణం
నీ చూపు తగిలి నా మనసు పరుగు తీసిందిలే
నా మాట వినదు కుదురేలేదు కూర్చోదిలా
నీడే నువ్వందిలే

ఎందుకిలా ఎందుకిలా ఏ మాయో తరుముతోంది
నిన్నైనా లేదుకదా హో తేలిపోతువుందిలే మనసు

అలికిడైతే ఉలికిపడుతూ అడుగుతోంది శ్వాశ నిన్నే
కళ్ళు మూసి నన్ను కలలోనే చూసుకో
నూరేళ్లనే ఈ రోజని గడిపేసినట్టుంది హాయి
చూడాలని చేరాలని నీ యెదుట ఉంచాను నన్నే

ఎందుకిలా ఎందుకిలా ఏకాంతమే లేదు నాకు
నిన్నైనా లేదుకదా హో తేలిపోతువుందిలే మనసు

మొదటిసారి మనసుతోనే నడిచినట్టు ఉందివ్వాళ
గుండెదారి తెరిచివుంచాను చేరుకో
కలిశావని కలకాదని పులకించిపోయాను నేనే
కను మూసినా ఎటుచూసినా ఉన్నాను నీ తోని నేనే
ఇన్నాళ్లు నేను ఉన్నట్టు లేను తొలిప్రేమలో పడ్డాను ఏమో
మతిచెడి తడబడుతూ ఉందిలా నా ఊహలో తీయగా

ఎందుకనే ఉంది ఇలా నా సొంతమే నువ్వయ్యాక
నిన్నటిలా లేవుకదా నువు నా లోకమే నువ్వు చేరాక


Palli Balakrishna Wednesday, August 9, 2017
Kurradu (2009)


చిత్రం: కుర్రాడు (2009)
సంగీతం: అచ్చు
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: కార్తీక్
నటీనటులు: వరుణ్ సందేశ్, నేహా శర్మ
దర్శకత్వం: సందీప్ గుణ్ణం
నిర్మాత: పి.కిరణ్
విడుదల తేది: 12.11.2009

పల్లవి :
ఏమంటావే ఈ మౌనం మాటై వస్తే
ఏమౌతావే ఆ మాటేప్రేమైతే
ఔనంటావే నాలానే నీకూ ఉంటే
తడౌతావే నీలోనే నేనుంటే
నీ చూపే నవ్వింది నా నవ్వే చూసింది
ఈ నవ్వూ చూపు కలిసే వేళ ఇదే
ఏమంటావే ఈ మౌనం మాటై వస్తే
ఏమౌతావే ఆ మాటే ప్రేమైతే
ఔనంటావే నాలానే నీకూ ఉంటే
తడౌతావే నీలోనే నేనుంటే

చరణం: 1
సంతోషం ఉన్నా సందేహంలోనా లోనా
ఉంటావే ఎన్నాళ్ళైనా ఎవ్వరివమ్మా
అంతా మాయేనా సొంతం కాలేనా లేనా
అంటుందే ఏ రోజైనా నీ జత కోరే జన్మ
యవ్వనమా జమున వనమా
ఓ జాలే లేదా జంటై రావే ప్రేమా
ఏమంటావే ఈ మౌనం మాటై వస్తే
ఏమౌతావే ఆ మాటే ప్రేమైతే
ఔనంటావే నాలానే నీకూ ఉంటే
తడౌతావే నీలోనే నేనుంటే

చరణం: 2
అందాలనుకున్నా నీకే ప్రతిచోట చోట
బంధించే కౌగిలిలోనే కాదనకమ్మా
చెందాలనుకున్నా నీకే ప్రతిపూట పూట
వందేళ్ళు నాతో ఉంటే వాడదు ఆశలకొమ్మ
అమృతమాఅమిత హితమా
హో అంతా నీ చేతుల్లో ఉందే ప్రేమా
ఏమంటావే ఈ మౌనం మాటై వస్తే
ఏమౌతావే ఆ మాటే ప్రేమైతే
ఔనంటావే నాలానే నీకూ ఉంటే
తడౌతావే నీలోనే నేనుంటే
నీ చూపే నవ్వింది నా నవ్వే చూసింది
ఈ నవ్వూ చూపు కలిసే వేళ ఇదే



Palli Balakrishna Monday, July 31, 2017
Luckkunnodu (2017)


చిత్రం: లక్కున్నోడు (2017)
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, అచ్చు రాజమని
సాహిత్యం: జి. గీతా పోనిక్, శ్రీజో
గానం: అద్నాన్ సామీ, ప్రవీణ్ లక్కరాజు
నటీనటులు: మంచు విష్ణు, హన్షిక మొత్వాని
దర్శకత్వం: రాజ్ కిరణ్
నిర్మాత: యమ్.వి.వి.సత్యన్నారాయణ
విడుదల తేది: 26.01.2017

ఆ ఊరు వాడ మోగిపోయే నవ్వక మొకరా
ఒక్కరైన ఊరుకోరే ఇదేమి జాతర
మొక్కుకున్నా నే మొక్కుకున్నా
రాత మాత్రం మారుతుందా
టేస్ట్ నీకే టేస్ట్ పెగ్గు టేస్ట్ పాస్
మార్కులిచ్చే లైఫ్ లాగాలా
షి వాట్ ద ఎఫ్ రా

ఆ లక్ దేవతొచ్చి నిదర లేపుతుండగా
కర్మకాలి కళ్ళు కోమాలోకి జారేగా
నిచ్చెనెక్కుతుంటే పాము పక్కనుండేలా
నా దిమ్మ దిరిగే ట్విస్ట్ లేంటిలా
మా నాన్న తిట్లకానకట్ట వెయ్యలేనుగా
గింజుకుంటే చేతకాదు మారిపోముగా
ఆవగింజ సైజులో అదృష్టముండగా
అంబాని అల్లుడవ్వడం ఎలా హ
పేరుకేమో లక్కు ఉంది
కాని నాకే దక్కనంది
అందినట్టే చేతికంది అందకుండ
జారిపోయే లైఫ్ లాగాలా

షి వాట్ ద ఎఫ్ రా

నాకు పెద్ద కోరికంటు లేదుదేవుడా
మంచి లక్ నీడలాగ వెంటపెట్టరా
తెల్లవారే లోపు కింగ్ నయ్యేటట్టుగా
తదాస్తు అనక తూలిపోకురా
చెవిలో చెప్పే జ్యోష్యామంత జోకు కాదురా
రాహు కేతు తోటి నాకు సెల్ఫీలేంటిరా
చిటికేలోనే లైఫ్ లైన్ చక్కబెట్టావా
నువ్వు తలచుకుంటే దేనికే కదా
నీకు నాపై జాలి లేదా
వేరే రూటే మార్చరాదా
లక్కునంత దాచిపెట్టి కచ్చితంగ
తాట తీసే లైఫ్ లాగాలా

షి వాట్ ద ఎఫ్ రా




**********   *********  **********



చిత్రం: లక్కున్నోడు (2017)
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, అచ్చు రాజమని
సాహిత్యం: జి. గీతా పోనిక్, శ్రీజో

ఆఁ ఐసలగావ్ ఐసలగావ్
దిల్పే లగావ్ జోర్సే లగావ్
బాబు సెగ తాకెనుగా
గుండెలపై దుంపతెగ
మిల్కీ స్కిన్ టోన్ పాప
మత్తెక్కించే షేప్ బాగా
రచ్చ రచ్చ లేపెనుగా
లాగుతుంటే లిప్పు తెగా
ఓయ్ ముందెనక చూడానిక
మిస్సు రెడీగున్నదిగా
బండినెక్కి స్పీడ్ పెంచి
దూసుకేల్తా డడ్డర డడ్డర డా

పప్ప పపర పపర పప (6)

నానా రకాలుగా నడుం తిప్పేశానంటే
గుండె ఒక్కోసారి బీటే మిస్సై పోతుందే
నిన్నే ఎలాగోలా నెగ్గాలంటే ఇట్టాగే
ఎగబడి కన్నేగీటి గిర్రా గిర్రా చుట్టాలే
కుదురే లేదనక పసిడి పాలపిట్ట
పదపద మంటూ ఇట్టా ముస్తాబయ్యిందే
అదిరే కోడి పెట్టా ముసుగే తీసేనటా
ఇప్పుడిక తాడో పేడో తేలేదేట్టాగే

పప్ప పపర పపర పప (6)

హే యారో యు మై హీరో
దిల్ సే జట్కా మారో
ఈ ప్యారి నీదే లేరో
రెచ్చే రేపే సైగల్ కరో
చూపే తుపాకిలో తూటా లాగ పేలిందే
నాలో అడో ఇడో సుర్రంటున్నా బాగుందే
హే పేలే పటాసుకి పైటే వేసినట్టుందే
పదమరి సరా సరా నిప్పే పుట్టించేద్దామే
దుడుకు దూకుడుకి దొరికేనే చిలికి
సరసర సిగ్గు ఎగ్గూ శివాలెత్తాయే
అసలే పూల బుట్టా అందుకే ముద్దులెట్టా
ఇకమరి అడ్డే తీసి ఆదాగించాలే

పప్ప పపర పపర పప (8)

Palli Balakrishna Wednesday, July 26, 2017

Most Recent

Default