Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Pranitha Subhash"
Dynamite (2015)


చిత్రం: డైనమైట్ (2015)
సంగీతం: అచ్చు రాజమణి
నటీనటులు: విష్ణు మంచు, ప్రణిత సుభాస్, జె.డి.చక్రవర్తి
దర్శకత్వం: విష్ణు మంచు, విజయన్ మాస్టర్
నిర్మాత: మంచు విష్ణు
విడుదల తేది: 04.09.2015


Palli Balakrishna Tuesday, February 19, 2019
Chuttalabbai (2016)

చిత్రం: చుట్టాలబ్బాయి (2016)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: రామజోగయ్య శాస్త్రి , శ్రీకృష్ణ , గీతామధురి
నటీనటులు: ఆది, నమితా ప్రమోద్, ప్రణీత
దర్శకత్వం: వీరభద్రం చౌదరి
నిర్మాతలు: తళ్లూరి రాము, తలారి వెంకట్
విడుదల తేది: 19.08.2016

పల్లవి:
పిపిపి డుండుం డోలు సన్నాయి
మోగేందుకు సిద్దంగున్నాయి
పెళ్లింట్లో ఏర్పాట్లన్నీ పూర్తయ్యి
లగ్గం కానిద్దామన్నాయి
పట్టుచీరలన్ని ముస్తాబైపోయాయి
అందాల కనువిందుగ
పంచికట్టు లాల్చీ ప్యాంటు షర్టులన్నీ
జిగేలుమన్నాయి ఉల్లాసంగా
పందిళ్లు తోరణాలు వేసివున్నాయి
అక్షింతలు దీవెనలు ఆ గట్టిమేళం
ఎప్పుడంటు గోల పెట్టెస్తున్నాయి

చూడవోయి చుట్టాలబ్బాయి
మా పెళ్లింటికి పెద్దవి నువ్వోయి
మంచికి నీదెపుడు పైచేయి
చిలకల జంటకు కళ్యాణం చేద్దాం రావోయి

పిపిపి డుండుం డోలు సన్నాయి
మోగేందుకు సిద్దంగున్నాయి
పెళ్లింట్లో ఏర్పాట్లన్నీ పూర్తయ్యి
లగ్గం కానిద్దామన్నాయి

చరణం: 1
కుందనాల బొమ్మండి
చందనాల కొమ్మండి
భూమ్మిద సీతమ్మె మా సుందరి
అంత మంచి రత్నాన్ని
ఎంచుకుంది ఎవరండి
మాయింటి రామయ్యే కాడా మరి
అందానికే అందం చెలి
అబ్బా మీ పెళ్లికొడుకు పంట పండింది
అదృష్టమంటే మీ పిల్లదేనండి
అందుచేత మా కుర్రాడి కంట పడింది
మాటల్లో పొద్దుపోతే లాభమేముంది
జీరాబెల్లాలు పెట్టి తాళిబొట్టు
కట్టకుంటే మూర్తమెల్లిపోతుంది

చూడవోయి చుట్టాలబ్బాయి
మా పెళ్లింటికి పెద్దవి నువ్వోయి
మంచికి నీదెపుడు పైచేయి
చిలకల జంటకు కళ్యాణం చేద్దాం రావోయి

చరణం: 2
అడ్డుగోడై తెరసెల్లా
ఆడుకుంటోందేంటిళ్ల
పిల్లాడి ఆత్రాన్ని ఆపేంతలా
సిగ్గుబరువై నిలువెళ్ల
తలవంచుకుందే పూబాల
అందాల వెన్నెల్ని దాచేంతల
ఇన్నాళ్లుగా వేచారుగా
ఇందాక వచ్చికూడా ఇన్నికష్టాల
కన్నెర్రగా కందేంతగా
దోబూచులాటలో అల్లాడిపోవాలా
బుగ్గల్లో చుక్కలు రెండు తొందరన్నాయి
మాంగల్యం తంతునా వియ్యాలు కలిపే
అయ్యవారి మంత్రమేగ తరువాయి

చూడవోయి చుట్టాలబ్బాయి
మా పెళ్లింటికి పెద్దవి నువ్వోయి
మంచికి నీదెపుడు పైచేయి
చిలకల జంటకు కళ్యాణం చేద్దాం రావోయి


Palli Balakrishna Wednesday, November 8, 2017
Pandavulu Pandavulu Tummeda (2014)


చిత్రం: పాండవులు పాండవులు తుమ్మెద (2014)
సంగీతం: అచ్చు రాజమని, బప్పా. బి.లహరి
సాహిత్యం: చంద్రబోస్
గానం: ఉదిత్ నారాయణ్
నటీనటులు: మోహన్ బాబు, విష్ణు, మనోజ్, వరుణ్ సందేశ్, తనీష్ , వెన్నెల కిషోర్, హన్సిక, ప్రణీత, రవీనా టండన్
దర్శకత్వం: శ్రీవాస్
నిర్మాత: మంచు విష్ణు, మంచు మనోజ్
విడుదల తేది: 31.01.2014

అచ్చ తెలుగంటి  పెదవుల్ని వెలుగంటి బుగ్గలని
దగ్గరగా చూశాను నేనే
పచ్చి పసుపంటి పాదాల్ని పాలంటి గుండెల్ని
పిచ్చెక్కి చూశాను నేనే
చూశా నేనే చూశా నేనే అందం మొత్తం చూసేశానే
రాశా నేనే రాశా నేనే హృదయం నీకే రాసిచ్చానే

చరణం: 1
ఓ నా కళ్ళలో మెరుపొచ్చేలా నీ కళ్ళు చూశాను నేనే
నా వెన్నులో ఉడుకొచ్చేలా నీ వెన్ను చూశాను నేనే
నీ ఒంపులో ఆపేశావే కాలాన్నే
నీలో సంద్రాల లోతుల్ని శిఖరాల ఎత్తుల్ని
నిఖరంగా చూశాను నేనే
పిల్లా నీ పీఠభూముల్ని  నునులేత కనులన్నీ
నిశ్చంగా  చూశాను నేనే

చూశా నేనే చూశా నేనే అందం మొత్తం చూసేశానే
రాశా నేనే రాశా నేనే హృదయం నీకే రాసిచ్చానే

చరణం: 2
ఆ ఊబిలో  దిగిపోయేలా నీ నాభి చూశాను నేనే
ఆ మడతలో మునకేసేలా  నీ నడుమే చూశాను నేనే
నీ రూపుతో పిండేసావే ప్రాణాన్నే
అబ్బో  ఆ సూర్య చంద్రుల్ని చూల్లేని  చోటుల్ని
అడ్డంగా  చూశాను నేనే
అమ్మో నువ్వైన నీలోన చూల్లేని  సోకుల్ని
అద్దంలా చూశాను నేనే

చూశా నేనే  చూశా నేనే   అందం మొత్తం చూసేశానే
రాశా నేనే రాశా నేనే హృదయం నీకే రాసిచ్చానే

అచ్చ తెలుగంటి  పెదవుల్ని వెలుగంటి బుగ్గలని దగ్గరగా చూశాను నేనే
పచ్చి పసుపంటి పాదాల్ని పాలంటి గుండెల్ని  పిచ్చెక్కి చూశాను నేనే

చూశా నేనే చూశా నేనే అందం మొత్తం చూసేశానే
రాశా నేనే రాశా నేనే హృదయం నీకే రాసిచ్చానే
చూశా నేనే చూశా నేనే అందం మొత్తం చూసేశానే
రాశా నేనే రాశా నేనే హృదయం నీకే రాసిచ్చానే

Palli Balakrishna Sunday, October 1, 2017
Em Pillo Em Pillado (2010)

చిత్రం: ఎం పిల్లో ఎం పిల్లడో (2010)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాష శ్రీ
గానం: రంజిత్
నటీనటులు: తనీష్ , ప్రణీత
దర్శకత్వం: ఎ. యస్.రవికుమార్ చౌదరి
నిర్మాత: పోకూరి బాబూరావు
విడుదల తేది: 16.07.2010

తెలిసిందే ఈ క్షణం .. నువు నాలో ఓ సగం
నువు లేనీ ఈ సగం .. బ్రతికున్నా ఏం సుఖం

ఎడబాటు గాయమే దాచీ .. నీ నవ్వులలో
సెలవంటు ఆశగా చూస్తే .. నా కన్నులలో

నా మనసు నిలవదూ .. పోవే నన్ను చూడకూ
నా ముందు కదులుతూ .. ప్రేమా నన్ను చంపకూ
ఓ తీపి గురుతులా .. నువ్వే నన్ను దాచుకో
నీ కంటిపాపలా .. ఉంటా జన్మజన్మకూ

తెలిసిందే ఈ క్షణం .. నువు నాలో ఓ సగం
నువు లేనీ ఈ సగం .. బ్రతికున్నా ఏం సుఖం

కన్నీటీ వానల్లో .. పన్నీటి స్నానాలే
గోరింటా పూతల్లో .. మా ప్రేమే వాడేలే
నా రాణి పాదంలో పారాణి పూస్తున్నా
ఈ పూల హారాలే గుండెల్ని కోస్తున్నా

ఓ తీపి గురుతులా .. నువ్వే నన్ను దాచుకో
నీ కంటిపాపలా .. ఉంటా జన్మజన్మకూ

తెలిసిందే ఈ క్షణం .. నువు నాలో ఓ సగం
నువు లేనీ ఈ సగం .. బ్రతికున్నా ఏం సుఖం

మా లోనీ ఓ ప్రేమా .. మా మాటే వింటావా
పంతాలా పందిట్లో .. ప్రేమల్లే పూస్తావా
కాలాన్నే ఆపేసీ మౌనన్ని తుంచాలే
కాదంటే మా నుండీ నీ వైనా పోవాలే


ఓ తీపి గురుతులా .. నువ్వే మాకు మిగలకూ
నీ పెద్దమనసుతో .. కలిపెయ్ జన్మజన్మకూ


తెలిసిందే ఈ క్షణం .. నువు నాలో ఓ సగం
నువు లేనీ ఈ సగం .. బ్రతికున్నా ఏం సుఖం


ఎడబాటు గాయమే దాచీ .. నీ నవ్వులలో
సెలవంటు ఆశగా చూస్తే .. నా కన్నులలో

నా మనసు నిలవదూ .. పోవే నన్ను చూడకూ
నా ముందు కదులుతూ .. ప్రేమా నన్ను చంపకూ
ఓ తీపి గురుతులా .. నువ్వే నన్ను దాచుకో
నీ కంటిపాపలా .. ఉంటా జన్మజన్మకూ

Palli Balakrishna Wednesday, September 27, 2017
Brahmotsavam (2016)




చిత్రం: బ్రహ్మోత్సవం (2016)
సంగీతం: మిక్కీ జే. మేయర్ 
నటీనటులు: మహేష్ బాబు, సమంత, కాజల్ అగర్వాల్, ప్రణీత
దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల
నిర్మాతలు: ప్రసాద్ వి. పొట్లూరి, మహేష్ బాబు
విడుదల తేది: 20.05.2016



Songs List:



వచ్చింది కదా అవకాశం పాట సాహిత్యం

 
చిత్రం: బ్రహ్మోత్సవం (2016)
సంగీతం:  స్టీఫెన్ దేవాస్సి (రి రికార్డింగ్ : మిక్కీ జే. మేయర్)
సాహిత్యం: సిరివెన్నెల
గానం: అభయ్ జోద్పుర్కర్

వచ్చింది కదా అవకాశం 



మధురం మధురం పాట సాహిత్యం

 
చిత్రం: బ్రహ్మోత్సవం (2016)
సంగీతం:  స్టీఫెన్ దేవాస్సి (రి రికార్డింగ్ : మిక్కీ జే. మేయర్)
సాహిత్యం: ట్రెడిషనల్
గానం: పద్మ , శ్రీదేవి

అధరం మధురం వదనం మధురం
నయనం మధురం హసితం మధురం
హృదయం మధురం గమనం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్
మధురం మధురం మధురం మధురం

అధరం మధురం వదనం మధురం
నయనం మధురం హసితం మధురమ్
హృదయం మధురం గమనం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్
మధురం మధురం మధురం మధురం

వచనం మధురం చరితం మధురం
వసనం మధురం వలితం మధురమ్
చలితం మధురం భ్రమితం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్
మధురం మధురం అఖిలం మధురమ్
మధురం మధురం అఖిలం మధురమ్



బ్రహ్మోత్సవం పాట సాహిత్యం

 
చిత్రం: బ్రహ్మోత్సవం (2016)
సంగీతం:  స్టీఫెన్ దేవాస్సి (రి రికార్డింగ్ : మిక్కీ జే. మేయర్)
సాహిత్యం: సిరివెన్నెల
గానం: శ్రీరాంచంద్ర మన్యంపాటి

బ్రహ్మోత్సవం 




ఆట పాటలాడు పాట సాహిత్యం

 
చిత్రం: బ్రహ్మోత్సవం (2016)
సంగీతం:  స్టీఫెన్ దేవాస్సి (రి రికార్డింగ్ : మిక్కీ జే. మేయర్)
సాహిత్యం: శ్రీకాంత్ అడ్డాల
గానం: కార్తీక్

ఆట పాటలాడు



నాయుడోళ్ళింటికాడ పాట సాహిత్యం

 
చిత్రం: బ్రహ్మోత్సవం (2016)
సంగీతం: మిక్కీ జే. మేయర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రమ్యా బెహ్రా , అంజనా సౌమ్య

నాయుడోళ్ళింటికాడ నల్లతుమ్మ చెట్టు కాడ
నాయుడెమన్నడె పిల్లా...
అబ్బ ఎంత వింతగున్నావే పిల్లా..
నాయుడోళ్ళింటికాడ నల్లతుమ్మ చెట్టు కాడ
నాలుగు కోళ్ళు ఇచ్చాడే నాయుడు
అబ్బ గుండె జల్లుమన్నాదే పిన్నీ...
కరణం గారి ఇంటీ కాడ
కారుమునగ చెట్టు కాడ
కాముడేమన్నాడే పిల్లా...
ఒహొ కాముడేమన్నాడే పిల్లా..
కరణం గారి ఇంటీ కాడ
కారుమునగ చెట్టు కాడ
కాసులపేరు ఇస్తాన్నాడమ్మ..
ఓ కాసులపేరు ఇస్తాన్నాడమ్మ...
మునుసుబు గారి ఇంటీ కాడ
ముందర దర్వాజు కాడ
ఆతాడేమన్నాడే పిల్లా..

ఓ ఆతాడేమన్నాడే పిల్లా..
మునుసుబు గారి ఇంటీ కాడ
ముందర దర్వాజూ కాడ

ముక్కుపుడకలు ఇస్తాన్నాడమ్మ..
ముక్కుపుడకలు ఇస్తాన్నాడమ్మ...

ముంతంత కొప్పు మీద
మూడు చేమంతి పూలు
ఏ రాజు పేట్టాడే పిల్లా..
అబ్బ ఎంత చక్కగున్నావే పిల్లా..
చేమంతి పువ్వులు చెంగులోన తానేట్టీ
కోరి కోరి పిలిచాడే నాయుడు
అబ్బ గుండె దడ దడ ఆడె పిన్నీ...
కాసులపేరు ఏసుకోని
కాలవగట్టు ఎల్తుంటే
పానిపట్టు పట్టాడే నాయుడు
అబ్బ గుండె జల్లుమన్నాదే పిన్నీ...
మాయమ్మ తమ్ముళ్లు
మాకు మేన మామలు..
గుబ్బ గొడుగులవారు..
కిర్రు చెప్పులవారు..
చేతి కర్రలవారు..
వార కన్నులవారు..
వయ్యారి నడకవారు...
ఏతొవనున్నారో..
రవికేసుకో పమిటేసుకో..
పంచడిలో మంచమేసుకో..
వాకిట్లో దీపమెట్టుకో...
రాకపోతే కేకెసుకో...



బాల త్రిపురమని పాట సాహిత్యం

 
చిత్రం: బ్రహ్మోత్సవం (2016)
సంగీతం:  స్టీఫెన్ దేవాస్సి (రి రికార్డింగ్ : మిక్కీ జే. మేయర్)
సాహిత్యం: కృష్ణ చైతన్య 
గానం: రాహుల్ నంబియార్

బాల త్రిపురమని



Put Your Hands Up పాట సాహిత్యం

 
చిత్రం: బ్రహ్మోత్సవం (2016)
సంగీతం:  స్టీఫెన్ దేవాస్సి (రి రికార్డింగ్ : మిక్కీ జే. మేయర్)
సాహిత్యం: కృష్ణ చైతన్య 
గానం: శ్రావణ భార్గవి

Put Your Hands Up

Palli Balakrishna Saturday, August 19, 2017
Baava (2010)

చిత్రం: బావ (2010)
సంగీతం: చక్రి
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: సిద్దార్ధ్
నటీనటులు: సిద్దార్ధ్, ప్రణీత
దర్శకత్వం: రాంబాబు
నిర్మాత: యమ్.ఎల్. పద్మకుమార్ చౌదరి
విడుదల తేది: 29.10.2010

అల్లరోడు ఒకడే ఒకడే
తింగరోడు ఒకడే ఒకడే
గోలగాడు ఒకడే ఒకడే
గాలిగాడు ఒకడే ఒకడే
వీడిగ్యాంగు కనిపిస్తే చాలు జనమంత గడగడే వీరగడగడే
వీడిముందు ఆఫ్ట్రాలే కదా అణుబాంబు దడదడే
Who is this పోరగాడే
వీరమాచనేని వంశమున పుట్టిన కిట్టమూర్తి
వీరబాబు ఊరబాబుగా మారిన కల్లు కోతి
పనీ పాట లేనే లేని తొట్టి గుంపుకు దళపతి
ఊరువాడ దణ్ణమెడతాది వీడికే చేతులెత్తి
బావా బావా బావా బావా బావా బావా
అల్లరోడు చిల్లరోడు సొల్లుగాడు సోదిగాడు కొంటె గాడు కోతి గాడు
తింగరోడు తీటగాడు గాలిగాడు గోలగాడు మాసుగాడు

ఎక్కడబడితే అక్కడ తిరిగే all in one పారికోడే
ఎవ్వడినైనా Don't Care అంటూ గొడవకు దిగిపోతాడే
కిరికిరి చేష్టల కింగునని భూమ్మీదసలే నడవడుగా
ఎదవేషాలకు తోపునని కాలరు దించడుగా
అచ్చోసిన Dash Dash అంటే అసలర్ధం వీడేలే
ఆమాటే వాడికి చెప్పే మొగుడే లేడే

||వీరమాచనేని||

చేతులదురద మనకొక సరదా ఎవడినొ ఒకడిని కెలుకు
మొటికలు తిట్లూ చీపురు కట్టలు మామూలేగా మనకు
మంతోగోక్కుని ఎవడైనా నెమ్మదిగా నిదరోడుకదా
సర్లెమ్మని ఎడ్జస్టయినా మనమే వాడిని వొదలముగా
నరకంలో పాపం చేసే ఈ ఊర్లో పుట్టరు
మనచేతికి దొరికేసారు బకరాగాళ్ళు



********   *********   ********


చిత్రం: బావ (2010)
సంగీతం: చక్రి
సాహిత్యం: కందికొండ
గానం: రంజిత్, హరిణి

మిల మిల మిలమని సూర్యోదయమై తగిలెనులే తొలి ప్రేమ
తళ తళ తళమని చంద్రోదయమై తడిపెనులే నీ ప్రేమ
మిల మిల మిలమని సూర్యోదయమై తగిలెనులే తొలి ప్రేమ
తళ తళ తళమని చంద్రోదయమై తడిపెనులే నీ ప్రేమ
నేనే నా నేనే నా నేను చూస్తుంది నిన్నే నా
నిజమేనా నిజమేనా నమ్మదు నా మనసే
నేనేలే నేనేలే నువ్వు చూస్తుంది నన్నేలే
చిననాటి నీ చెలిమి ఎదురుగానిలిచెనులే
హాయ్ లే హాయ్ లే ప్రతిరోజు సంబరాలే
హాయ్ లే హాయ్ లే ఎండల్లో చల్లని వానలే
హాయ్ లే హాయ్ లే మది తాకే అంబారాలే
హాయ్ లే హాయ్ లే ఎద ఉగుతున్నది ఊయలే

మిల మిల మిలమని సూర్యోదయమై తగిలెనులే తొలి ప్రేమ
తళ తళ తళమని చంద్రోదయమై తడిపెనులే నీ ప్రేమ

ఏ మనసుకు రెక్కలు మొలిచే నువ్వే నన్నే కలిసాకే
తీపిని మించిన తిపే రుచి చూశా ఇపుడే
నింగికి నేలకు నడుమ మది నిలిచే నీతో నడిచే
రంగుల ఆ హరివిల్లై విరబూసే ప్రణయమే
అనందం అంటుంటే ఇన్నాళ్ళు విన్నాలే
ఈ రోజే తొలిసారి అది ఏమిటో కన్నాలే
సద్రం నీటి బొట్టై పిడికిట్లో ఒదిగేనేలే
ఆకాశం పులరెక్కై అరచేతుల్లో చిక్కిందిలే
హాయ్ లే హాయ్ లే ప్రతిరోజు సంబరాలే
హాయ్ లే హాయ్ లే ఎండల్లో చల్లని వానలే
హాయ్ లే హాయ్ లే మది తాకే అంబరాలే
హాయ్ లే హాయ్ లే ఎద ఊగుతున్నది ఊయాలే

మిల మిల మిలమని సూర్యోదయమై తగిలెనులే తొలి ప్రేమ
తళ తళ తళమని చంద్రోదయమై తడిపెనులే నీ ప్రేమ

చేతితో కనులను మూస్తే చీకట్లో నీ రూపం
రారా రమ్మని పిలిచే అది ఏమిటో చిత్రమే
ఇదివరకెన్నడు లేదే నాకంటూ ఒక గమ్యం
నువ్వే ఇక నా తీరం నీ వెనుకే పయనమే
అందంలో నను చూసి నీ రూపం కనిపించే
నీ పేరు ఎవర్న నీ పేరు వినిపించే
లోకం నాకు నువై నే శూన్యం ఐనాలే
నా ప్రాణం నిన్ను చేరి నీ ప్రాణం లో కలిసిందిలే

హాయ్ లే హాయ్ లే ప్రతిరోజు సంబరాలే
హాయ్ లే హాయ్ లే ఎండల్లో చల్లని వానలే
హాయ్ లే హాయ్ లే మది తాకే అంబరాలే
హాయ్ లే హాయ్ లే ఎద ఊగుతున్నది ఊయలే

మిల మిల మిలమని సూర్యోదయమై తగిలెనులే తొలి ప్రేమ
తళ తళ తళమని చంద్రోదయమై తడిపెనులే నీ ప్రేమ


********   *********   ********


చిత్రం: బావ (2010)
సంగీతం: చక్రి
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: యమ్.యమ్. కీరవాణి

పన్నెండేల్ల ప్రాయం వెన్నెల్లాంటి హృదయం
ఎన్నాళ్ళైనా మరుపే రావుగా
సంతోషాల సమయం పంతాలైన మధురం
సొంతం కాని ఎదలే లేవుగా
కాసేపు ఆ జ్ఞాపకాలన్నీ ఎదురైతే
నీ రూపు ఆ చోట పసిపాపై తోస్తుంది
కథలా కదిలే కాలం లోన అన్నీ వింతలే
చెలిమే చిలికే కళ్ళలోన కలవా చింతలే
అదిగో తేనెటీగల్లె తాకింది ఆ చల్ల గాలి
అపుడే తేనే తీపంతా నన్నందుకోమంది వెళ్ళి

పన్నెండేల్ల ప్రాయం వెన్నెల్లాంటి హృదయం
ఎన్నాళ్ళైనా మరుపే రావుగా
సంతోషాల సమయం పంతాలైన మధురం
సొంతం కాని ఎదలే లేవుగా

చెరువుల్లో ఈత ఇసకల్లో రాత
తిరనాల్లో ఆడే సైఆట
గుడిలోని పాట తూనీగల వేట
బడిలో నేర్పించే బతుకాట
చిననాటి స్నేహాల చిగురింతలే
ఎదిగెను ఈనాటి పులకింతలై
ఆ బొమ్మ పెళ్ళిల్ల సందల్లలో
ఈ బొమ్మకెన్నెన్ని తుల్లింతలో
నువ్వు దాచాలి అనుకున్నా వీల్లేదని తెలుసా

పన్నెండేల్ల ప్రాయం వెన్నెల్లాంటి హృదయం
ఎన్నాళ్ళైనా మరుపే రావుగా
సంతోషాల సమయం పంతాలైన మధురం
సొంతం కాని ఎదలే లేవుగా

మనపై జడివాన కురిసే నిమిషాన
పడవలు తయ్యారే గుర్తుందా
మామిడి కొమ్మల్లో కోకిలతో చేరి
కూసే కచ్చేరీ గుర్తుందా
నిన్నమొన్నే అయినట్టు వున్నాయిలే
ఆ నవ్వు నాతో ఉండేట్టు చేసాయిలే
పాదాలు ఏ దారి నడిపించునో
ఏ ప్రేమ తీరాలు కనిపించునో
అడగలంటు నీ చెంత వాలిందలా మనసు

పన్నెండేల్ల ప్రాయం వెన్నెల్లాంటి హృదయం
ఎన్నాళ్ళైనా మరుపే రావుగా
సంతోషాల సమయం పంతాలైన మధురం
సొంతం కాని ఎదలే లేవుగా

Palli Balakrishna
Attarintiki Daredi (2013)




చిత్రం: అత్తారింటికి దారేది (2013)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నటీనటులు: పవన్ కళ్యాణ్ , సమంత, ప్రణీత
దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాతలు: బి.వి.యస్.యన్. ప్రసాద్
విడుదల తేది: 27.09.2013



Songs List:



ఆరడుగుల బుల్లెట్టు పాట సాహిత్యం

 
చిత్రం: అత్తారింటికి దారేది (2013)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీ మణి
గానం: విజయ్ ప్రకాష్, ఎమ్. ఎల్. ఆర్. కార్తీకేయన్

గగనపు వీధి వీడి వలస వెళ్లిపోయిన నీలి మబ్బు కోసం
తరలింది తనకు తానే ఆకాశం పరదేశం
శిఖరపు అంచు నుంచి నేల జారి పోయిన నీటి చుక్క కోసం
విడిచింది చూడు నగమె తన వాసం వనవాసం

భైరవుడొ భార్గవుడొ భాస్కరుడొ మరి రక్కసుడొ
ఉక్కు తీగలాంటి ఒంటి నైజం వీడు మెరుపులన్ని ఒక్కటైన తేజం
రక్షకుడొ దక్షకుడొ పరీక్షలకె సుశిక్షితుడో
శత్రువు అంటు లేని వింత యుద్ధం వీడి గుండె లోతు గాయమైన శబ్ధం
నడిచొచ్చె నర్తన శౌరీ పరిగెత్తె పరాక్రమ శైలీ
హలాహలం ధరించిన ధగ్ ధగ్ హృదయుడొ

వీడు ఆరడుగుల బుల్లెట్టు వీడు ధైర్యం విసిరిన రాకెట్టూ

గగనపు వీధి వీడి వలస వెళ్లిపోయిన నీలి మబ్బు కోసం
తరలింది తనకు తానే ఆకాశం పరదేశం
శిఖరపు అంచు నుంచి నేల జారి పోయిన నీటి చుక్క కోసం
విడిచింది చూడు నగమె తన వాసం వనవాసం

దివి నుంచి భువి పైకి భగ భగ మని కురిసేటి
వినిపించని కిరణం చప్పుడు వీడు
వడివడిగా వడగళ్లై ధడ ధడమని జారేటి
కనిపించని జడి వానేగ వీడూ
శంఖంలొ దాగేటి పోటెత్తిన సంద్రం హోరితడు
శోకాన్నె దాచేసే అశోకుడు వీడురొ

వీడు ఆరడుగుల బుల్లెట్టు వీడు ధైర్యం విసిరిన రాకెట్టూ

తన మొదలే వదులుకొని పైకెదిగిన కొమ్మలకి చిగురించిన చోటుని చూపిస్తాడు
తన దిశనే మార్చుకొని ప్రభవించె సూర్యుడికి తన తూరుపు పరిచయమె చేస్తాడూ
రావణుడొ రాఘవుడొ మనసును దోచె మాధవుడో
సైనికుడొ శ్రామికుడొ అసాధ్యుడు వీడురో

వీడు ఆరడుగుల బుల్లెట్టు వీడు ధైర్యం విసిరిన రాకెట్టూ

గగనపు వీధి వీడి వలస వెళ్లిపోయిన నీలి మబ్బు కోసం
తరలింది తనకు తానే ఆకాశం పరదేశం
శిఖరపు అంచు నుంచి నేల జారి పోయిన నీటి చుక్క కోసం
విడిచింది చూడు నగమె తన వాసం వనవాసం



నిన్ను చూడగానె చిట్టి గుండె పాట సాహిత్యం

 
చిత్రం: అత్తారింటికి దారేది (2013)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: దేవి శ్రీ ప్రసాద్
గానం: దేవి శ్రీ ప్రసాద్

నిన్ను చూడగానె చిట్టి గుండె గట్టిగానె కొట్టుకున్నదే హో అదేమిటే
నిన్ను చూడకుంటె రెండు కళ్లు ఒకటినొకటి తిట్టుకున్నవే హొయ్ అదేమిటే హొయ్
ఓయ్ ఆ ఆ ఏ అవతలకి పో

నిన్ను చూడగానె చిట్టి గుండె గట్టిగానె కొట్టుకున్నదే హొయ్ అదేమిటే హొయ్
నిన్ను చూడకుంటె రెండు కళ్లు ఒకటినొకటి తిట్టుకున్నవే హొయ్ అదేమిటే హై

ఏమిటో ఏమ్మాయో చేసినావె కంటి చూపుతోటి
ఏమిటో ఇదేమి రోగమో అంటించినావె ఒంటి ఊపుతోటి
ముంచే వరదలా కాల్చే ప్రమిధలా చంపావే మరదలా

నిన్ను చూడగానే... నా చిట్టి గుండె
నిన్ను చూడగానె చిట్టి గుండె గట్టిగానె కొట్టుకున్నదే హొయ్ అదేమిటే హొయ్
నిన్ను చూడకుంటె రెండు కళ్లు ఒకటినొకటి తిట్టుకున్నవే హొయ్ అదేమిటే హై

వన్స్ మోర్ విత్ ఫీల్ 
ఓహ్ నో

ఏ అంత పెద్ద ఆకాశం అంతులేని ఆ నీలం
నీ చేప కళ్ల లోతుల్లో ఎట్ట నింపావె ఇరగదీసావే
ఏయ్ భూమిలోన బంగారం
దాగి ఉందనేది ఓ సత్యం
దాన్ని నువ్వు భూమి పైన పెరిగేస్తూ ఇట్ట తిరిగేస్తూ తిరగ రాసావే
ఏయ్ అలా నువ్వు చీర కట్టి చిందులేస్తె చీమలా నేను వెంట పడనా
నావలా నువ్వు తూగుతూ నడుస్తు ఉంటె
కాపలాకి నేను వెంట రానా
కృష్ణ రాధలా, నొప్పి బాధలా ఉందాం రావె మరదలా

నిన్ను చూడగానె చిట్టి గుండె గట్టిగానె కొట్టుకున్నదే హొయ్ అదేమిటే హై

ఆ హుం ఆ హుం ఆ హుం ఆ హుం 
అత్తలేని కోడలుత్తమురాలు ఓరమ్మా కోడల్లేని అత్త గుణవంతురాలు ఆ హుం ఆ హుం
హోయ్ కోడల కోడల కొడుకు పెళ్ళామా ఓరమ్మా పచ్చి పాల మీద మీగడేదమ్మా
హా వేడి పాలలోన వెన్న లేదమ్మా ఆ హుం ఆ హుం
ప్లీజ్ డ్యాన్స్ యార్

మోనలీస చిత్రాన్ని గీసినోడు ఎవడైనా
ఈ పాల సీస అందాన్ని చూడనే లేదు ఇంక ఏం లాభం
కోహినూరు వజ్రాన్ని ఎత్తుకెళ్లినోడు రాజైనా
దాని మెరుపు నీలోనే దాగిఉందని తెలియలే పాపం
ఇంతిలా నువ్వు పుట్టుకొస్తె నేను మాత్రమెంతని పొగిడి పాడగలను
తెలుగు భాషలో నాకు తెలిసిన పదాలు అన్ని గుమ్మరించి ఇంత రాసినాను
సిరివెన్నెల మూటలా వేటూరి పాటలా ముద్దుగున్నావె మరదలా

నిన్ను చూడగానె నా చిట్టి గుండె...
నిన్ను చూడగానె చిట్టి గుండె గట్టిగానె కొట్టుకున్నదే హొయ్ అదేమిటే హొయ్
నిన్ను చూడకుంటె రెండు కళ్లు ఒకటినొకటి తిట్టుకున్నవే హొయ్ అదేమిటే హై



దేవదేవం భజే పాట సాహిత్యం

 
చిత్రం: అత్తారింటికి దారేది (2013)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: తాళ్ళపాక అన్నమాచార్య
గానం: పాలక్కడ్ శ్రీరామ్, ఎమ్. ఎస్. సుబ్బలక్ష్మి, రీటా

దేవదేవం భజే దివ్య ప్రభావం
రావణాసుర వైరి రణపుంగవం రామం
దేవదేవం భజే దివ్య ప్రభావం

వేల సుమ గంధముల గాలి అలలా
కలల చిరునవ్వులతో కదిలినాడు
రాల హృదయాల తడిమేటి తడిలా
కరుణగల వరుణుడై కరిగినాడు

అతనొక ఆకాశం అంతెరుగని శూన్యం
ఆవిరి మేఘాలే ఆతని సొంతం
అరమరికల వైరం కాల్చెడి అంగారం
వెలుగుల వైభోగం ఆతని నయనం

ప్రాణ ఋణబంధముల తరువును
పుడమిగ నిలుపుటె తన గుణం

దేవదేవం భజే దివ్య ప్రభావం
రావణాసుర వైరి రణపుంగవం రామం
దేవదేవం భజే దివ్య ప్రభావం




అమ్మో బాపు గారి బొమ్మో పాట సాహిత్యం

 
చిత్రం: అత్తారింటికి దారేది (2013)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: శంకర్ మహదేవన్

హేయ్ బొంగరాలంటి కళ్ళు తిప్పింది ఉంగరాలున్న జుట్టు తిప్పింది
గింగిరాలెత్తే నడుమొంపుల్లో నన్నే తిప్పిందీ...
అమ్మో బాపు గారి బొమ్మో
ఓలమ్మో మల్లెపూల కొమ్మో...
రబ్బరు గాజుల రంగు తీసింది
బుగ్గల అంచున ఎరుపు రాసింది
రిబ్బను కట్టిన గాలి పటంలా నన్నెగరేసిందీ...
అమ్మో దాని చూపు గమ్మో
ఓలమ్మో ఓల్డ్ మోంక్ రమ్మో... హై
పగడాల పెదవుల్తో పడగొట్టిందీ పిల్లా
కత్తులులేని యుద్ధం చేసి నన్నే గెలిచింది
ఏకంగా యెదపైనే నర్తించిందీ...
అబ్బా నాట్యంలోని ముద్దర చూసి నిద్దర నాదే పోయింది...

అమ్మో బాపు గారి బొమ్మో హే హే హే
ఓలమ్మో మల్లెపూల కొమ్మో... హో హో

మొన్న మేడ మీద బట్టలారేస్తూ
కూని రాగమేదొ తీసేస్తూ
పిడికెడు ప్రాణం పిండేసేలా పల్లవి పాడిందే పిల్లా...
నిన్న కాఫీ గ్లాసు చేతికందిస్తూ
నాజూకైన వేళ్ళు తాకిస్తూ
మెత్తని మత్తుల విద్యుత్ తీగై ఒత్తిడి పెంచిందే మళ్ళా... హోయ్
కూరలో వేసే పోపు నా ఊహల్లో వేసేసింది
ఓరగా చూసే చూపు నావైపే అనిపిస్తుంది
పూలలో గుచ్చే దారం నా గుండెల్లో గుచ్చేసింది
చీర చెంగు చివరంచుల్లో నన్నె బంధీ చేసింది
పొద్దు పొద్దున్నే హల్లో అంటుందీ
పొద్దు పోతె చాలు కల్లోకొస్తుందీ
పొద్దస్తమానం పొయినంత దూరం గుర్తొస్తుంటుందీ...

అమ్మో బాపు గారి బొమ్మో హే హే హే
ఓలమ్మో మల్లెపూల కొమ్మో...

సయ్యో అయ్యయ్యో మయ్యో అయ్యయ్యో రయ్యో అయ్యయ్యో అహ అహ అహ అహ
సయ్యో అయ్యయ్యో మయ్యో అయ్యయ్యో రయ్యో అయ్యయ్యో అహ అహ అహ అహ

యే మాయా లోకంలోనో నన్ను మెల్లగ తోసేసింది
తలుపులు మూసింది తాళం పోగెట్టేసిందీ
ఆ మబ్బుల అంచుల దాకా నా మనసుని మోసేసింది
చప్పుడు లేకుండా నిచ్చెన పక్కకు లాగింది.
తిన్నగా గుండెను పట్టి గుప్పిట పెట్టి మూసేసింది
అందమే గంధపు గాలై మళ్ళీ ఊపిరి పోసింది
తియ్యని ముచ్చటలెన్నో ఆలోచన్లో అచ్చేసింది
ప్రేమనే కళ్లద్దాలు చూపులకే తగిలించింది
కోసల దేశపు రాజకుమారి ఆశలు రేపిన ఖండాల పోరి
పూసల దండలొ నన్నే గుచ్చి మెళ్ళో వేసిందీ

అమ్మో బాపు గారి బొమ్మో హే హే హే
ఓలమ్మో మల్లెపూల కొమ్మో... ఓ...




కిర్రాకు కిర్రాకు పాట సాహిత్యం

 
చిత్రం: అత్తారింటికి దారేది (2013)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: నరేంద్ర, డేవిడ్ సిమన్

ఓహ్ మై గాడ్!! ఐ కాంట్ బిలీవ్ దట్ యు సెడ్ దట్
ఆర్ యామ్ ఐ డ్రీమింగ్ దట్ ఐ హియర్డ్ దట్
మై హార్ట్ ఈస్ రేజింగ్ లైక్ ఎ చీతా
సో ఐ వన్నా సింగ్ దిస్ కొత్త పాట

ఓసోసి పిల్ల పోరి ఓ చిన్న మాట జారి
ఏం దెబ్బ తీసినావె
రాకాసి రాకుమారి కోపంగ పళ్ళు నూరి
ఐ లవ్ యు చెప్పినావే
అందంగ పెట్టినావె స్పాటు గుండె తాకిందె ప్రేమ గన్ను షాటు
ఏది లెఫ్టు ఏది నాకు రైటు
మందు కొట్టకుండనే నేను టైటు
క్యాట్ బాలు లాగిపెట్టి మల్లె పూలు జల్లినట్టు
షర్టు జేబు కింద చిట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు
పిచ్చి పిచ్చి గుందే

కిర్రాకు కిర్రాకు కిర్రాకు రాకు రాకు పుట్టించావే
కిర్రాకు కిర్రాకు కిర్రాకు రాకు కేక పెట్టించావే హోయ్

ఓహ్ మై గాడ్!! ఐ కాంట్ బిలీవ్ దట్ యు సెడ్ దట్
ఆర్ యామ్ ఐ డ్రీమింగ్ దట్ ఐ హియర్డ్ దట్
మై హార్ట్ ఈస్ రేజింగ్ లైక్ ఎ చీతా
సో ఐ వన్నా సింగ్ దిస్ కొత్త పాట

పెదవి స్ట్రా బెరి పలుకు క్యాట్బరీ
సొగసు తీగలో కదిలింది పూల నర్సరీ
కళ్ళలో కలల గేలరీ చిలిపి చూపులో
కొలువుంది ద్రాక్ష మాధురి
అత్తరేదొ జల్లినావే అత్త గారి పిల్ల
సిత్తరాల నవ్వు పైన రత్తనాలు జల్లా
కొత్త ప్రేమ మత్తు నన్ను హత్తుకుంటె యిల్లా
పిచ్చి పిచ్చి గుందే

కిర్రాకు కిర్రాకు కిర్రాకు రాకు రాకు పుట్టించావే
కిర్రాకు కిర్రాకు కిర్రాకు రాకు కేక పెట్టించావే హోయ్

హే మహంకాళి జాతర్లో మైకు సెట్టు మోగినట్టు మైండంత గోల గుందే
బెంగాళి స్వీటు లోన భంగేదో కలిపితిన్న ఫీలింగు కుమ్ముతుందే
కౌబాయ్ డ్రెస్సు వేసినట్టు క్రిష్ణ రాయలోని గుర్రమెక్కినట్టు
భూమ్మీద ఉన్న చోటే ఉంటూ ఆ మూను మీద కాలు పెట్టినట్టు
సిమ్ము లేని సెల్లు లోకి ఇన్ కమింగు వచ్చినట్టు
సింగరేణి బొగ్గు తీసి ఫేసు పౌడరద్దినట్టు
పిచ్చి పిచ్చి గుందే

కిర్రాకు కిర్రాకు కిర్రాకు రాకు రాకు పుట్టించావే
కిర్రాకు కిర్రాకు కిర్రాకు రాకు కేక పెట్టించావే హోయ్



It's time to party now పాట సాహిత్యం

 
చిత్రం: అత్తారింటికి దారేది (2013)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: మల్గాడి శుభ, డేవిడ్ సిమన్

ఓరి దేవుడో దేవుడో ఏంపిల్లగాడే
మిల్లీమీటరైన వదలకుండా దిల్లో నిండినాడే
హాఁ కళ్ళల్లోన కత్తులున్న తీవ్రవాదిలా
మాటల్లోన మత్తులున్న మంత్రవాదిలా
పరేషాను చేస్తున్నాడిలా పట్టుకో ఆఁ పట్టుకో 
Hey It's time to party now (2)

నోటికొచ్చిన పాటేదో పాడెయ్ పాడెయ్ పాడెయ్ పాడెయ్
ఒంటికొచ్చిన డేన్సేదో చేసెయ్ చేసెయ్ రో
It's time to party (2)
చేతికందిన డ్రింకేదోతాగెయ్ తాగెయ్ తాగెయ్ తాగెయ్
లోకమంతా ఉయ్యాలే ఊగెయ్ ఊగెయ్ రో
It's time to party  (2)

Come on Come on Lets chill n thrill n kill it now
Come on Come on పిచ్చెక్కించేద్దాం రో
Come on Come on Lets rock it shake it break it now
Come on Come on తెగ జల్సా చేద్దాం రో
It's time to party now 
It's time to party now  రావే ఓ పిల్లా
It's time to party now  చేద్దాం గోల
It's time to party now రావే ఓ పిల్లా
మనకంటే గొప్పోళ్ళా టాటా బిర్లా

ఓరి దేవుడో దేవుడో ఏంపిల్లగాడే
మిల్లీమీటరైన వదలకుండా దిల్లో నిండినాడే
హాఁ కళ్ళల్లోన కత్తులున్న తీవ్రవాదిలా
మాటల్లోన మత్తులున్న మంతవాదిలా
పరేషాను చేస్తున్నాడిలా పట్టుకో ఆఁ పట్టుకో

ఎడిసన్ను బల్బులోని ఫిలమెంటు వైరు నేను
అట్టా నను టచ్ చేశావో ఇట్టా స్విచ్చానౌతాను
It's time to party (2)
హే మైక్రోవేవ్ మంటలాగా సైలెంటు ఫైరు నేను
నువు కొంచెం మనసిచ్చావో టాలెంటే చూపిస్తాను
It's time to party (2)
హే బాయ్ అబ్బాయ్ లవ్వు గాడుకు నువ్వు క్లోనింగా
అమ్మోయ్ అమ్మాయ్ తొలి చూపుకె ఇంతటి ఫాలోయింగా
It's time to party now 
It's time to party now  రావే ఓ పిల్లా
It's time to party now  చేద్దాం గోల

హాఁ మైనేం ఈజ్ మార్గరీటా మాక్ టైల్లా పుట్టానంటా
చూపుల్తో అందమంతా సరదాగా సిప్ చేయ్మంటా
It's time to party (2)
వాచ్ మేనే లేని చోట వయసే ఓ పూల తోట
వెల్కమ్మని పిలిచావంటే తుమ్మెదలా వాలిపోతా
It's time to party (2)
హల్లో హల్లో అని పిలవాలా నినుపేరెట్టి
పిల్లో పిల్లో నను లాగొద్దట్టా దారం కట్టి
It's time to party now 
It's time to party now  రావే ఓ పిల్లా
It's time to party now  చేద్దాం గోల

It's time to party (3)



కటమరాయుడా కదిరి నరసింహుడ పాట సాహిత్యం

 
చిత్రం: అత్తారింటికి దారేది (2013)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సముద్రాల రాఘవాచార్య
గానం: పవన్ కళ్యాణ్ 

కటమరాయుడా కదిరి నరసింహుడ

Palli Balakrishna Monday, July 31, 2017
Rabhasa (2014)

చిత్రం: రభస (2014)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: కార్తిక్, మేఘ
నటీనటులు: జూ.యన్. టి. ఆర్, సమంత, ప్రణీత
దర్శకత్వం: సంతోష్ శ్రీనివాస్
నిర్మాత: బెల్లంకొండ సురేష్
విడుదల తేది: 29.08.2014

హవా హవా హై తొ తెరె బినా
జియా జియా హై తొ తెరె బినా (2)

అటు ఇటు ఎటు చూసిన ఎం చేసినా
న కల్లముందు నువ్వె నువ్వె
అది ఇది అనలలేనిది ఏదో ఏదో
నా గుండెల్లోన పుట్టించావె

అయ్యొ నేనెం చేశా నీలో పొంగె ఆశ
నీతొ మాటాదిస్తోందె అరె ఇంకా నాదేముందె

చెప్పలేను ఔనని వెల్లలేను కాదని
ఒప్పుకోవె ప్రేమని
నువ్వు అవునన్నావొ  తిప్పెస్తానే భూమిని

హవా హవా హై తొ తెరె బినా
జియా జియా హై తొ తెరె బినా (2)

అటు ఇటు ఎటు చూసిన ఎం చేసినా
న కల్లముందు నువ్వె నువ్వె

పాదమేమొ నేల మీద లేదురా
ప్రాణమేమో గాలిలోన తేలుతోంది రా
ఉంది ఉంది ఊహ దూకుతుందిరా
నాకు కెందుకింత ఎక్కడలేని తొందర

నీకు నేను చేరువై ఇలా ఇలా
నీ సగం అవుతుండగా
నింగి నేల ఒక్కటై అలా అలా
తారుమారు అవుతుందిగా

చెప్పలేను ఔనని వెల్లలేను కాదని
ఒప్పుకోవె ప్రేమని
నువ్వు అవునన్నావొ
తిప్పెస్తానె సూర్యుని

నువ్వు లేని చోట చీకటున్నది
నిన్ను చూడగానె మళ్ళి వేకువైనది
కాలమెందు కింత మారుతున్నది

నాకర్ధం అయ్యెటట్టు మాత్రం లేదిది
నన్ను తప్ప దేనిని ఇలా ఇలా
చూడను అందే నీ కన్ను
రెప్ప మూయమన్నదె అలా అలా
నేన్ లేని చోట నిన్ను

చెప్పలేను ఔనని వెల్లలేను కాదని
ఒప్పుకోవె ప్రేమని
నువ్వు అవునన్నావొ
ఆపేస్తానె గాలిని

హవా హవా హై తొ తెరె బినా
జియా జియా హై తొ తెరె బినా (2)



********  *******   ********



చిత్రం: రభస (2014)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: సుచిత్ సురేషన్

డమ డమ డమ డమ డమరుక్ ద్వనిగా
నలుచెరుగున శుభ షకునం

ఘుమ ఘుమ ఘుమ పరిమలమున సిరిగా
ప్రతి మనసున మదుపవనం
ఇది నర నరమున
సల సలమను విదమున
అలలెగిసిన సంచలనం

తను జనియించిన
ఒడి పుడమికి వెలుగిడ అడుగిడ
మన యువకిరనం

హెయ్ జివ్వున ఎగిసే రక్తమిలా
ఉప్పొంగె లావా ల
హెయ్ జివ్వున ఎగిసే రక్తమిలా
ఉప్పొంగె లావా ల
హెయ్ జుమ్మని పొంగే సంద్రములా
మనసూగెను ఉయ్యాల

అరె స్వర్గం కన్నా మిన్నా
నే జన్మించిన ఈ నేలా
ఈ నేలన అడుగే  మోపీ
పులకించానీవేళ

మార్ సలాం మార్ సలాం
మార్ సలాం బోల్ జొర్ సె బోల్
బోల్ జొర్ సె బోల్

హెయ్ జివ్వున ఎగిసే రక్తమిలా
ఉప్పొంగే లావా ల

మార్ సలాం బోల్ జొర్ సె బోల్
మార్ సలాం బోల్ జొర్ సె బోల్

నీతిగ బ్రతుకుని గడపాలి
నిప్పులా తప్పుని చెరపాలి
మంచికై నిలబడి కలబడి
ఎగబడి తెగబడి
చెడు నెదిరించాలి

చరితలను చదవడమె కాదు
మనమే ఒక చరితగ మారాలి
అరె ఏ చోటె మనమున్నా
ఈ నేలకు వెలుగవ్వాలి
తల దించని మన జెండాల
మన గౌరవం ఉందాలి

మార్ సలాం మార్ సలాం
మార్ సలాం బోల్ జొర్ సె బోల్
బోల్ జొర్ సె బోల్

హెయ్ జివ్వున ఎగిసే రక్తమిలా
ఉప్పొంగే లావా ల

చిరునవ్వుల సుర్యుడు వచ్చాడే - వచ్చాడే
ప్రతి గుండెకు పండగ తెచ్చాడే - తెచ్చాడే

మార్ సలాం మార్ సలాం

ఎవ్వరో ఎందుకు నడపాలి
ముందడుగు మనదే కావాలి
సెకనుకో రకముగ ఎదురగు
బ్రతుకను రణమున గెలిచే తీరాలి

విలువైన విజయం యేదైన
సులువుగా రాదని నమ్మాలి
పడినా లేచే కెరటం
మనకాదర్షం కావలి
మరినిప్పుని కొనీ ఆడేలా
మన పనితనముండాలి

మార్ సలాం మార్ సలాం
మార్ సలాం బోల్ జొర్ సె బోల్
బోల్ జొర్ సె బోల్

హెయ్ జివ్వున ఎగిసే రక్తమిలా
ఉప్పొంగే లావా ల

మార్ సలాం

Palli Balakrishna Friday, July 21, 2017

Most Recent

Default