Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Amit Trivedi"
V (2020)



చిత్రం: V (2020)
సంగీతం: అమిత్ త్రివేది
నటీనటులు: నాని, సుధీర్ బాబు, నివేథ థామస్, అదితి రావ్ హైదరి
దర్శకత్వం: మోహన్ కృష్ణ ఇంద్రంటి
నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్, హర్షిత్ రెడ్డి
విడుదల తేది: 05.09.2020



Songs List:



మనసు మరీ మత్తుగా పాట సాహిత్యం

 
చిత్రం: V (2020)
సంగీతం: అమిత్ త్రివేది
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: యాజిన్ నజీర్, శశ తిరుపతి

మనసు మరీ మత్తుగా
తూగి పోతున్నదే ఏమో ఈ వేళ
వయసు మరీ వింతగా
విస్తుబోతున్నదే నీదే ఈ లీల
అంతగా కవ్విస్తావేం గిల్లి
అందుకే బంధించెయ్ నన్నల్లీ

ఖిలాడీ కోమలీ గుళేబకావలి,
సుఖాల జావలి వినాలి కౌగిలీ

మనసు మరీ మత్తుగా
తూగి పోతున్నదే ఏమో ఈ వేళ
వయసు మరీ వింతగా
విస్తుబోతున్నదే నీదే ఈ లీల

ఓ అడుగులో అడుగువై
ఇలా రా నాతో నిత్యం వరాననా
హా బతుకులో బతుకునై
నివేదిస్తా, నాసర్వం జహాపనా
పూల నావ.. గాలి తోవ
హైలో.. హైలెస్సో - ఓ ఓ ఓ
చేరనీవా చేయనీవా - సేవలేవేవో..

మనసు మరీ మత్తుగా
తూగి పోతున్నదే ఏమో ఈ వేళ
వయసు మరీ వింతగా
విస్తుబోతున్నదే నీదే ఈ లీల

మనసులో అలలయే రహస్యాలేవో
చెప్పే క్షణం ఇది
మనువుతో మొదలయే
మరో జన్మాన్నై పుట్టే వరమిది
నీలో ఉంచా నా ప్రాణాన్ని
చూసి పోల్చుకో...
హో నాలో పెంచా నీ కలలన్నీ
ఊగనీ ఉయ్యాల్లో 

మనసు మరీ మత్తుగా
తూగి పోతున్నదే ఏమో ఈ వేళ
వయసు మరీ వింతగా
విస్తుబోతున్నదే నీదే ఈ లీల

అంతగా కవ్విస్తావేం గిల్లి
అందుకే బంధించెయ్ నన్నల్లీ
ఖిలాడీ కోమలీ గుళేబకావలి
సుఖాల జావలి వినాలి కౌగిలీ




వస్తున్న వచ్చేస్తున్నా పాట సాహిత్యం

 
చిత్రం: V (2020)
సంగీతం: అమిత్ త్రివేది
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: శ్రేయా ఘోషల్, అమిత్ త్రివేది, అనురాగ్ కులకర్ణి 

చూస్తున్న చూస్తూనే ఉన్న కనురెప్పైనా పడనీక
వస్తానని చెబుతున్న మనసుకు వినిపించదు తెలుసా

చూస్తున్న చూస్తూనే ఉన్న కనురెప్పయినా పడనీక
ఏం చేస్తున్న ధ్యాసంతా నీమీదే తెలుసా

నిను చూడనిదే ఆగనని ఊహల ఉబలాటం
ఉసి కొడుతుంటే

వస్తున్న వచ్చేస్తున్నా 
వద్దన్నా వదిలేస్తానా
కవ్విస్తూ కనబడకున్నా 
ఉవ్వెత్తున ఉరికొస్తున్నా 

చూస్తున్న చూస్తూనే ఉన్న కనురెప్పయినా పడనీక
వస్తానని చెబుతున్న మనసుకు వినిపించదు తెలుసా

చెలియా చెలియా నీ తలపే తరిమిందే
అడుగే అలలయ్యే ఆరాటమే పెంచనా

గడియో క్షణమో ఈ దూరం కలగాలే
ప్రాణం బాణంలా విరహాన్ని వేటాడగా

మురిపించే ముస్తాబై ఉన్నా
దరికొస్తే అందిస్తాగా ఆనందంగా 

ఇప్పటి ఈ ఒప్పందాలే 
ఇబ్బందులు తప్పించాలే
చీకటితో చెప్పించాలే
ఏకాంతం ఇప్పించాలే

వస్తున్న వచ్చేస్తున్నా 
వద్దన్నా వదిలేస్తానా
కవ్విస్తూ కనబడకున్నా 
ఉవ్వెత్తున ఉరికొస్తున్నా

చూస్తున్న చూస్తూనే ఉన్న కనురెప్పయినా పడనీక
వస్తానని చెబుతున్న మనసుకు వినిపించదు తెలుసా




రంగ రంగేళి పాట సాహిత్యం

 
చిత్రం: V (2020)
సంగీతం: అమిత్ త్రివేది
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: యాజిన్ నజీర్, నిఖితా గాంధి

సలసర సర్రా వేడెక్కింది సాయంత్రం గాలి
సలసర సర్రా వేడెక్కింది సాయంత్రం గాలి
బిర బిర బి బీచు నిండా బీరులు పొంగాలి
బిర బిర బిర్రా బీచు నిండా బీరులు పొంగాలి
మత్తై పోవాలి గమ్మతై పోవాలి కిక్కై పోవాలి

రంగ రంగేళి రంగ రంగరంగేళి
మరో మస్తుగా మబ్బుల ఎత్తుకు నిచ్చెన వేయాలి
రంగ రంగేళి రంగ రంగ రంగేళి
రచ్చో రచ్చగా పచ్చిగా పిచ్చిగా ముచ్చట తీరాలి

ఓ రబ్బ అబ్బబ్బా ఓ రబ్బ 
ఓ రబ్బ అబ్బబ్బా ఓ రబ్బ

షకలక బూమ్ బూమ్
షకలక బూమ్ బూమ్

పార్టీ పార్టీ ఫన్ కా పార్టీ
టచింగ్ టచింగ్ చల్ మొదలెడదామా
మజా మజా కాళ్ళ గజ్జా
సయ్యాటాడి క్లైమేట్ వేడి పెంచేద్దామా
మందే హంగామా లైన్ అఫ్ కంట్రోల్ హద్దులు
మీరీ మస్తీ చేద్దామా
గుర్తుకు తెచ్చుకొని ఒక్క చిట్టా రాయాలి
పెండింగ్ ఉన్న ఫాంటసీలకు టిక్కులు పెట్టాలి
చిల్ అయిపోవాలి థ్రిల్ అయిపోవాలి 
చిల్ అయిపోవాలి

రంగ రంగేళి రంగ రంగ రంగేళి
మస్తో మస్తుగా మబ్బుల ఎత్తుకు నిచ్చెన వేయాలి 
రంగ రంగేళి రంగ రంగ రంగేళి
రచ్చో రచ్చగా పచ్చిగా పిచ్చిగా ముచ్చట తీరాలి

ఓ రబ్బ అబ్బబ్బా ఓ రబ్బ 
ఓ రబ్బ అబ్బబ్బా ఓ రబ్బ

షకలక బూమ్ బూమ్
షకలక బూమ్ బూమ్

రంగ రంగేళి రంగ రంగ రంగేళి (3)




బేబీ కిస్ మీ కిస్ మీ నౌ.. పాట సాహిత్యం

 
చిత్రం: V (2020)
సంగీతం: అమిత్ త్రివేది
సాహిత్యం: కృష్ణ కాంత్ 
గానం: షర్వి యాదవ్ 

మజా మజా మైకంలో ఆన్ ది ఫ్లోర్
మళ్ళి మళ్ళి ట్రిప్పైపొరొ
మరి మరి మారంతో డోంట్ లెట్ దిస్ గో
తుళ్ళి తుళ్ళి తప్పే చెయ్ రో
దాహాలే ఆవిరయ్యేలా మేఘములా మెరిసి పోరా
కాలాలే కరిగిపోయేలా
అటెన్షనే ఇటేపుగా తిప్పైరా

వన్నా టచ్ యూ టచ్ యూ నౌ నౌ నౌ....
బేబీ కిస్ మీ కిస్ మీ నౌ..నౌ.. నౌ..
వన్నా టచ్ యూ టచ్ యూ నౌ నౌ నౌ....
బేబీ కిస్ మీ కిస్ మీ నౌ.... నౌ..(2)

దేహాలే మరి వదిలేసాయా గ్రావిటీ
కొత్త ఊహల్తోటి మొహాలే రేపి దాగుందేమో చీకటి
హే పెదవంచుల్లో నవ్వల్లే నన్నే అల్లుకోరా
తమ కళ్ళోనే చూపే ముంచి కమో కమో కమో దగ్గరగా

వన్నా టచ్ యూ టచ్ యూ నౌ నౌ నౌ....
బేబీ కిస్ మీ కిస్ మీ నౌ..నౌ.. నౌ..
వన్నా టచ్ యూ టచ్ యూ నౌ నౌ నౌ....
బేబీ కిస్ మీ కిస్ మీ నౌ.... నౌ..(2)

Palli Balakrishna Saturday, January 23, 2021
Sye Raa Narasimha Reddy (2019)



చిత్రం: సైరా నరసింహారెడ్డి (2019)
సంగీతం: అమిత్ త్రివేది
నటీనటులు: చిరంజీవి, అమితాబ్, నయన తార, తమన్నా
దర్శకత్వం: సురేందర్ రెడ్డి
నిర్మాత: రాంచరణ్
విడుదల తేది: 02.10.2019



Songs List:



హో సైరా... (పవిత్ర ధాత్రి భారతాంబ) పాట సాహిత్యం

 
చిత్రం: సైరా నరసింహారెడ్డి (2019)
సంగీతం: అమిత్ త్రివేది
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: సునిధి చౌహాన్, శ్రేయ ఘోషల్

పల్లవి:
పవిత్ర ధాత్రి భారతాంబ ముద్దు బిడ్డవవురా
ఉయ్యాలవాడ నారసింహుడా
చరిత్ర పుటలు విస్మరించ వీలులేని వీరా
రేనాటిసీమ కన్న సూర్యుడా

మృత్యువే స్వరాన చిరాయురస్తు అనగా
ప్రసూతి గండమే జయించినావురా
నింగి శిరసువంచి నమోస్తు నీకు అనగా
నవోదయానివై జనించినావురా

హో  సైరా.., హో సైరా.., హో సైరా.
ఉసస్సు నీకు ఊపిరాయెరా
హో  సైరా.., హో సైరా.., హో సైరా
యసస్సు నీకు రూపమాయెరా

చరణం: 1
అహంకరించు ఆంగ్ల దొరలపైన
హుంకరించగలుగు ధైర్యమా
తలొంచి బతుకు సాటివారిలోన
సాహసాన్ని నింపు శౌర్యమా
శృంఖలాలనే తెంచుకొమ్మని
స్వేచ్చ కోసమే శ్వాసనిమ్మని
నినాదం నీవేరా...
ఒక్కొక్క బిందువల్లె జనులనొక్కచోట చేర్చి
సముద్రమళ్లే మార్చినావురా
ప్రపంచమొనికిపోవు పెనుతుఫానులాగ వీచి
దొరల్ని ధిక్కరించినావురా
మొట్టమొదటి సారి స్వతంత్ర సమరభేరి
పెటెల్లు మన్నది ప్రజాలి పోరిది
కాలరాత్రి వంటి పరాయి పాలనాన్ని
దహించు జ్వాలలో ప్రకాశమే ఇది
హో సైరా.. హో సైరా.. హో సైరా
ఉసస్సు నీకు ఊపిరాయెరా
హో సైరా.. హో సైరా.. హో సైరా
యసస్సు నీకు రూపమాయెరా

చరణం: 2
దాస్యాన జీవించడం కన్న చావెంతో మేలంది
నీ పౌరుషం
మనుషులైతే మనం అనిచివేసే జులుం
ఒప్పుకోకంది నీ ఉద్యమం
ఆలని బిడ్డని అమ్మని జన్మని బంధనాలన్ని
ఒదిలి సాగుదాం
ఓ.. నువ్వే లక్షలై ఒకే లక్ష్యమై అటేవేయని
ప్రతి పదం
కదనరంగమంతా కొదమసింగమల్లె
ఆక్రమించి విక్రమించి తరుముతోందిరా
అరివీర సంహారా...
హో  సైరా.. హో సైరా.. హో సైరా
హో  సైరా.. హో సైరా.. హో సైరా
ఉసస్సు నీకు ఊపిరాయెరా





జాగో నరసింహా జాగోరే పాట సాహిత్యం

 
చిత్రం: సైరా నరసింహారెడ్డి (2019)
సంగీతం: అమిత్ త్రివేది
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: శంకర్ మహదేవన్, హరి చరణ్, అనురాగ్ కులకర్ణి

జాగో నరసింహా జాగోరే
జనమంతా చూసేరే రారే
చేయ్యెత్తి జై కొట్టె హోరే
తకథై అంటు సింధులు తొక్కాలే

వజ్రాల వడగాళ్లే నవరత్నాలే సిరిజల్లై
మా నవ్వుల్లో సుక్కలు కురవాలే

ఓ  సై రా

జామాజం  జంజారావంలో
ధమాదం దుమ్ము దుమారంలో
అమాంతం అందరి ఊపిరిలో
ఘుమాగుమ్ చిందిన అత్తర్లో

పది దిక్కులకీ అందింధీ సందేశమ్
సరిహద్దులు అన్ని చెరిపిన ఈ సంతోషం
ఉవ్వెత్తునిల ఉప్పొంగిన ఈ ఉల్లాసం
ప్రతి ఒక్కరికి పంచేందుకని అవకాశమిదే

కన్నావటయ్య మా దొర
మా సంబరాన్ని కన్నార
ఉయ్యాలనాటి ఈడుల
ఊళ్ళన్నిటిని ఊగించేలా

కన్నావటయ్య మా దొర
మా సంబరాన్ని కన్నార
ఉయ్యాలనాటి ఈడుల
ఊళ్ళన్నిటిని ఊగించేలా
ఊళ్ళన్నిటిని ఊగించేలా
హే ఊళ్ళన్నిటిని ఊగించేలా

ఎం జవాబు చెబుతాంరా
పలానా పక్కోడెవడంటే
ఈ మన్నేర ఇద్దరిని కన్నదని
అనరా నిజమంటే

నువ్వు బాగుంటే చాలంతే
ఆ మాటింటే మరి
నే కూడా సల్లంగ ఉన్నట్టే

ఈ జాతర సాక్షిగ కలిసిన మన సావాసం
మన కష్టసుఖాలను పంచుకునేందుకు సిద్ధం
నువు నా కోసమ్ నేన్ నీ కోసం అనుకుందాం
మన అందరిని ముడి వేసెనిల మనిషన్న పదం

కన్నావటయ్య మా దొర
మా సంబరాన్ని కన్నార
ఉయ్యాలనాటి ఈడుల
ఊళ్ళన్నిటిని ఊగించేలా

కన్నావటయ్య మా దొర
మా సంబరాన్ని కన్నార
ఉయ్యాలనాటి ఈడుల
ఊళ్ళన్నిటిని ఊగించేలా
ఊళ్ళన్నిటిని ఊగించేలా
హే ఊళ్ళన్నిటిని ఊగించేలా

హైస్ హైస్ హైస్ హైలెస్స (3)

కన్నావటయ్య మా దొర
మా సంబరాన్ని కన్నార
ఉయ్యాలనాటి ఈడుల
ఊళ్ళన్నిటిని ఊగించేలా

కన్నావటయ్య మా దొర
మా సంబరాన్ని కన్నార
ఉయ్యాలనాటి ఈడుల
ఊళ్ళన్నిటిని ఊగించేలా
ఊళ్ళన్నిటిని ఊగించేలా
ఊళ్ళన్నిటిని ఊగించేలా




అందం అంకితం పాట సాహిత్యం

 
చిత్రం: సైరా నరసింహారెడ్డి (2019)
సంగీతం: అమిత్ త్రివేది
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: విజయ్ ప్రకాష్ , షాషా తిరుపతి

అందం అంకితం
ప్రాణం అర్పితం
బంధం శాశ్వతం
మీరే జీవితం

నువు పద్మానివై ఉంటె
రవితేజం నేనౌతా
కలువై నువు వెచుంటె
నెలరాజై నెయ్ వస్త
వరించుతా తరించుతా

అందం అంకితం
ప్రాణం అర్పితం

ఓ చక్కోరయానం చేసి
చేరా నిన్నెలా
నాదే నాదే వెన్నెలా - హో 
ఒక్కోరహస్యం విరించి
విరిసా పువ్వులా
నీలో నిలిచె నవ్వులా

సరస్సౌతాను నీకోసం
ఇటురావే రాయంచ
ఇహ నాదైన సంతోషం
అది నీకే రాసుంచా
ప్రియాయచా లయాయచా

అందం అంకితం
ప్రాణం అర్పితం
బంధం శాశ్వతం
మీరే జీవితం

తకరిన తకథిన తకరిన దిన్న
తదియన తదియన థిల్లాన
పధములు కలిసెను మధువని లోన
తగనిస పదమున దీజాన
తకరిన తకథిన తకరిన దిన్న
తదియన తదియన థిల్లాన
హృదయము అదిరెను ముధురక్షణాన
మధురము కురిసెను తందాన




శ్వాసలోన దేశమే పాట సాహిత్యం

 
చిత్రం: సైరా నరసింహారెడ్డి (2019)
సంగీతం: అమిత్ త్రివేది
సాహిత్యం: చంద్రబోస్
గానం: హరి చరణ్

శ్వాసలోన దేశమే
కోరస్: శ్వాసలోన దేశమే
గుండే గోషలోన దేశమే
కోరస్: గోషలోన దేశమే
ప్రాన నాడిలోన దేశమే
ప్రణమంత తల్లి కోసమే

మాటలోనే దేశమే
కోరస్: మాటలోనే దేశమే
కత్తి వేటులోన దేశమే
కోరస్: వేటులోన దేశమే
కాలి అడుగులొన దేశమే
కాలి బూడిదైన తల్లి కోసమే

దేశమే నువ్వురా సందేశమయ్యెరా
కోరస్: దేశమే నువ్వురా
దేశమే నువ్వురా సందేశమయ్యెరా
కోరస్: సందేశమయ్యెరా

చిన్నారి ప్రాయమందునా
కన్నోళ్ళనొదిలినావురా
కోరస్: కన్నోళ్ళనొదిలినావురా 

కన్నీటి పదును తేలేరా
ఖడ్గమే... ప్రయాణమైన పోరులో
కోరస్: ప్రయాణమైనా పోరులో 
ప్రేమింకా ఇంకిపోయారా
కోరస్: ప్రెమింక ఇంకిపోయారా 
దోసిట్లో దాచినావురా
సంద్రమే...ప్రజల స్వేచ్ఛకై
ప్రాణాలనొదులుతూ
పతాకమల్లే ఎగిరినావురా

దేశమే నువ్వురా సందేశమయ్యెరా
కోరస్: దేశమే నువ్వురా
దేశమే నువ్వురా సందేశమయ్యెరా
కోరస్: సందేశమయ్యెరా (3)

Palli Balakrishna Tuesday, October 8, 2019

Most Recent

Default