చిత్రం: మనవూరికథ (1976)
సంగీతం: జె.వి. రాఘవులు
సాహిత్యం: మైలవరపు గోపి
గానం: యస్.పి.బాలు, సుశీల
నటీనటులు: కృష్ణ , జయప్రద
కథ: పాలగుమ్మి పద్మరాజు
మాటలు: గోపి
దర్శకత్వం: కె.హేమంబరధరరావు
నిర్మాత: కె.యల్. దామోదర్
బ్యానర్: ఆర్.కె.ఆర్ట్.ప్రొడక్షన్స్
విడుదల తేది: 12.05.1976
పల్లవి:
వచ్చిందీ కొత్త పెళ్లికూతురు.. మనసుకు తెచ్చింది.. కొండంత వెలుతురు
అహ.. హా.. ఆ.. హా.. ఆ..
వచ్చిందీ కొత్త పెళ్లికూతురు.. మనసుకు తెచ్చింది.. కొండంత వెలుతురు
చరణం: 1
అహ.. హా.. ఆ.. హా.. ఆ.. ఓహోహో... లలలలలాల... లలలలలాల
నడయాడే వెన్నెలలా.. ఆ.. చిరుగాలి తెమ్మెరలా.. ఆ
నడయాడే వెన్నెలలా.. చిరుగాలి తెమ్మెరలా
ఎలమావి లే చిగురులా.. సొగసు విరిబోణిలా నిండు తరవాణిలా
వచ్చిందీ కొత్త పెళ్లికూతురు.. మనసుకు తెచ్చింది... కొండంత వెలుతురు
చరణం: 2
అహ.. హా.. ఆ.. హా.. ఆ.. ఓహోహో... లలలలలాల... లలలలలాల
పరువాలా మిసమిసలు... ఆ.. చిరునవ్వు దొ౦తరలు.. ఆ..
పరువాలా మిసమిసలు.. చిరునవ్వు దొ౦తరలు
నడిచేను రాయంచలా.. ముద్ద చామంతిలా... ముద్దు పూబంతిలా
వచ్చిందీ కొత్త పెళ్లికూతురు.. మనసుకు తెచ్చింది కొండంత వెలుతురు
****** ****** ******
చిత్రం: మన ఊరి కథ (1976)
సంగీతం: జె.వి. రాఘవులు
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, సుశీల
పల్లవి:
గోదారికి ఏ ఒడ్డైనా... నీరు ఒక్కటే
గోదారికి ఏ ఒడ్డైనా... నీరు ఒక్కటే
కుర్రదానికి ఏ వైఫైనా... అందమొక్కటే
గోదారికి ఏ ఒడ్డైనా... నీరు ఒక్కటే
కొంగులు రెండూ వేరైనా... కోక ఒక్కటే
కొంగులు రెండూ వేరైనా... కోక ఒక్కటే
ఈ కుర్రడికి ఏ పొద్ధూ కోరికోక్కటే
గోదారికి ఏ ఒడ్డైనా.... నీరు ఒక్కటే
చరణం: 1
పడవెంత చిన్నదైనా గెడవేసి నడపాలి.. పడుచెంత సొ౦తమైనా ముడివేసి అడగాలి
పడవెంత చిన్నదైనా గెడవేసి నడపాలి.. పడుచెంత సొ౦తమైనా ముడివేసి అడగాలి
గాలి చూసి వాలు చూసి తెరచాప ఎత్తాలి
గాలి చూసి వాలు చూసి తెరచాప ఎత్తాలి
ఎంత వీలైన వేళైనా తెరచాటు ఉండాలీ
గోదారికి ఏ ఒడ్డైనా నీరు ఒక్కటే
చరణం: 2
పోటోచ్చిన ఏటికి ఎత్తుపల్ల మొక్కటే
పొంగోచ్చిన వయసుకు పగలు రేయి ఒక్కటే
పగలు రేయి కలుసుకునే హద్దు ఒక్కటే
పలుకరాని పెదవులకి ముద్దు ఒక్కటే
గోదారికి ఏ ఒడ్డైనా... నీరు ఒక్కటే
కొంగులు రెండూ వేరైనా... కోక ఒక్కటే
కొంగులు రెండూ వేరైనా... కోక ఒక్కటే
ఈ కుర్రడికి ఏ పొద్ధూ... కోరికోక్కటే
గోదారికి ఏ ఒడ్డైనా... నీరు ఒక్కటే
****** ****** ******
చిత్రం: మన ఊరి కథ (1976)
సంగీతం: జె.వి. రాఘవులు
సాహిత్యం: మైలవరపు గోపి
గానం: యస్.పి.బాలు, సుశీల
పల్లవి:
మావ కూతురా నీతో మాటున్నదీ
పడుచు గుండె నీ పొందే కోరుతున్నది
నువ్వు అవునంటే జొన్నచేను చాటున్నదీ..ఈ. చాటున్నది
మావ కూతురా.. ఆ..ఆ.. ఓ.. ఓ...
వగలమారి బావయ్యా.. రభస చెయ్యకు
పగలు రాత్రి లేకుండా దారి కాయకు
నువ్వు దారి కాసి నలుగురిలో అలుసు చేయకు..ఊ..
నా పరువు తియ్యకు...
వగలమారి బావయ్యా... ఆ.. ఓ.. ఓ..
చరణం: 1
యాతమెక్కుదామన్నా నీ ఊసే ..
అరక దున్నుతూ ఉన్నా ఆ ధ్యాసే...
యాతమెక్కుదామన్నా నీ ఊసే ..
అరక దున్నుతూ ఉన్నా ఆ ధ్యాసే...
పూలు ముడువబోతున్నా నీ ఊసే...
నే చల్ల చిలక బోతున్నా ఆ ధ్యాసే... ఓ.. ఓ.. ఓ..
మావ కూతురా నీతో మాటున్నది
పడుచు గుండె నీ పొందే కోరుతున్నది
నువ్వు అవునంటే జొన్నచేను చాటున్నదీ..ఈ. చాటున్నది
మావ కూతురా.. ఆ.. ఆ.. ఓ.. ఆ.....
చరణం: 2
పగలంతా కోరికతో తెలవారే...
రేయేమో పగటి కలలు సరిపోయే...
పగలంతా కోరికతో తెలవారే... హాయ్..
రేయేమో పగటి కలలు సరిపోయే...
వలపేమో నీ చెంతకు తరిమింది...
పాడు సిగ్గేమో పగ్గమేసి లాగింది... ఓ..ఓ..
మావ కూతురా నీతో మాటున్నది
పడుచు గుండె నీ పొందే కోరుతున్నది
నువ్వు అవునంటే జొన్నచేను చాటున్నదీ..ఈ. చాటున్నది
మావ కూతురా.. ఆ..ఆ.. ఏ.. ఓ..