Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Suresh Kondeti"
Shopping Mall (2010)


 

చిత్రం: షాపింగ్ మాల్ (2010)
సంగీతం: జి. వి. ప్రకాష్ కుమార్, విజయ్ ఆంటోని
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: హరిచరణ్, చిన్మయ శ్రీ పాద
నటీనటులు: మహేష్ , అంజలి
దర్శకత్వం: వసంత బాలన్
నిర్మాత: సురేష్ కొండేటి
విడుదల తేది: 06.11.2010



నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం
నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం
నా పాటకు మాటై పలికావే హో...
యద చప్పుడు చేసే శృతి నీవే

ఎండల్లో వెన్నెల తెచ్చావే హో..
నిప్పుల్లో వానై వచ్చావే

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం
నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం
నా పాటకు మాటై పలికావే ఓ...
యద చప్పుడు చేసే శృతి నీవే

నీ పరువాల పూ జల్లే కురిపించావే
నా మనసును దోచి మాయను చేసి మురిపించావే
నా మదిలోని భావనల అర్ధం నువ్వే
బుగ్గల్లోన మెరిసేటి సిగ్గైనావే
నా లోకం చీకటి కోన నువ్వొస్తే వెన్నెల వాన
ప్రతి రేయి పున్నమి అనుకోనా చెలియా చెలియా

హో.. ఎండల్లోవెన్నెల తెచ్చావే హో..
నిప్పుల్లో వానై వచ్చావే

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం
నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం

నా పాటకు మాటై పలికావే హో..
యద చప్పుడు చేసే శృతి నీవే
ఓ.. ఎండల్లో వెన్నెల తెచ్చావే హో..
నిప్పుల్లో వానై వచ్చావే

నీ తోడంటు ఉండని నాడే జగమే శూన్యం
నీ సింధూరం అవుతుంటే నా జన్మే ధన్యం
నీ మురిపించే రాగం రేపే మల్లెల మోహం
నా మదిలోన చిందులు వేసే అల్లరి దాహం
నీ జాడగ ఉంటే తప్ప నా నీడకు అర్దమ్మా లేదే
అంతకంటే వరమే ఏలా ప్రియా ప్రియా
ఎండల్లో వెన్నెల తెచ్చావే హో.. 
నిప్పుల్లో వానై వచ్చావే

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం
నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం
నా పాటకు మాటై పలికావే హో..
యద చప్పుడు చేసే శృతి
ఎండల్లో వెన్నెల తెచ్చావే హో..
నిప్పుల్లో వానై వచ్చావే

Palli Balakrishna Saturday, May 8, 2021
Premisthe (2005)




చిత్రం: ప్రేమిస్తే (2005)
సంగీతం: జోష్వా శ్రీధర్
నటీనటులు: భరత్, సంధ్యా
దర్శకత్వం: బాలాజీ శక్తివేల్
నిర్మాత: సురేష్ కొండేటి
విడుదల తేది: 12.10.2005



Songs List:



మూల సందు పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమిస్తే (2005)
సంగీతం:  జోష్వా శ్రీధర్
సాహిత్యం: వేటూరి
గానం: కార్తీక్, టిప్పు, శ్రీవర్ధిని

మూల సందు 



తందనాన డప్పులతో పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమిస్తే (2005)
సంగీతం:  జోష్వా శ్రీధర్
సాహిత్యం: వేటూరి
గానం: పాప్ శాలిని, మాలతీ శర్మ , శ్రీవర్ధిని

తందనాన డప్పులతో 



ఇతడే పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమిస్తే (2005)
సంగీతం:  జోష్వా శ్రీధర్
సాహిత్యం: వేటూరి
గానం: సునీత సారధి

ఇతడే 




మట్టిలాంటి నన్ను పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమిస్తే (2005)
సంగీతం:  జోష్వా శ్రీధర్
సాహిత్యం: వేటూరి
గానం: హరిచరన్, హరిణి సుధాకర్

ఏ దూర తీరాలు నా పయనమయినా
నే సేద తీరేది నీ ఓడిలోనే
మరణాన ఒడిచేరు ఆ క్షణమునైనా
నీ సిగకు పూలిచ్చి పోనీ ప్రాణం
ప్రాణం ప్రాణం ప్రాణం ప్రాణం

మట్టిలాంటి నన్ను పట్టి పట్టి చూసి
శిల్పంలాగ చేసిందెవరో
నన్ను చుట్టి చుట్టి గుండే కొల్లగొట్టి
పట్టుతేనె కోరిందెవరో
ఎదలో ఎపుడు చెరగని తలపులే
జతగా ఆ ఆ బతికే కలలే నిజములే
 
మట్టిలాంటి నన్ను పట్టి పట్టి చూసి
శిల్పం లాగ చేసిందెవరో
నన్ను చుట్టి చుట్టి గుండే కొల్ల గొట్టి
పట్టు తేనె కోరిందెవరో

మాటలు నేర్పే అమ్మను కూడా మరిచే క్షణము
మనసే దోచే వెన్నెల గువ్వ నీకై పరుగు
నిన్ను చూడ వచ్చే కంటి పాప చేసే ఎంతో పుణ్యం
ఒంటి మీద వాలే వాన చుక్క నీవై తడిపే వైనం
హ్రుదయము నిండే ప్రియమైన మాటే
చెరగని గురుతైపోదా
ఎద చేరి ఏలే చిత్రమైన ప్రేమ నిన్ను నన్ను కలిపేను కాదా

ఏ దూర తీరాలు నా పయనమయినా
నే సేద తీరేది నీ ఓడిలోనే
మరణాన ఒడిచేరు ఆ క్షణమునైనా
నీ సిగకు పూలిచ్చి పోనీ ప్రాణం

మట్టిలాంటి నన్ను పట్టి పట్టి చూసి
శిల్పం లాగ చేసిందెవరో
నన్ను చుట్టి చుట్టి గుండే కొల్లగొట్టి
పట్టు తేనె కోరిందెవరో
ఎదలో ఎపుడు చెరగని తలపులే
జతగా ఆ ఆ బతికే కలలే నిజములే

మనసులు రెండు ఒకటైపొయే పలికే రాగం
ఎదనే మీటే చెరగని పేరు నిలిపే ప్రాణం
నన్ను తాకి వెళ్ళే చల్లగాలి లోన నీదే తలపు
నాలోఆశ దాచా పైట చాటు చేసా ఎదకే సుఖమై
స్వరముల జల్లై వలపు వెన్నెల్లై
అల్లుకుంటే ప్రేమే కదా
ఆది అంతం లేని మనల వీడిపోని దైవం ప్రేమే కాదా

మట్టిలాంటి నిన్ను పట్టి పట్టి చూసి
శిల్పం లాగ చేసిందెవరో
నిన్ను చుట్టి చుట్టి గుండే కొల్లగొట్టి
పట్టు తేనె కోరిందెవరో
ఎదలో ఎపుడు చెరగని తలపులే
జతగా ఆ ఆ బతికే కలలే నిజములే
మట్టిలాంటి నిన్ను పట్టి పట్టి చూసి
శిల్పం లాగ చేసిందెవరో
నిన్ను చుట్టి చుట్టి గుండే కొల్లగొట్టి
పట్టు తేనె కోరిందెవరో




పువ్వు నచ్చెను పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమిస్తే (2005)
సంగీతం:  జోష్వా శ్రీధర్
సాహిత్యం: వేటూరి
గానం: కార్తీక్, టిప్పు, పాప్ షాలిని

పువ్వు నచ్చెను 




జన్మ నీదేలే పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమిస్తే (2005)
సంగీతం:  జోష్వా శ్రీధర్
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి
గానం: హరిచరణ్

జన్మ నీదేలే మరుజన్మ నీకేలే
జతను విడిచావో చితికి పోతానే
ప్రియతమా... ప్రణయమా... 
కుమలకే... ప్రాణమా...
అడుగు నీతోనే

జన్మ నీదేలే మరుజన్మ నీకేలే
జతను విడిచావో చితికి పోతానే

కన్నుల బాధను కన్నుల నీరే తెలుపును
వలచిన హృదయము తెలపదులే
గడ్డిలో పిచ్చిగ పూసిన పువ్వులే 
ఎన్నడు దేవత పూజకు నోచవులే
మెరుపుల్లో తీగల మీద 
మైనా కడుతుందా గూడు
మన ప్రేమకు ఓటమి రానే రాదు
ప్రతి నదికి మలుపులు తధ్యం 
బ్రతుకుల్లో బాధలు నిత్యం
ఎద గాయం మాన్పును కాలం
సిరివెన్నెల మాత్రం నమ్మి 
చిగురాకులు బ్రతుకవు కాదా
మిణుగురులే వడి కిరణం

తల్లిని తండ్రిని కాదని ప్రేమే కోరిన చిలుకకు 
గూడుగ నే ఉన్నా
గుండెపై నీవుగ వాలిన ప్రేమలో 
ఎదురుగ పిడుగులే పడినను విడువనులే
స్నానానికి వేణ్ణిలవుతా 
అవి కాచే మంటనవుతా
హ్రుదయంలో నిన్నే నిలిపాలే
నిదురించే కంట్లో నేనే పాపల్లే మేలుకుంటా
కలలోనే గస్తీ కాస్తాలే...
నేనంటే నేనే కాదు నువు లేక నేనేలేను
నీ కంటి రెప్పల్లే ఉంటా

జన్మ నీదేలే మరుజన్మ నీకేలే 
జతను విడిచావో చితికి పోతానే
ప్రియతమా... ప్రణయమా... 
కుమలకే... ప్రాణమా...

అడుగు నీతోనే అడుగు నీతోనే 
అడుగు నీతోనే అడుగు నీతోనే




గిర గిర పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమిస్తే (2005)
సంగీతం:  జోష్వా శ్రీధర్
సాహిత్యం: వేటూరి
గానం: కార్తీక్,  పాప్ షాలిని

గిర గిర 

Palli Balakrishna Sunday, July 16, 2017
Journey (2011)



చిత్రం: జర్నీ (2011)
సంగీతం: సి.సత్యా
సాహిత్యం: సాహితి
గానం: కార్తీక్
నటీనటులు: శార్వానంద్, జై ,  అనన్య, అంజలి
దర్శకత్వం: యమ్.శరవన్
నిర్మాత: సురేష్ కొండేటి
విడుదల తేది: 16.12.2011

మేఘమా నీలి మేఘమా
ఎదురు చూశానీ పూల జల్లుకి
వర్షమా వలపుల వర్షమా
కాచుకున్నానీ మొదటి ముద్దుకి
కన్ను మూయల చెవి మోగల
ముద్ద మింగల నోట నవ్వల
చెయ్యి ఊపల కాలు కదపల
ఆ విసుగులో ఏమెరుగల

ఓ మేఘమా  మేఘమా ఎదురుచూశానే
మేఘమా నీలి మేఘమా
ఎదురు చూశానీ పూల జల్లుకి

రోడ్ లోన చూడాలా పార్క్ లో చూడాలా
బస్ లో చూడాలా ఆటోలో చూడాలా
థియేటర్ లో చూడాలా స్ట్రీట్ లో చూడాలా
చూశాను అల్లంత దూరంలో...
గాలిలో నిలవాల భూమిలో నిలవాల
అక్కడ నిలవాల ఇక్కడ నిలవాల
నిలవాల నిలవాల ఎక్కడ నిలవాల
నిలిచాను ఆ పిల్ల గుండెలో...
నిలిచిందో పిలిచిందో వీధిలో
నేను గమనించుకోలేదు మొదటిలో
నే ఎదురు చూశాలే పూలకొమ్మకి

మేఘమా నీలి మేఘమా
కాచుకున్నానీ మొదటి ముద్దుకి

నంబర్ అడగాల ఫోన్ చెయ్యాలా
అడ్రస్ అడగాల లవ్ లెటరివ్వాళ
ఫాలో చెయ్యాలా కబురు పంపాల
ఎలా వచ్చింది ఎదురులో...
ప్లీస్ చేయాలా జగడాలాడాల
మిడిమీరి చూడాలా నవ్వుతూ మాట్లాడాలా
వీధిలో అపాల చెయ్యి పట్టాల ఎట్లా పడ్డాది ప్రేమలో
నేను క్యాచ్ చేయి పోయేటి నవ్వుతో
నాకు మ్యాచైపోయింది లైఫ్ లో
నేను ఎదురు చూశాలే నా పూల కొమ్మకి

మేఘమా నీలి మేఘమా
నాకు నీ ప్రేమే కావాలిలే నువ్వే కావాలిలే
కన్ను మూయల చెవి మోగల
ముద్ద మింగల నోట నవ్వల
నాకు నీ ప్రేమే కావాలిలే


*********   **********   **********


చిత్రం: జర్నీ (2011)
సంగీతం: సి.సత్యా
సాహిత్యం: సాహితి
గానం: అనురాధ శ్రీరామ్

సయ్యా...  సయ్యా...

నీ పేరే తెలియదుగా నిను పిలవగ లేను కద
నే నీకో పేరిడిన నీకే తెలియదుగా
ఆ పేరే విననోళ్లు మరి ఎవ్వరు లేరు కదా
ఆ పేరొకపరి వింటే నిద్దుర రాదు సుమా
నే ప్రతి రోజు నిన్ను తలచి పులకించన
నా మిన్నంటు మమతలతో  నిను మించినా
ఓ ఆ పేరు వెచ్చని కిరణం పలికేటి పెదవుల మధురం
సూర్యుడే నీవనుకుంటే సరికాదులే

ఓ ఆ పేరు చిరు చలికాలం వినగానే జిల్లాను హృదయం
నది అని నువ్వనుకుంటే అది కాదులే
కదలని ఆ శిల కాదు బెదిరించే పులికాదు
తన పేరిక ఏదైనా అది మరుపేరే కాదు
నా పేరుతో చేరే పేరే నే చెప్పనా...

మహా పెద్ద పేరే తనది గొంతు మరి కొరపోతుంది
అక్షరాలెన్నని అంటే అంతుతెలియదే
ఓ అతి చిన్న పేరే తనది చిటికెలో అయిపోతుంది
ఆ పేరు తీరుని తెలిపే బాషలేదులే
అధరాల కలయికగా ఆ పేరే పలుకంగా
అది తేటల తెలుగువలె విరితేనెలు తొణికెనులే
నా పేరుతో చేరే పేరే నే చెప్పనా

నీ పేరే తెలియదుగా నిను పిలవగ లేను కద
నే నీకో పేరిడిన నీకే తెలియదుగా
నే ప్రతి రోజు నిన్ను తలచి పులకించన
నా మిన్నంటు మమతలతో  నిను మించినా

Palli Balakrishna Wednesday, July 5, 2017

Most Recent

Default