Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Ram Charan (As a Producer)"
Acharya (2022)


చిత్రం: ఆచార్య (2022)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: చిరంజీవి, రామ్ చరణ్, కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే
దర్శకత్వం: కొరటాల శివ
నిర్మాత: రామ్ చరణ్
విడుదల తేది: 14.02.2022



Songs List:



లాహే లాహే పాట సాహిత్యం

 
చిత్రం: ఆచార్య (2022)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: హరిత నారాయణ్, సాహితి చాగంటి

లాహే లాహేలాహేలాహే లాహే లాహేలాహేలాహే
లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహేలే

కొండలరాజు బంగరు కొండ
కొండా జాతికి అండా దండా
మద్దే రాతిరి లేచి మంగళ గౌరీ మల్లెలు కోసిందే
ఆటిని మాలలు కడతా
మంచు కొండల సామిని తలసిందే

లాహే లాహేలాహేలాహే లాహే లాహేలాహేలాహే
లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహేలే

మెళ్ళో మెలికల నాగుల దండ
వలపుల వేడికి ఎగిరిపడంగా
ఒంటి యిబూది జలజల రాలిపడంగా
సాంబడు కదిలిండే
అమ్మ పిలుపుకు సామి
అత్తరు సెగలై విలవిల నలిగిండే

లాహే లాహేలాహేలాహే లాహే లాహేలాహేలాహే
లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహేలే

నాదర్దిన్న దినదిన నాననా
నాదర్దిన్న దినదిన నాననా

కొరకొర కొరువులు మండే కళ్ళు
జడలిరబోసిన సింపిరి కురులు
ఎర్రటి కోపాలెగసిన కుంకంబొట్టు వెన్నెల కాసిందే
పెనిమిటి రాకను తెలిసి సీమాతంగి సిగ్గులు పూసిందే

ఉబలాటంగా ముందటి కురికి 
అయ్యవతారం చూసిన కల్కి
ఎందా శంఖం సూళం భైరాగేసం ఏందని సణిగిందే
ఇంపుగ ఈ పూటైనా రాలేవా అని సనువుగ కసిరిందే

లాహే లాహేలాహేలాహే లాహే లాహేలాహేలాహే
లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహేలే

లోకాలేలే ఎంతోడైన లోకువమడిసే సొంతింట్లోన
అమ్మోరు గడ్డంపట్టి బతిమాలినవి అడ్డాల నామాలు
ఆలుమగల నడుమన అడ్డంరావులే ఇట్టాంటి నియమాలు

ఒకటో జామున కలిగిన విరహం
రెండో జాముకి ముదిరిన విరసం
సర్దుకుపోయే సరసం కుదిరే వేళకు మూడో జామాయే
ఒద్దిక పెరిగే నాలుగో జాముకి
గుళో గంటలు మొదలాయే

లాహే లాహేలాహేలాహే లాహే లాహేలాహేలాహే
లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహేలే
లాహే లాహేలాహేలాహే లాహే లాహేలాహేలాహే
లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహేలే

ప్రతి ఒక రోజిది జరిగే ఘట్టం
ఎడమొకమయ్యి ఏకం అవటం
అనాది అలవాటీళ్ళకి అలకలలోనే కిలకిలమనుకోటం
స్వయాన చెబుతున్నారు అనుబంధాలు
కడతేరే పాఠం



నీలాంబరీ పాట సాహిత్యం

 
చిత్రం: ఆచార్య (2022)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: అనంత శ్రీరాం
గానం: అనురాగ్ కులకర్ణి , రమ్య బెహ్రా

నీలాంబరీ నీలాంబరీ
వేరెవ్వరే నీలా మరి
అయ్యోరింటి సుందరి
వయ్యారాల వల్లరి
నీలాంబరీ (నీలాంబరీ)

వందే చంద్ర సోదరి
వస్తున్నాను నీ దరి
నీలాంబరీ నీలాంబరీ

మంత్రాలేంటోయ్ ఓ పూజారి
కాలం పోదా చేజారి
తంత్రాలేవి రావే నారి
నేనేం చెయ్ నే నన్నారి
నువ్వే చూపాలేమో చిలిపి వలపు నగరి

నీలాంబరీ నీలాంబరీ
వేరెవ్వరే నీలా మరి
నీలాంబరీ నీలాంబరీ
నీ అందమే నీ అల్లరి

విడిచా ఇపుడే ప్రహరీ… నిన్నే కోరి
గాలాలేయకోయ్… మాటలా జాలరి
ఒళ్ళో వాలదా నాలో సిరి టెన్ టు ఫైవ్
నీతో సాగితే మాటలే ఆవిరి
అయినా వేసినా పాటతో పందిరి
అడుగేస్తే చేస్తా నీకే నౌకరి

నీలాంబరీ నీలాంబరీ
వేరెవ్వరే నీలా మరి
నీలాంబరీ నీలాంబరీ
నీ అందమే నీ అల్లరి

ధీం తోం తోం పా సరిగమప ని
ధీం తోం తోం రీ మగరిస
ధీం తోం తోం పా సరిగమప ని
ధీం తోం తోం రీ మగరిస

మెరిశా వలచే కలలో ఆరితేరి
ఇంకా నేర్చుకో చాలదోయ్ నీ గురి
నేనే ఆపినా వీడకోయ్ ఈ బరి
విడనే వీడనే… నువ్వు నా ఊపిరి
సాక్ష్యం ఉన్నదీ జీవధార ఝరి
ప్రతిజన్మ నీకే రాశా ఛోకిరి

నీలాంబరీ నీలాంబరీ
వేరెవ్వరే నీలా మరి
నీలాంబరీ నీలాంబరీ
నీ అందమే నీ అల్లరి



శాన కష్టం పాట సాహిత్యం

 

చిత్రం: ఆచార్య (2022)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాస్కర భట్ల 
గానం: రేవంత్, గీత మాధురి

కల్లోలం కల్లోలం ఊరువాడా కల్లోలం
నేనొస్తే అల్లకల్లోలం
కల్లోలం కల్లోలం కిందా మీద కల్లోలం
నా అందం అల్లకల్లోలం

నా జడ గంటలూ ఊగే కొద్ది
ఓ అరగంటలో పెరిగే రద్దీ
ధగధగలా వయ్యారాన్ని
దాచి పెట్టేదెట్టాగా

శాన కష్టం సాన కష్టం
సాన కష్టం వచ్చిందే మందాకిని
చూసే వాళ్ళ కళ్ళు కాకులెత్తుకుపోని
సాన కష్టం వచ్చిందే మందాకిని
నీ నడుం మడతలోన జనం నలిగేపోనీ

నా కొలతే చూడాలని
ప్రతోడు టైలర్లా అయిపోతాడే
ఓ నిజంగా భలే బాగున్నాదే
నీ మూలంగా ఒక పని దొరికిందే

ఏడేడో నిమరొచ్చని
కుర్రాళ్ళే ఆర్ఎంపిలు అవుతున్నారే
హే ఇదేదో కొంచెం తేడాగుందే
నీ అబద్ధం కూడా అందంగుందే
ఇల్లు దాటితే ఇబ్బందే... ఒంపు సొంపుల్తో

శాన కష్టం, పాపం... సాన కష్టం
సాన కష్టం వచ్చిందే మందాకిని
అంటించకే అందాల అగరొత్తిని
సాన కష్టం వచ్చిందే మందాకిని
నానమ్మతో తీయించేయ్ నర దిష్టిని

ఓ యే ఓ యే ఎంగిలంది అమ్మాయో
ఓ యే ఓ యే ఎంగిలంది అమ్మాయో

హే, నా పైట పిన్నీసుని
అదేంటో విలన్లా చూస్తుంటారే
ఏ లెవెల్లో ఫోజెడుతున్నావే
మా చెవుల్లో పూలెడుతున్నావే

డాబాలే ఎక్కేస్తారే
పెరట్లో మా యమ్మే నలుగెడుతుంటే
నీ కహాని మాకెందుకు చెప్పు
మేం వింటున్నాం అని కొట్టకే డప్పు
గంప గుత్తగా సోకుల్తో ఎట్టా వేగాలో

శాన కష్టం, అరెరే... సాన కష్టం
సాన కష్టం వచ్చిందే మందాకిని
పంచాయితీలెట్టొద్ధే వద్దొద్దనీ
సాన కష్టం వచ్చిందే మందాకిని
అచ్చు బొమ్మాటాడించు యావత్తుని



భలే భలే బంజారా పాట సాహిత్యం

 
చిత్రం: ఆచార్య (2022)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: శంకర్ మహదేవన్, రాహుల్ సిప్లిగంజ్

హే సింబా రింబా సింబా రింబా 
చిరత పులుల చిందాట
హే సింబా రింబా సింబా రింబా 
సరదా బురద సయ్యాట

చీమలు దూరని చిట్టడవికి
చిరు నవ్వొచ్చింది
నిప్పు కాక రేగింది
డప్పు మోత మోగింది

కాకులు దూరని కారడవిలో
పండగ పుట్టింది
గాలి గంతులాడింది
నేల వంతపాడింది

సీకటంతా సిల్లుపడి
యెన్నెలయ్యిందియాల
అందినంత దండుకుందాం
పద దలో చెయ్యారా

భలే భలే బంజారా మజా మనదేర
రేయి కచ్చేరీలో రెచ్చి పోదాం రా (2)

చీమలు దూరని చిట్టడవికి
చిరు నవ్వొచ్చింది
నిప్పు కాక రేగింది
డప్పు మోత మోగింది

హే కొక్కొరోకో కోడె కూత
ఈ పక్క రావద్దే
అయితలెక్క ఆడేపాడే
మాలెక్క నాపొద్దే

తద్దిన దిన సుక్కల దాక లెగిసి ఆడాల
అద్దిర బన్నా ఆకాశ కప్పు అదిరి పడాల

అరిచేయి గీతకు చిక్కింది
భూగోళమ్మీయాల
పిల్లోల్ల మల్లే దాన్నట్టా
బొంగర మెయ్యాలా

భలే భలే బంజారా మజా మనదేర
రేయి కచ్చేరీలో రెచ్చి పోదాంరా (2)

నేస్తమేగా చుట్టూ ఉన్న 
చెట్టైన పిట్టైనా
దోస్తులేగా రాస్తాలోని
గుట్టహా మిట్టైన

అమ్మకుమల్లే నిన్నూ నన్ను
సాకింది ఈ వనము
ఆ తల్లీ బిడ్డల సల్లంగ జూసే
ఆయుధమే మనము

గుండెకు దగ్గరి ప్రాణాలు
ఈ గూడెం జనాలు
ఈల్ల కష్టం సుఖం
రెండిటికీ మనమే అయినోళ్లు

భలే భలే బంజారా మజా మనదేర
రేయి కచ్చేరీలో రెచ్చి పోదాం రా (2)

Palli Balakrishna Monday, April 18, 2022
Sye Raa Narasimha Reddy (2019)



చిత్రం: సైరా నరసింహారెడ్డి (2019)
సంగీతం: అమిత్ త్రివేది
నటీనటులు: చిరంజీవి, అమితాబ్, నయన తార, తమన్నా
దర్శకత్వం: సురేందర్ రెడ్డి
నిర్మాత: రాంచరణ్
విడుదల తేది: 02.10.2019



Songs List:



హో సైరా... (పవిత్ర ధాత్రి భారతాంబ) పాట సాహిత్యం

 
చిత్రం: సైరా నరసింహారెడ్డి (2019)
సంగీతం: అమిత్ త్రివేది
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: సునిధి చౌహాన్, శ్రేయ ఘోషల్

పల్లవి:
పవిత్ర ధాత్రి భారతాంబ ముద్దు బిడ్డవవురా
ఉయ్యాలవాడ నారసింహుడా
చరిత్ర పుటలు విస్మరించ వీలులేని వీరా
రేనాటిసీమ కన్న సూర్యుడా

మృత్యువే స్వరాన చిరాయురస్తు అనగా
ప్రసూతి గండమే జయించినావురా
నింగి శిరసువంచి నమోస్తు నీకు అనగా
నవోదయానివై జనించినావురా

హో  సైరా.., హో సైరా.., హో సైరా.
ఉసస్సు నీకు ఊపిరాయెరా
హో  సైరా.., హో సైరా.., హో సైరా
యసస్సు నీకు రూపమాయెరా

చరణం: 1
అహంకరించు ఆంగ్ల దొరలపైన
హుంకరించగలుగు ధైర్యమా
తలొంచి బతుకు సాటివారిలోన
సాహసాన్ని నింపు శౌర్యమా
శృంఖలాలనే తెంచుకొమ్మని
స్వేచ్చ కోసమే శ్వాసనిమ్మని
నినాదం నీవేరా...
ఒక్కొక్క బిందువల్లె జనులనొక్కచోట చేర్చి
సముద్రమళ్లే మార్చినావురా
ప్రపంచమొనికిపోవు పెనుతుఫానులాగ వీచి
దొరల్ని ధిక్కరించినావురా
మొట్టమొదటి సారి స్వతంత్ర సమరభేరి
పెటెల్లు మన్నది ప్రజాలి పోరిది
కాలరాత్రి వంటి పరాయి పాలనాన్ని
దహించు జ్వాలలో ప్రకాశమే ఇది
హో సైరా.. హో సైరా.. హో సైరా
ఉసస్సు నీకు ఊపిరాయెరా
హో సైరా.. హో సైరా.. హో సైరా
యసస్సు నీకు రూపమాయెరా

చరణం: 2
దాస్యాన జీవించడం కన్న చావెంతో మేలంది
నీ పౌరుషం
మనుషులైతే మనం అనిచివేసే జులుం
ఒప్పుకోకంది నీ ఉద్యమం
ఆలని బిడ్డని అమ్మని జన్మని బంధనాలన్ని
ఒదిలి సాగుదాం
ఓ.. నువ్వే లక్షలై ఒకే లక్ష్యమై అటేవేయని
ప్రతి పదం
కదనరంగమంతా కొదమసింగమల్లె
ఆక్రమించి విక్రమించి తరుముతోందిరా
అరివీర సంహారా...
హో  సైరా.. హో సైరా.. హో సైరా
హో  సైరా.. హో సైరా.. హో సైరా
ఉసస్సు నీకు ఊపిరాయెరా





జాగో నరసింహా జాగోరే పాట సాహిత్యం

 
చిత్రం: సైరా నరసింహారెడ్డి (2019)
సంగీతం: అమిత్ త్రివేది
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: శంకర్ మహదేవన్, హరి చరణ్, అనురాగ్ కులకర్ణి

జాగో నరసింహా జాగోరే
జనమంతా చూసేరే రారే
చేయ్యెత్తి జై కొట్టె హోరే
తకథై అంటు సింధులు తొక్కాలే

వజ్రాల వడగాళ్లే నవరత్నాలే సిరిజల్లై
మా నవ్వుల్లో సుక్కలు కురవాలే

ఓ  సై రా

జామాజం  జంజారావంలో
ధమాదం దుమ్ము దుమారంలో
అమాంతం అందరి ఊపిరిలో
ఘుమాగుమ్ చిందిన అత్తర్లో

పది దిక్కులకీ అందింధీ సందేశమ్
సరిహద్దులు అన్ని చెరిపిన ఈ సంతోషం
ఉవ్వెత్తునిల ఉప్పొంగిన ఈ ఉల్లాసం
ప్రతి ఒక్కరికి పంచేందుకని అవకాశమిదే

కన్నావటయ్య మా దొర
మా సంబరాన్ని కన్నార
ఉయ్యాలనాటి ఈడుల
ఊళ్ళన్నిటిని ఊగించేలా

కన్నావటయ్య మా దొర
మా సంబరాన్ని కన్నార
ఉయ్యాలనాటి ఈడుల
ఊళ్ళన్నిటిని ఊగించేలా
ఊళ్ళన్నిటిని ఊగించేలా
హే ఊళ్ళన్నిటిని ఊగించేలా

ఎం జవాబు చెబుతాంరా
పలానా పక్కోడెవడంటే
ఈ మన్నేర ఇద్దరిని కన్నదని
అనరా నిజమంటే

నువ్వు బాగుంటే చాలంతే
ఆ మాటింటే మరి
నే కూడా సల్లంగ ఉన్నట్టే

ఈ జాతర సాక్షిగ కలిసిన మన సావాసం
మన కష్టసుఖాలను పంచుకునేందుకు సిద్ధం
నువు నా కోసమ్ నేన్ నీ కోసం అనుకుందాం
మన అందరిని ముడి వేసెనిల మనిషన్న పదం

కన్నావటయ్య మా దొర
మా సంబరాన్ని కన్నార
ఉయ్యాలనాటి ఈడుల
ఊళ్ళన్నిటిని ఊగించేలా

కన్నావటయ్య మా దొర
మా సంబరాన్ని కన్నార
ఉయ్యాలనాటి ఈడుల
ఊళ్ళన్నిటిని ఊగించేలా
ఊళ్ళన్నిటిని ఊగించేలా
హే ఊళ్ళన్నిటిని ఊగించేలా

హైస్ హైస్ హైస్ హైలెస్స (3)

కన్నావటయ్య మా దొర
మా సంబరాన్ని కన్నార
ఉయ్యాలనాటి ఈడుల
ఊళ్ళన్నిటిని ఊగించేలా

కన్నావటయ్య మా దొర
మా సంబరాన్ని కన్నార
ఉయ్యాలనాటి ఈడుల
ఊళ్ళన్నిటిని ఊగించేలా
ఊళ్ళన్నిటిని ఊగించేలా
ఊళ్ళన్నిటిని ఊగించేలా




అందం అంకితం పాట సాహిత్యం

 
చిత్రం: సైరా నరసింహారెడ్డి (2019)
సంగీతం: అమిత్ త్రివేది
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: విజయ్ ప్రకాష్ , షాషా తిరుపతి

అందం అంకితం
ప్రాణం అర్పితం
బంధం శాశ్వతం
మీరే జీవితం

నువు పద్మానివై ఉంటె
రవితేజం నేనౌతా
కలువై నువు వెచుంటె
నెలరాజై నెయ్ వస్త
వరించుతా తరించుతా

అందం అంకితం
ప్రాణం అర్పితం

ఓ చక్కోరయానం చేసి
చేరా నిన్నెలా
నాదే నాదే వెన్నెలా - హో 
ఒక్కోరహస్యం విరించి
విరిసా పువ్వులా
నీలో నిలిచె నవ్వులా

సరస్సౌతాను నీకోసం
ఇటురావే రాయంచ
ఇహ నాదైన సంతోషం
అది నీకే రాసుంచా
ప్రియాయచా లయాయచా

అందం అంకితం
ప్రాణం అర్పితం
బంధం శాశ్వతం
మీరే జీవితం

తకరిన తకథిన తకరిన దిన్న
తదియన తదియన థిల్లాన
పధములు కలిసెను మధువని లోన
తగనిస పదమున దీజాన
తకరిన తకథిన తకరిన దిన్న
తదియన తదియన థిల్లాన
హృదయము అదిరెను ముధురక్షణాన
మధురము కురిసెను తందాన




శ్వాసలోన దేశమే పాట సాహిత్యం

 
చిత్రం: సైరా నరసింహారెడ్డి (2019)
సంగీతం: అమిత్ త్రివేది
సాహిత్యం: చంద్రబోస్
గానం: హరి చరణ్

శ్వాసలోన దేశమే
కోరస్: శ్వాసలోన దేశమే
గుండే గోషలోన దేశమే
కోరస్: గోషలోన దేశమే
ప్రాన నాడిలోన దేశమే
ప్రణమంత తల్లి కోసమే

మాటలోనే దేశమే
కోరస్: మాటలోనే దేశమే
కత్తి వేటులోన దేశమే
కోరస్: వేటులోన దేశమే
కాలి అడుగులొన దేశమే
కాలి బూడిదైన తల్లి కోసమే

దేశమే నువ్వురా సందేశమయ్యెరా
కోరస్: దేశమే నువ్వురా
దేశమే నువ్వురా సందేశమయ్యెరా
కోరస్: సందేశమయ్యెరా

చిన్నారి ప్రాయమందునా
కన్నోళ్ళనొదిలినావురా
కోరస్: కన్నోళ్ళనొదిలినావురా 

కన్నీటి పదును తేలేరా
ఖడ్గమే... ప్రయాణమైన పోరులో
కోరస్: ప్రయాణమైనా పోరులో 
ప్రేమింకా ఇంకిపోయారా
కోరస్: ప్రెమింక ఇంకిపోయారా 
దోసిట్లో దాచినావురా
సంద్రమే...ప్రజల స్వేచ్ఛకై
ప్రాణాలనొదులుతూ
పతాకమల్లే ఎగిరినావురా

దేశమే నువ్వురా సందేశమయ్యెరా
కోరస్: దేశమే నువ్వురా
దేశమే నువ్వురా సందేశమయ్యెరా
కోరస్: సందేశమయ్యెరా (3)

Palli Balakrishna Tuesday, October 8, 2019
Khaidi No. 150 (2017)




చిత్రం: ఖైది నంబర్ : 150 (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నటీనటులు: చిరంజీవి, కాజల్ అగర్వాల్
దర్శకత్వం: వి.వి.వినాయక్
నిర్మాత: రామ్ చరణ్
విడుదల తేది: 11.01.2017



Songs List:



అమ్మడు లెట్స్ డూ కుమ్ముడూ పాట సాహిత్యం

 
చిత్రం: ఖైది నంబర్ : 150 (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: దేవి శ్రీ ప్రసాద్
గానం: దేవి శ్రీ ప్రసాద్, రెనైనా రెడ్డి

యో గయ్స్ 
దిస్ ఈస్ నాట్ మాస్ సాంగ్
దిస్ ఈజ్ ద బాస్ సాంగ్ 

హె ఎర్ర చొక్కానే నీకోసం ఏశాను 
సర్రు మంటూ ఫారిన్ సెంటే కొట్టాను 
గళ్ళ లుంగీనే ట్రెండీగా కట్టాను 
కల్ల జోడెట్టి నీకోసం వచ్చాను 
అమ్మడు లెట్స్ డూ కుమ్ముడూ 

ఎర్ర చీరేమో ఈ రోజే కొన్నాను 
నల్ల జాకెట్టు నైటంతా కుట్టాను 
వాలు జళ్ళోనా మందారం పెట్టాను 
కన్నె ఒళ్ళంతా సింగారం చుట్టాను 
పిల్లడు లెట్స్ డూ కుమ్ముడూ 

హె ఇన్స్టాగ్రాం ప్రొఫైలు పిక్చర్ లాగా 
భలే మస్తుందే నీ అందం మల్లె తీగ 
హా డిస్కవరీ చానెల్ లో చేసింగ్ లాగా
అలా పై పైకి దూకెయ్ కు సింహం లాగా 

అమ్మడు లెట్స్ డూ కుమ్ముడూ 

చరణం: 1
మండే ఎండలొ ఐస్క్రీము బండిలా
కూల్ అండ్ క్యూటుగ ఉండే అందం 
రెండే కళ్ళతో ధన్ ధన్ స్టెన్ గన్నులా
చూపుల గుళ్ళతో తీసావ్ ప్రాణం 
హాట్ గా ఘాట్ గా ఉండే నీ హిప్పుని
నాటుగ చాటుగ పట్టేయనా 
రఫ్ఫుగ టఫ్ఫుగ ఉండే నీ చేతితో
నువ్ తాకితే నేను ఫట్టైపోనా 

అమ్మడు లెట్స్ డూ కుమ్ముడూ 
తమ్ముడూ లెట్స్ డూ కుమ్ముడూ 

చరణం: 2
హె శారీ కట్టినా సల్వారే చుట్టినా
అల్లాడిస్తదే నీ ఔట్ లైనూ 
హె లారీ గుద్దినా ల్యాండ్ మైనే పేలినా
నీతో పోలిస్తే నతింగ్ జానూ 
స్టెప్పులే స్టెప్పులూ నీతో వెయ్యాలని
ఇప్పుడే కట్టినా కొత్త ట్యూనూ 
నిప్పులా ఉన్న నీ వైల్డూ రొమాన్సుకు
లిప్పులో దాచినా రెడ్డూ వైనూ

అమ్మడు లెట్స్ డూ కుమ్ముడూ

యో గయ్స్ 
దిస్ ఈస్ నాట్ మాస్ సాంగ్
దిస్ ఈజ్ ద బాస్ సాంగ్

అమ్మడు లెట్స్ డూ కుమ్ముడూ



సుందరి పాట సాహిత్యం

 
చిత్రం: ఖైది నంబర్ : 150 (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: జస్ప్రీత్ జస్జ్

సన్న జాజిలా పుట్టేసిందిరో మల్లె తీగలా చుట్టేసిందిరో
తేనెటీగలా కుట్టేసిందిరో సుందరి ఈ సుందరి
అందం తాడుతో కట్టేసిందిరో మత్తు మందునే పెట్టేసిందిరో
కొత్త దారిలో నెట్టేసిందిరో సుందరి ఈ సుందరి
సోకె కుక్కినాదిరో నాజూకు మెక్కినదిరో
దీన్నే చెక్కినోడికి వరల్డ్ బ్యాంకు నుంచి
బ్లాంక్ చేక్కు ఇవ్వరో 
కోకే కట్టినదిరో గుండె కేకే పెట్టినాదిరో
లైకే కొట్టినానురో
లవ్ బండి తీసి ట్రాక్ మీద పెట్టినానురో

సన్న జాజిలా పుట్టేసిందిరో మల్లె తీగలా చుట్టేసిందిరో
తేనెటీగలా కుట్టేసిందిరో సుందరి ఈ సుందరి
అందం తాడూతి కట్టేసిందిరో మత్తు మందునే పెట్టేసిందిరో
కొత్త దారిలో నెట్టేసిందిరో సుందరి ఈ సుందరి


చాక్లెట్ చూపి పిల్లవాడిని క్యూట్ గ ఊరించినట్టుగా
మాగ్నెట్ లాంటి ఒంపు సోంపుని చూపి నన్ను చంపేరో
ఊపి ఊపిరిరాపేరో 
ట్యూబ్ లైట్ వేసి డల్ నైట్ ని
ఫుల్ గ బ్రైట్ చేసినట్టుగా 
మూన్ లైట్ లాంటి కంటి చూపుతో
నా హార్ట్ లైట్ వేసేరో మనసు వెయిట్ పెంచేరో
తీసేయ్ రొమాన్స్ గేట్ ని ఇక తోసెయ్ ఆ సిగ్గు సీట్ ని
రాసేయ్ నీ కాపీరైట్ ని నా పేరు మీద 
ఫిక్స్ అని నువ్వు నేను మిక్స్ అని

సన్న జాజిలా పుట్టేసిందిరో మల్లె తీగలా చుట్టేసిందిరో
తేనెటీగలా కుట్టేసిందిరో సుందరి ఈ సుందరి
అందం తాడుతో కట్టేసిందిరో మత్తు మందునే పెట్టేసిందిరో
కొత్త దారిలో నెట్టేసిందిరో సుందరి ఈ సుందరి

కీపర్ లేని టైం చూసి ఫుట్ బాల్ గోల్ కొట్టినట్టుగా
కంట్రోల్ లేని టైం చూసి హిప్ నాకు చూపేరో
హిప్నటైజ్ చేసేరో 
రైఫిల్ని లోడ్ చేసి టార్గెట్ నే కాల్చినట్టుగా 
లిప్స్టిక్ లో రెడ్ తీసి
లవ్ సింబల్ ఏసేరో బాణమేసి గుచ్చేరో
రావే నా లెఫ్ట్ సైడ్ కి నీకోసం తెరిచా గుండె కిటికీ
పోదాం ఈ నైట్ ఫ్లైయట్ కి ఓ హనీమూన్ స్పాట్ కి
ఊటీ లాంటి చోటుకి

సన్న జాజిలా పుట్టేసిందిరో మల్లె తీగలా చుట్టేసిందిరో
తేనెటీగలా కుట్టేసిందిరో సుందరి ఈ సుందరి
అందం తాడుతో కట్టేసిందిరో మత్తు మందునే పెట్టేసిందిరో
కొత్త దారిలో నెట్టేసిందిరో సుందరి ఈ సుందరి



యూ అండ్ మీ పాట సాహిత్యం

 
చిత్రం: ఖైది నంబర్ : 150 (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: హరిచరన్, శ్రేయ ఘోషల్

మీ మీ మిమ్మీమీ 
ఇకపై ఓన్లీ యూ అండ్ మీ

సాయంకాలానా సాగర తీరానా
సంధ్య సూర్యుడిలా నువ్వూ నేను
వేసవి కాలానా వెన్నెల సమయానా
తార చంద్రుడిలా నువ్వూ నేను
నువ్వు రాగం అయితే నే పాటవుతాను
నువ్వు మేఘం అయితే
నీ జిలిబిలి వలపుల వర్షం నేను

మీ మీ మిమ్మీమీ 
ఇకపై ఓన్లీ యూ అండ్ మీ
మీ మీ మిమ్మీమీ 
ఇకపై ఓన్లీ యూ అండ్ మీ

సాయంకాలానా సాగర తీరానా
సంధ్య సూర్యుడిలా నువ్వూ నేను
వేసవి కాలానా వెన్నెల సమయానా
తార చంద్రుడిలా నువ్వూ నేను

ముద్ద మందారం తెలుసు
మెరిసే బంగారం తెలుసు
రెండు కలిపేస్తే నువ్వేనా
మండే సూరీడు తెలుసు
వెండి జాబిల్లి తెలుసు
రెండు కలబోస్తే నువ్వేనా
రోజు అద్దంలో అందం నువ్వేనా
ఆ అందం నువ్వైతే నువ్వూ నేనా 
రోజు కన్నుల్లో కలలే నువ్వేనా
కలలే నిజమైతే నువ్వూ నేనా

మీ మీ మిమ్మీమీ 
ఇకపై ఓన్లీ యూ అండ్ మీ
మీ మీ మిమ్మీమీ 
ఇకపై ఓన్లీ యూ అండ్ మీ

కోపం సైనికుడి వరస
తాపం ప్రేమికుడి వరస
రెండూ ఒకటైతే నువ్వేనా
పల్లె పడుచుల్ని చూశా
పట్నం సొగసుల్ని చూశా
రెండూ ఒకటైతే నువ్వేనా
హో రంగుల విల్లంటే అచ్చం నువ్వేనా
బాణం నేనైతే నువ్వూ నేనా
పువ్వుల వరదంటే అచ్చం నువ్వేనా
నన్నే చుట్టేస్తే నువ్వూ నేనా

మీ మీ మిమ్మీమీ 
ఇకపై ఓన్లీ యూ అండ్ మీ
మీ మీ మీ మీ మీ
ఇకపై ఓన్లీ యూ అండ్ మీ



రత్తాలు రత్తాలు పాట సాహిత్యం

 
చిత్రం: ఖైది నంబర్ : 150 (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: దేవి శ్రీ ప్రసాద్
గానం: నకాష్ అజిజ్ , జాస్మిన్ సండ్లస్

బాస్ ఇస్ బ్యాక్ గెట్ రెడీ 

రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు 
నిను చూస్తే నిలబడనంటాయ్ నా చొక్కా బోత్తాలు 
రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు 
నిను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు 
నీ ఒంపు సోంపు అందం చందం అన్ని నా చుట్టాలూ 
చెంగుమంటూ రావే  తిరగరాసేద్దాం చట్టాలు 
నేర్చుకుంటే నేర్పుతాలే కొత్త కొత్త చిట్కాలు 
మాస్ డాన్స్ చేసేద్దాం రావే రావే రత్తాలు 
నా రొమాన్స్ చూస్తావా అది పూలు నింపిన పిస్తోలు

రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు 
నిను చూస్తే నిలబడనంటాయ్ నా చొక్కా బోత్తాలు 
రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు 
నిను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు 

బాస్ ఇస్ బ్యాక్ గెట్ రెడీ 

నీ నవ్వులే రత్నాలు నీ మాటలే ముత్యాలు 
పొట్లాలు కడితే కోట్ల కొద్ది బేరాలు 
నీ చేతులే మేగ్నెట్లు నీ వేళ్ళు వీణ మెట్లు 
నువ్వు తాకుతుంటే రక్తమంతా  రాగాలు..
ఓ నువ్వు పక్కనుంటే కిక్కె వేరు వధ్ధులే జారాధాలు 
ఆవురావురంటూ వున్నా తీర్చు నా సరదాలు 
అందుకేగా వచ్చేసా రఫ్ఫాడిద్దాం రాత్రి పగలు 
మాస్ డాన్స్ చేసేద్దాం రావే రావే రత్తాలు 
నా రొమాన్స్ చూస్తావా అది పూలు నింపిన పిస్తోలు

రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు 
నిను చూస్తే ఘల్ ఘల్ మంటాయ్ నా చిట్టి పట్టీలు 
రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు 
నిను చూస్తే నిలబడనంటాయ్ నా జళ్ళో ఏ పూలు 

బాసూ..చూపీయ్ నీ గ్రేసు..

ఏ.. మై డియర్ బాస్.. నువ్వు మాస్ ప్లస్ క్లాసు 
నీ స్టైల్ చూస్తే సింహమైన నీతో దిగదా సెల్ఫీలు హే.. 
మిస్ యూనివర్సు లాంటి నీ ఫీచర్స్ 
చూస్తూ ఉంటే రెచ్చిపోతాయ్ గుండెలోన గుర్రాలు 
నీ వాక్ చూస్తే ఓరయ్యో ఐ లూస్ మై కంట్రోలు 
నీ హీట్ ఉంటే చాలమ్మో ఇక ఎందుకు పెట్రోలు 
నాకు నూవు నీకు నేను అప్పచెబుదాం పాఠాలు 
మాస్ డాన్స్ చేసేద్దాం రావే రావే రత్తాలు 
నా రొమాన్స్ చూస్తావా అది పూలు నింపిన పిస్తోలు

హేయ్ రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు 
నిను చూస్తే నిలబడనంటాయ్ నా చొక్కా బోత్తాలు 
రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు 
నిను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు 
రత్తాలు....... 

బాస్ ఇస్ బ్యాక్ గెట్ రెడీ 




రైతు కంట నీరు పాట సాహిత్యం

 
చిత్రం: ఖైది నంబర్ : 150 (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: శంకర్ మహదేవన్

నీరు నీరు  నీరు  రైతు కంట నీరు
చూడనైన చూడరెవ్వరూ...
గుండెలన్ని బీడు ఆశలన్ని మోడు 
ఆదరించు నాథుడెవ్వరూ... 
అన్నదాత గోడు నింగినంటె నేడు...
ఆలకించు వారు ఎవ్వరూ...

నీరు నీరు  నీరు  రైతు కంట నీరు
చూడనైన చూడరెవ్వరూ...

గొంతు ఎండిపోయే పేగు మండిపోయే...
గంగతల్లి జాడ లేదనీ... 
నీటి పైన ఆశే నీరుగారి పోయే...
రాత మారు దారి లేదని... 
దాహమారుతుందా...
పైరు పండుతుందా... 
ధారలైన కంటి నీటితో...

నీరు నీరు  నీరు  రైతు కంట నీరు
చూడనైన చూడరెవ్వరూ...
గుండెలన్ని బీడు ఆశలన్ని మోడు
ఆదరించు నాథుడెవ్వరూ...

నేల తల్లి నేడు అంగీలారిపోయే... 
మూగబోయే రైతు నాగలి...
ఆయువంత చూడు ఆర్తనాదమాయే... 
గొంతు కోసుకుంది ఆకలి...

Palli Balakrishna Monday, August 7, 2017

Most Recent

Default