Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Devara: Part 1 (2024)




చిత్రం: దేవర (2024)
సంగీతం: అనిరుద్ రవిచందర్
నటీనటులు: యన్.టి.ఆర్, జాన్వి కపూర్
దర్శకత్వం: కొరటాలశివ 
నిర్మాతలు: సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ 
విడుదల తేది:27.09.2024



Songs List:



Fear Song సాహిత్యం

 
చిత్రం: దేవర (2024)
సంగీతం: అనిరుద్ రవిచందర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: అనిరుద్ రవిచందర్

అగ్గంటుకుంది సంద్రం
ఏహా
భగ్గున మండె ఆకసం
అరాచకాలు భగ్నం
ఏహా
చల్లారె చెడు సాహసం

జగడపు దారిలో
ముందడుగైన సేనానీ
జడుపును నేర్పగా
అదుపున ఆపే సైన్యాన్ని

దూకే ధైర్యమా జాగ్రత్త
రాకే తెగబడి రాకే
దేవర ముంగిట నువ్వెంత
దాక్కోవే

కాలం తడబడెనే
పొంగే కెరటము లాగెనే
ప్రాణం పరుగులయీ
కలుగుల్లో దూరెనే

దూకే ధైర్యమా జాగ్రత్త
దేవర ముంగిట నువ్వెంత దేవర

దేవరా ఓ

జగతికి చేటు చేయనేల
దేవర వేటుకందనేల
పదమే కదమై దిగితే ఫెళ ఫెళ

కనులకు కానరాని లీల
కడలికి కాపయ్యింది వేళ
విధికే ఎదురై వెళితే విలవిలా

అలలయే ఎరుపు నీళ్ళే
ఆ కాళ్ళను కడిగెరా
ప్రళయమై అతడి రాకే
దడ దడ దడ దండోరా

దేవర మౌనమే
సవరణ లేని హెచ్చరిక
రగిలిన కోపమే
మృత్యువుకైన ముచ్చెమట

దూకే ధైర్యమా జాగ్రత్త
రాకే తెగబడి రాకే
దేవర ముంగిట నువ్వెంత
దాక్కోవే

కాలం తడబడెనే
పొంగే కెరటము లాగెనే
ప్రాణం పరుగులయీ
కలుగుల్లో దూరెనే

దూకే ధైర్యమా జాగ్రత్త
దేవర ముంగిట నువ్వెంత దేవర

దేవరా ఓ




చుట్టమల్లే చుట్టేస్తాంది.. పాట సాహిత్యం

 
చిత్రం: దేవర (2024)
సంగీతం: అనిరుద్ రవిచందర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: శిల్పా రావు

చుట్టమల్లే చుట్టేస్తాంది.. తుంటరి చూపు..
ఊరికే ఉండదు కాసేపు...
అస్తమానం నీలోకమే నా మైమరపు..
చేతనైతే నువ్వే నన్నాపు...
రా.. నా నిద్దర కులాసా.. నీ కలలకిచ్చేశా..
నీ కోసం వయసు వాకిలి కాశా..
రా.. నా ఆశలు పోగేశా.. నీ గుండెకు అచ్చేశా..
నీ రాకకు రంగం సిద్దం చేశా..

ఎందుకు పుట్టిందో పుట్టింది.. ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది..
పుడతానే నీ పిచ్చి పట్టింది..నీ పేరు పెట్టింది..
వయ్యారం ఓణీ కట్టింది.. గోరింట పెట్టింది..
సామికి మొక్కులు కట్టింది.. చుట్టమల్లే చుట్టేస్తాంది.. 
చుట్టమల్లే చుట్టేస్తాంది..హాహా..అరారారే
చుట్టమల్లే చుట్టేస్తాంది.. తుంటరి చూపు..
ఊరికే ఉండదు కాసేపు..

చరణం 1
మత్తుగా మెలేసింది.. నీ వరాల మగసిరి
హత్తుకోలేవా మరి సరసన చేరి..
వాస్తుగా పెంచానిట్టా వంద కోట్ల సొగసిరి..
ఆస్తిగా అల్లేసుకో కోసరి కోసరి..
చెయ్యరా ముద్దుల దాడి.. ఇష్టమే నీ సందడి..
ముట్టడించే ముట్టేసుకోలేవా ఓసారి చేజారి..
రా.. ఈ బంగరు నెక్లేసు ఈ ఒంటికి నచ్చట్లే..
నీ కౌగిలితో నన్ను సింగారించు..
రా.. ఏ వెన్నెల జోలాలి..నన్ను నిద్దర పుచ్చట్లే..
నా తిప్పలు కొంచెం ఆలోచించు..

ఎందుకు పుట్టిందో పుట్టింది.. ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది..
పుడతానే నీ పిచ్చి పట్టింది..నీ పేరు పెట్టింది..
వయ్యారం ఓణీ కట్టింది.. గోరింట పెట్టింది..
సామికి మొక్కులు కట్టింది.. చుట్టమల్లే చుట్టేస్తాంది.. 
చుట్టమల్లే చుట్టేస్తాంది..హాహా..అరారారే
చుట్టమల్లే చుట్టేస్తాంది.. తుంటరి చూపు..
ఊరికే ఉండదు కాసేపు..

No comments

Most Recent

Default