Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Manmadha Leela (1976)




చిత్రం: మన్మధలీల (1976)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: వీటూరి 
గానం: యస్. పి. బాలు, పి. సుశీల, ఎల్. ఆర్. ఈశ్వరి
నటీనటులు: కమలహాసన్, జయప్రద, వై.విజయ, జయవిజయ, సునందిని, హేమా చౌదరి, హలం 
దర్శకత్వం: కె. బాలచందర్ 
నిర్మాత: మాగంటి రవీంద్రనాథ్ చౌదరి 
నిర్మాణత: విజయబాపినీడు
విడుదల తేది: 27.02.1976

(గమనిక: వేటూరి సుందరరామ మూర్తి, వీటూరి వెంకట సత్య సూర్యనారాయణమూర్తి ఇద్దరు వేరు వేరు, కానీ వీరిద్దరు పాటలు రచయితలు. ఈ సినిమాలో పాటలు రాసింది వీటూరి వెంకట సత్య సూర్యనారాయణమూర్తి)




Songs List:



నిన్నొక మేనక..పాట సాహిత్యం

 
చిత్రం: మన్మధలీల (1976)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: వీటూరి 
గానం: యస్. పి. బాలు

పల్లవి : 
ఫట్‌ ఫట్‌ పడాపడా ఫట్... ఛట్‌ ఛట్‌ ఫట్‌ ఫట్‌.. పడాపడా ఫట్ ఛట్‌ ఛట్‌
నిన్నొక మేనక.. నేడొక ఊర్వశి
నిన్నొక మేనక నేడొక ఊర్వశి...  ఏరా తమ్ముడు ఎవరీ అమ్మడూ
ఏరా తమ్ముడు ఎవరీ అమ్మడూ
నీతో వచ్చింది మాయలమారి... నన్నూ మెచ్చింది రాజకుమారి
ఫట్‌ ఫట్‌ పడాపడా ఫట్... ఛట్‌ ఛట్‌ ఫట్‌ ఫట్‌... పడాపడా ఫట్ ఛట్‌ ఛట్‌  

చరణం: 1
ఇంద్రుని కెందరు ఇంతులు కలరో
చంద్రుని కెందరు సతులున్నారో...  కొందరు మనకూ ఉండాలిరా
ఏరా బేట మనలో మాట ఎవరీ పిట్ట ఎన్నో వేట
ఇందులో నీ కంటే మొనగాన్నిరోయ్‌
ఫట్‌ ఫట్‌ పడాపడా ఫట్... ఛట్‌ ఛట్‌ చడాచట్.... ఫట్‌ ఫట్‌ పడాపడా ఫట్.. ఛట్‌ ఛట్‌ చడాచట్  

చరణం: 2 
దేశమునిండా పడుచులుండగా
దేవుడు యిచ్చిన కన్నులుండగా  జాతర చేయర మహరాజా
జాతి నీతి పాతర వేసి
న్యాయం గీయం గోతిలో పారి.. సరదా తీర్చుకో యువరాజా
నిన్నొక మేనక నేడొక ఊర్వశి... నిన్నొక మేనక నేడొక ఊర్వశి 

చరణం: 3
కండల్లోన పొగరే వుంటే చేతుల్లోన చిల్లర వుంటే జల్సా చేద్దాం ఒక పూట
పాపం లేదు పుణ్యం లేదు...  హద్దు పద్దు అసలే వద్దు
ఇదిరా బేటా మనలో బాట
మేరిజా.. మేరిజా అయ్‌ మేరా బుల్‌ బుల్‌
మేరిజా.. మేరిజా అయ్‌ మేరా బుల్‌ బుల్‌
మొహబత్‌ హో గయి కహానీ కైసాహయ్‌
మొహబత్‌ హో గయి కహానీ కై సాహయ్‌
దిల్‌ ఏక్‌ మందిర్‌ హం దోనో కుషుబూ హై
యాదోంకి బారాత్‌  ముజుకో దీదర్‌ హై




కుశలమేనా కుర్రదానా పాట సాహిత్యం

 
చిత్రం: మన్మధలీల (1976)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: వీటూరి 
గానం: యస్. పి. బాలు, పి. సుశీల

పల్లవి: 
కుశలమేనా కుర్రదానా  నీ హృదయమూ శాంతించెనా
కుశలమేనా భామలంతా మీ విషయమూ నేనెరుగనా
కుశలమేనా కుర్రదానా నీ హృదయమూ శాంతించెనా
కుశలమేనా.. భామలంతా  మీ విషయమూ నేనెరుగనా 

చరణం: 1 
నన్నెందరో కోరి కోరి వెంటాడినా
నన్నెందరో కోరి కోరి వెంటాడినా ఉండలేక నే తిరిగినా
ఊరిలోన విహరించినా నా ప్రాణం నీవే సుమా

స్త్రీ అన్నది ఒక్కసారె ప్రేమించునే
స్త్రీ అన్నది ఒక్కసారె ప్రేమించునే..
ఒకరితోనే జీవించునే సుఖములిచ్చి లాలించునే మా నీతి మీకున్నదా
మీ విషయమూ నేనెరుగనా మీ విషయమూ నేనెరుగనా   

చరణం: 2
పసిపిల్లలే ఇంట ఉంటే యిల్లాలికి
పసిపిల్లలే ఇంట ఉంటే యిల్లాలికి
కొంత శాంతి ప్రతి దానికి ఆ బాగ్యం కరువైనది
మీ మనసే రాయి అయినది
మీ మనసే రాయి అయినది
ఈ రోజున తెలుసుకుంటిని ఈ వేదన పిల్లలుంటే ప్రేమించనా
కోరుకుంటే కాదంటినా ఒక్కటైతే యిక ఆగునా 

చరణం: 3
నా పెన్నిధి నా మీద దయగన్నది కోడెవయసు తోడయినది
పక్కమీద చోటున్నది ఇద్దరినీ రమ్మన్నది
ఇలా కోరితే కోరుకున్న సుఖం యివ్వనా
పరులకన్న హీనమయితినా ఆ మాత్రం కవ్వించనా..  
ప్రేమించి మురిపించనా 




హల్లో మైడియర్‌ రాంగ్‌ నెంబర్‌ పాట సాహిత్యం

 
చిత్రం: మన్మధలీల (1976)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: వీటూరి 
గానం: యస్. పి. బాలు, ఎల్. ఆర్. ఈశ్వరి

పల్లవి: 
హల్లో హల్లో హల్లో మైడియర్‌ రాంగ్‌ నెంబర్‌
హల్లో హల్లో హల్లో మైడియర్‌ రాంగ్‌ నెంబర్‌
గొంతుకే వింటే ఎంత మధురం.. చెంతకే వస్తే చాలు స్వర్గం
గొంతుకే వింటే ఎంత మధురం.. చెంతకే వస్తే చాలు  స్వర్గం
నీ వింత శృంగారం
నీ వింత శృంగారం ఒకమారు చూపగల రాదా 
హల్లో...
హల్లో మైడియర్‌ రాంగ్‌ నెంబర్‌
చూపితే ఏముంటుంది అందం ఎందుకో నీలో ఇంత తాపం
చూపితే ఏముంటుంది అందం ఎందుకో నీలో ఇంత తాపం
అనుభవం ఎంతో వుంది ఆగితే బాగుంటుంది
హల్లో.. హల్లో మైడియర్‌ రాంగ్‌ నెంబర్‌
చూపితే ఏముంటుంది అందం ఎందుకో మీలో ఇంత తాపం

చరణం: 1
కవుల కల్పనవో... నో
మరుమల్లె తేనెవో...  నో
కవుల కల్పనవో మరుమల్లె తేనెవో
శిల్ప సుందరివో తెల్పగా రావో
పూవునై వస్తే ఆగరే మీరు - రియల్లీ
పూవునై వస్తే ఆగరే మీరు మధువులే కోరి గొడవ పెడతారు ఐడోంట్‌ మైండ్‌
నీ వింత శృంగారం ఒక మారు చూపగా రావా

హల్లో హల్లో మైడియర్‌ రాంగ్‌ నెంబర్‌
గొంతుకే వింటే ఎంత మధురం.. ఊ ఊ
చెంతకే వస్తే చాలు స్వర్గం.. ఊ ఊ 

చరణం: 2
హృదయాన రాణిగా ఎవరున్నారు
రాణి వైతే నువ్వే ఇంకెవరూ లేరు
వేచి వుంటే పోదా  మోజు తీర్చరాదా
వేచి వుంటే పోదా మోజు తీర్చరాదా
మురిపాలు చాలండిbమురిపించ వద్దండి  

హల్లో హల్లో మైడియర్‌ రాంగ్‌ నెంబర్‌
గొంతుకే వింటే ఎంత మధురం చెంతకే వస్తే చాలు స్వర్గం
నీ వింత శృంగారం ఒక మారురు చూపగా రావా హల్లో హల్లో






మనిషినే దైవంగా పాట సాహిత్యం

 
చిత్రం: మన్మధలీల (1976)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: వీటూరి 
గానం: యస్. పి. బాలు

మనిషినే దైవంగా 

No comments

Most Recent

Default