Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Aa Ammayi Gurinchi Meeku Cheppali (2022)
చిత్రం: ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి (2022)
సంగీతం: వివేక్ సాగర్ 
నటీనటులు: సుదీర్ బాబు, కృతి శెట్టి 
దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి 
నిర్మాత: మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి 
విడుదల తేది: 2022Songs List:కొత్త కొత్తగా ఉన్నా పాట సాహిత్యం

 
చిత్రం: ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి (2022)
సంగీతం: వివేక్ సాగర్ 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: చైత్ర అంబడిపూడి, అభయ్ జోద్పుర్కర్

హా, అల్లంత దూరంగ నువ్వు నీ కన్ను
నన్నే చూస్తుంటే ఏం చెయ్యాలో
హా, రవ్వంత గారంగా నాలో నీ నన్ను
మాటాడిస్తుంటే ఏం చెప్పాలో

ఆ, అనగనగా మనవి విను
ముసిముసి ముక్తసరి నవ్వుతో
నిలకడగా అవును అను
తెరలు విడే… పలుకు సిరితో

కొత్త కొత్తగా ఉన్నా కొంచెం బావుందే
పోను పోను ఇంకొంచెం బావుండేలా ఉందే
ఆ, కొత్త కొత్తగా ఉన్నా కొంచెం బావుందే
పోను పోను ఇంకొంచెం బావుండేలా ఉందే

హా, అల్లంత దూరంగ నువ్వు నీ కన్ను
నన్నే చూస్తుంటే… ఏం చెయ్యాలో
హా, రవ్వంత గారంగా… నాలో నీ నన్ను
మాటాడిస్తుంటే… ఏం చెప్పాలో

హో ఆ, తలపు దాకా వచ్చాలే
తగని సిగ్గు చాల్లే
తగిన ఖాళీ పూరిస్తాలే
హా, చనువు కొంచం పెంచాలే
మొదటికన్నా మేలే
కుదిరినంతా కులాసాలే

హా నిను కననీ
నిను కననీ కదలికకు తెలవారదే
హో, నిదురవనీ ప్రతి కలలో
నీ ఊసే తారాడుతోందే

కొత్త కొత్తగా ఉన్నా కొంచెం బావుందే
పోను పోను ఇంకొంచెం బావుండేలా ఉందే
ఆ, కొత్త కొత్తగా ఉన్నా కొంచెం బావుందే
పోను పోను ఇంకొంచెం బావుండేలా ఉందే

సమయమెల్లా సాగిందో గమనమైనా లేదే
తమరి మాయేగా ఇదంతా
ఓ ఓ, పయనమెల్లా పండిందో
మరపురానే రాదే
మధురమాయే సంగతంతా

ఆ ఆ, ఎద గదిలో ఓ ఓ
ఎద గదిలో కిరణమయే తరుణం ఇదే
ఇరువురిలో చలనమిలా
ప్రేమన్న పేరందుకున్నదే


హా, కొత్త కొత్తగా ఉన్నా… కొంచెం బావుందే
ఆ ఆ, పోను పోను ఇంకొంచెం బావుండేలా ఉందే
హో, చెలిమి కల చెరిసగమే
చిటికెన వేలి చివరంచులో
సఖిలదళ విడివడని
ముడిపడవే ప్రియతమ ముడితో
మీరే హీరోలా ఉన్నారు పాట సాహిత్యం

 
చిత్రం: ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి (2022)
సంగీతం: వివేక్ సాగర్ 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: విజయ్ ప్రకాష్

మీరే హీరోలా ఉన్నారు
మరి తెర్రంగేట్రం ఎప్పుడు చేస్తారు
హహ, ఆ పని మనకెందుకు మాష్టారు
మైటీ హీరోలే మన మాటింటారు

ఆ, ఫుల్ టూ సక్సెస్ లో ఉన్నారు
ఓ, అది నా బలహీనత అంటుంటారు
బడ్జెట్ భారీగా ఎక్కిస్తారే మీరు
బదులుగా రెట్టింపు లెక్కిస్తారు వారు

పాన్ ఇండియాకు… వెళుతున్నారా మీరు
ఏ, ఆల్ ఇండియాలో మనకు ఫ్యాన్స్ ఉన్నారు
మనమే ట్రెండు రా, బ్రాండు రా లెజెండురా
బాక్స్ ఆఫీస్ కు మనమే గోల్డెన్ హ్యాండురా

ఏమా జాతకం నంబర్ వన్ను రాకం
సిల్వర్ స్క్రీన్ పై మీదే నవశకం

ఏ, పుట్టుకతో నేనింతే
బద్దలు కొడతానంతే
బొమ్మలు తీశానంతే
దిమ్మలు తిరగాలంతే

నా ఫైరింగ్ వల్లేగా
చల్లంగుంది ఇండస్ట్రీ
మనమే ట్రెండురా
బ్రాండు రా లెజెండురా
హా హ, బాక్స్ ఆఫీస్ కు మనమే
గోల్డెన్ హ్యాండురా

మీకు యాటిట్యూడ్ అంటారే
మాతో బాగానే ఉంటారే
రెండు మీవాళ్ళే రాస్తారే
గాసిప్ గల్లాట చేస్తారే

ప్రతి సినిమాకు కత్తర్లే
అయినా అనుకుందే తీస్తాలే
సోషల్ మెసేజ్ స్క్రిప్ట్ ముట్టుకోరెం
అయ్యో రామ మనమాగొడవెట్టుకోమే

చాలనే మీకు ఓవర్ కాన్ఫిడెన్స్
ఏంటి బ్రదర్ నేనేంటో నాకు తెలుసు
నో కామెంట్స్ 

మనమే ట్రెండు రా
బ్రాండు రా లెజెండురా
బాక్స్ ఆఫీస్ కు మనమే
గోల్డెన్ హండురా

గడియారంతో పరిగెడతా
పాత రికార్డులు పడగొడతా
భల భీభత్సంగా ఆడిస్తా ఆట

ఇక చాల్లే ఇంకెన్నని చెబుతా
తతీమా ఎమున్నా కబురెడుతా
మల్లి ప్రెస్‌మీట్‌లో కనబడతా
టాటా టాటా టాటా

No comments

Most Recent

Default