Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Urvasivo Rakshasivo (2022)
చిత్రం: ఊర్వశివో రాక్షసివో (2022)
సంగీతం: అచ్చు రాజమణి 
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: అనూప్ రూబెన్స్
నటీనటులు: అల్లు శిరీష్, అను ఇమాన్యుయెల్ 
దర్శకత్వం: రాకేష్ శశి 
నిర్మాత: బన్నీ వాసు 
విడుదల తేది: 04.11.2022Songs List:ధీంతనన ధీంతనన పాట సాహిత్యం

 
చిత్రం: ఊర్వశివో రాక్షసివో (2022)
సంగీతం: అచ్చు రాజమణి 
సాహిత్యం: పూర్ణాచారి 
గానం: సిద్ శ్రీరాం 

అనగా అనగనగ కనులే కలగనగా
నిజమయ్యే మెరుపల్లే వాలెగా
నా ఊపిరి నడక తన ఊపిరి జతగ
కలగలిసి మొదలయ్యే నాలో అలజడిగా

అరెరే అరెరె మనసే అదిరే
నీవల్ల నాలోన ఈ అల్లరే
ఎవరే ఎవరే కుదురే చెదిరే
తొలిసారి తనువంత ఓ జాతరే

ఆరాటము మెహమాటము
జతగా కలిగే నాకెందుకో
అలవాటులో పొరపాటుగా
నను నేను దాస్తున్నానెందుకో..!

ధీంతనన ధీంతనన నీచూపుల దాడి
చేసిందే చేసిందే ఈ గారడి
ధీంతనన ధీంతనన
నన్నే నే వీడి నీతో కలిసే (2)

నీ అడుగుల వెంట నే గురుతై ఉంటా
నీ పాదమే దాటు ప్రతి చోటున
నీ పెదవులు తాకే నా పేరును వింట
ఓ స్పర్శకే పొంగి పోతానట

కాలం కలిపింది ఈ జోడి బాగుందని
ప్రాణం అడిగింది నీతోడు సాగాలని
దూరం దూరం అయ్యే దారే చూపిస్తుంది
ఒకటవ్వనే, ఓ ఓ ఓ ఓ

ధీంతనన ధీంతనన నీచూపుల దాడి
చేసిందే చేసిందే ఈ గారడి
ధీంతనన ధీంతనన
నన్నే నే వీడి నీతో కలిసే

ఆకాశం తానే చినుకల్లే మారి
అక్షింతలై పైన రాలాయిగా
ఆ ఉరుముల శబ్దం మనసున నిశ్శబ్దం
మోగాయిలే మేళతాళాలుగా

రాయబారాలు పంపాను నా భాషలో
రాయలేనన్ని భావాలు నా ఊహలో
మౌనం మౌనం వీడి మాటే నేర్పిస్తుంది
ఈ ప్రేమలో, ఓ ఓ ఓ ఓ

ధీంతనన ధీంతనన నీచూపుల దాడి
చేసిందే చేసిందే ఈ గారడి
ధీంతనన ధీంతనన
నన్నే నే వీడి నీతో కలిసే
మాయారే ఈ అమ్మయిలంతా పాట సాహిత్యం

 
చిత్రం: ఊర్వశివో రాక్షసివో (2022)
సంగీతం: అచ్చు రాజమణి 
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: రాహుల్ సిప్లిగంజ్

పోరిల ఎంట పోకు ఫ్రెండు
ఆడుకుంటరు నిన్నో రౌండు
ఎందుకలా వై వై ఎందూకలా

పడిపోకురా ఇస్తే స్మైలు
బతుకైతది గూడ్స్ రైలు
ఎందుకలా వై వై ఎందూకలా

చేసేదంతా చేసేసి
జారుకుంటదమ్మాయి
దిక్కు మొక్కు ఏం లేక
బారుకాడ అబ్బాయి

మాయారే ఈ అమ్మాయిలంతా మాయారే
గాయలే ఈళ్ళతోటి పెట్టుకుంటే గాయలే
మాయారే ఈ అమ్మయిలంతా మాయారే

మాయ మాయ మాయ మాయ
జిందగీ గయా గయా
మాయ మాయ మాయ మాయ
బతుకే గయా గయా

ఏ ఆకలుండదు నిద్దరుండదు
వీళ్ళ వల్ల మైండే దొబ్బి లైఫే ఉండదు
ఫ్రెండు అంటరు లవ్వు అంటరు
డైలీ వాట్సాప్ స్టాటస్ లాగ మారిపోతారు

మంటల కలిసి పోయేది మనం
మనల్నే తిడతారు ఎర్రి జనం
పబ్జీ లాగ ఆడేస్తు బుజ్జికన్న అంటారు
బ్రిడ్జిలాగా మనముంటే రైలే ఎక్కి పోతారు

మాయారే ఈ అమ్మయిలంతా మాయారే
గాయలే ఈళ్ళతోటి పెట్టుకుంటే గాయలే
మాయారే ఈ అమ్మయిలంతా మాయారే

మాయ మాయ మాయ మాయ
జిందగీ గయా గయా
మాయ మాయ మాయ మాయ
బతుకే గయా గయా

పోరిల ఎంట పోకు ఫ్రెండు
ఆడుకుంటరు నిన్నో రౌండు
ఎందుకలా వై వై ఎందూకలా

పడిపోకురా ఇస్తే స్మైలు
బతుకైతది గూడ్స్ రైలు
ఎందుకలా వై వై ఎందూకలా
ఎందూకలా ఎందూకలా ఎందూకలా

వద్దుర పోరిల జోలికి
పోరి దూల తీర్చి పోతది
ఫుల్ టార్చరు పెడ్తది మెంటల్లీ
ఇగ రాడ్డేరా జిందగి టోటల్లీ

వీళ్ళ ఫోన్లు బ్లాకైపోను
వీళ్ళ అకౌంట్లు హ్యాకైపోను
షాపింగ్ మాల్లు లాకైపోను
పబ్బుల్లో పోరిల్ని చెయ్యాలి బ్యాను
మేకప్ కిట్లు కాకెత్క పోను
బ్యూటీ పార్లర్లు బందైపోను

కురాళ్ళ ఉసురు వీళ్లకి తగిలి
ఉన్న జుట్టు ఊడిపోను
అమ్మాయిలందరు వచ్చే జన్మల
అబ్బాయిలుగ మారిపోను మారిపోను
పోను పోను పోను పోనుకలిసుంటే నువ్వు నేనిలా పాట సాహిత్యం

 
చిత్రం: ఊర్వశివో రాక్షసివో (2022)
సంగీతం: అచ్చు రాజమణి 
సాహిత్యం: కృష్ణకాంత్
గానం: అర్మాన్ మాలిక్ 

కలిసుంటే నువ్వు నేనిలా
కలలాగే ఉంది నమ్మవా
ఎప్పటికి నా మనసే ఇక నీకే

ఓ ఓ ప్రతి రోజు కొత్త జన్మలా
అల్లావే అన్ని వైపులా
నిను చూసే ప్రతిసారి పడతానే

ఓ ఓ చెలివే చెలివే
సరిపోదే గుప్పెడు గుండె
చెలివే చెలివే
మరు హృదయం అప్పడిగానే

నను తాకే ఊపిరి
ఓ ఓఓ అలవాటే అయినది
నదిలో అలలా కలిసేపోనీ

స స సస స ని ని స
కవిత్వాలు నేర్పే సొగసా
సస స సస ని ని స ని ని స
మాటే మూగబోయెను తెలుసా

స సస ని ని స
కొంచెం తెలుగునడిగే చూసా
సస స సస ని ని స ని ని స
సరిపోదులే పొగడగా ఓ భాష

వెతికే నన్నే నన్నే కదిలే అద్ధంలోనే
సగమే సగమే దొరికావ్ మసకుంది ఇన్నాల్లే
బతికే ఇన్నాళ్లు నే కరిగే ఊహల్లోనే
మరిచా మరిచా గతమే వెలుగొచ్చే నీవల్లే

ఓ ఓ సొంతం అని అనుకుంటూనే
పంతానికి పోతుంటావే
కొంచెం కొంచెం చనువే పెంచి
నువ్వుండి పోవే

సంతోషమే ఇకపై నాదే
సందేహమే నాకిక లేదే
సమానమై పోదాం రావే
నువ్వుండి పోవే

స స సస స ని ని స
కవిత్వాలు నేర్పే సొగసా
సస స సస ని ని స ని ని స
మాటే మూగబోయెను తెలుసా

స సస ని ని స
కొంచెం తెలుగునడిగే చూసా
సస స సస ని ని స ని ని స
సరిపోదులే పొగడగా ఓ భాష

సీతాకోక చిలుక పాట సాహిత్యం

 
చిత్రం: ఊర్వశివో రాక్షసివో (2022)
సంగీతం: అచ్చు రాజమణి 
సాహిత్యం: శ్రీమణి 
గానం: శ్రీకృష్ణ 

సీతాకోక చిలుక 

No comments

Most Recent

Default