చిత్రం: చక్రవాకం (1974) సంగీతం: కె.వి. మహదేవన్ నటీనటులు: శోభన్ బాబు, వాణీశ్రీ, చంద్రకళ, జి.వరలక్ష్మి, అంజలీదేవి, కృష్ణ కుమారి దర్శకత్వం: వి. మధుసూధనరావు నిర్మాత: డి. రామానాయుడు విడుదల తేది: 1974
Songs List:
ఈ నదిలా నా హృదయం పాట సాహిత్యం
చిత్రం: చక్రవాకం (1974)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: పి. సుశీల, వి. రామకృష్ణ
పల్లవి:
ఈ నదిలా నా హృదయం పరుగులు తీస్తూంది
ఏ ప్రేమ కడలినో ఏ వెచ్చని ఒడినో వెతుకుతు వెళుతూంది
ఈ నదిలా నా హృదయం పరుగులు తీస్తూంది
ఏ ప్రేమ కడలినో ఏ వెచ్చని ఒడినో.
వెతుకుతు వెళుతూంది వెతుకుతు వెళుతూంది
చరణం: 1
వలపు వాన చల్లదనం తెలియనిది
వయసు వరద పొంగు సంగతే ఎరగనిది
వలపు వాన చల్లదనం తెలియనిది
వయసు వరద పొంగు సంగతే ఎరగనిది
కలల కెరటాల గలగలలు రేగనిది
కలల కెరటాల గలగలలు రేగనిది
గట్టు సరిహద్దు కలతపడి దాటనిది
ఏ మబ్బు మెరిసినదో ఏ జల్లు కురిసినదో
ఎంతగా మారినది ఎందుకో ఉరికినది
ఎంతగా మారినది ఎందుకో ఉరికినది
ఈ నదిలా నా హృదయం పరుగులు తీస్తూంది
ఏ ప్రేమ కడలినో ఏ వెచ్చని ఒడినో వెతుకుతు వెళుతూంది
చరణం: 2
అడవి పిల్లల్లే ఎక్కడో ఫుట్టినది
అడుగడుగునా సొగసు పోగు చేసుకున్నది
అడవి పిల్లల్లే ఎక్కడో ఫుట్టినది
అడుగడుగునా సొగసు పోగు చేసుకున్నది
మలుపు మలుపులో ఒక వంపు తిరిగినది
మలుపు మలుపులో ఒక వంపు తిరిగినది
ఏ మనిషికి మచ్చికకు రానన్నది
ఏ తోడు కలిసినదో.. ఏ లోతు తెలిసినదో
వింతగా మారినది.. వెల్లువై ఉరికినది
ఈ నదిలా నా హృదయం పరుగులు తీస్తూంది
ఏ ప్రేమ కడలినో ఏ వెచ్చని ఒడినో
వెతుకుతు వెళుతూంది వెతుకుతు వెళుతూంది
కొత్తగా పెళ్ళైన కుర్రవాడికి పాట సాహిత్యం
చిత్రం: చక్రవాకం (1974)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: పి. సుశీల, వి. రామకృష్ణ
పల్లవి:
కొత్తగా పెళ్ళైన కుర్రవాడికి
పట్టపగలె తొందర పండగుంది ముందర
కొత్తగా పెళ్ళైన కుర్రదానికి
పట్టరాని తొందర పట్టుకుంటె బిత్తర
చరణం: 1
కొంగుచాటులో వయసు పొంగులన్ని దాచావు
కోలకళ్ళ జాడలో గుట్టు కాస్త చెప్పావు
కొంగుచాటులో వయసు పొంగులన్ని దాచావు
కోలకళ్ళ జాడలో గుట్టు కాస్త చెప్పావు
కోరి వలచి వచ్చాను నీ కోసమెన్నొ తెచ్చాను
కోరి వలచి వచ్చాను నీ కోసమెన్నొ తెచ్చాను
గుట్టు చప్పుడు లేక నీ సొంతమే చేసుకో
కొత్తగా పెళ్ళైన కుర్రవాడికి
పట్టపగలె తొందర పట్టుకుంటె బిత్తర
చరణం: 2
నింగి వంగి వచ్చిందీ నిన్ను చూచేటందుకు
నేల పచ్చిక పరచింది నీవు నడిచేటందుకు
నింగి వంగి వచ్చిందీ నిన్ను చూచేటందుకు
నేల పచ్చిక పరచింది నీవు నడిచేటందుకు
మంచు జల్లు కురిసింది చలి పుట్టేటందుకు
మబ్బు చాటు చేసింది గిలి తీరేటందుకు
మబ్బు చాటు చేసింది గిలి తీరేటందుకు
కొత్తగా పెళ్ళైన కుర్రదానికి
పట్టరాని తొందర పండగుంది ముందర
చరణం: 3
అల్లరి కళ్ళకు నల్లని కాటుక హద్దులే గీచావు ఎందుకూ
కళ్ళకు కాటుకే చల్లదనం హద్దులో ఆడదుంటె చక్కదనం
చీర కట్టులో ఎన్ని గమ్మత్తులు చిగురాకు పెదవుల్లో ఎన్ని మత్తులు
బిగి కౌగిలింతలో కొత్తకొత్తలు ప్రేమ బాటంతా పూలగుత్తులు
కొత్తగా పెళ్ళైన కుర్రదానికి
పట్టరాని తొందర పట్టుకుంటె బిత్తర
కొత్తగా పెళ్ళైన కుర్రవాడికి
పట్టపగలె తొందర పండగుంది ముందర
వీణలోన తీగలోన పాట సాహిత్యం
చిత్రం: చక్రవాకం (1974) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: ఆత్రేయ గానం: పి. సుశీల పల్లవి: వీణలోన తీగలోన ఎక్కడున్నది నాదము అది ఎలాగైనది రాగము వీణలోనా తీగలోనా చరణం: 1 మాటలోనా మనసులోనా ఎక్కడున్నది భావము అది ఎప్పుడౌను గానము నాదమునకు స్వరమే రాగము మనసులోని మాటే భావము రాగ భావములేకమైనది రమ్యమైనా గానము వీణలోన తీగలోనా చరణం: 2 గతజన్మ శ్రుతి చేసుకున్నది అది ఈ జన్మ సంగీతమైనది సరిగమ పదనిసానిదమప గరిగ రాగాల ఆరోహణవరోహణైనది అనురాగ హృదయాల అన్వేషణైనది వీణలోనా తీగలోనా చరణం: 3 గుండెలోనా గోంతులోనా ఎక్కడున్నది ఆవేదన అది ఎలాగౌను సాధన గీతమునకూ బలమే వేదన రాగమునకూ మెరుగే సాధన గుండె గొంతుకలేకమైనవి నిండురాగాలాపన వీణలోన తీగలోన ఎక్కడున్నది నాదము అది ఎలాగైనది రాగము వీణలోనా తీగలోనా
వీణలేని తీగను (Sad) పాట సాహిత్యం
చిత్రం: చక్రవాకం (1974) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: ఆత్రేయ గానం: పి. సుశీల, వి. రామకృష్ణ పల్లవి: వీణలేని తీగను నీవులేని బ్రతుకును మోస్తూ జీవించలేను ముగిసిందని మరణించలేను వీణలేని తీగను నీవులేని బ్రతుకును మోస్తూ జీవించలేను ముగిసిందని మరణించలేను జీవించలేను మరణించలేను చరణం: 1 మనసు నిన్నే వలచింది నన్ను విడిచి వెళ్లింది నిన్ను మరచి రమ్మంటే వీలుకాదు పొమ్మంది మరువలేని మనసుకన్నా నరకమేముంది ఆ నరకమందే బ్రతకమని నా నొసట నువ్వే రాసింది చరణం: 2 వీణకేమి తీగ తెగితే మార్చుకుంటుంది తెగిన తీగకు వీణ ఎక్కడ దొరకబోతుంది తీగ మారినా కొత్త రాగం పలకనంటుంది పాత స్మృతులే మాసిపోక బాధపడుతుంది జీవించలేను మరణించలేను చరణం: 3 బండబారిన గుండె నాది పగిలిపోదు చెదిరిపోదు నువ్వు పేర్చిన ప్రేమ చితిలో కాలిపోదు బూదికాదు నిన్ను కలిసే ఆశలేదు నిజం తెలిసే దారిలేదు చివరికి నీ జీవితానికి చిటికెడంత విషం లేదు జీవించలేను మరణించలేను
ప్రియతమా నా ప్రియతమా పాట సాహిత్యం
చిత్రం: చక్రవాకం (1974) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: ఆత్రేయ గానం: పి. సుశీల పల్లవి: ప్రియతమా నా ప్రియతమా ఎక్కడున్న ఎలాగున్నా వినుము నా నివేదన ఎక్కడున్న ఎలాగున్నా వినుము నా నివేదన దిక్కు దిక్కుల మారుమ్రోగే..దీన హృదయావేదన దిక్కు దిక్కుల మారుమ్రోగే దీన హృదయావేదన ప్రియతమా నా ప్రియతమా ఎక్కడున్న ఎలాగున్నా వినుము నా నివేదన చరణం: 1 నిన్ను నేను వంచించగలనా ఈ జన్మ ఎవరికో అర్పించగలనా నిన్ను నేను వంచించగలనా ఈ జన్మ ఎవరికో అర్పించగలనా నింద నెటుల నమ్మావు నీవు నింద నెటుల నమ్మావు నీవు నన్నిదా తెలుసుకున్నావు నన్నిదా తెలుసుకున్నావు ప్రియతమా నా ప్రియతమా ఎక్కడున్న ఎలాగున్నా వినుము నా నివేదన చరణం::2 నిన్ను కాదని జీవించగలనా ఈ నిజానికి రుజువు కావలెనా నిన్ను కాదని జీవించగలనా ఈ నిజానికి రుజువు కావలెనా గుండె గుడిగా చేసుకున్నాను గుండె గుడిగా చేసుకున్నాను నీ కొలువుకోసమే కాచుకున్నాను నీ కొలువుకోసమే కాచుకున్నాను ఎక్కడున్న ఎలాగున్నా వినుము నా నివేదన దిక్కు దిక్కుల మారుమ్రోగే దీన హృదయావేదన ప్రియతమా నా ప్రియతమా
వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళాలంటే వెళ్ళిపో పాట సాహిత్యం
చిత్రం: చక్రవాకం (1974) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: ఆత్రేయ గానం: పి. సుశీల, వి. రామకృష్ణ వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళాలంటే వెళ్ళిపో ఓ కుళ్ళుమోమొతు పిల్లగా మళ్ళివచ్చేదాకా నీ కళు కాస్తా ఇచ్చిపో నీ కళ్ళు కాస్తా ఇచ్చిపో ఉండిపో ఉండిపో వుండాలంటే వుండిపో ఓ ఒళ్ళుపొగరుపిల్లా వెళ్ళలేని కళ్ళల్లో నువ్వు వెన్నెలల్లే ఉండిపో నువ్వు వెన్నెలల్లే ఉండిపో వెన్నెలతో నన్ను పోల్చకూ అది సగం రోజులుంటుందీ నెలకు వెన్నెలతో నన్ను పోల్చకూ అది సగం రోజులుంటుందీ నెలకు ఆ మిగితాసగం నేనుంటానులే ఒద్దికంటే ఇద్దరం పంచుకోవాలిలే ఉండిపో ఉండిపో ఉండాలంటే ఉండిపో ఓకుళ్ళుమొతు పిల్లగా మల్లి వచ్చే దాకా నీ కళ్ళు కాస్తా ఇచ్చిపో నీ కళ్ళు కాస్తా ఇచ్చిపో పోతే పో నాకే అన్నావుగా మరి బుంగమూతి పెట్టుకు కూర్చోన్నావేంటి మరి నీకే నువు టవునుకెలతావు స్నేహితులని సినిమాలకనీ పగలంతా హాయిగా తిరిగి రాత్రికి మత్తుగా నిద్రపోతావు నే నొంటరిగా ఎలావుండనూ మగాడివి నీకేమి పగలంతా తిరుగుతావు మాపటికి అలసిపోయి మత్తుగా నిదరోతావ్ ఆ... హా... ఆ... ఆ... మగాడివి నీకేమి పగలంతా తిరుగుతావు మాపటికి అలసిపోయి మత్తుగా నిదరోతావ్ ఆడపిల్లవు నీకేమి అద్దమెదుట కూర్చోంటావ్ ఆడపిల్లవు నీకేమి అద్దమెదుట కూర్చోంటావ్ రోజు రోజుకో కొత్త పోంగు చూసుకొంటూ గడిపేస్తావ్ సరే వెళ్ళో వెళ్ళిపో వెళ్ళాలంటే వెళ్ళిపో ఓ ఒల్లుపొగరుపిల్లా వెళ్ళలేని కళ్ళల్లోనువు వెన్నెలల్లే ఉండిపో నువు వెన్నెలల్లే ఉండిపో నీ జతలో నేనే మగాడినీ నువు లేకుంటే నాకు నేనే పగాడిని నీ జతలో నేనే మగాడినీ నువు లేకుంటే నాకు నేనే గాడిని పగవాడితో పోరు తెలిసినట్లుంటుంది పడుచువాడితో పొత్తు ప్రాణాలు తీస్తాది ఐతే ఉండిపో ఉండిపో ఉండాలంటే వుండిపో సరే వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళాలంటే వెళ్ళిపో ఓ ఒల్లుపొగరు పిల్లా వెళ్ళలేని కళ్ళల్లో ఓ కుళ్ళుమొతు పిల్లగా మల్లివచ్చేదాకా నీ కళ్ళు కాస్తా ఇచ్చిపో నీ కళ్ళు కాస్తా ఇచ్చిపో
వీణలోన తీగలోన ఎక్కడున్నది అపశ్రుతి పాట సాహిత్యం
చిత్రం: చక్రవాకం (1974) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: ఆత్రేయ గానం: పి. సుశీల పల్లవి: ఆ..హా.. ఆ... వీణలోనా తీగలోనా ఎక్కడున్నది అపశృతి అది ఎలాగైనది విషాద గీతి వీణలోనా తీగలోనా ఎక్కడున్నది అపశృతి అది ఎలాగైనది విషాద గీతి వీణలోనా తీగలోనా చరణం: 1 వెతికి వచ్చిన తీగతో నా వీణనే ముడివేసుకొంటిని వెతికి వచ్చిన తీగతో నా వీణనే ముడివేసుకొంటిని వెలితి రాదని కలిసి పాడితిని వెలితి రాదని కలిసి పాడితిని నేడే వికల వీణగా మిగిలిపోతిని వీణలోనా తీగలోనా ఎక్కడున్నది అపశృతి చరణం: 2 రాగమున ఒక స్వరము మారిన వలపు పాటే కలత పాటగును రాగమున ఒక స్వరము మారిన వలపు పాటే కలత పాటగును అనురాగమున అపశృతి పలికిన అనురాగమున అపశృతి పలికిన కన్నీటిలో కల కరిగిపోవును వీణలోనా తీగలోనా ఎక్కడున్నది అపశృతి చరణం: 3 గాలిలోనా గాలినై కలసిపోతాను నీ గానమై నే నందులోనే నిలిచిపోతాను మట్టిలోనా మట్టినై మాసిపోతాను నీ మనసులోని మమతగానే బ్రతికి ఉంటాను వీణలోనా తీగలోనా ఎక్కడున్నది అపశృతి

No comments
Post a Comment