చిత్రం: గామి (2024) సంగీతం: స్వీకర్ అగస్తి, నరేష్ కుమారన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్: నరేష్ కుమారన్ నటీనటులు: విశ్వక్‌సేన్, చాందిని చౌదరి, అభినయ, మహ్మద్ సమద్, హారిక పెడద దర్శకత్వం:విద్యాధర్ కాగిత నిర్మాత: కార్తీక్ శబరీష్ సహ నిర్మాత: శ్వేతా మొరవనేని విడుదల తేది: 08.03.2024
Songs List:
గమ్యాన్నే చేధించే పాట సాహిత్యం
చిత్రం: గామి (2024) సంగీతం: స్వీకర్ అగస్తి, నరేష్ కుమారన్ సాహిత్యం: సేనాపతి భరద్వాజ్ పాత్రుడు గానం: అనురాగ్ కులకర్ణి, స్వీకర్ అగస్తి, సుగుణమ్మ సొమ్మసిల్లిపోయి కూలింది కాలం సత్తువంటూ లేక ఇంకెంత కాలం సన్నగిల్లకుంది ఈ వింత దూరం దిక్కుతోసకుండ ఇంకెంత దూరం సొమ్మసిల్లిపోయి కూలింది కాలం సత్తువంటూ లేక ఇంకెంత కాలం సన్నగిల్లకుంది ఈ వింత దూరం దిక్కుతోసకుండ ఇంకెంత దూరం గమ్యాన్నే చేధించే స్థైర్యంతో పదా ధైర్యాన్నే సంధించెయ్ వచ్చిందో ఆపద కాలకూటమైన ఈ తీపి స్పర్శ అమృతంగా మారే దారుందా ఈషా తనువు నీలమౌతూ పెడుతుంటే ఘోషా జీవమున్న చావు పొందిందా శ్వాస బేతాళ ప్రశ్నేదో వాలిందంటే బదులిచ్చి తీరాలి కాదా లోనున్న భయమంటూ పోవాలంటే దాగున్న సత్యాన్ని వెతకాలంటా చేయూతనిచ్చే ఆశే ఉంటే ఆ గామి రాదా నీకై గాయాన్ని దాటి చేరాలంటే నిన్నే నువ్వు గామివై గమ్యాన్నే ఛేదించే స్థైర్యంతో పదా ధైర్యాన్నే సంధించెయ్ వచ్చిందో ఆపదా నేలలోకి నిన్ను నెడుతుంటే శోకం చూసి చూడనట్టే ఉంటుంది లోకం జరుగుతోంది నిత్య ఏకాకి యుద్ధం నువ్వు తప్ప నీకు ఏముంది సైన్యం కన్నీళ్ళు నిలువెల్లా ముంచేస్తున్నా ఎదురీది చేరాలి ఒడ్డు దుఃఖాలు నీ చుట్టూ కంచేస్తున్నా ఎదిరించే తెగువుంటే కాదోయ్ అడ్డు చేయూతనిచ్చే ఆశే ఉంటే ఆ గామి రాదా నీకై గాయాన్ని దాటి చేరాలంటే నిన్నే నువ్వు గామివై గమ్యాన్నే చేధించే స్థైర్యంతో పదా ధైర్యాన్నే సంధించెయ్ వచ్చిందో ఆపదా గమ్యాన్నే చేధించే స్థైర్యంతో పదా ధైర్యాన్నే సంధించెయ్ వచ్చిందో ఆపదా
శివం పాట సాహిత్యం
చిత్రం: గామి (2024) సంగీతం: స్వీకర్ అగస్తి, నరేష్ కుమారన్ సాహిత్యం: శ్రీమణి గానం: శంకర్ మహదేవన్ నీ పయనం నీది కదా ఈ గమనం మారదుగా నీ గమ్యం చేరనిదే వెనకడుగే లేదు కదా హే మీలోని యుద్ధం శివం నీతోని యుద్ధం శివం నీకై నీ యుద్ధం శివమ్ శివమ్ శివమ్ శివం నీ గతమే నీ భవిత ఈ కధమే నీ కథగా నిదురించే నీ కలనే మెలకువలో నిలుపు పదా హరహర హరహర హర హరహర హరహర హర హర హర హర హర హర హర హర హర హర హర నీతో నిను వెతికేది నీలో నిను కలిపేది అన్వేషణ నీ కొరకను సంఘర్షణ ఆది ఇది హరహర హరహర హర హరహర హరహర హర హర హర హర హర హర ఈ లోకానికే నిను తాకే హక్కేదో లేకుందిరా నీ సహనానికే అది తీర్చే చుక్కాని దొరికిందిరా నీ నిన్నల్లోని గాయాలే నడిపించే దిక్సూచిరా ఈ స్పర్శల్లోని దాగున్న మరణాన్ని చెరిపెయ్యరా జీవం నీలోనే ప్రవహించగా నదిలా విశ్వం అడ్డున్నా దాటెళ్ళి మోక్షాగామివవ్వరా చావైనా సిద్ధం శివమ్ ప్రాణంకై యుద్ధం శివమ్ నీలానికి సంకెల శివమ్ శివమ్ శివమ్ శివం బడబాగ్నుల కాగనిది జఠరాగ్నుల కారనిది హిమగాలుల జ్వాల ఇది నీలోపల రేగినది హరహర హరహర హర హరహర హరహర హర హర హర హర హర హర వేధించే వేదననే సాధించే సాధనగా సాగినదో నీ గాధ తిరుగన్నది లేదు పదా హరహర హరహర హర హరహర హరహర హర హర హర హర హర హర హర హర హర హర హర ఏ సంచారివో ఏ శూన్యలోకాల సన్యాసివో ఏ కాంతి నువ్వో ఏకాంత లోకాల ఏకాకివో ఏ అంతానివో నీ ఆయువే పెంచు పంతానివో ఏ ప్రళయం ఇదో ఉపమానమే లేని తపమే ఇదో లక్ష్యం ఏ నింగి నక్షత్రమో అయినా దీక్షే మొదలెట్టి సాధించి మోక్షగామివవ్వరా హే మృత్యువుకే మోక్షం శివం శివం ఊపిరికే సాక్ష్యం శివం శివం ఆయువుకే రక్షే శివం శివం శివమ్ శివమ్ శివం హరహర హరహరా హరహర హరహరా
అరిరారో పాట సాహిత్యం
చిత్రం: గామి (2024) సంగీతం: స్వీకర్ అగస్తి, నరేష్ కుమారన్ సాహిత్యం: లక్ష్మీ ప్రియాంక గానం: హరిణి ఇవటూరి అరిరారో
No comments
Post a Comment