Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Peddillu Chinnillu (1979)






చిత్రం: చిన్నిల్లు పెద్దిల్లు (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
నటీనటులు: దాసరి నారాయణరావు, మురళీమోహన్, మోహన్ బాబు, ప్రభ
దర్శకత్వం: దాసరి నారాయణరావు
నిర్మాత: ఎమ్.కె.మావుళ్లయ్య
విడుదల తేది: 11.05.1979



Songs List:



ఆరోగ్యమే మహా భాగ్యం పాట సాహిత్యం

 
చిత్రం: చిన్నిల్లు పెద్దిల్లు (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: జానకి 

వన్, టూ - డూ డూ
త్రీ, ఫోర్ - లిటిల్ మోర్
ఫైవ్, సిక్సు - ఫిక్స్ ఫిక్స్
సెవెన్, ఎయిట్ - దట్స్ రైట్

ఆరోగ్యమే మహా భాగ్యం ఛఛఛ
అందరికీ అది సౌభాగ్యం ఛఛఛ
కాదంటే చఛఛ వద్దంటే చచచ 
వదిలేస్తే చ చచ
నో నో వదిలేస్తే నా దౌర్భాగ్యం
శత కోటి మన్మధాకార
జితచంద్ర సుందరాకారా
సిరిమల్లెకన్న సుకుమారా
కౌగింట చేర మనసార
యిటు రార యిట రారు

హో మిస్టర్ వెంకట్రామయ్య అటుకాదు ... యిటు
నీ యింటి పంచదార నినుచేర మనసార
పొరుగింటి పుల్లకూర రుచియా
కమాన్ ఛేంజ్ ది ఐటం

ఎత్తుదించు - ఎత్తుదించు
వన్.. ఛఛఛ టు ఛఛఛ త్రీ ఛఛఛ
ఫోర్-ఛఛఛ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్
సెవెన్ ఎయిట్
ఆ లాల లలలా

ఈదాలి చేపల్లె తమరు
తేలాలి పడవల్లె తమరు
చేతులూపుతూ - కాళ్ళు కొడుతూ
యిలాగే యిలాగే ఈదాలి తమరు

స్విమ్ లైక్ ఎ ఫిష్
ఫ్లోట్ లైక్ ఎ బోట్
కమాన్ ముందుకి ఆ ఆ

ఓ మిస్టర్ వెంకట్రామయ్య
ఆరోగ్యమే మహాభాగ్యం
అందరికీ అది సౌభాగ్యం

హెర్ ఈజ్ వెల్త్
వెల్త్ ఈజ్ లైఫ్
లైఫ్ తజ్ వైఫ్

వైఫ్......





ఒక అబ్బాయి ఒక అమ్మాయి పాట సాహిత్యం

 
చిత్రం: చిన్నిల్లు పెద్దిల్లు (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి.బాలు

ఒక అబ్బాయి ఒక అమ్మాయి
ఉంటేనే ప్రేమకథా - ఒకటైతే సుఖాంతం
విడిపోతే విషాదాంతం - తొలిచూపులో చూపులో
రాపిడి పుడుతుంది - ముని మాపులో ఎదమాటలో అలజడి పెడుతుంది
నిద్దర పగపడుతుంది
కోరిక తెగబడుతుంది
యిద్దరు కలిసేదాకా హా .. హా
ఎండైన, వానైన పూలైన, ముల్లైన
అంతా ఒక లాగుంటుంది

|| ఒక అబ్బాయి||

ఏ తోటనో ఏ బాటనో -- కలయిక అవుతాయి
బులపాటము మొగమాటము
తికమక పెడతాయి
మనసులు తడి అవుతాయి
పెదవులు పొడి అవుతాయి
ఇద్దరి అవస్థచూసీ
ఈచేయి ఆచేయి ఈ ఒళ్ళు ఆ ఒళ్ళు
ఒకటై తీరుపు చెబుతాయి.

|| ఒక అబ్బాయి||




పచ్చబొట్టు పొడిపించు బావా పాట సాహిత్యం

 
చిత్రం: చిన్నిల్లు పెద్దిల్లు (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: దాసం గోపాల కృష్ణ 
గానం: సుశీల 

ఏవే నిన్ను సూత్తంటే ఒక పాటొకటి
పాడించుకోవాలని పిత్తందే - పాడుతావా పాడు
ఊహు హు .. సిగ్గేస్తది
సిగ్గులేదూ - ఎగ్గూ లేదు పాడవేబాబు
పచ్చాబొట్టు పొడిపించు బావ .. ఓ బావ 
పావల పరికిచ్చి పొడిపించు బావ
ఇరుగు పొరుగు చూడకుండ
అత్తామావ కానకుండ - బావ
పొడిపించు బావ

సింహాచలం కొండొకటి కొండమీద గుడి ఒకటి
గుడిమీద బొమ్మొకటి -- కూకున్న బొమ్మొకటి
నుంచున్న బొమ్మొకటి - వంగున్న బొమ్మొకటి
పడుకున్న బొమ్మొకటి బొమ్మ పక్కన బొమ్మొకటి
నా చేతిమీద సోకుతీర పొడిపించు బావ

యమునా నది ఏటిగట్టు -- గట్టు మీద పొన్న చెట్టూ
అబ్బో సంపుతున్నావే మార్చు
యమునా నది ఏటిగట్టు -- గట్టుమీద పొన్నచెట్టు
చెట్టుమీద గోపాలుడు - చెట్టుకింద గోపికలు
జలకాలాడే గోపికలు మోగ్గల్లాంటి గోపికలు
సిగ్గుపడే గోపికలు - దణ్ణా లెట్టిన గోపికలు
నా దండమీద కందకుండ పొడిపించు బావ

ఏవే నిన్ను సూత్తంటే ఒక పాటొకటి
పాడించుకోవాలని పిత్తందే - పాడుతావా పాడు
ఊహు హు .. సిగ్గేస్తది
సిగ్గులేదూ - ఎగ్గూ లేదు పాడవేబాబు
పచ్చాబొట్టు పొడిపించు బావ .. ఓ బావ 
పావల పరికిచ్చి పొడిపించు బావ
ఇరుగు పొరుగు చూడకుండ
అత్తామావ కానకుండ - బావ
పొడిపించు బావ

సింహాచలం కొండొకటి -- కొండమీద గుడి ఒకటి
గుడిమీద బొమ్మొకటి -- కూకున్న బొమ్మొకటి
బొమ్మ పక్కన బొమ్మొకటి





పెట్టరా పెద్దిల్లు చిన్నిల్లు సోదరా పాట సాహిత్యం

 
చిత్రం: చిన్నిల్లు పెద్దిల్లు (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: దాసం గోపాల కృష్ణ 
గానం: యస్.పి.బాలు

స్వర్గమనేది పైన ఎక్కడో లేదురా
ఎర్రోళ్లు తెలియక వెతుకుతున్నార్రా
అంతా యిక్కడే .. ఈ సేతుల్లోనే ఉందిరా సన్నాసి
పెట్టరా పెద్దిల్లు చిన్నిల్లు సోదరా
అప్పుడే ఎడా పెడా ఛాన్సురా
ఎత్తరా లోకాన్ని మీదికి
దించరా స్వర్గాన్ని కిందికి
కిందో ఇల్లు పైనో ఇల్లు
పై నుంచి కిందకి, కిందనుంచి పైకి
ఎక్కుతూ దిగుతూ హేపీగా వున్నాడు
ఏడుకొండలవాడు

నెత్తిమీద ఒకరు -- తొడమీద ఒకరు
పై నుంచి కిందకి కిందనుంచి పైకి
చూస్తూ నవ్వతూ హేపీగా వున్నాడు శంకరుడు
అటు ఇల్లు - యిటు ఇల్లు
ఎటుచూసిన ఇల్లాల్లే
యింటి నుంచి యింటికి
మారి మారి కోరి కోరి 
హేపీగా వున్నారు. శ్రీకృష్ణుడు
అందుకే మనం - మనవంటే మనవే

ఏక్ దో - వన్ టు- ఒకటి... రెండు
ఫిఫ్టీ ఫిఫ్టీ

ఒకే ఇలు ఒకే పెళ్లి అన్నాడు శ్రీరాముడు
కడకేమయ్యాడు అడవుల పాలయ్యాడు
ఒకే మాట ఒకే మనువు అన్నాడు హరిశ్చంద్రుడూ
ఈయనే వయ్యాడు ? ఆలిని అమ్మేశాడు
చివరికి కాటికే కాపరయ్యాడూ

అందుకే మనం మనవంటే మనవే
ఏక్..దో - వన్-టూ - ఒకటి.. రెండు
ఫిఫ్టీ ఫిఫ్టీ





సోమవారం సోగ్గాడ పాట సాహిత్యం

 
చిత్రం: చిన్నిల్లు పెద్దిల్లు (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: ఆత్రేయ 
గానం: L.R.ఈశ్వరి

సోంవారం సోగ్గాడా.
మంగళారం మొనగాడా
ఆరువారాలు అలసిపోయి
ఆదివారం కోరివచ్చావా.. ఓ రాత్రగాడా
అదివారం శెలవు రోజురా

బట్టలు కొట్టు మూశారు నగలు కొట్టు మూశారు
చైనాబజారు మూశారు మందులంగడి మూశారు
ఆదివారం కోరివచ్చావా - ఓ రాత్రగాడా
ఆదివారం శెలవు రోజురా

||సోంవారం||

ఒంటిదాన్ని అన్నాను .. ఇంటి నెంబరు అడిగావు
నను ఇంటిదాన్ని చేస్తావని...ఎంతో నీపై ఆశపడి
తాళిబొట్టూ చెయ్యమన్నా- మేళగాడ్ని ఉండమన్నా
నువ్వురాక నవ్వులాట అయ్యాక
ఆదివారం కోరివచ్చావా - ఓ రాత్రగాడా
ఆదివారం శెలవు రోజురా

||సోంవారం||

చలువ దుప్పటి వేశాను - జాజిపువ్వులు పరిచాను
ఆవుపాలు కాశాను - బాదంపప్పు కలిపాను
అయ్యవార్ని లగ్నమడిగి.. అన్నీ సిద్ధం చేసుకుంటే
పూలు వాడి పాలు ఆరిపోయాక
ఆదివారం కోరి వచ్చావా -- ఓ రాత్రగాడా
ఆదివారం శెలవు రోజురా

||సోంవారం||

No comments

Most Recent

Default