Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Ragile Jwala (1981)




చిత్రం: రగిలే జ్వాల (1981)
సంగీతం: కె. చక్రవర్తి 
నటీనటులు: కృష్ణం రాజు, జయప్రద
దర్శకత్వం: కె. రాఘవేంద్రరావు
నిర్మాత: టి. త్రివిక్రమ రావు
విడుదల తేది: 07.08.1981



Songs List:



ముద్దబంతి పువ్వమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: రగిలే జ్వాల (1981)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

పల్లవి :
ముద్దబంతి పువ్వమ్మా... పొద్దుపొడుపు నువ్వమ్మా... 
సందెకాల సూరీడు... అందగాడినన్నాడు
కొండ సాటు నుండి కొంగు సాటుకు దాక వచ్చాడోయమ్మ 

ముద్దబంతి పువ్వమ్మా... పొద్దుపొడుపు నువ్వమ్మా... 
సందెకాల సూరీడు... అందగాడినన్నాడు
కొండ సాటు నుండి కొంగు సాటుకు దాక వచ్చాడోయమ్మ 

చరణం: 1
ఎలుగులు నావంటే..
సొగసులు నీవంటే...
ఎలుగులు నావంటే... సొగసులు నీవంటే...

ఓ సూపు సూసింది.. ఓ నవ్వు రువ్వింది..
ఓ సూపు సూసింది.. ఓ నవ్వు రువ్వింది..

సూపూసుఫు సుట్టలంటాడు... రేపోమాపో కాపురమంటాడు
పెళ్ళెప్పుడమ్మా... ఇల్లెక్కడమ్మా
పిల్లొప్పుకుంటే... ఐనప్పుడమ్మా
దీపమెట్టినాక నికూ నాకూ వేరే ధ్యాసే లేదమ్మా

ముద్దబంతి పువ్వమ్మా... పొద్దుపొడుపు నువ్వమ్మా... 
సందెకాల సూరీడు... అందగాడినన్నాడు
కొండ సాటు నుండి కొంగు సాటుకు దాక వచ్చాడోయమ్మ 

చరణం: 2 
ముందుకు వచ్చాడే...
ముచ్చట పడ్డాడే...
ముందుకు వచ్చాడే... ముచ్చట పడ్డాడే..

గోరంత ముద్దిచ్చి... గోరింటలిచ్చాడే
గోరంత ముద్దిచ్చి... గోరింటలిచ్చాడే

కొమ్మా కొమ్మకు కోకలు కట్టిందోయ్
ముద్దులగుమ్మ మునకాలేసిందోయ్

కోకెక్కడమ్మ... రైకెక్కడమ్మ
సిగ్గెందుకమ్మ... సెట్టెక్కెనమ్మ
సీకటొచ్చి నాకు చీర కట్టిపోతే.. సిన్నబోయెరమ్మా

ముద్దబంతి పువ్వమ్మా... పొద్దుపొడుపు నువ్వమ్మా... 
సందెకాల సూరీడు... అందగాడినన్నాడు
కొండ సాటు నుండి కొంగు సాటుకు దాక వచ్చాడోయమ్మ 




తోటమాలిని పూలబాటసారిని పాట సాహిత్యం

 
చిత్రం: రగిలే జ్వాల (1981)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆత్రేయ
గానం: పి.సుశీల, యస్.పి.బాలు

పల్లవి:
తోటమాలిని..పూల బాటసారిని
తోటమాలిని..పూల బాటసారిని
కొలవలేని అందాలను..కొలిచే పూజారినీ
నీవెళె నా దేవేరీ..నీ వేలే నా దేవేరీ

తోటమాలికి..పూల బాటసారికి
తోటమాలికి..పూల బాటసారికి
నిండుమనసు పండించే..మమతల మా వారికి
ఇల్లాలే ఈ దేవేరీ..ఇల్లాలే ఈ దేవేరీ

చరణం: 1
చేతి చలువ చేమంతుల..చివురించిన చోట
నీటి కలువ కనుచూపుల..విరిసెను నీట
జలకమాడితే..ఏఏఏ..తిలకమలదనా
జలకమాడితే..ఏఏఏ..తిలకమలదనా
చిలక పచ్చ పట్టుచీర..సారె పెట్టనా

ఆఆ..చీరెలొద్దు సారెలొద్దు..సిరులూ వద్దూ
చిరునవ్వుల సిగ పువ్వులు..ఇంటికి ముద్దు
చిలకా గోరింక జంట..సృష్టికి ముద్దు..సృష్టికి ముద్దు

తోటమాలిని..పూల బాటసారిని
తోటమాలిని..పూల బాటసారిని

చరణం: 2
నీ కాలు పెట్టగానే..పూచే కనకాంబరాలు
నీ కంట చూడగానే విరిసె..కాశీ మందారాలు
ఇది పంచవటి కుటీరం..మన వలపుల బృందావనం

అటు ఏరు ఇటు ఊరు..నడుమనున్న తోటలో
పూసింది కొత్తగా..నంది వర్ధనం  
పుట్టింది ఇప్పుడే..ఆనంద వర్ధనం
లాలీ జో లాలీ జో..మ్..లాలీ జో లాలీ జో

తోటమాలిని..పూల బాటసారిని
తోటమాలిని..పూల బాటసారిని

చరణం: 3
మూడు పువ్వులై నవ్వే..ముచ్చటైన ఇంట
ప్రతి పూట వసంతాలు..వచ్చునంటా
వయసు పండితే..ఏఏఏ..మనసు పండునా
వయసు పండితే..ఏఏఏ..మనసు పండునా
ఏటిలోని అలల మాట..నీకు చెప్పనా
ఆఆఆ..మాటలొద్దు..మనసులేని మణూలూ వద్దూ
మన ఆశల తొలి పూతల..మనుగడ ముద్దు
మన ముగ్గురి ముద్దులు..ముద్దుకు ముద్దు..ముద్దుకు ముద్దూ

తోటమాలికి..పూల బాటసారికి
నిండుమనసు పండించే..మమతల మా వారికి
ఇల్లాలే ఈ దేవేరీ..నీవేలే నా దేవేరీ



ఎన్నెల్లో తాంబూలాలు పాట సాహిత్యం

 
చిత్రం: రగిలే జ్వాల (1981)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

పల్లవి:
ఎన్నెల్లో తాంబూలాలు ఏందయ్యో పేరంటాలు
ఎన్నెల్లో తాంబూలాలు ఏందయ్యో పేరంటాలు
సోకులన్ని..ఆకు వక్క..లేసుకో..ఓ
సొమ్ములుంటే..నాకు తెచ్చి..ఇచ్చుకో..ఓ
వడ్డాణాలు వయ్యారాలు..ముద్దే చాలు
ఎవరూ తేరా..ఆ

హహహ్హా..
ఎందమ్మో తాంబూలాలు..ఎన్నెల్లో పేరంటాలు 
ఎందమ్మో తాంబూలాలు..ఎన్నెల్లో పేరంటాలు 
ఆకులేసే సందె వన్నె..చూడనా..ఆ
సోకులన్నీ సొమ్ముజేసి..చూడనా..ఆ
ఒకటే దారి లేదే దారి..మురిసే దారీ ఏం చాలదా

అహహ్హా..ఎన్నెల్లో తాంబూలాలు..ఎన్నెల్లో పేరంటాలు

చరణం: 1
బుగ్గ చూడు..సిగ్గులు చూడు
ముద్దులుంటే..ముచ్చటలాడు
ఆడుతూ పాడాలి.. 
ఆట చూడు..పాటలు చూడు
నింగి దాటే..నిగ నిగ చూడు
అందెలు పాడాలి
నేనంటే నీకు మనసా..ఆఆఆ
ఔనంటే ఆట తెలుసా..ఆఆఆ 

గుండెలోనా..గుబ గుబ చూశా
పాట లాంటి..పక పక చూశా
ఓడిస్తా నంటా..

చిందు చూశా..చిందెలు చూశా
చిన్నదాని..పిలుపులు చూశా
ఒద్దిక..లెమ్మంటా

మొసంగా..పడుచందాలు..నేనే పంచుకౌటా..ఆ
మొలకెత్తే బిడియాలన్నీ..నేనే దోచుకుంటా..ఆ
తళుకే నాది బెళుకే నాది..కులుకే నాదీ..ఈఈఇ
ఏం పాట..ఆగదా???

అహహ్హా..
ఎన్నెల్లో తాంబూలాలు..ఏందయ్యో పేరంటాలు
ఎందమ్మో తాంబూలాలు..ఎన్నెల్లో పేరంటాలు 

చరణం: 2
నన్ను చూడు..నవ నవ చూడు
నాణ్యమైన..నడకలు చూడు..నీతోనే ఉంటా
వన్నె చూడు..వయసును చూడు
వాలు చూపు..వరసలు చూడు..నువ్వే నా జంట
అందాల..అత్త కొడకా..ఆఆఆ
పందెమేసి..మెత్త పడకా..ఆఆఆ 

ఊసులాడే..ఉరుములు చూసా..
మేనిలోని..మెరుపులు చూసా
నాదే..పై పందెం

ఒంపు చూసా..సొంపులు చూసా
ఆటలోనా..అలజడి చూశా
నచ్చింది..పరువం..

మన్నించే..మనసున బంధం
నేనే..కాచుకుంటా..ఆఆఅ
మనసిచ్చి..వయసుకు పగ్గం
నేనే..వేసుకొంటా
ముద్దే నాది..మురిపెం నాది..వలపేనాది..ఈ

ఆ..ఎన్నెల్లో తాంబూలాలు..ఏందయ్యో పేరంటాలు
ఎందమ్మో తాంబూలాలు..ఎన్నెల్లో పేరంటాలు 
సోకులన్ని..ఆకు వక్క..లేసుకో..ఓ
సొమ్ములుంటే..నాకు తెచ్చి..ఇచ్చుకో..ఓఓఓ




నా జీవనజ్యోతివి నువ్వే పాట సాహిత్యం

 
చిత్రం: రగిలే జ్వాల (1981)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

పల్లవి:
నా జీవన జ్యోతివి నీవే..ఈ కోవెల హారతి నీవే
ఇహమై పరమై..ఈ..వరమై..ఈ..వెలగవే..ఏఏఏఏ
నా జీవన జ్యోతివి నీవే..ఈ కోవెల హారతి నీవే

చరణం: 1
ఏ ప్రమిదలోన వెలిగావో..నా బ్రతుకు నీవుగా మిగిలావు
ఏ ప్రమిదలోన వెలిగావో..నా బ్రతుకు నీవుగా మిగిలావు
ఏ దేవత కడుపున పుట్టావో..నా జన్మకు దీపం పెట్టావు
కదిలే శిలలో మమతే నీవులే..ఏఏఏఏఏఏఏ

నా జీవన జ్యోతివి నీవే..ఈ కోవెల హారతి నీవే

చరణం: 2
నా నిదరే..దేవుడికిచ్చాను..ఊ
నా చూపులు..కాపుగ..చేసాను
ఆ దేవుడు ఇచ్చిన ఆయువునీ..ఈ
ఆ దేవుడు ఇచ్చిన ఆయువునీ..ఈ
నీ కోసం..ధారగ పోస్తాను
మదిలో మెదిలే బంధం నీదేలే..ఏఏఏఏఏఏ

నా జీవన జ్యోతివి నీవే..ఈ కోవెల హారతి నీవే

చరణం: 3
నీ హృదయ కాంతినే..వెలిగించి..ఈ
నను జ్యోతిగ..నీవే చేసావు
నీ హృదయ కాంతినే..వెలిగించి..ఈ
నను జ్యోతిగ..నీవే చేసావు
నీ వెలుగుకు..నీడై పయనించి 
నీ ప్రేమకు హారతి..పడతాను
ఎదిగే రుణమే..నిధిగా మిగలనీ..ఈఈఈఈఇ

నా జీవన దాతవు నీవే..ఈ భువిలో దేవత నీవే
తల్లీ తంద్రీ గురువూ నీవులే..ఏఏఏఏఏఏ

నా జీవన జ్యోతివి..నీవేలే..ఏఏ
నా జీవన..ధాతవు..నీవే..ఏ



చినుకు పడితే చిచ్చు రేగి పాట సాహిత్యం

 
చిత్రం: రగిలే జ్వాల (1981)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

పల్లవి:
చినుకు పడితే చిచ్చురేగి..ఒకటే చప్పట్లూ
చినుకు పడితే చిచ్చురేగి..ఒకటే చప్పట్లూ
వొణుకు పుడితే వయసు కోరే..వలపే దుప్పట్లూ
ముద్దూ..ముచ్చట్లూ..ఊ

చినుకు పడితే చిచ్చురేగి..ఒకటే చప్పట్లూ
చినుకు పడితే చిచ్చురేగి..ఒకటే చప్పట్లూ
వొణుకు పుడితే వయసు కోరే..వలపే దుప్పట్లూ
ముద్దూ..ముచ్చట్లూ..ఊ

చరణం: 1
నిన్ను చూసిన నాటి నుండి..కన్నుమరిచే కునికిపాట్లు
కన్ను వేసిన నాటి నుండి..కన్నతనమే ఉలికిపాట్లు

బిగిసిన కౌగిట అగచాట్లు..వయసులు చేసే పొరపాట్లు
బిగిసిన కౌగిట అగచాట్లు..వయసులు చేసే పొరపాట్లు

తడిసిన మోజుల తడబాట్లు..తడవని రోజుల ఎడబాట్లో
తడిసిన మోజుల తడబాట్లు..హోయ్..తడవని రోజుల ఎడబాట్లో
ఇప్పట్లో ఆగవులే..ఇద్దరి సందిట్లో..

చినుకులు పడితే చిచ్చురేగి..ఒకటే చప్పట్లూ
వొణుకు పుడితే వయసుకోరే..వలపే దుప్పట్లూ
ముద్దూ ముచ్చట్లూ..

చరణం: 2
ఇంతకాలం చినుకు రాక..నేను నీకై పడిన పాట్లు
కొంత కాలం దరికి రాక..బుగ్గ మీద పడని గాట్లు

ముసిరిన వయసుల అలవాట్లు..తెలుగందానికి తలకట్లు
ముసిరిన వయసుల అలవాట్లు..తెలుగందానికి తలకట్లు

నలుగురు చూస్తే నగుబాట్లో..ఓ..పడుచు దనానికి పరిపాట్లో
నలుగురు చూస్తే నగుబాట్లో..పడుచు దనానికి పరిపాట్లో
ఇప్పట్లో ఆగవులే..మబ్బుల పందిట్లో

చినికి పడితే చిచ్చురేగి..ఒకటే చప్పట్లూ
వొణుకు పుడితే వయసు కోరే..వలపే దుప్పట్లూ
ముద్దూ..ముచ్చట్లూ..

చినికి పడితే చిచ్చురేగి..ఒకటే చప్పట్లూ
వొణుకు పుడితే వయసు కోరే..వలపే దుప్పట్లూ
ముద్దూ..ముచ్చట్లూ..




తోపుకాడకొస్తావా పిల్లో పాట సాహిత్యం

 
చిత్రం: రగిలే జ్వాల (1981)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

పల్లవి:
తోపుకాడ కొస్తావ పిల్లో..తమలపాకులిస్తాను పిల్లో
తోపుకాడ కొస్తావ పిల్లో..తమలపాకులిస్తాను పిల్లో

నీ పెదవులు పండిన ఎరుపు..నా ప్రేమకు పండుగ పిలుపు
నీ పెదవులు పండిన ఎరుపు..నా ప్రేమకు పండుగ పిలుపు

తోపుకాడ కొస్తావ పిల్లడో..తమలపాకులిస్తాను పిల్లడో
తోపుకాడ కొస్తావ పిల్లడో..తమలపాకులిస్తాను పిల్లడో

నీ విచ్చిన మల్లెలు తెలుపు..మనసిచ్చిన వలపులు తెలుపు
నీ విచ్చిన మల్లెలు తెలుపు..మనసిచ్చిన వలపులు తెలుపు

తోపుకాడ కొస్తావ పిల్లో..తమలపాకులిస్తాను పిల్లో
ఆహహా..తోపుకాడ కొస్తావ పిల్లడో..తమలపాకులిస్తాను పిల్లడో

చరణం: 1
కాదంటే కౌగిలింత..హ్హ..లేదంటే లేతచింత..హ్హ
రా అంటే రాతిరంతా..హ్హా..పో అంటే పొందులంట
ఏవన్న ప్రేమన్న..ఎదలోని మాట..ఆ
పొమ్మన్నా రమ్మన్నా..సరసాల మూట

పులకింతలా పూలేరుకో..ఓయ్..ఓయ్..
ముప్పూటలా..ముద్దాడుకో..ఓయ్..ఓయ్..
పండున్నదీ పంచేసుకో..పడుచందమే తుంచేసుకో

తోపుకాడ కొస్తావ పిల్లో..తమలపాకులిస్తాను పిల్లో
అరెరె రెరె..తోపుకాడ కొస్తావ..పిల్లడో..
తమలపాకులిస్తాను..పిల్లడో 

చరణం: 2
నీ కంట నీలి మబ్బు..హ్హ..నా కంట వాన మబ్బు..ఆ
నా చూపే చుక్క మెరుపు..ఓయ్..నీ పిలుపే కొత్త ఉరుము..ఆ
మన ఈడులో నేడు..తొలి గాలి వాన..
తెలిసింది వయసెంతో..నీ జంటలోనా

నా గుండెలో తల దాచుకో..నా ఎండలో చలి కాచుకో
ఆ సిగ్గులే నువ్వుంచుకో..నీ బుగ్గలే నా కిచ్చుకో

తోపుకాడ కొస్తావ..పిల్లడో..తమలపాకులిస్తాను..పిల్లడో 
తోపుకాడ కొస్తావ..పిల్లడో..తమలపాకులిస్తాను..పిల్లడో

నీ పెదవులు పండిన ఎరుపు..నా ప్రేమకు పండుగ పిలుపు
నీ పెదవులు పండిన ఎరుపు..నా ప్రేమకు పండుగ పిలుపు

అరెరె రెరె..తోపుకాడ కొస్తావ..పిల్లడో
తమలపాకులిస్తాను..పిల్లడో

అరె..తోపుకాడ కొస్తావ..పిల్లో..తమలపాకులిస్తాను..పిల్లో


No comments

Most Recent

Default