చిత్రం: జిన్నా (2022) సంగీతం: అనూప్ రూబెన్స్ నటీనటులు: మంచు విష్ణు, సన్నీ లియోన్, పాయల్ రాజపుత్ దర్శకత్వం: సూర్యా నిర్మాత: మంచు విష్ణు విడుదల తేది: 21.10.2022
Songs List:
ఇది స్నేహం పాట సాహిత్యం
చిత్రం: జిన్నా (2022) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: భాస్కరభట్ల గానం: అరియాన, వివియాన మౌనం కూడా మాటాడదా కుహు కుహు కోయిల పాటవ్వదా మనసున సందడి మొదలవ్వదా ఒక స్నేహం తోడైతే స సరిగరి సరి రీగమాగరిగ గామపపగామ రినిస హరివిల్లుకి రంగుల్లా చిరుగాలికి అల్లరులా సెలయేటికి సవ్వడిలా ఇది స్నేహం ఇది స్నేహం ఇది స్నేహం ఇది స్నేహం ఇది స్నేహం ఎహె దోస్తీ దిస్ ఈజ్ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ ఆ దైవం రాడే ప్రతి దానికి కనుకే లోకం ప్రతివైపుకీ పంపించాడే మన మంచికి వరంలాగా ఈ స్నేహమే లా- ఆ గుండెకి చప్పుడులా కనుపాపకి రెప్పల్లా అరె చేతికి గీతల్లా లాలా లా పెదవంచుకి నవ్వుల్లా పాదాలకి పురుగుల్లా ప్రాణానికి ప్రాణంగా ఇది స్నేహం ఇది స్నేహం ఇది స్నేహం ఇది స్నేహం ఇది స్నేహం ఇది స్నేహం నువు తలిచేలోగా వచ్చేయడం అడిగేలోగా ఇచ్చెయ్యడం బ్రతికేలోగా తెచ్చెయ్యడం స్నేహంలోనా ఉందే గుణం లా- నీ ఆశకి నిచ్చెనలా నీ ఊహకి ఊపిరిలా నీ దారికి దీపంలా లాలా లా నీ మాటకి అర్థంలా నిను చూపే అద్దంలా ప్రతి పూట పండుగరా ఇది స్నేహం ఇది స్నేహం ఇది స్నేహం ఇది స్నేహం ఇది స్నేహం ఎహె దోస్తీ దిస్ ఈజ్ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్
గోలిసోడావే పాట సాహిత్యం
చిత్రం: జిన్నా (2022) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: బాలాజీ గానం: నకాష్ అజీజ్, నూతన్ మోహన్ గోలిసోడావే
నా పేరు జిన్నారా పాట సాహిత్యం
చిత్రం: జిన్నా (2022) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: ప్రేమ్ గానం: పృద్వి చంద్ర నా పేరు జిన్నారా అందరికి అన్నరా నకరాలు జేస్తే కిస్సా ఖల్లాసురా ఆ ఆ హే, పద్దులు చూడంది డాన్ జిన్నా భాయ్ ఎవ్రీబడీ టేక్ ఇట్ అవుట్ ఆఫ్ ది వే ఫాల్తూగాళ్ళందరూ చుప్ బైటికే అన్నకి సలాం కొట్టుర్రి బే కథల్ జేసెటోళ్ళని ఇడిసేదిలే ఇచ్చి పడేస్తాడు వచ్చిండంటే ఇగ హే, చూపు అదురు లేదు బెదురు నాకు ఎదురు లేదురా ఒకటే గుద్దుతోనే పుంగి పగిలిపోద్దిరా వీడి కటౌటే చూస్తే షేపౌటే నీ బద్దలు భాషింగాలే అరె, వచ్చిండు చూడు మన జిన్నా భాయ్ తొడ గొట్టిండు చూడు మన జిన్నా భాయ్ ఆట ఆడిండంటే మన జిన్నా భాయ్, ఖేల్ ఖతం
జారు మిఠాయో పాట సాహిత్యం
చిత్రం: జిన్నా (2022) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: ఎ. గణేష్ గానం: సింహా, నిర్మలా రాథోడ్ హెయ్, జారు మిఠాయో నా జారు మిఠాయ హే హే, లెట్స్ డూ దిస్ మిఠాయ మిఠాయ జారు మిఠాయ మిఠాయ మిఠాయ జారు మిఠాయ నువ్వొస్తావని నేను ఓరబ్బయ్య సిల్కు చీర కట్టుకుంటిని (అబ్బా) మల్లెపూలు పెట్టుకుంటిని (అబ్బబ్బబ్బా) మిఠాయ మిఠాయ జారు మిట్టాయ మిఠాయ మిఠాయ జారు మిట్టాయ నువ్వు రాలేదని నేను ఓరబ్బయ్యా సీరనేమో సింపుకుంటినీ పూలనేమో సికర బకర చేసుకుంటినీ మిఠాయ్ మిఠాయ్… మిఠాయ్ మిఠాయ్ జారు మిఠాయా మిఠాయ్ మిఠాయ్… మిఠాయ్ మిఠాయ్ జారు మిఠాయా పగటేలకొస్తవనీ ఓరబ్బయ్య జీడిపప్పు వలిచి పెడితిని పిడత కింద దాచి పెడితిని పరులేమో చూసిరని ఒరబ్బయ్యా జీడిపప్పు ఉడతకిస్తిని పిడతనేమో పగలకొడితిని నేను ఆడదాన్ని కాదంట్రా మొగ్గలెక్క లింగో జమ్కులకిడి జారు మిఠాయ రాత్రి అయితే చాలు నాకు నువ్వే గుర్తుకువస్తావు అబ్బయో, అబ్బాయా నీకోసం నేను దాచిందంతా ఆరు బయట పెడతాను అబ్బాయ, అబ్బాయ… అబ్బాయా మాటేలకొస్తవని ఓరబ్బయా తమలపాకు కడిగిపెడితిని వక్క కోసం ఎదురు చూస్తినీ పరులేమో నవ్విరని ఒరబ్బయ్యా ఆకునేమో మడిచిపెడితినీ వక్క లేక బిక్కుమంటినీ మిఠాయ్ మిఠాయ్… మిఠాయ్ మిఠాయ్ జారు మిఠాయా మిఠాయ్ మిఠాయ్… మిఠాయ్ మిఠాయ్ జారు మిఠాయా నేను ఆడదాన్ని కాదంట్రా మొగ్గలెక్క లింగో జమ్కులకిడి జారు మిఠాయ కోరస్: యో, గాలి నాగేశ్వర్ రావు ఈ యమ్మి లెక్క సూడు నీ జీడిపప్పు కొరికేస్తా ఆకుపైన వక్కేస్తా చిలక మిఠాయ్ చిదిమేస్తా నీ చీర చాటు… నీ చీర చాటు అందమంతా దోచేసుకుంటా జమ్కులకిడి జారు మిఠాయ నేను ఆడదాన్ని కాదంట్రా మొగ్గలెక్క లింగో జమ్కులకిడి జారు మిఠాయ హే, జారు జారు… జారు జారు జారు మిఠాయా మిఠాయ్ మిఠాయ్… మిఠాయ్ మిఠాయ్ జారు మిఠాయా జమ్కులకిడి జారు మిఠాయ
2022
,
Anup Rubens
,
Ginna
,
Payal Rajput
,
Sunny Leone
,
Vishnu Manchu
,
Vishnu Manchu (As a Producer)
Ginna (2022)
Palli Balakrishna
Monday, October 17, 2022