Image Source Link
చిత్రం: హాయ్ నాన్న (2023) సంగీతం: హేషం అబ్దుల్ వహేబ్ నటీనటులు: నాని, మృణాల్ ఠాకూర్ దర్శకత్వం: సౌరవ్ నిర్మాతలు: మోహన్ చెరుకూరి, డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల విడుదల తేది: 21.12.2023
Songs List:
సమయమా..!! పాట సాహిత్యం
చిత్రం: హాయ్ నాన్న (2023) సంగీతం: హేషం అబ్దుల్ వహేబ్ సాహిత్యం: అనంత శ్రీరాం గానం: అనురాగ్ కులకర్ణి , సితార కృష్ణ కుమార్ నీ సా సా గ స, నీ సా సా గ స నీ సా సా గ స నీ సా మ గ స నీ సా సా గ స నీ సా సా గ స నీ సా సా గ స నీ సా మా గ స సమయమా..!! భలే సాయం చేశావమ్మా ఒట్టుగా, ఒట్టుగా కనులకే..!! తన రూపాన్నందిచావే గుట్టుగా ఓ ఇది సరిపోదా… సరె సరె తొరపడకో తదుపరి కథ ఎటుకో ఎటు మరి తన నడకో చివరికి ఎవరెనకో సమయమా..!! భలే సాయం చేశావమ్మా ఒట్టుగా, ఒట్టుగా కనులకే..!! తన రూపాన్నందిచావే గుట్టుగా హో తను ఎవరే..? నడిచే తారా, తళుకుల ధారా తను చూస్తుంటే, రాదే నిద్దుర పలికే ఏరా… కునుకే ఔరా అలలై పొంగే అందం అది తన పేరా..! ఆకాశాన్నే తాగేసిందే తన కన్నుల్లో నీలం చూపుల్లోనే ఏదో ఇంద్రజాలం బంగారు వానల్లో నిండా ముంచే కాలం చూస్తామనుకోలేదే నాలాంటోళ్ళం భూగోళాన్నే తిప్పేసే ఆ బుంగమూతి వైనం చూపిస్తుందే తనలో ఇంకో కోణం చంగావి చెంపల్లో చెంగుమంటు మౌనం చూస్తూ చూస్తూ తీస్తువుందే ప్రాణం తను చేరిన ప్రతి చోటిలా చాలా చిత్రంగున్నదే తనతో ఇలా ప్రతి జ్ఞాపకం ఛాయా చిత్రం అయినదే సరె సరె తొరపడకో తదుపరి కథ ఎటుకో ఓ ఓ ఎటు మరి తన నడకో చివరికి ఎవరెనకో సమయమా..!! భలే సాయం చేశావమ్మా ఒట్టుగా, ఒట్టుగా కనులకే..!! తన రూపాన్నందిచావే గుట్టుగా ఓ ఇది సరిపోదా… సమయమా..!!!
గాజు బొమ్మా పాట సాహిత్యం
చిత్రం: హాయ్ నాన్న (2023) సంగీతం: హేషం అబ్దుల్ వహేబ్ సాహిత్యం: అనంత శ్రీరాం గానం: హేషం అబ్దుల్ వహేబ్ ఇటురావే నా గాజు బొమ్మా నేనే నాన్న అమ్మా ఎదనీకు ఉయ్యాల కొమ్మా నిన్ను ఊపే చెయ్యే ప్రేమా వాలిపో... ఈ గుండెపై...నే... ఆడుకో... ఈ గూటిలో...నే... దూరం పోబోకు మా చిన్ని చిన్ని పాదాలని నేలై నే మోయనా చిందే క్షణంలో నువు కింద పడినా ఉంటావు నా నీడన నీ చెంతే రెండు చెవులుంచి బయలెల్లనా ఏ మాట నీ నోట మొగించినా వెనువెంటే వింటానే రానా నిమిషంలోన నే నన్నే వదిలేసైనా తుళ్ళే తుళ్ళే నీ శ్వాసకి కాపై నేనుండనా ఉచ్వాస నైన నిశ్వాస నైన మేలెంచి పంపించనా ఏ కాంతులైన అవి నన్ను దాటాకనే ఆ రాజు చేరాలి నీ చూపునే నీ రెప్పై ఉంటానే పాపా కంటి పాపా నా పాపా కంటి పాపా ఇటురావే నా గాజు బొమ్మా నేనే నాన్న అమ్మా ఎదనీకు ఉయ్యాల కొమ్మా నిన్ను ఊపే చెయ్యే ప్రేమా వాలిపో... ఈ గుండెపై...నే... ఆడుకో... ఈ గూటిలో...నే... దూరం పోబోకు మా
No comments
Post a Comment