Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Koduku Kodalu (1972)






చిత్రం: కొడుకు కోడలు (1972)
సంగీతం: కె.వి.మహదేవన్
నటీనటులు: నాగేశ్వర రావు, వాణిశ్రీ 
దర్శకత్వం: పి.పుల్లయ్య 
నిర్మాత: వి.వెంకటేశ్వరులు
విడుదల తేది: 22.12.1972



Songs List:



గొప్పోల్ల చిన్నది పాట సాహిత్యం

 
చిత్రం: కొడుకు కోడలు (1972)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: ఘంటసాల 

పల్లవి:
గొప్పోళ్ళ చిన్నది గువ్వల్లే ఉన్నది
కొండమీది కోతల్లే చిక్కనంటది
చెట్టుకొమ్మల్లే గుండెను ఊపేస్తది

చరణం: 1
నడుమెంత చిన్నదో నడకంత చక్కంది
చూపెంత చురుకైందో రూపంత సొగసైంది
నడుమెంత చిన్నదో నడకంత చక్కంది
చూపెంత చురుకైందో రూపంత సొగసైంది

మనిషేమో దుడుకైంది వయసేమో ఉడుకైంది
మనిషేమో దుడుకైంది వయసేమో ఉడుకైంది
మనసేలా ఉంటుందో అది ఇస్తేనే తెలిసేది

గొప్పోళ్ళ చిన్నది గువ్వల్లే ఉన్నది
కొండమీది కోతల్లే చిక్కనంటది
చెట్టుకొమ్మల్లే గుండెను ఊపేస్తది

చరణం: 2
ఒంటరిగా వచ్చిందంటే జంటకోసమై ఉంటుంది
పేచితో మొదలెట్టిందంటే ప్రేమ పుట్టే ఉంటుంది
హ.. ప్రేమ పుట్టే ఉంటుంది

కొమ్మమీది దోరపండు కోరుకుంటే చిక్కుతుందా
నాకు దక్కుతుందా హ హ..
కొమ్మమీది దోరపండు కోరుకుంటే చిక్కుతుందా
కొమ్మ పట్టి గుంజితేనే కొంగులోకి పడుతుంది

గొప్పోళ్ళ చిన్నది గువ్వల్లే ఉన్నది
కొండమీది కోతల్లే చిక్కనంటది
చెట్టుకొమ్మల్లే గుండెను ఊపేస్తది

చరణం: 3
ఊరుకున్న కుర్రవాడ్ని ఉడికించుకు పోతుంది
మాపటికి పాపమంత వేపించుకు తింటుంది
ఒక్క చోట నిలువలేక పక్క మీద ఉండలేక
ఆ టెక్కు నిక్కు తగ్గి రేపిక్కడికే తానొస్తుంది

గొప్పోళ్ళ చిన్నది గువ్వల్లే ఉన్నది
కొండమీది కోతల్లే చిక్కనంటది
చెట్టుకొమ్మల్లే గుండెను ఊపేస్తది
లలలేలాలాలేలల లలలేలాలాలేలల



నువ్వూ నేనూ ఏకమైనాము పాట సాహిత్యం

 
చిత్రం: కొడుకు కోడలు (1972)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: ఘంటసాల, యస్. జానకి 

పల్లవి:
నువ్వూ నేనూ ఏకమైనాము
నువ్వూ నేనూ ఏకమైనాము
ఇద్దరము మనమిద్దరము ఒక లోకమైనామూ
లోకమంతా ఏకమైనా వేరు కాలేము వేరు కాలేము
నువ్వూ నేనూ ఏకమైనాము

చరణం: 1
కళ్ళు నాలుగు కలిపి మనమూ ఇల్లు కడద్దామూ
అందులో మన చల్ల చల్లని వలపు దీపం నిలుపుకుంద్దాము

కళ్ళు నాలుగు కలిపి మనమూ ఇల్లు కడద్దామూ
అందులో మన చల్ల చల్లని వలపు దీపం నిలుపుకుంద్దాము

పసిడి మనసులు పట్టెమంచం వేసుకుంద్దాము
అందులో మన పడుచు కోర్కెల మల్లెపూలు పరుచుకుంద్దాము

నువ్వూ నేనూ ఏకమైనాము

చరణం: 2
చెలిమితో ఒక చలువపందిరి వేసుకుంద్దాము
కలల తీగల అల్లిబిల్లిగా అల్లుకుంద్దాము

ఆ అల్లికలను మన జీవితాలకు పోల్చుకుంద్దాము
ఏ పొద్దు కానీ వాడిపోనీ పువ్వులవుద్దామూ

నువ్వూ నేనూ ఏకమైనాము

చరణం: 3
లేత వెన్నెల చల్లదనము నువ్వు తెస్తావూ
అందులో నీరెండలోని వెచ్చదనము నువ్వు ఇస్తావు

లేత వెన్నెల చల్లదనము నువ్వు తెస్తావూ
అందులో నీరెండలోని వెచ్చదనము నువ్వు ఇస్తావు

సూర్యచంద్రులు లేని జగతిని సృష్టి చేద్దాము
అందులో ఈ సృష్టికెన్నడు లేని సొగసు మనము తెద్దాము

నువ్వూ నేనూ ఏకమైనాము
ఇద్దరము మనమిద్దరము ఒక లోకమైనామూ
లోకమంతా ఏకమైనా వేరు కాలేము వేరు కాలేము
నువ్వూ నేనూ ఏకమైనాము ఆహ హా..ఆహ ఆహ హా...




చేయి చేయి తగిలింది పాట సాహిత్యం

 
చిత్రం: కొడుకు కోడలు (1972)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: ఘంటసాల, పి. సుశీల 

పల్లవి:
చేయి చేయి తగిలింది హాయి హాయిగా ఉంది
పగలు రేయిగా మారింది పరువం ఉరకలు వేసింది
చేయి చేయి తగిలింది హాయి హాయిగా ఉంది
పగలు రేయిగా మారింది పరువం ఉరకలు వేసింది

చరణం: 1
నా వలపే తలుపును తట్టిందీ
నా వలపే తలుపును తట్టిందీ
నీ మనసుకు మెలుకువ వచ్చింది
నీ వయసుకు గడియను తీసింది

నీ పిలుపే లోనికి రమ్మందీ
నీ పిలుపే లోనికి రమ్మందీ
నా బిడియం వాకిట ఆపింది
నా సిగ్గే మొగ్గలు వేసింది

చేయి చేయి తగిలింది హాయి హాయిగా ఉంది
పగలు రేయిగా మారింది పరువం ఉరకలు వేసింది

చరణం: 2
సిగ్గుతో నీవు నిలుచుంటే నీ బుగ్గల నిగ్గులు చూస్తుంటే
సిగ్గుతో నీవు నిలుచుంటే నీ బుగ్గల నిగ్గులు చూస్తుంటే
ఊపిరాడక నా మనసు ఉక్కిరిబిక్కిరి అయ్యింది

వాకిట నేను నిలుచుంటే ఆకలిగా నువు చూస్తుంటే
వాకిట నేను నిలుచుంటే ఆకలిగా నువు చూస్తుంటే
ఆశలు రేగి నా మనసు అటు ఇటు గాక నలిగింది

చేయి చేయి తగిలింది హాయి హాయిగా ఉంది
పగలు రేయిగా మారింది పరువం ఉరకలు వేసింది

చరణం: 3
నీ చూపే మెత్తగ తాకింది
నీ చూపే మెత్తగ తాకింది నా చుట్టూ మత్తును చల్లింది
నిను చూస్తూ ఉంటే చాలంది

నీ సొగసే నిలవేసింది
నీ సొగసే నిలవేసింది
నా మగసిరికే సరితూగింది నా సగమును నీకు ఇమ్మంది
లా లా లా లా లా

చేయి చేయి తగిలింది హాయి హాయిగా ఉంది
పగలు రేయిగా మారింది పరువం ఉరకలు వేసింది
 




నీకేమి తెలుసు నిమ్మకాయ పులుసు పాట సాహిత్యం

 
చిత్రం: కొడుకు కోడలు (1972)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: ఘంటసాల, పి.సుశీల 

పల్లవి:
నీకేం తెలుసూ - నిమ్మకాయ పులుసూ
నీకేం తెలుసూ నిమ్మకాయ పులుసూ
నేనంటే నీకెందుకింత అలసు

నీకేం తెలుసూ
నీకేం తెలుసూ నిమ్మకాయ పులుసూ
నా వద్ద సాగదు నీ దురుసూ
నీకేం తెలుసూ

చరణం: 1 
చేయాలి కోడలూ మామగారి సేవలూ
అబ్బాయి మనసు మరమ్మత్తులూ
భలే భలే గమ్మత్తులూ

వద్దు నీసేవలూ వద్దు మరమ్మత్తులూ
చాలమ్మ చాలు నీ అల్లరులూ
వద్దు నీసేవలూ వద్దు మరమ్మత్తులూ
చాలమ్మ చాలు నీ అల్లరులూ
చాలు నీ అల్లరులూ

అల్లర్లు ఎన్నాళ్ళు వేసేయ్ మూడుముళ్ళు - ఆహా
అల్లర్లు ఎన్నాళ్ళు వేసేయ్ మూడుముళ్ళు
ఆపైన ఆడాళ్ళు బుద్ధిమంతులు ఎంతో బుధిమంతులు  

నీకేం తెలుసూ?
నీకేం తెలుసూ నిమ్మకాయ పులుసూ
నావద్ద సాగదు నీ దురుసూ
హా నీకేం తెలుసూ

చరణం: 2 
మగువకు సిగ్గే సింగారము 
మమతున్న మనసే బంగారము
మగువకు సిగ్గే సింగారము 
మమతున్న మనసే బంగారము 

ఆ బంగారమొకరికె ఇచ్చేది
ఆ సంగతి తెలిసే అడిగేది నేనడిగేది

నీకేం తెలుసూ
నీకేం తెలుసూ నిమ్మకాయ పులుసూ
నావద్ద సాగదు నీ దురుసూ
నీకేం తెలుసూ 

చరణం: 3 
వయసుంది సొగసుంది వరసైన బావా నచ్చింది తీసుకోలేవా
వయసుంది సొగసుంది వరసైన బావా నచ్చింది తీసుకోలేవా
వయసుంటే చాలునా సొగసుంటే తీరునా హ్హా
అవి చెట్టు చేమకు లేవా

చెట్టైన తీగను చేపట్టి ఏలదా
చెట్టైన తీగను చేపట్టి ఏలదా
ఆ పాటి మనసైన లేదా
నీకాపాటి మనసైన లేదా 

నీకేం తెలుసూ
నీకేం తెలుసూ ఆడదాని మనసు
నేనంటే నీకెందుకింత అలుసూ
నీకేం తెలుసు అసలైన మనసు
నావద్ద సాగదు నీ దురుసూ

నీకేం తెలుసూ ?
నీకేం తెలుసూ ?
నీకేం తెలుసూ ?
నీకూ.. - ఆ....





నువ్వూ నేనూ పాట సాహిత్యం

 
చిత్రం: కొడుకు కోడలు (1972)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: పి.సుశీల 

నువ్వూ నేనూ 



ఇదేనన్నమాట పాట సాహిత్యం

 
చిత్రం: కొడుకు కోడలు (1972)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: పి.సుశీల, యస్.జానకి 

పల్లవి:
ఇదేనన్నమాట ఇది అదేనన్నమాట
మతి మతిలో లేకుంది మనసేదోలాగుంది అంటే

చరణం: 1
ప్రేమంటే అదోరకం పిచ్చన్నమాట
ఆ పిచ్చిలోనే వెచ్చదనం ఉన్నదన్నమాట

మనసిస్తే మతిపోయిందన్నమాట
మతిపోయే మత్తేదో కమ్మునన్నమాట

చరణం: 2
కొత్తకొత్త సొగసులు మొగ్గ తొడుగుతున్నది
అవి గుండెలో ఉండుండి గుబులు రేపుతున్నది 
కుర్రతనం చేష్టలు ముద్దులొలుకుతున్నవి
అవి కునుకురాని కళ్లకు కలలుగా వచ్చినవి 

చరణం: 3
ఆడదాని జీవితమే అరిటాకు అన్నారు
అన్నవాళ్ళందరూ అనురాగం కోరారు
తేటి ఎగిరిపోతుంది పువ్వు మిగిలిపోతుంది 
తేనె ఉన్న సంగతే తేటి గుర్తు చేస్తుంది

చరణం: 4
వలపే ఒక వేదన... అది గెలిచిందా తీయన
కన్నెబ్రతుకే ఒక శోధన కలలు పండిస్తే సాధన
మనసు మెత్తబడుతుంది కన్నీటిలోన
మమతల పంటకదే తొలకరివాన




నేలకు ఆశలు చూపినదెవరో పాట సాహిత్యం

 
చిత్రం: కొడుకు కోడలు (1972)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: ఘంటసాల 

నేలకు ఆశలు చూపినదెవరో 




నీకంటే చిన్నవాడు మా తమ్ముడున్నాడు పాట సాహిత్యం

 
చిత్రం: కొడుకు కోడలు (1972)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: పి. సుశీల 

నీకంటే చిన్నవాడు మా తమ్ముడున్నాడు 

No comments

Most Recent

Default