Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Bharya Bhartalu (1961)




చిత్రం: భార్యా భర్తలు (1961)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
నటీనటులు:  అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ కుమారి
దర్శకత్వం: కె. ప్రత్యగాత్మ
నిర్మాత: ఏ.వి. సుబ్బారావు
బ్యానర్: ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్
విడుదల తేది: 31.03.1961



Songs List:



జోరుగా హుషారుగా షికారు పోదామా! పాట సాహిత్యం

 
చిత్రం:  భార్యాభర్తలు (1961)
సంగీతం:  సాలూరి. రాజేశ్వరరావు
సాహిత్యం:  శ్రీశ్రీ
గానం: ఘంటసాల

జోరుగా హుషారుగా షికారు పోదామా!
హాయి హాయిగా తీయ తీయగా
జోరుగా హుషారుగా షికారు పోదామా!
హాయి హాయిగా తీయ తీయగా

ఓ ...బాల నీ వయ్యార మెంచి మరులుకొంటి నే
చాల ప్రేమ పాఠములను చదువుకొంటినే
మరువనంటినే

 ||జోరుగా॥

నీ ... వన్నె చిన్నె లన్ని చూచి వలచినాడనే
వయసు సొగసు తలచి తలచి మురిసినాడనే
కలసి రాగదే

 ||జోరుగా॥

నా ...కలలలోన చెలియ నిన్నె పిలచినాడనే
కనులు తెరచి ఎదుట నిన్నె కాంచినాడనే
వరించువాడనే




ఓ..సుకుమారా పాట సాహిత్యం

 
చిత్రం:  భార్యాభర్తలు (1961)
సంగీతం:  సాలూరి. రాజేశ్వరరావు
సాహిత్యం:  శ్రీశ్రీ
గానం: ఘంటసాల, సుశీల

పల్లవి:
ఓ..సుకుమారా నను చేరా రావోయి ఇటు రావోయి
నిలువగ లేని వలపులరాణి నీ కొరకే తపించునులే
నిలువగ లేని వలపులరాణి నీ కొరకే తపించునులే

ఓ..జవరాలా ప్రియురాలా ఈనాడే మనదే హాయి
తనువుగ నేడు ఈ చెలికాడు 
నీ దరినే సుఖించునులే

చరణం: 1
కోటి కిరణముల కోరిన గాని
భానుని చూడదు కలువ చెలి
కోటి కిరణముల కోరిన గాని
భానుని చూడదు కలువ చెలి
వెన్నెల కాంతి వెలిగిన వేళా
వెన్నెల కాంతి వెలిగిన వేళా
విరుయునుగా విలాసముగా

నిలువగ లేని వలపులరాణి 
నీ కొరకే తపించునులే

చరణం: 2
వేయి కనులతో వెదికిన గాని
తారకు జాబిలి దూరమేగా
వేయి కనులతో వెదికిన గాని
తారకు జాబిలి దూరమేగా
కలువల రాణీ వలపులలోనే
కలువల రాణీ వలపులలోనే
కళకళలాడి చేరునుగా

తనువుగ నేడు ఈ చెలికాడు 
నీ దరినే సుఖించునులే




మధురం మధురం పాట సాహిత్యం

 
చిత్రం:  భార్యాభర్తలు (1961)
సంగీతం:  సాలూరి. రాజేశ్వరరావు
సాహిత్యం:  శ్రీశ్రీ
గానం: ఘంటసాల, సుశీల

మధురం మధురం ఈ సమయం
ఇక జీవితమే ఆనందమయం
మధురం మధురం ఈ సమయం 

చల్లని పున్నమి వెన్నెలలో
ఎన్నడు వీడని కౌగిలిలో
చల్లని పున్నమి వెన్నెలలో
ఎన్నడు వీడని కౌగిలిలో
కన్నుల వలపు కాంతులు మెరయగ

 ||మధురం||

కరగిపోయె పెను చీకటి పొరలు
కరగిపోయె పెను చీకటి పొరలు
తొలగిపోయె అనుమానపు తెరలు
తొలగిపోయె అనుమానపు తెరలు

పరిమళించె అనురాగపు విరులు
పరిమళించె అనురాగపు విరులు
అలరెనే మనసు నందనవసము

|| మధురం...||

సఫల మాయెనే మన తియ్యని కలలు
సఫల మాయెనే మన తియ్యని కలలు
జగము నిండె నవజీవన కళలు
జగము నిండె నవజీవన కళలు

పొంగిపొరలె మన కోర్కెల అలలు
పొంగిపొరలె మన కోర్కెల అలలు
భావియే వెలిగె పూవుల బాటగ 

||మధురం... !!



ఏమని పాదేదనో ఈ వేళ పాట సాహిత్యం

 
చిత్రం:  భార్యాభర్తలు (1961)
సంగీతం:  సాలూరి. రాజేశ్వరరావు
సాహిత్యం:  శ్రీశ్రీ
గానం:  సుశీల

ఏమని పాదేదనో ఈ వేళ
మానస వీణ మౌనముగా
నిదురించిన వేళ
ఏమని పాడెదనో

జగమే మరచి హృదయ విపంచి
గారడిగా వినువీధి చరించి
కలత నిదురలో కాంచిన కలలే
గాలి మేడలై కూలిన వేళ
ఏమని పాడెదనో

వనసీమలలో హాయిగ ఆడే
రాచిలుకా నిను రాణిని చేసే
పసిడితీగల పంజరమిదిగో
పలుక వేమని పిలిచే వేళ



రంగ రంగేళీ పాట సాహిత్యం

 
చిత్రం:  భార్యాభర్తలు (1961)
సంగీతం:  సాలూరి. రాజేశ్వరరావు
సాహిత్యం:  ఆరుద్ర 
గానం:  సుశీల

రంగ రంగేళీ సుఖాలను తేలి
రావోయి మధుర మీరేయి
రంగ రంగేళీ

నిన్ను కోరే గులాబులు
ఈయ వేల జవాబులు
నిన్ను కోరే గులాబులు
ఈయ వేల జవాబులు
మనసులోని మమత లేవో
మనసులోని మమత లేవో
తెలుపునే మెరిసే కనులు
పరాకేలనోయి ప్రియా

భరింపజాల ఈ విరహ జ్వాల
వహవ్వా
వలపుల బాలననీ బేలననీ రమ్మనవు
వలపుల బాలననీ బేలననీ రమ్మనవు
వలచి చేరితి నే కోరితినే చిరునగవు
తొలగిపోయెదవు చాలునులే యీ బిగువు
సరసాలు మురిపాలు మరి రానేరావు 



చూచి చూచి కళ్లు కాయలే కాచాయి పాట సాహిత్యం

 
చిత్రం:  భార్యాభర్తలు (1961)
సంగీతం:  సాలూరి. రాజేశ్వరరావు
సాహిత్యం:  కొసరాజు
గానం:  ఘంటసాల, జిక్కీ

జో జో జో జోజో
చూచి చూచి కళ్లు కాయలే కాచాయి
గా నీ తండ్రి ఊడి పడ్డాడూ
చక్కనీ నా బాబు జోజో
చల్లనీ నా తండ్రి జోజో

రెక్కలూ గట్టుకొని రివ్వునా వాలాను
రేయింబగళ్ళు నిను తలచుకొని మురిశాను
మురిపాల మొలకవూ జోజో
ముద్దులూరించేవు జోజో

|| చూచి చూచి||

కాకితో ఒక సారి కబురంపినావని
కాకితో ఒక సారి కబురంపినావని
కలలోన నిను చాల కలవరించాను
కాశీకి పోయినా గంగలో మునిగినా
నిను మరువ కున్నాను జో జో
నిలువలేకున్నాను జో జో

|| చూచి చూచి||

ఏ వూళ్ళు తిరిగావు  ఏమేమి చేశావు
ఏ వూళ్ళు తిరిగావు  ఏమేమి చేశావు
ఎవరితో సరదాలు తీర్చుకొచ్చావు
ఇంత చక్కని రంభ ఇంటిలో ఉండగా
ఇతరులతో పని ఏమి జోజో
ఇది మంచి సమయము జోజో 
ఇది మంచి సమయము జోజో




కనకమా ! చిట్టి కనకమా! పాట సాహిత్యం

 
చిత్రం:  భార్యాభర్తలు (1961)
సంగీతం:  సాలూరి. రాజేశ్వరరావు
సాహిత్యం:  కొసరాజు
గానం: మాధవపెద్ది సత్యం, స్వర్ణలత

కనకమా ! చిట్టి కనకమా!
ముద్దు కనకమా ! నామాట వినుమా !
మనము కలసి మెలిసుంటే అప్పీలు లేదుసుమా !
కనకమా ! చిట్టి కనక మా ! నామాట వినుమా !

కలసి మెలిసున్నందు కేగా 
నీవు కరుణ జూపించావు బాగా
కలసి మెలిసున్నందు కేగా 
నీవు కరుణ జూపించావు బాగా


కల్లకపటం లేని నా కన్న తండ్రిని
వేటాడి వేధించి వెళ్ళగొట్టావుగా !
ఆలు మగలకు మధ్య చూడు
మామ అడ్డముంటే ఎంతో గోడు
ఆలు మగలకు మధ్య చూడు
మామ అడ్డముంటే ఎంతో గోడు

ఆనందముగ మనము అనుభవించాలంటే
ఆనందముగ మనము అనుభవించాలంటే
అడుగడుగునా మనకు గుదిబండ అయినాడు

కనకమా ! చిట్టి కనక మా ! నామాట వినుమా !

అల్లారు ముద్దుగా నా కోరికలు తీర్చి
అన్యాయమగు మాట లేల
అవ్వ అపహాస్యములు చేయ నేల
అన్యాయమగు మాట లేల
అవ్వ అపహాస్యములు చేయ నేల

ఉల్లాసముగ నన్ను ఓదార్చ వేల
మెడనిండ సొమ్ములు పెడతాను
కంచి పట్టు చీరలు కట్టబెడతాను
మెడనిండ సొమ్ములు పెడతాను
కంచి పట్టు చీరలు కట్టబెడతాను

ఇల్లంత స్వర్గంగ మార్చి వేస్తాను
ఇల్లంత స్వర్గంగ మార్చి వేస్తాను
ఇంతకన్నా మంచి ఏమి చేస్తాను

Palli Balakrishna Tuesday, May 18, 2021
Kalyana Thilakam (1985)



చిత్రం: కళ్యాణ తిలకం  (1985)
సంగీతం: జె.వి.రాఘవులు
నటీనటులు: మోహన్ బాబు, జయసుధ
దర్శకత్వం: బి.భాస్కరరావు
నిర్మాత: ఆర్.కేతినేని 
బ్యానర్: కేతినేని పిక్చర్స్ 
విడుదల తేది: 23.10.1985



Songs List:



నువ్వు నేనూ ఒకటంట పాట సాహిత్యం

 
చిత్రం: కళ్యాణ తిలకం  (1985)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: మైలవరపు గోపి 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల 

పల్లవి:
నువ్వు నేనూ ఒకటంట ఎడబాటన్నది రాదంట
స్వర్గం వద్దే వద్దంట కమ్మని కౌగలి ఇమ్మంటా

నువ్వు నేనూ ఒకటంట ఎడబాటన్నది రాదంట
స్వర్గం వద్దే వద్దంట కమ్మని కౌగలి ఇమ్మంటా

నువ్వు నేనూ ఒకటంట

చరణం: 1
చిన్ననాటి పచ్చబొట్టివేళ ముచ్చటైన పెళ్లిబొట్టు కాగా
కుర్రదాని చెయ్యి పట్టగానే గుండెనిండ వెన్నెలాయే కాదా
నీతో నడిచే వరమే ఛాలు
వలచే వడిలో క్షణమే చాలు

నువ్వు నేనూ ఒకటంట ఎడబాటన్నది రాదంట
స్వర్గం వద్దే వద్దంట కమ్మని కౌగలి ఇమ్మంటా

నువ్వు నేనూ ఒకటంట

చరణం: 2
చందమామ అందమంత దాచి ఏరికోరి చేరుకుంది నన్నే
కోరుకున్న కొమ్మ నీడలోనే కోయాలమ్మ పాడుతుంది గీతం
నీలో నాలో ఒకటే రాగం
నువ్వే నన్ను నడిపే దీపం

నువ్వు నేనూ ఒకటంట ఎడబాటన్నది రాదంట
స్వర్గం వద్దే వద్దంట కమ్మని కౌగలి ఇమ్మంటా

నువ్వు నేనూ ఒకటంట ఎడబాటన్నది రాదంట
స్వర్గం వద్దే వద్దంట కమ్మని కౌగలి ఇమ్మంటా

నువ్వు నేనూ ఒకటంట




బృందావనిలో పాట సాహిత్యం

 
చిత్రం: కళ్యాణ తిలకం  (1985)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: మైలవరపు గోపి 
గానం: పి. సుశీల

బృందావనిలో 




ఆమని వేళకు పాట సాహిత్యం

 
చిత్రం: కళ్యాణ తిలకం  (1985)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల

ఆమని వేళకు 



శాపమేదో పాట సాహిత్యం

 
చిత్రం: కళ్యాణ తిలకం  (1985)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: మైలవరపు గోపి 
గానం: కె. జె. జేసుదాస్ 

శాపమేదో 



అమ్మా నీకు నువ్వే పాట సాహిత్యం

 
చిత్రం: కళ్యాణ తిలకం  (1985)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: మైలవరపు గోపి 
గానం: కె. జె. జేసుదాస్ , యస్.పి.శైలజ 

అమ్మా నీకు నువ్వే 

Palli Balakrishna
Guru Brahma (1986)


 

చిత్రం: గురుబ్రహ్మ  (1986)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు:  పరుచూరి గోపాలకృష్ణ , అక్కినేని నాగేశ్వరరావు
దర్శకత్వం:  బోయిన సుబ్బారావు
నిర్మాత: డి.రామానాయుడు
బ్యానర్: సురేష్ ప్రొడక్షన్స్
విడుదల తేది: 25.12.1986






Palli Balakrishna
Bharya Bharthalu (1988)


 

చిత్రం: భార్యా భర్తలు  (1988)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: S.P.బాలు, P.సుశీల, S.జానకి
నటీనటులు:  శోభన్ బాబు, సుహాషిని, రాధ
దర్శకత్వం:  కె. మురళీ మోహనరావు
నిర్మాత: యం. నరసింహారావు
బ్యానర్: రాశీ మూవీ క్రియేషన్స్
విడుదల తేది: 1988


చిత్రం: భార్యా భర్తలు  (1988)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

అయ్యోరామ అంత సిగ్గులెందు కంటా
బుగ్గమీద అన్నిమొగ్గలెందు కంటా
కోరి వచ్చాననా కొరుక్కు తింటాననా
వర్రగున్న పండు చూసి బర్రుపిట్ట కొచ్చేనమ్మ ఆరాటం

అయ్యోరామ అంత గోల దేనికంట
అందమంత అప్పగించి ఊరుకుంటా
కాపు నీదేనులే కైపెక్కి పోరాదులే
పూలపల్లె డొంక దాటి పాలకొల్లు సంతకొస్తే పేరంటం

మెంతున్నదో అంత వాటేసు కుంటానులే
 ముద్దు ఏమూల ఎంతున్నదో
ఉయ్యాలగా నీకు కొత్త ఊపందు కుంటానులే
ఈడు ఏనాడు ఎట్టుంటదో
మల్లె పూలు జల్లుకున్న మంచాలలో
సన్న సోకు గువ్వులున్న చంచాలలో
ఎంగిలైన ఆశలన్ని రంగరించుకున్న ప్రేమ నీకోసం

అయ్యోరామ అంత గోల దేనికంట
అందమంత అప్పగించి ఊరుకుంటా

కల్లోకి వస్తావు నన్నే కవ్వించి పోతావు
వల్లో వేశావు నన్నెప్పుడో

తీసేసి దీపాలు చూశా నీలోని ధూపాలు
వళ్ళో పడ్డాను నేనెప్పుడో
చల్లగాలి చంపుతున్న సందేళలో
వంపుకొక్క సొంపు వచ్చే అందాలలో
ముద్దులూరి పాడు కాడ ముట్టజెప్పవమ్మ నాకు తాంబూలం

అయ్యోరామ అంత గోల దేనికంట
అందమంత అప్పగించి ఊరుకుంటా
కాపు నేదేనులే కైపెక్కి పోరాదులే
పూల జల్లడెత్తగానే పాలకొల్లు సంతకొస్తే పేరంటం






Palli Balakrishna
Koteeswarudu (1984)
చిత్రం: కోటీశ్వరుడు  (1984)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు:  అక్నాకినేని గేశ్వరరావు, సుజాత
దర్శకత్వం:  కొమ్మినేని శేషగిరి రావు
నిర్మాతలు: టి.ఆర్.శ్రీనివాస్, పి.హెచ్.రామారావు
విడుదల తేది: 06.01.1984

చిత్రం: కోటీశ్వరుడు  (1984)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: రాజశ్రీ
గానం: యస్.పి. బాలు, సుశీల

చిగురాకు శుభలేఖ రాసేటి వేళ
చిరుగాలి సన్నాయి పాడేటి వేళ
ఆ చూపు అరుణోదయం 
ఆ చిరునవ్వు చంద్రోదయం

ఆ.. సెలయేరు పరువాలు చిలికేటి వేళ
మేఘాలు రాగాలు తీసేటి వేళ
ఆ చూపు అరుణోదయం 
ఆ చిరునవ్వు చంద్రోదయం

చిగురాకు శుభలేఖ రాసేటి వేళ
మేఘాలు రాగాలు తీసేటి వేళ

నువ్వే నాకొక సిందూర తిలకం
సిగలో వాడని మందార కుసుమం
నీ ప్రతి పలుకు నీరెండ కులుకు
వలపులు చిందే పన్నీటి చినుకు
తలపులే ఒక వేకువ వలపులే ఒక వెల్లువ
ఊహలు విరిసే నీ యదలోన ఊపిరి నీతోనా
అభివందనం ఇది నందనం హరిచందనం ప్రేమకే

సెలయేరు పరువాలు చిలికేటి వేళ
చిగురాకు శుభలేఖ రాసేటి వేళ
ఆ చూపు అరుణోదయం 
ఆ చిరునవ్వు చంద్రోదయం

కలిసిన నాలుగు నయనాలలోన
కురిసెను ఆశలు సిరితేనె వాన
మురిసినది తొలి మురిపాల లోన
కలలే తీరి పులకించి పోనా
రాగమే అనురాగమై బంధమే అనుబంధమై
దిక్కులు చుక్కలు నిలిచేదాక ఒకటై ఉండాలి
ఈ జీవితం నీకంకితం ఇది స్వాగతం ప్రేమకే

చిగురాకు శుభలేఖ రాసేటి వేళ
చిరుగాలి సన్నాయి పాడేటి వేళ
ఆ చూపు అరుణోదయం 
ఆ చిరునవ్వు చంద్రోదయం

ఆ.. సెలయేరు పరువాలు చిలికేటి వేళ
మేఘాలు రాగాలు తీసేటి వేళ
ఆ చూపు అరుణోదయం 
ఆ చిరునవ్వు చంద్రోదయం


Palli Balakrishna Monday, May 17, 2021
Manavudu Danavudu (1986)



చిత్రం: మానవుడు దానవుడు (1986)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: ఆత్రేయ, దాసరి నారాయణరావు
గానం: యస్.పి.బాలు, పి.సుశీల, యస్.జానకి 
నటీనటులు: మోహన్ బాబు, రజిని, నళిని
దర్శకత్వం: రమణ బాబు
నిర్మాతలు: మంచు మోహన్ బాబు, యం. వెంకటాద్రినాయుడు
విడుదల తేది: 22.05.1986



Songs List:



కృష్ణా మధుసూధన పాట సాహిత్యం

 
చిత్రం: మానవుడు దానవుడు (1986)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: ఆత్రేయ 
గానం: పి.సుశీల

కృష్ణా మధుసూధన




వేమ్మా వేమ్మా వేమ్మా...పాట సాహిత్యం

 
చిత్రం: మానవుడు దానవుడు (1986)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: దాసరి నారాయణరావు
గానం: పి.సుశీల, యస్.పి.బాలు 

వేమ్మా వేమ్మా వేమ్మా...
ముట్టుకుంటే ముడుచుకుంటా వేమ్మా
పట్టుకుంటే పాన్చు కుంటావేమ్మా
పట్టుకుంటే పారిపోతావేమ్మా

ముక్కు మొఖము తెలియని గాలి నీ పై ఎందుకు వాలాలి
నాకై నీవు దాచిన సొగసులు త్వరపడి ఎందుకు తాకాలి

ముక్కు మొఖము తెలియని గాలి నీ పై ఎందుకు వాలాలి
నాకై నీవు దాచిన సొగసులు త్వరపడి ఎందుకు తాకాలి

దొంగని ఎందుకు కొరకాలి బెంగకు నేనేం కావాలి

నేను ఎక్కువా నీకా గాలి ఎక్కువ
నేను ఎక్కువా నీకా గాలి ఎక్కువ

దగ్గరుంటే దూరం అవుతావమ్మా
దూరముంటే దగ్గరౌతావమ్మా
మనసుపడితే కట్టుకుంటవు
కట్టుకుంటే సొంతమౌతవు
కోరుకున్న  మనసు ఎక్కువా
కట్టుకున్న మనిషి మక్కువా

నేను ఎక్కువా నీపై నాకు మక్కువా
నేను ఎక్కువా నీపై నాకు మక్కువా




చెవిలో పువ్వెట్టు పాట సాహిత్యం

 
చిత్రం: మానవుడు దానవుడు (1986)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: దాసరి నారాయణరావు
గానం: యస్.జానకి , యస్.పి.బాలు 

చెవిలో పువ్వెట్టు 




ధిక్కారమా ఇది తిరస్కారమా పాట సాహిత్యం

 
చిత్రం: మానవుడు దానవుడు (1986)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: ఆత్రేయ 
గానం: యస్.పి.బాలు 

ధిక్కారమా ఇది తిరస్కారమా



పూణా కెళ్ళాడు నా మొగుడు పాట సాహిత్యం

 
చిత్రం: మానవుడు దానవుడు (1986)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: యస్.జానకి 
గానం: పి.సుశీల

పూణా కెళ్ళాడు నా మొగుడు 

Palli Balakrishna
Ragile Gundelu (1985)






చిత్రం: రగిలే గుండెలు (1985)
సంగీతం: కె. చక్రవర్తి
నటీనటులు: మోహన్ బాబు , రాధిక , ప్రభ, మంచు విష్ణు (చైల్డ్ ఆర్టిస్ట్)
నిర్మాత: మంచు మోహన్ బాబ
విడుదల తేది: 02.05.1985





చిత్రం: రగిలే గుండెలు (1985)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: 
గానం: 

నవ్వులు పూసే నందనం పాట సాహిత్యం

నవ్వులు పూసే నందనం
మమతలు పండే బృంధావనం

నవ్వులు పూసే నందనం
మమతలు పండే బృంధావనం

అన్నయ్య మనసే రామాలయం
వదినమ్మ నీడే ప్రేమాలయం
మా ఇల్లే దేవాలయం
మా ఇల్లే దేవాలయం

నవ్వులు పూసే నందనం
మమతలు పండే బృంధావనం

 అన్నదమ్ముల అనుబంధానికి అర్థం చెప్పే తమ్ముడు
అన్నదమ్ముల అనుబంధానికి అర్థం చెప్పే తమ్ముడు
లక్ష్మణుడంటి తమ్ముడు
ఎన్నడూ వీడని మిత్రుడు
ఆ తమ్ముడు వదినై
ఈ అన్నకి సతినై
సీతానైనాను ఒక మాటనైనాను
నీ సీతానైనాను ఒక మాటనైనాను
ఈ అన్నదమ్ముల అనుబంధం ఇక వర్ధిల్లాలి కలకాలం
ఇక వర్ధిల్లాలి కలకాలం

మా ఇల్లే దేవాలయం
మా ఇల్లే దేవాలయం

నవ్వులు పూసే నందనం
మమతలు పండే బృంధావనం

ఆలయమంటి మెట్టినింటిలో దీపంలాంటి కోడలు
ఆలయమంటి మెట్టినింటిలో దీపంలాంటి కోడలు

చిరునవ్వుల శ్రీలక్ష్మిగా మా ఇంటి మహాలక్ష్మి గా
మా అమ్మానాన్నకి ముద్దు 
ఈ చిన్నాన్నికి నే ముద్దు
ఈ ముగ్గురి మురిపాలు శ్రీరామ రక్షణలు
ఈ ముగ్గురి మురిపాలు శ్రీరామ రక్షణలు
ఈ ఇంటిపచ్చని తోరణం ఇక వాడిపోదులే కలకాలం
ఇక వాడిపోదులే కలకాలం

మా ఇల్లే దేవాలయం
మా ఇల్లే దేవాలయం

నవ్వులు పూసే నందనం
మమతలు పండే బృందావనం
అన్నయ్య మనసే రామాలయం
వదినమ్మ నీడే ప్రేమాలయం
మా ఇల్లే దేవాలయం
మా ఇల్లే దేవాలయం
నవ్వులు పూసే నందనం
మమతలు పండే బృంధావనం

Note: This Lyric was Donated by Runku Ramprasad


Palli Balakrishna
Agni Jwala (1983)

చిత్రం: అగ్ని జ్వాల (1983)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
నటీనటులు: మోహన్ బాబు , కవిత, ముచ్చర్ల అరుణ, నరేష్ 
డైలాగ్స్: సత్యానంద్
దర్శకత్వం: బోయిన సుబ్బారావు
నిర్మాత: జి.వి. కృష్ణ రావు
విడుదల తేది: 14.07.1983 

Palli Balakrishna
Bandodu Gundamma (1980)



చిత్రం: బండోడు గుండమ్మ (1980 )
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: 
గానం: 
నటీనటులు: కృష్ణ , జయప్రద
దర్శకత్వం: దాసరి నారాయణరావు
నిర్మాత: జి.వి.ఎస్. రాజు 
విడుదల తేది: ౦౩.10.1980 

Palli Balakrishna Sunday, May 16, 2021
College Bullodu (1992)





చిత్రం: కాలేజ్ బుల్లోడు (1992)
సంగీతం: రాజ్-కోటి
నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, రాధిక, హరీష్
దర్శకత్వం: శరత్
నిర్మాత: పి. బలరాం
విడుదల తేది:02.07.1992



Songs List:



అందమా ఇలా అందుమా పాట సాహిత్యం

 
చిత్రం: కాలేజ్ బుల్లోడు (1992)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, చిత్ర 

అందమా ఇలా అందుమా



చమ చమ చమ పాట సాహిత్యం

 
చిత్రం: కాలేజ్ బుల్లోడు (1992)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, చిత్ర 

చమ చమ చమ 



ఎంతో మధురమీ జీవితం పాట సాహిత్యం

 
చిత్రం: కాలేజ్ బుల్లోడు (1992)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు 

పల్లవి:
ఎంతో మధురమీ జీవితం అంతే లేని ఓ అద్భుతం 
అనుదినం అనుభవం పరువమే పరిమళం 
సాయంత్రం తెల్లారే రేయంతా పగలాయే నా చదువు సంధ్యల్లో...
కలలన్నీ సత్యాలే కదలాడే దృశ్యాలే కాలేజీ రోజుల్లో 
నవ్వేది నవ్వించేది నా పాత్ర మీ మధ్యలో 

చరణం: 1
అరవై యేళ్ళా ఆనందం 
ఇరవై యేళ్ళా తారంగాలే...
మనకు సొంతాలే...
సిక్సో క్లాక్ సిద్ధాంతం 
సిలబస్సంతా రాద్ధాంతాలే...
తిరగరాస్తాలే...
మళ్ళీ మనసుపడి తిరిగివచ్చిందీ ఉదయం 
మాళ్లే మనసులలో పిలిచే టీనేజీ హృదయం 
వయస్సంటే మనసు అదే నాకూ తెలుసూ...ఓ...ఓ....ఓ...

చరణం: 2
అంతేలేని ఆకాశం 
ఎంతో వున్న అవకాశం
దొరికె ఈనాడే...
సాహిత్యంసేవించాలి 
శ్రుతులతో నేడే...
జానేదో లోకం మనము రాసిందే శ్లోకం 
ఏమైనా రాగం మనము వేసిందే తాళం
ఒకే చాన్సు బ్రతుకు...భరోసాగా బతుకూ...ఓ..ఓ..ఓ...




రాగింగ్ అంట పాట సాహిత్యం

 
చిత్రం: కాలేజ్ బుల్లోడు (1992)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, చిత్ర 

రాగింగ్ అంట 




ఏమి హాయిలే పాట సాహిత్యం

 
చిత్రం: కాలేజ్ బుల్లోడు (1992)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, చిత్ర 

ఏమి హాయిలే

Palli Balakrishna Wednesday, May 12, 2021
Maa Variki Pelli (1993)


చిత్రం: మావారికి పెళ్లి (1993)
సంగీతం: శంకర్ గణేష్
నటీనటులు: ఆనంద్ బాబు, సితార
దర్శకత్వం: రామనారాయణ
నిర్మాతలు: నార్నే శ్రీనివాస రావు, ఎన్. డి. విజయబాబు
విడుదల తేది:26.01.1993



Palli Balakrishna
Aalu Magalu (1995)


చిత్రం: ఆలుమగలు (1995)
సంగీతం: ఎం. ఎం. శ్రీలేఖ
నటీనటులు: సుమన్, మీనా, ఆమని
దర్శకత్వం: సాగర్
నిర్మాత: కె.విజయలక్ష్మి ప్రసాద్
విడుదల తేది: 26.01.1995

చిత్రం: ఆలుమగలు (1995)
సంగీతం: ఎం. ఎం. శ్రీలేఖ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, ఎం. ఎం. శ్రీలేఖ

మల్లి... మల్లి మల్లి అంటూ నీ పేరే అంటుంటే మళ్ళీ  మళ్ళీ
తుళ్ళి.. తుళ్ళి తుళ్ళి గుండె గుడి గంటెయ్ మోగిందే మళ్ళీ మళ్ళీ
నీ ఊహలె నీ ఊసులె నా ఊపిరిలో పలికే మురళి... రవళి

మల్లి...మల్లి మల్లి అంటూ నీ పేరే అంటుంటే మళ్ళీ మళ్ళీ
తుళ్ళి.. తుళ్ళి తుళ్ళి గుండె గుడి గంటెయ్ మోగిందే మళ్ళీ మళ్ళీ
నీ ఊహలె నీ ఊసులె నా ఊపిరిలో పలికే మురళి... రవళి

మల్లి...మల్లి మల్లి అంటూ నీ పేరే అంటుంటే మళ్ళీ మళ్ళీ

మృదువయిన రేఖ మధుమాస లేఖ
అది అందినాక కుదురేదికా
విరబూసినాక  దరహాస రేఖ
విరితేనెవాకా  ఎద నిండగా
వెలుగు చిలుకు కోరిక ఇలకు దిగిన తారక
మదన కధల తొలి వేదికా....
మునిమాపుల కనుపాపల మణి గీతిక నీవేనే మల్లి మల్లి...

మల్లి... మల్లి మల్లి అంటూ నీ పేరే అంటుంటే మళ్ళీ మళ్ళీ

సుకుమారమైన కుసుమారివైనా రసరాజ్యమేలే నా రాణివే...
నెలరాజుకైన వలరాజుకైనా విరహాలు రేపే నేర జాణవె
పడుచు కలల గీతిక కవి తలపులు కదలిక పరిమళాల స్వరమాలికా
నీ వన్నెలు నీ చిన్నెలు ఎన్నెన్నని వర్ణించనె మల్లి... మల్లి...

Palli Balakrishna
Aalu Magalu (1977)



చిత్రం: ఆలుమగలు (1977)
సంగీతం: టి.చలపతిరావు
నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ
దర్శకత్వం: తాతినేని రామారావు
నిర్మాత: ఎ. వి. సుబ్బారావు
విడుదల తేది: 11.03.1977



Songs List:



ఎరక్కపోయి వచ్చానూ పాట సాహిత్యం

 
చిత్రం: ఆలుమగలు (1977)
సంగీతం: టి.చలపతిరావు
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు

ఎరక్కపోయి వచ్చానూ



చిగురేసే మొగ్గేసే సొగసంతా పూతపూసే పాట సాహిత్యం

 
చిత్రం: ఆలుమగలు (1977)
సంగీతం: టి.చలపతిరావు
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

చిగురేసే మొగ్గేసే సొగసంతా పూతపూసే
చెయ్యెనా వెయ్యావేమి ఓ బాబూ దొర
చెయ్యెనా వెయ్యావేమి ఓ... బాబూ దొర
ఉయ్యాలలూపావేమీ.....

చిగురేసే మొగ్గేసే సొగసంతా పూతపూసే
ఇవ్వాలని లేదా ఏమీ....
ఆ సాగసంతా ఇవ్వాలని లేదా ఏమీ
ఓ సిరిపాపా ఎన్నాళ్లు దాస్తావేమీ...

చరణం:1
ముట్టుకుంటే ఉలికిపడతావ్
పట్టుకుంటే జారిపోతావ్ 
ముట్టుకుంటే ఉలికిపడతావ్
పట్టుకుంటే జారిపోతావ్ 
నీ చూపుల్లో ఉందీ సూదంటూరాయీ
అది లాగుతుంటే ఒళ్లంతా హాయి

చిగురేసే మొగ్గేసే సొగసంతా పూతపూసే
చెయ్యెనా వెయ్యావేమి ఓ బాబూ దొర
చెయ్యెనా వెయ్యావేమి ఓ...బాబూ దొర
ఉయ్యాలలూపావేమీ.....

చరణం:2
చేరుకుంటే ఊరుకుంటావ్
వల్లకుంటే గిల్లుతుంటావ్
చేరుకుంటే ఊరుకుంటావ్
వల్లకుంటే గిల్లుతుంటావ్
నీ చేతల్లో ఉంది చెకుముకి రాయి
అది రాసుకుంటే చురుకైన హాయి

చిగురేసే మొగ్గేసే సొగసంతా పూతపూసే
ఇవ్వాలని లేదా ఏమీ....
ఆ సాగసంతా ఇవ్వాలని లేదా ఏమీ
ఓ సిరిపాపా ఎన్నాళ్లు దాస్తావేమీ...

చరణం: 3
నిన్ను కట్టుకోవాలని మనసాతది.
చేయి పట్టుకోవాలంటే గుబులౌతది
నిన్ను కట్టుకోవాలని మనసాతది.
చేయి పట్టుకోవాలంటే గుబులౌతది

గుబులెందుకింకా గారాల చిలకా
ఎగిరెగిరిపోదాము సెలవంక దాకా

చిగురేసే మొగ్గేసే సొగసంతా పూతపూసే
చెయ్యెనా వెయ్యావేమి ఓ బాబూ దొర
చెయ్యెనా వెయ్యావేమి ఓ... బాబూ దొర
ఉయ్యాలలూపావేమీ.....




ఒక్కరిద్దరుగ మారేది పాట సాహిత్యం

 
చిత్రం: ఆలుమగలు (1977)
సంగీతం: టి.చలపతిరావు
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి
గానం: వి. రామక్రిష్ణ, పి.సుశీల

ఒక్కరిద్దరుగ మారేది




పరుగెత్తి పాలుతాగేకంటె పాట సాహిత్యం

 
చిత్రం: ఆలుమగలు (1977)
సంగీతం: టి.చలపతిరావు
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి. బాలు, పి.సుశీల, మాధవపెద్ది రమేష్, విజయలక్ష్మి శర్మ 

పరుగెత్తి పాలుతాగేకంటె




ర ర ర ర రంకెవేసిందమ్మో పాట సాహిత్యం

 
చిత్రం: ఆలుమగలు (1977)
సంగీతం: టి.చలపతిరావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: యస్.పి. బాలు, పి.సుశీల

ర ర ర ర రంకెవేసిందమ్మో



తెలుసుకో ఈ జీవితసత్యం పాట సాహిత్యం

 
చిత్రం: ఆలుమగలు (1977)
సంగీతం: టి.చలపతిరావు
సాహిత్యం: శ్రీ శ్రీ 
గానం: యస్.పి. బాలు

తెలుసుకో ఈ జీవితసత్యం

Palli Balakrishna

Most Recent

Default