Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Parvati Melton"
Game (2006)


చిత్రం: గేమ్ (2006)
సంగీతం: జాషువా శ్రీధర్
నటీనటులు: మోహన్ బాబు, మంచు విష్ణు, శోభన, పార్వతి మెల్టన్, శ్రేయా శరన్
దర్శకత్వం: రామ్ ప్రసాద్
నిర్మాత: మోహన్ బాబు
విడుదల తేది: 05.08.2006

Palli Balakrishna Tuesday, February 19, 2019
Madhumasam (2007)


చిత్రం: మధుమాసం (2007)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: రంజిత్ , రీటా
నటీనటులు: సుమంత్, స్నేహ , పార్వతి మెల్టన్
దర్శకత్వం: చంద్ర సిద్దార్ధ
నిర్మాత: డి.రామానాయుడు
విడుదల తేది: 09.02.2007

పల్లవి:
వసంతం వాయిదా పడైనా రాదుగా
కనీసం కమ్మగా కలైనా కావుగా
ఈ కాంత కోకిలా వలచినా పిలిచినా ప్రియతమా
వసంతం వాయిదా పడైనా రాదుగా

చరణం: 1
విరజాజి పూలే విరహాన రాలే
మలిసందే వేళే తెలవారి పోయే
పొడి ఇసుక దారులలో
మన అడుగు జాడలలో
గతము తలచి కలిసి నడిచి
వలపు కలయిక కలా
నిదుట నిలచి ఎదను తెరచి
క్షణము దొరకవు కదా

వసంతం వాయిదా పడైనా రాదుగా
కనీసం కమ్మగా కలైనా కావుగా

చరణం: 2
బస్తీల నిండా బృందావనాలే
ముస్తాబు మీద హస్తాక్షరాలే
ఎదురసలు చూడనిది
మనము అనుకోనిదిది
మనసు అలుపు మమత అలుకు
జతను కలిపెను కదా
ఎవరికెవరు ఒకరికొకరు
ఇపుడె తెలిసెను కదా

వసంతం వాయిదా పడైనా రాదుగా
కనీసం కమ్మగా కలైనా కావుగా
ఈ కాంత కోకిలా వలచినా పిలిచినా ప్రియతమా
వసంతం వాయిదా పడైనా రాదుగా

Palli Balakrishna Wednesday, November 22, 2017
Srimannarayana (2012)



చిత్రం: శ్రీమన్నారాయణ (2012)
సంగీతం: చక్రి
నటీనటులు: బాలకృష్ణ , ఇషా చావ్లా, పార్వతి మెల్టన్
దర్శకత్వం: రవికుమార్ చావలి
నిర్మాత: రమేష్ పుప్పాల
విడుదల తేది: 30.08.2012



Songs List:



హే తక్కతై తిక్కతై పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీమన్నారాయణ  (2012)
సంగీతం: చక్రి
సాహిత్యం: కందికొండ
గానం: ఉదిత్ నారాయన్, కౌశల్య 

పల్లవి:
హే తక్కతై తిక్కతై నువ్వు నేను ఒక్కటై 
ట్వంటి ట్వంటి మ్యాచులాడుదామా 
హే తక్కతై తిక్కతై నువ్వు నేను కమిటై 
ఉక్క పోత ఆట లాడుదామా
హే పిచ్చదిరిందే భామో - ఓహో
సిక్సరు తప్పదే జానో  - అమ్మమ్మా
అందమంతా ఆస్తి పాస్తి అమ్మమ్మో
నీ చూపుతోనే కొల్లగొట్టు అబ్బబ్బో - అబ్బబ్బో
ఎన్నాల్లే పీనాసి దాస్తావే లాకేసి 
స్పిన్నే వేసిన బౌన్సర్లేసిన బౌండరి కొట్టక తప్పదు రామ్మో 

హే తక్కతై తిక్కతై నువ్వు నేను ఒక్కటై 
ట్వంటి ట్వంటి మ్యాచులాడుదామా 
హే తక్కతై తిక్కతై నువ్వు నేను కమిటై 
ఉక్క పోత ఆట లాడుదామా 

చరణం: 1
హే పగలంతా పడదాం గొడవే 
జత కడదాం చీకటి పడితే 
పురి విప్పిన నెమలిని నేనెై దరికొస్తాలే
హే ఉప్పు కారాలు ఎక్కువే తింటాను 
పిల్ల తట్టుకుంటావమల్లా 
కష్టాలు నావే కొత్తల్లో ఇష్టాలు పెట్టి 
కష్టం ఇష్టంగా మారదా 
చంపుతుంది నీ వంటి వాస్తు 
నువ్వు తోడు వుంటే ఉండలేను పస్తు 
కాదని అనకు లేదని అనను 
నా ప్రతి అడుగు నీవే కాదా 

హే తక్కతై తిక్కతై నువ్వు నేను ఒక్కటై 
ట్వంటి ట్వంటి మ్యాచులాడుదామా 
హే తక్కతై తిక్కతై నువ్వు నేను కమిటై 
ఉక్క పోత ఆట లాడుదామా 

చరణం: 2
నీ ఒంటి కొలతలు తెలిపి పెంచొద్దే హైబీపీ
నా వంటిలో మందొకటుంది ఇస్తా ఇటు రా 
ఆవకాయంటి సొంపులెన్నో కొరుక్కుతింట 
ఆవు నెయ్యి వేసుకుంటూ 
ముద్దు ముద్దొక ముడులే విప్పెసుకుంటూ 
చూపై స్వర్గాలు ఇలలో 
అగ్గి మీద గుగ్గిలు ఉన్న వయసే 
బగ్గుమంది ఆర్పకుంటే గొడవే 
దూరం అనను భారం అనను 
మారం చేయకపో కొడతారు 

హే తక్కతై తక్కతై తిక్కతై తిక్కతై నువ్వు నేను ఒక్కటై 
ట్వంటి ట్వంటి మ్యాచులాడుదామా 
హే తక్కతై తిక్కతై నువ్వు నేను కమిటై ఉక్క పోత ఆట లాడుదామా
అబ్బబ్బో అబ్బబ్బో





ఒట్టేదునా నీ చుట్టేద్దునే పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీమన్నారాయణ  (2012)
సంగీతం: చక్రి
సాహిత్యం: ప్రవీణ్ లక్మా
గానం: సుఖ్విందర్ సింగ్, గీతా మాధురి

ఒట్టేదునా నీ చుట్టేద్దునే




చలాకి చూపులతో పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీమన్నారాయణ  (2012)
సంగీతం: చక్రి
సాహిత్యం: ప్రవీణ్ లక్మా
గానం: దలేర్ మెహంది, ఆదర్షణి

చలాకి చూపులతో




క్యా బే జారే పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీమన్నారాయణ  (2012)
సంగీతం: చక్రి
సాహిత్యం: బాలాజీ
గానం: వినోద్ యాజమాన్య, విజయ

క్యా బే జారే




ఆరడుగుల అబ్బాయి పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీమన్నారాయణ  (2012)
సంగీతం: చక్రి
సాహిత్యం: చంద్రబోస్
గానం: మనో, కౌశల్య , శ్రావణ భార్గవి

ఆరడుగుల అబ్బాయి హ్యాండ్సమ్ నువ్వోయి
ఏడడుగులు నాతో వేసెయ్యి
ఆరడుగుల అబ్బాయి హేట్సాఫ్ నీకోయి
ఏదైనా నన్నే అడిగేయి
గిరాకి ఉన్న కుర్రోడిని డిమాండ్ ఉన్న బుల్లోడిని
కరంటు కందని మగాడిని కర్చీఫ్ వేసేసుకో
అరె జనాలు మెచ్చే బొనాంజని జగాలు గెలిసే ఎనర్జిని
రిమార్కు లేని రికార్డ్ ని రిజర్వ్ చేసేసుకో
నేనే నీకు బ్రేకింగ్ న్యూస్ నువ్వే నాకు డ్రైవింగ్ ఫోర్స్
ఈ వైపు బొమ్మ ఆ వైపు బొరుసు కాసేపు కాసేసుకో

ఆరడుగుల అబ్బాయి హ్యాండ్సమ్ నువ్వోయి
ఏడడుగులు నాతో వేసెయ్యి

చరణం: 1
అబ్బాయి ముంచెయ్యి ప్రేమ వర్షంలో
చిత్రాలే చూసెయ్యి నా దూరదర్శన్ లో
నీ సిగ్నలే నే మెచ్చానులే నీ కేబులే నే కచ్చానులే
నీకేసి పీకేసి వచ్చానులే ఓ మిస్సమ్మో
అటెంప్ట్ ఛానల్ నాది హ్యాపీగా టచ్ మీ టచ్ మీ
మాజాల విజువల్ నాది మజాగ కిస్ మీ కిస్ మీ
క్రష్ మీ క్రష్ మీ

అ నీతో నీతో నీతో నీతో నీతో  
నిషాల ప్రోగ్రాం నీలోని చూస్తా 
ఖుషీల ఐటమ్ నీతోనే చేస్తా
రిమోట్ నొక్కి రివర్స్ కొస్తా
రక రకాల సుఖాల షికారు చేస్తా

ఆరడుగుల అబ్బాయి హ్యాండ్సమ్ నువ్వోయి
ఏడడుగులు నాతో వేసెయ్యి

చరణం: 2
రావయ్యో రావయ్య మేనమామయ్యో
రాగాలే పలికేటి నా ఫోన్ నీదయ్యో
నీ తోటి ఉంటే కనెక్షనే నీ మాట వింటే అటెన్షనే
నువ్వంటే నాకెంతో ఎఫెక్షనే...ఓ మిస్సమ్మో
సెకండ్ సిమ్ కార్డు నాది సరదాగా టచ్ మీ టచ్ మీ
సీక్రెట్స్ నెంబర్ నాది సింప్లీగా పుష్ మీ పుష్ మీ
ప్రూవ్ మీ కిల్ మీ హే
నీతో నీతో నీతో నీతో నీతో 
నాలోని మాట చెప్పేసుకుంటా
పైపైన నీకే పెట్టాను మంట
నూటొక్క మంది నా వెంట పడ్డా 
నిన్నొక్కదాన్నే పెళ్లాడు కుంటా

ఆరడుగుల అబ్బాయి హ్యాండ్సమ్ నువ్వోయి
ఏడడుగులు నాతో వేసెయ్యి
ఆరడుగుల అబ్బాయి హేట్సాఫ్ నీకోయి
ఏదైనా నన్నే అడిగేయి

Palli Balakrishna Wednesday, November 15, 2017
Allare Allari (2006)


చిత్రం: అల్లరే అల్లరి (2006)
సంగీతం: చక్రి
సాహిత్యం: శ్రీనివాస్ చంద్ర
గానం: కౌశల్య, చక్రి
నటీనటులు: అల్లరి నరేష్ , వేణు తొట్టెంపూడి, పార్వతి మెల్టన్, మల్లికా కపూర్
దర్శకత్వం: ముప్పలనేని శివ
నిర్మాత: యస్. కె.బషీద్
విడుదల తేది: 20.12.2006

పల్లవి:
నువ్వైనా నేనైనా ఒకటేలే ప్రేమ
నీలోన నాలోన ఊరించే ప్రేమ
ఎవ్వరు ఏమనుకున్నా
నా మదిలో ఉన్నది నువ్వేనా
ఎప్పుడు నేననుకున్నా నా కలలోకే రారా
నీవే నేననుకున్నా నా మౌనం నివనుకున్నా
నీకై వేచే ఉన్నా నా కళ్ళారా...

నువ్వైనా నేనైనా ఒకటేలే ప్రేమ
నీలోన నాలోన ఊరించే ప్రేమ

చరణం: 1
నువ్వు నాకెంతో ఇష్టం ఐనా
ప్రేమ నీ పెదవి అదిమేస్తున్నా
ఇన్నినాళ్లుగా దాచిన ప్రేమకు ఫీలై పోతున్నా
కొత్త కొత్తగా నిను చూస్తున్నా
కోటి వింతలే కనుగొంటున్నా
నన్ను చేరినా నీ తొలిప్రేమను నిన్నే చూస్తున్నా
కలనైనా మెలుకువనైనా
ఐ యామ్ ఫీలింగే లవ్ యు
నీలోన మరి నేనున్నా టేక్ కేర్ ఆఫ్ యూ
నన్నే బతికిస్తున్నా నా శ్వాసకు ఆశవు నువ్వేరా
నాలో విహరిస్తున్నా తొలి ఊహలు నీవేరా
ఇంతగ వినిపిస్తున్నా నా ఊపిరి రాగం నీదేరా
ఐ వాన్నా వుయ్ విత్ యు జస్ట్ లవ్ మీ రా

నువ్వైనా నేనైనా ఒకటేలే ప్రేమ

చరణం: 2
మెల్ల మెల్లగా మనసుని గిల్లి
చందనాల సిరి నవ్వులు చల్లి
నువ్వు పంచినా ఈ పరిచయమే ప్రాణం అనుకోనా
ఉంది వాకిట ఉదయం నువ్వై
కొంగు దాటని బిడియం నువ్వై
నన్ను తాకిన నీ పరిమళమే కౌగిలి అనుకోనా
ఎందరిలో నేనుంటున్నా
ఐ రిమైండ్ ఆఫ్ యు
నీ తలపే నిలదీస్తున్నా
ఐ వెల్డింగ్ ఫర్ యు
కొత్తగ అనిపిస్తున్నా సుతిమెత్తని మైకం నీదేరా
నన్నే మురిపిస్తున్నా మధుమాసం నువ్వేరా
కొంటెగ కనిపిస్తున్నా పులకింతల లోకం నువ్వేరా
ఐ వాన్నా వుయ్ విత్ యు జస్ట్ లవ్ మీ రా

నువ్వైనా నేనైనా ఒకటేలే ప్రేమ
నీలోన నాలోన ఊరించే ప్రేమ

Palli Balakrishna Wednesday, November 8, 2017
Jalsa (2008)




చిత్రం: జల్సా (2008)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
నటీనటులు: పవన్ కళ్యాణ్, ఇలియానా, పార్వతి మెల్టన్
దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాత: అల్లు అరవింద్
విడుదల తేది: 02.04.2008



Songs List:



కరో కరో జర జల్సా పాట సాహిత్యం

 
చిత్రం: జల్సా (2008)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరి వెన్నెల
గానం: బాబా సెహగల్ ,  రీటా 

సరిగమపదనిస అరె కరో కరో జర జల్సా స జల్సా
సనిదపమగరిస అరె కరో కరో జర జల్సా స జల్సా
తెల్సా తెల్సా తెల్సా ఎవ్వరికైనా తెల్సా
సునామీ ఎదురుగ వస్తే ఎలాగ కనబడుతుందో
తెల్సా తెల్సా తెల్సా ఎవ్వరికైనా తెల్సా
తుఫానే తలుపులు తడితే ఎలాగ వినబడుతుందో
అరె తెలియకపోతే చూడర బాబూ 
హిజ్ హ్యూమన్ సునామీ
తెలియాలనుకుంటే డేంజర్ బాబూ 
యు హావ్ గాట్ బిలీవ్ మి
హే సరిగమపదనిస అరె కరో కరో జర జల్సా స జల్సా
హే సనిదపమగరిస అరె కరో కరో జర జల్సా స
వన్ మోర్ టైమ్ జల్సా

చరణం: 1
హైటెంతుంటాడో కొలవాలనిపిస్తే అమాంతమూ
అలా అలా మౌంటెవరెస్ట్ అవుతాడు
ఫైటేంచేస్తాడో అని సరదాపడితే స్ట్రెచర్ తనై
సరాసరి వార్డుకి చేరుస్తాడు
అరె గడ్డిపోచ అనుకుని తుంచడానికొస్తే
గడ్డపార నమిలేస్తాడు
గుండు సూది చేతికిచ్చి దండ గుచ్చమంటే
కొండ తవ్వి పారేస్తాడూ
హే సరిగమపదనిస అరె కరో కరో జర జల్సా స జల్సా
హే సనిదపమగరిస అరె కరో కరో జర జల్సా

చరణం: 2
మనవాడనుకుంటే చెలికాడవుతాడు
హెయ్ విమానమై భుజాలపై సవారి చేయిస్తాడు
పగవాడనుకుంటే విలుకాడవుతాడు
హెయ్ ప్రమాదమై క్షణాలలో శవాలు పుట్టిస్తాడు
హే దోసెడు పూలను తెచ్చిపెట్టమంటే 
తోటలన్నీ నొల్లుకొస్తాడు
యమపాశం వచ్చి పీకచుట్టుకుంటే 
దానితోటి ఊయలూగుతాడు
సరిగమపదనిస అరె కరో కరో జర జల్సా స జల్సా
సనిదపమగరిస అరె కరో కరో కరో జర జల్సా స జల్సా



మై హార్ట్ ఈజ్ బీటింగ్ పాట సాహిత్యం

 
చిత్రం: జల్సా (2008)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కె.కె

మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా తెలుసుకోవా అదీ
ఎన్నాళ్ళీ వెయిటింగ్ అనేలా తరుముతోంది మదీ

పెదవిపై పలకదే మనసులో ఉన్న సంగతి
కనులలో వెతికితే దొరుకుతుందీ
టీ స్పూన్ టన్ను బరువవుతుందే
ఫుల్ మూన్ నన్ను ఉడికిస్తుందే
క్లౌడ్ 9 కాళ్ళకిందకొచ్చిందే
లాండ్ మైన్ గుండెలో పేలిందే దే దే

మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా తెలుసుకోవా అదీ
ఎన్నాళ్ళీ వెయిటింగ్ అనేలా తరుముతోంది మదీ

Hey I wanna be with you forever
Hey I wanna live with you forever

పెనుతుఫాను ఏదైనా మెరుపుదాడి చేసిందా
మునుపు లేని మైకానా మదిని ముంచి పోయిందా
ఊరికినే పెరగదుగా ఊపిరి సలపని భారమిలా
నీ ఉనికే ఉన్నదిగా నాలో నిలువెల్లా
తలపులలో చొరబడుతూ గజిబిజిగా చెలరేగాలా
తలగడతో తలబడుతూ తెల్లార్లు ఒంటరిగా వేగాలా
సెల్ ఫోన్ నీ కబురు తెస్తుంటే స్టెన్ గన్ మోగినట్టు ఉంటుందే
క్రాంప్టన్ ఫాను గాలి వీస్తుంటే సైక్లోన్ తాకినట్టు ఉంటుందే దే దే

మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా తెలుసుకోవా అదీ
ఎన్నాళ్ళీ వెయిటింగ్ అనేలా తరుముతోంది మదీ

ఎప్పుడెలా తెగిస్తానో నా మీదే నాకు అనుమానం
మాటల్లో పైకనేస్తానో నీ మీద ఉన్న అభిమానం
త్వరత్వరగా తరిమినదే పదపదమని పడుచు రథం
యదలయలో ముదిరినదే మదనుడి చిలిపి రిథం
గుసగుసగా పిలిచినదే మనసున మెరిసిన కలలవనం
తహతహగా తరిమినదే ధమ్ రె ధమ్ అని తూలే ఆనందం
ఫ్రీడం దొరికినట్టు గాలుల్లో వెల్కం పిలుపు వినిపిస్తుందే
బాణం వేసినట్టు ఏ విల్లో ప్రాణం దూసుకెళ్ళిపోతుందే దే దే

మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా తెలుసుకోవా అదీ
ఎన్నాళ్ళీ వెయిటింగ్ అనేలా తరుముతోంది మదీ




యు అండ్‌ ఐ (ఏ జిందగీ నడవాలంటే హస్తే హస్తే ) పాట సాహిత్యం

 
చిత్రం: జల్సా (2008)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: దేవీ శ్రీ ప్రసాద్

ఏ జిందగీ నడవాలంటే హస్తే హస్తే నదిలో దిగి ఎదురీదాలి అంతే అంతే 
హీరోషిమా  ఆగిందా ఆటంబాంబేేస్తే
ఛల్ చక్ దే చక్ దే అంటే పదినాళ్ళే చస్తామంతే 
హకునామ టాటా అనుకో తమాషగా తలఊపి 
వెరైటీగా శబ్ధం విందాం అర్ధం కొద్దిగా సైడుకి జరిపి 
అదే మనం తెలుగులో అంటే డోంట్‌ వర్రీ బిహ్యాపీ 
మరోరకంగా మారుద్దాం కొత్తదనం కలిపి

యు అండ్‌ ఐ లెట్స్ గో హై అండ్ డు భల్లే భల్లే 
లైప్ ఈజ్ లైక్ సాటర్ డే నైట్ లెట్స్ డు భల్లే భల్లే
లెట్స్ డు భల్లే భల్లే లెట్స్ డు భల్లే భల్లే

ఏ జిందగీ నడవాలంటే హస్తే హస్తే నదిలో దిగి ఎదురీదాలి అంతే అంతే 
హీరోషిమా  జీరో అయిందా  ఆటంబాంబేదో వేస్తే
ఛల్ చక్ దే చక్ దే అంటే పదినాళ్ళే చస్తామంతే

చరణం: 1 
ఎన్నో రంగుల జీవితం నిన్నే పిలిచిన స్వాగతం విన్నా నీలో సంశయం పోదా
ఉంటే నీలో నమ్మకం కన్నీరైన అమృతం కష్టం కూడా అధ్భుతం కాదా 
బొటానికల్ బాషలో మెటల్స్ పూరేకులు 
మెటీరియల్ సైన్స్ లో కలలు మెదడు పెనుకేకలు 
మెకానికల్ శ్వాసలో ఉసూరనే ఊసులు 
మనస్సు పరి భాషలో మధురమైన కధలు

యు అండ్‌ ఐ లెట్స్ గో హై అండ్ డు భల్లే భల్లే 
లైప్ ఈజ్ లైక్ సాటర్ డే నైట్ లెట్స్ డు భల్లే భల్లే
లెట్స్ డు భల్లే భల్లే లెట్స్ డు భల్లే భల్లే

ఏ జిందగీ నడవాలంటే హస్తే హస్తే నదిలో దిగి ఎదురీదాలి అంతే అంతే 
హీరోషిమా  జీరో అయిందా  ఆటంబాంబేదో వేస్తే
ఛల్ చక్ దే చక్ దే అంటే పదినాళ్ళే చస్తామంతే 

చరణం: 2 
పొందాలంటే విక్టరీ పోరాటం కంపల్సరీ రిస్కంటే ఎల్లామరి బోలో 
ఎక్కాలంటే హిమగిరి ధిక్కారం తప్పనిసరి కాలం మొక్కే హిస్టరీ లిఖనా 
ఇథోఫియా ఊహలో అటో ఇటో సాగుదాం 
యుకోరియా ఊపులో ఎగసి ఎగసి చెలరేగుదాం 
ఫిలాసఫీ చూపులో ప్రపంచమో బూటకం 
ఎనాటమి ల్యాబులో మనకు మనము దొరకం

యు అండ్‌ ఐ లెట్స్ గో హై అండ్ డు భల్లే భల్లే 
లైప్ ఈజ్ లైక్ సాటర్ డే నైట్ లెట్స్ డు భల్లే భల్లే
లెట్స్ డు భల్లే భల్లే లెట్స్ డు భల్లే భల్లే




చలోరే చలోరే చల్ పాట సాహిత్యం

 
చిత్రం: జల్సా (2008)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రంజిత్

చలోరే చలోరే చల్ చలోరే చలోరే చల్ 
చలోరే చలోరే చల్ చల్ (2)

నీ పయనం ఎక్కడికో నీకు తెలియాలిగా 
ఏ సమరం ఎవ్వరితో తేల్చుకో ముందుగా

చలోరే చలోరే చల్ చలోరే చలోరే చల్ 
చలోరే చలోరే చల్ చల్ (2)

చంపనిదే బతకవనీ బతికేందుకు చంపమనీ 
నమ్మించే అడవిని అడిగేం లాభం బతికే దారెటనీ 
చలోరే చలోరే చల్ చలోరే చలోరే చల్ 
చలోరే చలోరే చల్ చల్ 
సంహారం సహజమనీ సహవాసం స్వప్నమనీ 
తర్కించే తెలివికి తెలిసేనా తానే తన శతృవనీ
చలోరే చలోరే చల్ చలోరే చలోరే చల్ 
చలోరే చలోరే చల్ చల్ 
నీ పయనం ఎక్కడికో నీకు తెలియాలిగా 
ఏ సమరం ఎవ్వరితో తేల్చుకో ముందుగా

ధీరులకీ దీనులకీ అమ్మ ఒడి ఒక్కటే 
వీరులకీ చోరులకీ కంటతడి ఒక్కటే 
చలోరే చలోరే చల్ చలోరే చలోరే చల్ 
చలోరే చలోరే చల్ చల్ 
అపుడెపుడో ఆటవికం మరి ఇపుడో ఆధునికం 
యుగయుగాలుగా ఏ మృగాల కన్నా ఎక్కువ ఏం ఎదిగాం
చలోరే చలోరే చల్ చలోరే చలోరే
రాముడిలా ఎదగగలం రాక్షసులను మించగలం 
రకరకాల ముసుగులు వేస్తూ 
మరిచాం ఎపుడో సొంత ముఖం 
చలోరే చలోరే చల్ చలోరే చలోరే 
తారలనే తెంచగలం తలుచుకుంటే మనం 
రవికిరణం చీల్చగలం రంగులుగా మార్చగలం

చలోరే చలోరే చల్ చలోరే చలోరే చల్ 
చలోరే చలోరే చల్ చల్ (2)



హే Jennifer Lopez స్కెచ్ గీసినట్టుగా ఉందిరో ఈ సుందరి  పాట సాహిత్యం

 
చిత్రం: జల్సా (2008)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: బెన్నీ దయల్ , ప్రియా

హే Jennifer Lopez స్కెచ్ గీసినట్టుగా ఉందిరో ఈ సుందరి 
హే Britney Spears ని ప్రింట్ తీసినట్టుగా ఉందిరో ఈ కాడ్బరి 
ఓ నడుమే చూస్తే Shakira దాన్ని అంటుకున్న చెయ్యే లక్కిరా 
నడకే చూస్తే Beyonce  బేబి నవ్విందంటే ఖల్లాసే
ఓ జీన్స్ పాంట్ వేసుకున్న James Bond లాగా గన్ను లాంటి కన్ను కొట్టి చంపమాకురో 
బ్లాక్ బెల్ట్ పెట్టుకొని Jackie Chan లాగా నాన్ చాక్ తిప్పమాకురో 

చరణం: 1
హే లేడికళ్ళ లేజరే నువ్వా పారడైజ్ ఫ్లేవరే నువ్వా 
Oxyzen నింపుకున్న ఆడబాంబువా సాక్సోఫోన్ వంపువే నువ్వా 
ఓ Volcano కి బెస్ట్ ఫ్రెండ్ వా వెయ్యి వోల్ట్స్ హై కరెంటువా
వయసు మీద వాలుతున్న Tornedo నువ్వా Earth Quack థండరేనువ్వా 
నీ రెండు కళ్ళు Radium డయల్సా నీ పెదవులు ప్లాటినం ఫ్లవర్సా 
నువ్వు Hello అంటే రొమాన్సా నీ సైలెన్స్ అయినా వాయిలెన్సా
హే టైటానిక్ హీరోయిన్ పార్ట్ 2 నువ్వని నవ్వుతున్న మోనలిస మొత్తుకోదా 
Playboy చూపులున్న సమురాయ్ నువ్వని సుమోలంత సలాం కొట్టరా

హే Jennifer Lopez స్కెచ్ గీసినట్టుగా ఉందిరో ఈ సుందరి 
Britney Spears ని ప్రింట్ తీసినట్టుగా ఉందిరో ఈ కాడ్బరి 

చరణం: 2
హే DTS రింగుటోన్ వా హార్ట్ షేపు మూనువే నువ్వా
అందమన్న సాఫ్ట్ వేరు CD-ROM వా కమ్మనైన క్లోరోఫామ్ వా
హో రోమెయోకి క్లోనువే నువ్వా రెయిన్బోకి ట్విన్నువే నువ్వా
Dream University కి డీనువే నువ్వా నా Zodiac సైనువే నువ్వా 
హే 24 Carrot Vanila నువ్వు హాట్ హాట్ మెక్సికన్ Taquilla 
Fully Loaded రైఫుల్లా నన్ను రైడ్ చేసావే రాంబోలా
హే మడొన్నాను బంతి చేసి బౌన్సరేసినట్టుగా పల్స్ రేటు పెంచినావే ఫ్రెంచ్ మోడలా 
Maradona లాగిపెట్టి గోల్ కొట్టినట్టుగా Flying Kiss పెట్టమాకురో

హే Jennifer Lopez స్కెచ్ గీసినట్టుగా ఉందిరో ఈ సుందరి 
Britney Spears ని ప్రింట్ తీసినట్టుగా ఉందిరో ఈ కాడ్బరి 




గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే పాట సాహిత్యం

 
చిత్రం: జల్సా (2008)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సాహిత్యం: భాస్కరభట్ల రవి కుమార్
గానం: జి. సాహితి, గోపికా పూర్ణిమ, టిప్పు 

పల్లవి:
గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే
తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే
ఒళ్ళు ఊగినట్టుందే దమ్ము లాగినట్టుందే
ఫుల్లు బాటిలెత్తి దించకుండా తాగినట్టుందే
ఊర్వశివో నువ్వు రాక్షసివో నువ్వు
ప్రేయసివో నువ్వు నా కళ్ళకి
ఊపిరివో నువ్వు ఊహలవో నువ్వు
ఊయలవో నువ్వు నా మనసుకి

చరణం: 1
హే నిదుర దాటి కలలే పొంగె
పెదవి దాటి పిలుపే పొంగె
అదుపుదాటి మనసే పొంగె నాలో
గడపదాటి వలపే పొంగె
చెంపదాటి ఎరుపే పొంగె
నన్ను దాటి నేనే పొంగె నీ కొంటె ఊసుల్లో
రంగులవో నువ్వు రెక్కలవో నువ్వు
దిక్కులవో నువ్వు నా ఆశకి
తుమ్మెదవో నువ్వు తుంటరివో నువ్వు
తొందరవో నువ్వు నా ఈడుకి

గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే
తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే
ఒళ్ళు ఊగినట్టుందే దమ్ము లాగినట్టుందే
ఫుల్లు బాటిలెత్తి దించకుండా తాగినట్టుందే

చరణం: 2
తలపుదాటి తనువే పొంగె
సిగ్గుదాటి చనువే పొంగె
గట్టుదాటి వయసే పొంగె లోలో
కనులుదాటి చూపే పొంగె
అడుగు దాటి పరుగే పొంగె
హద్దు దాటి హాయే పొంగె నీ చిలిపి నవ్వుల్లో
తూరుపువో నువ్వు వేకువవో నువ్వు
సూర్యుడివో నువ్వు నా నింగికి
జాబిలివో నువ్వు వెన్నెలవో నువ్వు
తారకవో నువ్వు నా రాత్రికి



Chalore Chalore Chal (Hindi)

 
చిత్రం: జల్సా (2008)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సాహిత్యం: Raqueeb Alam
గానం: దేవీ శ్రీ ప్రసాద్

Chalore Chalore Chal (Hindi)



మై హార్ట్ ఈజ్ బీటింగ్ (Remix) పాట సాహిత్యం

 
చిత్రం: జల్సా (2008)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కె.కె

మై హార్ట్ ఈజ్ బీటింగ్  (Remix)



సరిగమపదనిస (The Devi Mix)

 
చిత్రం: జల్సా (2008)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరి వెన్నెల
గానం: బాబా సెహగల్ ,  దేవీ శ్రీ ప్రసాద్

సరిగమపదనిస అరె కరో కరో జర జల్సా  (The Devi Mix)

Palli Balakrishna Monday, July 31, 2017
Vennela (2005)


చిత్రం: వెన్నెల (2005)
సంగీతం: మహేష్ శంకర్
సాహిత్యం: రవివర్మ
గానం: సుదీప్ , అరవింద్, దేవన్
నటీనటులు: రాజా, పార్వతి మెల్టన్, శర్వానంద్, రవివర్మ
దర్శకత్వం: దేవా కట్టా
నిర్మాతలు: రవి వల్లభనేని, సచి పినగపని, చలపతి మన్నూరు
విడుదల తేది: 26.11.2005

పల్లవి:
భాగ్యం పొద్దున్న ఓ కొత్త కధ చెప్పింది
రోజు ముందర ఉన్న గుట్టు విప్పింది
భాగ్యం పొద్దున్న ఓ కొత్త కధ చెప్పింది
రోజు ముందర ఉన్న గుట్టు విప్పింది
చక్కని పిల్లాడు సోకైన పిల్ల
బస్టాండ్ షెల్టర్లో చూశారంట
కాలేజీ కాంటీన్లో కలిసింది చూపు
ఇద్దరి నడుమ మెరిసిందో ప్రేమ

నాయుడు గారి పాప రెడ్డి బాబు లవ్వు
రెడ్డి గారి పాప నాయుడు బాబు లవ్వు
చౌదరి గారి పాప శాస్త్రి బాబు లవ్వు
శాస్త్రి గారి పాప చౌదరి బాబు లవ్వు

చరణం: 1
పిటాపురం పుట్టాం పెద్దాపురం పెరిగాం
బెజవాడ చదివాం హాస్టల్లో వాలాం
పిటాపురం పుట్టాం పెద్దాపురం పెరిగాం
బెజవాడ చదివాం హాస్టల్లో వాలాం
టెక్సాస్లో ఉద్యోగం వెగాస్లో ఉల్లాసం
పారిస్లోన పెళ్లి హాలండ్ హనీమూన్
ఇటలీలోన టూరంట సింగపూర్లో షాపంట
నైలు నదిలో ఈతంట లండన్ గదిలో రెస్ట్ అంట

ఆఫ్రికాన పాప ఇంగ్లీష్ బాబు లవ్వు
అమెరిక పాప ఫూలిష్ బాబు లవ్వు
స్విట్జర్ లాండ్ పాప చైనా బాబు లవ్వు
పాకిస్తాన్ పాప ఇండియా బాబు లవ్వు

చరణం: 2
ముంబై వజ్రం హవాయి ముత్యం
ఆఫ్రికా బంగారం లండన్ లో వేలం
ముంబై వజ్రం హవాయి ముత్యం
ఆఫ్రికా బంగారం లండన్ లో వేలం
తైవానోడి షర్టు బర్మావాడి ప్యాంటు
జెర్మనోడి కారు చైనా ఓడి బ్లేడు
హిందుస్తాను కోనంట
జపానోడి ఫోనంట
అరబ్బోడి ఆయిలంట హాలీవుడ్ ఫిల్మంట

ఆఫ్రికాన పాప ఇంగ్లీష్ బాబు లవ్వు.....
అమెరిక పాప ఫూలిష్ బాబు లవ్వు
స్విట్జర్ లాండ్ పాప చైనా బాబు లవ్వు
పాకిస్తాన్ పాప ఇండియా బాబు లవ్వు

నాయుడు గారి పాప రెడ్డి బాబు లవ్వు
రెడ్డి గారి పాప నాయుడు బాబు లవ్వు
చౌదరి గారి పాప శాస్త్రి బాబు లవ్వు
శాస్త్రి గారి పాప చౌదరి బాబు లవ్వు


*******  *******  *******


చిత్రం: వెన్నెల (2005)
సంగీతం: మహేష్ శంకర్
సాహిత్యం: రవివర్మ
గానం: సుదీప్ , సైందవి, రజిని, దేవన్

ప్రేయసి కావు నేస్తం కావు
గుండెల్లో నిండున్నావు
గుప్పెట్లో దాగున్నావు
చీకట్లో వెలుగిస్తావు
జగమంతా కనిపిస్తావు

పండుగ నీవు నా పచ్చిక నీవు (2)

చరణం: 1
మోహమే మంటగా రగులుతున్నా
లోకమే నీవుగా మునిగివున్నా
గాలిలో ఈ కల తేలుతున్నా
నీటిలో రాతలా చెదిరివున్నా
నీ శ్వాసకోసం మానై ఉంటా
నీ మాటకోసం మునినై పోతా
నీ చూపు కోసం శిలనై ఉంటా
నీ నవ్వుకోసం అలుసై పోతా

జాబిలికే వెన్నెల నీవు
సూర్యునికే వేకువ నీవు
ఊపిరిలో ఉష్ణం నీవు
ఊరించే తృష్ణం నీవు

శూన్యం నీవు నా శోకం నీవు (2)

చరణం: 2
వేసవి వర్షమై కురిసిపోవా
వెచ్చని వేకువై వెలిగిరావా
మాటతో రూపమై తరలిరావా
నిర్ణయం చెప్పి నన్నాదుకోవా
నీ తోడుకోసం ఆవిరైపోనా
నీ స్పర్శకోసం చినుకై రానా
నీ అడుగు తాకి గుడినైపోనా
నీ గుండెలోకి సడినై రానా

నీలానికి నింగివి నీవు
కాలానికి గమ్యం నీవు
చలనానికి శక్తివి నీవు
భావానికి మూలం నీవు

ఎవ్వరి కోసం ఈ జాబిలి వేషం
కమ్మని కావ్యం ఈ వెన్నెల దీపం
ఎవ్వరి కోసం ఈ జాబిలి వేషం
కమ్మని కావ్యం ఈ వెన్నెల దీపం



**********  ***********  ***********


చిత్రం: వెన్నెల (2005)
సంగీతం: మహేష్ శంకర్
సాహిత్యం: రవివర్మ
గానం: రవివర్మ , దేవాకౌశిక్

Come on girls
రోజుకొక్క రోజా తెచ్చి పూటకొక్క షాపుకొచ్చి
గంటకొక్క లక్ష పోసి ఫైవ్ స్టార్ లైఫ్ ఇస్తే
చేస్తారా లవ్ చేస్తారా లవ్
చేస్తారా లవ్ చేస్తారా లవ్
రోజు రోజు రోజాలొద్దు ముప్పూట షాపులొద్దు
గంటకొక్క లక్ష వద్దు 5 స్టార్ లైఫ్ బోరు
తియ్యనైన మాట చెప్పవోయ్
తియ్యనైన మాట చెప్పవోయ్

చరణం: 1
సల్మాన్లా సెక్సీగుండి బచ్చన్లా బారుగుండి
సచ్చిన్లా సిక్స్ కొట్టి టైసన్లా మజిల్స్ ఉంటే
చేస్తారా లవ్ చేస్తారా లవ్  చేస్తారా లవ్ చేస్తారా లవ్
సల్మాన్ లాంటి హీరోలొద్దు బారుగున్న బచ్చన్లొద్దు
ఫోరులొద్దు సిక్సులొద్దు నల్లరాతి కండలొద్దు
గుండె తాకు చూపే చాలునోయ్
గుండె తాకు చూపే చాలునోయ్

చరణం: 2
గుండు గీసి గుండీ విప్పి
బ్లడ్ తీసి బొట్టే పెట్టి రఫ్ కట్ ఫేస్ తోటి
అడుగు అడుగు వెంట వస్తే
చేస్తారా లవ్ చేస్తారా లవ్
గుండు ఉన్న గూండాలొద్దు బ్లడ్ చూపే సైకోలొద్దు
రఫ్ కట్ రాంగు బాసు ఊరకుక్కల్ వెంట వద్దు
చందమామ చందం నచ్చునోయ్
చందమామ చందం నచ్చునోయ్

చరణం: 3
భక్తీ పూజ పుణ్యాలంటూ పంగ నామం పైన పెట్టి
పైసా పైసా కూడబెట్టి చదువుల్లోన ఫస్టుంటె
చేస్తారా లవ్ చేస్తారా లవ్
భక్తి పూజ కొంచెం చాలు పంగ నామం ఫాషన్ కాదు
పైసల్ చేర్చే పీచుల్ వేస్టు చదువుల్ మాత్రం లైఫైపోదు
కుర్రకారు కబురే చెప్పవోయ్
కుర్రకారు కబురే చెప్పవోయ్

చరణం: 4
హీరోలంటే ఏంటి మీకు చెప్పి చావవొచ్చు మాకు
ఎందుకింత పాడు లొల్లి సింగిల్ హింట్ ఇచ్చి చూడు
చూపిస్తాం లవ్ చూపిస్తాం లవ్
చూపిస్తాం లవ్ చూపిస్తాం లవ్
వట్టి మాటల్ కట్టి పెట్టు ఉన్నదాన్ని పదును పెట్టు
సొంత సొత్తు కొంచెం చూపు
టైమింగ్ చూసి లవ్ చెప్పు
పెళ్లి కార్డు మాకు పంపారో
పెళ్లి కార్డు మాకు పంపారో


*********  *********  *********


చిత్రం: వెన్నెల (2005)
సంగీతం: మహేష్ శంకర్
సాహిత్యం: రవివర్మ
గానం: టిప్పు

సూపర్ మోడల్ లాంటి పిల్ల ఒకతొచ్చె గుండె గుచ్చె
నా చూపులు కదిపి ఊహలు చెడగొట్టిపోయే కొట్టిపోయే
కన్నులలో కనులిచ్చి వచ్చిందో కలత రేపి కలలెక్కి పోయిందో
నెమలీకలా అడుగేసి వచ్చిందో మల్లికలా విరుగాలి వీచిందో
సూపర్ మోడల్ లాంటి పిల్లోడిటు వచ్చే గుండె గుచ్చె
నా ఊహలు కదిపి మనసే కొల్లగొట్టి పోయే కొట్టిపోయే
కన్నులలో కనులిచ్చి వచ్చాడు కలత రేపి కలలెక్కిపోయాడు
మేఘంలా వర్షించి వచ్చాడు మోహం రేపి మరులిచ్చి పోయాడు

చరణం: 1
మెరుపై వచ్చి మెలకువిచ్చి కవితను నేర్పింది
శ్వాసను చేరి జ్వరమై మారి నరమున కలిసింది
కిన్నెరసాని పున్నమి రాణి రధమున వచ్చింది
కోకిల వాణి నవ్వుల బాణి పదమై వెలిసింది
వెల్లువై తరుముకు వచ్చిందో
ఉప్పెనై ఎత్తుకు పోయిందో
దేవతై దర్శనమయిందో
వేవేల వరములు ఇచ్చిందో

చరణం: 2
మాటలు చెప్పి మాయలు చేసి చూపులు దోచాడు
గుండెను మీటి గొంతున పొంగి స్వరముగా మారాడు
మిన్నులు వీడి వెన్నెల రాజు వేటకు వచ్చాడు
కన్నయ్యలాగా కన్నెను చేరి వేణువులూదాడు
వేసవై వేడిగా వచ్చాడు
వేకువై వెచ్చగా తాకాడు
నదిలా నురగలు చిందాడు
నీడై మారి తోడుగా ఉన్నాడు

Palli Balakrishna Saturday, July 29, 2017
Dookudu (2011)




చిత్రం: దూకుడు (2011)
సంగీతం: ఎస్.ఎస్.థమన్
నటీనటులు: మహేష్ బాబు, సమంత
దర్శకత్వం: శ్రీనువైట్ల
నిర్మాతలు: రామ్ అచంట, గోపిచంద్ అచంట, అనీల్ సుంకర
విడుదల తేది: 23.09.2011



Songs List:



నీ దూకుడు... సాటెవ్వడూ... పాట సాహిత్యం

 
చిత్రం: దూకుడు (2011)
సంగీతం: ఎస్.ఎస్.థమన్
సాహిత్యం: విశ్వ 
గానం: శంకర్ మహాదేవన్

నీ దూకుడు... సాటెవ్వడూ...
హే సరాసరి వచ్చి ఎదుటపడి తెగబడతూ రెచ్చి
నిషాన ధనాధనా కూల్చే జోరే
హమేషా ఖణేల్ ఖణేల్‌మంటూ 
కలయబడి కలకలమే రేపే
బినా యే భలా బురా సోచే
కమాన్ ఏవ్రిబడి లెట్స్ గో గో గో...
నీ దూకుడు... సాటెవ్వడూ...

చరణం: 1
విషపు ఊడ పడగలనే 
నరికివేయి తక్షణమే
పనికిరాదు కనికరమే 
అణచివేత అవసరమే
వదలినావు దురితులనే 
ప్రళయమేరా క్షణక్షణమే 
సమరమే సై ఇక చలగిక చకచకా
ఎడతెగ చేయి ఇక విలయపు తైతక 
పిడికిలినే పిడుగులుగా కలబడనీ

నా దూకుడు... సాటెవ్వడూ...

చరణం: 2 
గీత విను దొరకదు గుణగణమే
చేవగల చతురత కణకణమే
చీడలను చెడమడ దునమడమే
నేటి మన అభినవ అభిమతమే
ఓటమిని ఎరుగని పెను పటిమే
పాదరస ఉరవడి నరనరమే
కర్ దిఖాయే జరా హఠ్‌కే
హోష్ ఉడాయే దుష్‌మన్‌కే
సమరమే చెయ్యిక చలా ఇక చకా చకా
ఎడతెగ చెయ్యిక విలయపు తై తక
చొరబడుతూ గురిపెడుతూ తలపడుతూ
నాననా నాననా నానానా (2)
కమాల్ హై ధమాల్ హై ఈ దూకుడు
ఝుకే నహీ రుకే నహీ ఈ దూకుడు

 హే సరాసరి వచ్చి ఎదుటపడి తెగబడతూ రెచ్చి
నిషాన ధనాధనా కూల్చే జోరే

నా దూకుడు... సాటెవ్వడూ...



గురువారం మార్చి ఒకటి పాట సాహిత్యం

 
చిత్రం: దూకుడు (2011)
సంగీతం: ఎస్.ఎస్.థమన్
సాహిత్యం: రామజోగయ్యశాస్త్రి
గానం: రాహుల్ నంబియార్

పల్లవి: 
గురువారం మార్చి ఒకటి సాయంత్రం ఫైవ్‌ ఫార్టీ 
తొలిసారిగ చూశానే నిన్ను
చూస్తూనే ప్రేమ పుట్టి నీ పైనే లెన్స్ పెట్టి 
నిదరే పోనందే నా కన్ను
గురువారం మార్చి ఒకటి సాయంత్రం ఫైవ్‌ఫార్టీ 
తొలిసారిగ చూశానే నిన్ను

రోజంతా నీ మాటే ధ్యాసంతా నీ మీదే 
అనుకుంటే కనిపిస్తావు నువ్వే
మొత్తంగా నా ఫోకస్ నీ వైపే మారేలా 
ఏం మాయో చేశావే
ఓం శాంతి శాంతి అనిపించావే

జర జరా సున్‌తో జర జానే జానా
దిల్‌సే తుఝ్‌కో ప్యార్ కియా ఏ దీవానా
నీపై చాలా ప్రేమ ఉంది గుండెల్లోన
సోచో జరా ప్యార్ సే దిల్‌కో సమ్‌ఝానా
ఐ లవ్ యూ బోలోనా హసీనా

చరణం: 1 
నువ్వాడే పెర్‌ఫ్యూమ్ గుర్తొస్తే చాలే 
మనసంతా ఏదో గిలిగింతే కలిగిందే పెరిగిందే
నా చుట్టూ లోకం నీతో నిండిందే 
ఓ నిమిషం నీ రూపం నన్నొదిలి పోనందే
క్లైమేట్ అంతా నాలాగే లవ్‌లో పడిపోయిందేమో అన్నట్టుందే క్రేజీగా ఉందే 
నింగినేల తలకిందై కనిపించే జాదూ ఏదో చేసేశావే 
ఓం శాంతి శాంతి అనిపించావే

జర జరా సున్‌తో జర జానే జానా
దిల్‌సే తుఝ్‌కో ప్యార్ కియా ఏ దీవానా
నీపై చాలా ప్రేమ ఉంది గుండెల్లోన
సోచో జరా ప్యార్ సే దిల్‌కో సమ్‌ఝానా
ఐ లవ్ యూ బోలోనా హసీనా

చరణం: 2 
గడియారం ముల్లై తిరిగేస్తున్నానే 
ఏ నిమిషం  నువ్వు ఐ లవ్ యూ 
అంటావో అనుకుంటూ
క్యాలెండర్ కన్నా ముందే ఉన్నానే 
నువు నాతో కలిసుండే ఆరోజే ఎపుడంటూ
డైలీ రొటీన్ టోటల్‌గా నీ వల్లే ఛేంజయ్యిందే 
చూస్తూ చూస్తూ నిన్ను ఫాలో చేస్తూ
అంతో ఇంతో డీసెంట్ కుర్రాణ్ణి 
ఆవారాలా మార్చేశావే
ఓం శాంతి శాంతి అనిపించావే

జర జర ప్రేమలోకి అడుగేస్తున్నా
చెలియలా చేరిపోనా నీలోన
ఏదేమైనా నీకు నేను సొంతం కానా
నన్నే నేను నీకు కానుకిస్తున్నా
నా ప్రాణం నా సర్వం నీకోసం




హే ఛుల్బులి నా ఛుల్బులి పాట సాహిత్యం

 
చిత్రం: దూకుడు (2011)
సంగీతం: ఎస్.ఎస్.థమన్
సాహిత్యం: రామజోగయ్యశాస్త్రి
గానం: కార్తీక్ ,  రీటా

హే ఛుల్బులి నా ఛుల్బులి 
నువు కోహినూరు లాంటి కొండమల్లి
నా ఛుల్బులి నా ఛుల్బులి 
అందాల దాడి చేసినావే ఆడపులి హాయ్
మాటల్లో మత్తు చల్లి చల్లి 
వెంటాడు నన్ను మళ్లీ మళ్లీ
చూడాలి నీ అల్లిబిల్లి ఓ ఓ...
నువు దొరికిపోవే నా దరికిరావే 
నీ ఇంటిపేరు మార్చాలి

ఛుల్బులి ఛుల్బులి గుండెలోతుల ఖల్బలి
ఛుల్బులి ఛుల్బులి ప్రేమలో మనసే బలి...

చరణం: 1
పిట్టంత నడుమును ఎరవేశావే 
పిల్లోడి నిదరను ఎగరేశావే
ఆకలి కళ్ల పోకిరిలాగ వదలక వెంట తిరిగావే
నాజూకు ఈటెలు గురిచూశావే 
నేనెటూ కదలని గిరిగీస్తావే
కుదురంతా చెరిపేశావే చూపులతోన 
చెక్కిలిమీటి చెకుముకి మంటేశావే
కనుసైగలతోనే కవ్వించావే చెలీ నన్ను రారమ్మనీ

మాటల్లో మత్తు చల్లి చల్లి 
వెంటాడు నన్ను మళ్లీ మళ్లీ
చూడాలి నీ అల్లిబిల్లి ఓ ఓ...
హే నువు దొరికిపోవే నా దరికిరావే 
నీ ఇంటిపేరు మార్చాలి లాలీ చలి

ఛుల్బులి ఛుల్బులి గుండెలోతుల ఖల్బలి
ఛుల్బులి ఛుల్బులి ప్రేమలో మనసే బలి...

చరణం: 2
బాగ్దాద్ గజదొంగై నే రానా 
ఏకంగా నిన్నే దోచుకుపోనా
కనుగొనలేని చిలకల దీవి 
మలుపులలోన నేనున్నా
ఏడేడు సంద్రాలను దాటైనా 
ఎలాగో నీ సరసకు రాలేనా
వింటున్నా చూస్తూ వున్నా 
నీ పదునైన మాటలలోని 
తెగువకు పడిపోతున్నా
హే ఎన్నటికైన నువు నా కూనా 
రానా రానా జతైపోనా

మాటల్లో మత్తు చల్లి చల్లి 
వెంటాడు నన్ను మళ్లీ మళ్లీ
చూడాలి నీ అల్లిబిల్లి ఓ ఓ...
నువు దొరికిపోవే నా దరికిరావే 
నీ ఇంటిపేరు మార్చాలి

ఛుల్బులి ఛుల్బులి గుండెలోతుల ఖల్బలి
ఛుల్బులి ఛుల్బులి ప్రేమలో మనసే బలి...



పువాయ్ పువాయ్ అంటాడు పాట సాహిత్యం

 
చిత్రం: దూకుడు (2011)
సంగీతం: ఎస్.ఎస్.థమన్
సాహిత్యం: రామజోగయ్యశాస్త్రి
గానం: ఎన్. ఎస్. రమ్య, నవీన్మాధవ్

పువాయ్ పువాయ్ అంటాడు ఆటో అప్పారావు
పువాయ్ పువాయ్ అంటాడు ఆటో అప్పారావు
పిపి నొక్కేత్తాడు స్కూటర్ సుబ్బారావు
చీ పాడు పోరగాళ్లంతా నా ఎనకే పడతారు
ఎందీ టెన్షను యమ్మా టెన్షను 
హే మారుతీలో డ్రైవింగ్ నేరిపిస్తాననీ సైదులు
ఎక్కంగా ఇన్నోవా గిఫ్ట్ ఇత్తాననీ అబ్బులు
దొరికిందే సందంట తెగ టెన్షను పడతారు అందరూ
తింగ తింగ తింగరొళ్ళ టెన్షను
దొంగ దొంగ సచ్చినోళ్ళ టెన్షను
పువాయ్ పువాయ్ అంటాడు ఆటో అప్పారావు

హే హే షేర్ ఆటో ఎక్కాలంటే పాసింజర్ల  టెన్షను
హే హే షేర్ ఆటో ఎక్కాలంటే పాసింజర్ల  టెన్షను
సినిమాకి ఎల్దామంటే సిల్లరగాళ్ళ టెన్షను
పిల్లా పిల్లా దడ పిల్లా ఎందే నీకే టెన్షను
ఎడాపెడా దడబిడ ఏం జరుగుద్దనీ నీ టెన్షను
హే నచ్చిందే పిల్లానీ నలిపేత్తారనీ  టెన్షను
నలుసంత నడుముని గిల్లేత్తారని  టెన్షను
వోణి కొచ్చకే ఓమ్మో మొదలైనదే  టెన్షను
తింగ తింగ తింగరొళ్ళ టెన్షను
దొంగ దొంగ సచ్చినోళ్ళ టెన్షను
మోనికా...
మోనికా...

హే హే ఓ మోస్తారు సరుకున్నోళ్ళు నా సూపులకి ఆనరు
హే హే ఓ మోస్తారు సరుకున్నోళ్ళు నా సూపులకి ఆనరు
సూపర్ స్టార్ రేంజు ఉన్నోడికే పెడతా నేను టెండరు
హే అల్లాటప్పా ఫిగరు ఇచ్చేయందే నీకా పొగరు
చూపిస్తా నాలో పవరు పిండేస్తా నీలో చమరు
హే నీలాంటి ఒక్కడు దొరికేదాకా టెన్షను
నీ పోకిరి చేతికి దొరికాక ఇంకో టెన్షను
నీ దుడుకు దూకుడు ఏం సేత్తదో నని టెన్షను...
దూకు దూకు అరే దూకు దూకు
హే దూకు దూకు దూకుతావని టెన్షను
అరె దుమ్ము దుమ్ము లేపుతవని టెన్షను




దేతడి దేతడి పాట సాహిత్యం

 
చిత్రం: దూకుడు (2011)
సంగీతం: ఎస్.ఎస్.థమన్
సాహిత్యం: భాస్కరభట్ల రవి కుమార్
గానం: దివ్య , రంజిత్

నీ స్టైలే చగస్...
నీ స్మైలే ఖల్లాస్...
నీ నడకే క్లాసు మాసు డాన్సే

ఇటు రాయే ఇటు రాయే నీ మీదే మనసాయే
ఇటు రాయే గొడవ గొడవాయే... హే
హే దడక్ దడక్ అని దేతడి దేతడి
దడక్ దడక్ దిల్ పచ్చడి పచ్చడి చేశావ్  
నడుము తడిమేసావ్
హే బటక్ బటక్ అని గుప్పెడు గుండెని
కొరుక్కోరుక్కుని నువ్ నమిలేసావ్
ఈ ఫ్రెంచ్ ఫిడేల్ జర దేక్ రే ఓ... ఓ... ఓ...
నీ తళుకు బెలుకు ఎహే సూపరే ఓ... ఓ... ఓ...
హే కిక్కు లేని లైఫ్ అంటే ఉప్పు లేని పప్పు చారు
కిస్సు లేని జిందగీని ఒప్పుకోరే కుర్రకారు ఏక్ పప్పీ దే...

ఇటు రాయే ఇటు రాయే నీ మీదే మనసాయే
ఇటు రాయే గొడవ గొడవాయే...హే
హే దడక్ దడక్ అని దేతడి దేతడి
దడక్ దడక్ దిల్ పచ్చడి పచ్చడి చేశావ్  
నడుము తడిమేసావ్

గుండు సూది ఉన్నది గుచ్చుకోవడానికే
గండు చీమ ఉన్నది కుట్టి పోవడానికే
మేరే దిల్ ఉన్నది నీకు ఇవ్వడానికే
ఆది పడి పడి దొర్లెను చూడే
తేనే లాంటి పిల్లాడే వేలు పెట్టీ చూడకే
తిమ్మిరాగనందిలే ఒహు వాహు ఓ...
ఏం జరగనివ్వు  పర్లేదులే ఒహో...
హే నిన్నదాకా లొల్లి పెట్టీ  ఇప్పుడేంటే సుప్పనాతీ
ఆడ పిల్ల బైట పడితే అల్లరల్లరవ్వదేటి
ఓసి నా తల్లో...

ఇటు రాయే ఇటు రాయే నీ మీదే మనసాయే
ఇటు రాయే గొడవ గొడవాయే... హే

పైనే బొట్టు ఉన్నది రేగిపోవడానికే
చీర కట్టు ఉన్నది జారి పోవడానికే
నువ్వు చూడడానికే చేతులెయ్యడానికే 
ఈ కిట కిట పరువం నీకే
ఈడు ఎందుకున్నది గోల చెయ్యడానికే
గోడ దూకడానికే ఓ...ఓ...ఓ...
హే విధియ తధియలిక దేనికే  ఓ...ఓ...ఓ...
హే విల్లు లాంటి ఒళ్ళు నాది భళ్ళుమంటూ విర్చుకో
ఒంపు సొంపులోనే ఉంది పాల ధార పంచదార 
ఏతమేసెయ్ రో...

ఇటు రాయే ఇటు రాయే నీ మీదే మనసాయే
ఇటు రాయే గొడవ గొడవాయే... హే
హే దడక్ దడక్ అని దేతడి దేతడి
దడక్ దడక్ దిల్ పచ్చడి పచ్చడి చేశావ్  
నడుము తడిమేసావ్

నీ స్మైలే కల్లాస్...



అదరదర గొట్టు పాట సాహిత్యం

 
చిత్రం: దూకుడు (2011)
సంగీతం: ఎస్.ఎస్.థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: కార్తీక్, కోటి, రామజోగయ్య శాస్త్రి, శ్రీవర్ధిని, రానైనా రెడ్డి, మేఘా

జే జే జే జే జేజేలంది మా ఇంటి పెళ్లి కళ
దిల్ సే దిల్ ముడి వేసేయ్ మంది వారే వీరై పోయేలా
కలలే కలిపిన అనుబంధంగా 
ఇలలో ఇపుడే సుముహూర్తంగా
ఎదురైయ్యింది చల్లని వేళ కల్యాణ లీలా

అదరదర గొట్టు డోలు బాజాల బీటు
ఊరు ఉయ్యాలుగేట్టు మోత మోగించే ట్రంఫెట్
అట్టాంటిట్టాంటి పెళ్ళిది కాదని జనమే నమ్మేట్టు 
అరే అరే అదరదర గొట్టు ఇదివరకిలాంటి పెళ్లి లేనట్టూ
హే మగపెళ్లివారమంతా వాలిపోయాం విడిదింట
పనిలో పని పళ్ళకిని మోసుకొచ్చేశామంట
మనువాడే శ్రీ మహాలక్ష్మిని తీసుకెళ్తాం మావెంట
ఆలస్యం దేనికింక తాళిబొట్టు కట్టేస్తా
పప్పర పప్ప పారా రారా
పప్పర పప్ప పారా రారా
అత్తింటి కోడలిని వేలు పట్టి వచ్చేస్తా 
పప్పర పప్ప పారా రారా

అదర అదర ఆదరదర గొట్టు డోలు బాజాల బీటు
ఊరు ఉయ్యాలుగేట్టు మోత మోగించే ట్రంఫెట్
అట్టాంటిట్టాంటి పెళ్ళిది కాదని జనమే నమ్మేట్టూ

హే పిల్లేమో ఎరుపు బంగారం కలగలుపు
పిల్లొడే కట్నం ఇచ్చుకోక తప్పదు
హే హే మావాడు మెరుపు పోటీలేని గెలుపు
స్విస్ బ్యాంకే రాసి ఇచ్చుకున్న చాలదు హే
వజ్రం లాంటి పిల్లను ఇస్తాం చాలనుకోండి మీరు
తన అదృష్టంతో కలిసొస్తాయి అన్ని లాంచనాలు
హే చూసేస్తున్నాడే వరుడు లాగ్గమెప్పుడన్నట్టు
ఆ మాటే అడిగిస్తుంది పిల్ల బుగ్గ లోగుట్టు
తాపీగా ఉన్నారండి తత్తర బిత్తర లేనట్టు
ఆలస్యం దేనికింక తాళిబొట్టు కట్టేస్తా

హే భూలోకమంతా వెతికి చూసుకున్నా 
ఇట్టాంటి అమ్మడు మీకు దక్కదు
హే నీ కంటి పాప కోరి చేరుకున్న వీరాది వీరుడు 
మా నిండు చంద్రుడు
హే అన్ని తానై ఉన్నాడు దేవుడులాంటి నాన్న
నే కోరే వరమే లేదంట తన సంతోషం కన్నా
ఆ అలాంటి రామచంద్రుడు  నీలాగే ఉండుంటాడు
చిన్నారి జానకి సీతకు చెయ్యందించి పెళ్లాడు
నీ కన్నతండ్రి కంట్లో వెలిగే ఆనందం చూడు

ఆలస్యం దేనికింక తాళిబొట్టు కట్టేస్తా
పప్పర పప్ప పారా రారా
పప్పర పప్ప పారా రారా
అత్తింటి కోడలిని వేలు పట్టి వచ్చేస్తా
పప్పర పప్ప పారా రారా

అదర ఆదర  ఆదరదరగొట్టు డోలు బాజాల బీటు
ఊరు ఉయ్యాలుగేట్టు మోత మోగించే ట్రంఫెట్
అట్టాంటిట్టాంటి పెళ్ళిది కాదని జనమే నమ్మేట్టూ

Palli Balakrishna Saturday, July 22, 2017

Most Recent

Default