Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Kanyasulkam (1955)




చిత్రం: కన్యాశుల్కం (1955)
సంగీతం: ఘంటసాల 
నటీనటులు: యన్.టి.రామారావు, సావిత్రి, షావుకారు జానకి 
దర్శకత్వం: పి.పుల్లయ్య
నిర్మాత: డి.ఎల్.నారాయణ 
విడుదల తేది: 26.08.1955



Songs List:



సరసుడా దరి చేరరా పాట సాహిత్యం

 
చిత్రం: కన్యాశుల్కం (1955)
సంగీతం: ఘంటసాల 
సాహిత్యం: వెంపటి సదాశివ బ్రహ్మం 
గానం: పి.సుశీల 

సరసుడ దరిజేరరా
సమయమిదె
మన సరసాల కిదివేళ చలమేలరా

వలచినదానర నే చిన్నదానరా
పిలచిన బిగువేలరా నన్నేలరా

చక్కెర విలుకాని బారి వేసారి
మక్కువతో నిన్నె మనసారకోరి
చేరితి నీచెంత దయగనుమావంత
మురిపించి మరపించరారా
జాగేలరా 





బొమ్మల పెళ్లి పాట సాహిత్యం

 
చిత్రం: కన్యాశుల్కం (1955)
సంగీతం: ఘంటసాల 
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి 
గానం: పద్మప్రియ 

చేదామురారే కళ్యాణము
చిలకా గోరింక పెళ్లి సింగారము
ఎవరే మీ చిన్నారి పెళ్లికూతురు
ఎవరమ్మ  వయ్యారి! పెళ్ళికూతురు

కన్నులలో దాచేనే కన్నెసిగ్గు దొంతరలు
నవ్వులలో పూచేనే! మల్లెపూల మంజరులు
ఇదిగో! మీ చిన్నారి పెళ్ళికూతురు
ఇదిగో ! మీవయ్యారి పెళ్ళికూతురు

సొగసూ! సోయగమూ! చూచిచూచి మెచ్చాము-కోరికోరి వచ్చాము
నగలెన్నొ చీరలెన్నొ నాణెమైన విచ్చేము-సారెలెన్నో తెచ్చేము
ఈడుజోడు వరుడైతే - చూడ అందగాడైతే
అదేమాకు పదివేలు - ఆదే కోటివరహాలు

మనసిచ్చే మగడైతే ఇస్తారా కానుక ?
సరేసరే
మరువాల మురిపాల మగువే మాకానుక!

సరేసరే ! బలేబలే !
మనసూ వయసూ కలిసే
మంచిమనువు కుదిరెనే॥
చేదామురారే! పెళ్లి విందులు
చూదామురారే ! ఆ పసందులు




నాగుల చవితి పాట సాహిత్యం

 
చిత్రం: కన్యాశుల్కం (1955)
సంగీతం: ఘంటసాల 
సాహిత్యం: బసవరాజు అప్పారావు 
గానం: ఎన్.ఎల్.గాన సరస్వతి 

నాగులచవితికి నాగేంద్రనీ
పొట్టనిండా పాలుపోసేము తండ్రి!
నీ పుట్టదరికి పాపలొచ్చేరు
మా పాపలొచ్చేరు
పాపపుణ్యముల వాసనేలేని
బ్రహ్మస్వరూపులౌ పసికూనలోయి
కోపించి బుస్సలు కొట్టబోకోయి
అటుకొండ ఇటుకొండ
ఆ రెంటినడుమ
నాగులకొండలో నాట్యమాడేటి
దివ్యసుందరనాగ దేహీయన్నాము
కనిపెట్టి మమ్మెపుడు కాపాడవోయి




చిటారు కొమ్మను పాట సాహిత్యం

 
చిత్రం: కన్యాశుల్కం (1955)
సంగీతం: ఘంటసాల 
సాహిత్యం: మల్లాది రామకృష్ణశాస్త్రి
గానం: ఘంటసాల

పల్లవి:
చిటారు కొమ్మను చిటారు కొమ్మను
మిఠాయి పొట్లం చేతికందదేం గురుడా
వాటం చూసి వడుపు చేసి
వంచర కొమ్మను నరుడ
హోయ్ చిటారు కొమ్మను

చరణం: 1
పక్కను మెలిగే చక్కని చుక్కకు
చక్కిలిగింత లేదేం గురుడా
కంచు మోతగా కనకం మోగదు
నిదానించరా నరుడా
వాటం చూసి వడుపు చేసి
వంచర కొమ్మను నరుడ
హోయ్ చిటారు కొమ్మను

చరణం: 2
పండంటి పిల్లకు పసుపు కుంకం
నిండుకున్నవేం గురుడా
దేవుడు చేసిన లోపాన్ని
నీవు దిద్దుకురారా నరుడా
కొద్దిగ హద్దు మీరరా నరుడా
చిటారు కొమ్మను మిఠాయి పొట్లం
చేతికందదేం గురుడా
వాటం చూసి వడుపు చేసి
వంచర కొమ్మను నరుడ
హోయ్ చిటారు కొమ్మను

చరణం: 3
విధవలందరికి శుభకార్యాలు
విధిగా చెయమంటావా గురుడ
అవతారం నీదందుకోసమే..ఏ..
వాటం చూసి వడుపు చేసి
వంచర కొమ్మను నరుడ
హోయ్ చిటారు కొమ్మను




ఆనందం అర్ణవమైతే పాట సాహిత్యం

 
చిత్రం: కన్యాశుల్కం (1955)
సంగీతం: ఘంటసాల 
సాహిత్యం: శ్రీ శ్రీ 
గానం: పి.సుశీల 

పల్లవి: 
ఆనందం అర్ణవమైతే అనురాగం అంబరమైతే
అనురాగపు తంచులు చూస్తాం
ఆనందపు లోతులు తీస్తాం.

చరణం: 1
నీ కంకణ నిక్వాణం_లో,
నా జీవన నిర్వాణం_లో
నీ మదిలో డోలలు తూగీ,
నా హృదిలో జ్వాలలు రేగీ
నీ తలపున రేకులు పూస్తే,
నా వలపున బాకులు దూస్తే
మరణానికి ప్రాణం పోస్తాం,
స్వర్గానికి నిచ్చెన వేస్తాం

చరణం: 2
హసనానికి రాణివి నీవై
వ్యసనానికి బానిస నేనై
విషమించిన మదీయ ఖేదం
కుసుమించిన త్వదీయ మోదం

విషవాయువులై ప్రసరిస్తే,
విరితేనియలై ప్రవహిస్తే
ప్రపంచమును పరిహాసిస్తాం,
భవిష్యమును పరిపాలిస్తాం

ఆనందం అర్ణవమైతే అనురాగం అంబరమైతే
ప్రపంచమును పరిహాసిస్తాం, భవిష్యమును పరిపాలిస్తాం




పూర్ణమ్మ కథ పాట సాహిత్యం

 
చిత్రం: కన్యాశుల్కం (1955)
సంగీతం: ఘంటసాల 
సాహిత్యం: గురజాడ అప్పారావు 
గానం: ఘంటసాల

పుత్తడిబొమ్మా - పూర్ణమ్మ
మేలిమి బంగరు మెలతల్లారా !

కలవల కన్నుల కన్నెల్లారా!
తల్లులగన్నా పిల్లల్లారా !
విన్నారమ్మా యీ కథను !
కొండలనడుమను కోనొకటుంది
కోనకినడుమా కొలనొకటుంది

కొలనిగట్టున కోవెలలోపల
వెలసెను బంగరు దుర్గమ్మ

పూజారింటను పుట్టెను చిన్నది
పుత్తడిబొమ్మా పూర్ణమ్మ
అన్నల తమ్ముల కనుగై దుర్గకు
పూజకు పువ్వులు కోసేది
ఏయేవేళల పూసే పువ్వుల
ఆయావేళల అందించి
బంగరు దుర్గను భక్తితో కొలిచెను
పుత్తడిబొమ్మా పూర్ణమ్మ

వచనం : అందాల చందమామలా గుణాలకి రత్నాల రాశిలా, నలుగురి కన్నుల్లో కనుపాపై - నట్టింట దీపమై వెలుగుతున్న పూర్ణమ్మను - అప్పుడేంచేసారయ్యా అంటే

కాసుకులోనై తల్లి దండ్రి
నెనరూ న్యాయం విడనాడి
పుత్తడిబొమ్మను పూర్ణమ్మను వొక
ముదుసలి మొగుడుకు ముడివేస్ట్రీ
||పుత్తడిబొమ్మ||

ముద్దునగవులూ మురిపెంబు మరి
పెనిమిటిగాంచిన నిమిషమున

బాసెను కన్నియముఖ కమలమ్మును
కన్నుల గ్రమ్మెను కన్నీరు.
ఆటలపాటలతోటి కన్నియలు
మొగుడు తాతయని కేలించ
ఆటలపాటల కలియక పూర్ణమ
దుర్గనుచేరి దుఃఖించె !

వచనం : తల్లిదండ్రులు గట్టిన గుదితాడు విప్పడానికి వశమా ? తప్పడానికి వశమా ? గొల్లుగొల్లున ఏడ్చింది?
గుండె రాయిజేసుకొని ఓర్చింది.
పుత్తడిబొమ్మా - పూర్ణమ్మ

కొన్నాళ్లకు పతి కొనిపోవచ్చెను
పుత్తడి బొమ్మను పూర్ణమను
చీరలు సొమ్ములు చాలగ దెచ్చెను.
పుత్తడిబొమ్మను పూర్ణమను

అపుడేం చేసిందయ్యా అంటే

పెద్దలకప్పుడు మొక్కెను పూర్ణమ్మ 
తల్లి దండ్రి దీవించి
దీవనవింటూ పక్కున నవ్వెను
పుత్తడిబొమ్మా పూర్ణమ్మ

10 చిన్నలనందరి కౌగిట జేర్చుకు
కంటను బెట్టెను కన్నీరు
అన్నల దముల నప్పుడు పలికెను
పుత్తడిబొమ్మా పూర్ణమ్మ



11 అన్నల్లారా! తమ్ముల్లారా
అమ్మను అయ్యను కానండి
బంగరుదుర్గను భక్తితో కొల
వండమ్మలకమ్మా దుర్గమ్మ

12 నలుగురుకూచుని నవ్వేవేళల
నాపేరొకతరి తలవండి
మీ మీ కన్నబిడ్డల నొకతెకు
ప్రేమను నా పేరివ్వండి

13 బలబల కన్నుల కన్నీరొలికెను
పుత్తడిబొమ్మకు పూర్ణమకు
కన్నులు తుడుచుకు కలకలనవ్వెను
పుత్తడిబొమ్మ! పూర్ణమ్మ

14 వగచిరి వదినలు వగచిరి తమ్ములు
తల్లియుకంటను తడిబెటెన్
కాసుకులోనై అల్లుని తలుచుకు
ఆనందించెను అయ్యొకడె!

15 ఎప్పటియట్టుల సాయంత్రమున
ఏరిన పూవులు సరిగూర్చి
సంతోషంబున దురను కొలువను
ఒంటిగబోయెను పూర్ణమ

16 ఆవులు మొదవులు మందలుజేరెను
పిట్టలు చెట్లను గుమిగూడెన్
మింటలు చుక్కలు మెరయుచు డమెను
పూర్ణమ యింటికి రాదాయె!

17 కన్నుల కాంతులు కలవల జేరెను
మేలిమిజేరెను మేనిపసల్
హంసలజేరెను నడకల బెడగులు
దుర్గనుజేరెను పూర్ణమా
పుత్తడిబొమా ! పూర్ణమ్మ






ఇల్లు ఇల్లానీవు పాట సాహిత్యం

 
చిత్రం: కన్యాశుల్కం (1955)
సంగీతం: ఘంటసాల 
సాహిత్యం: గురజాడ అప్పారావు 
గానం: ఎన్.ఎల్.గాన సరస్వతి 

ఇల్లు ఇల్లనియేవు - ఇల్లు నాదనియేవు
నీ యిల్లు యెక్కడే - చిలుకా
ఊరికి వుత్తరాన సామాధిపురములో
కట్టెయిల్లన్నదే చిలుకా
ఎన్నాళ్లు బ్రతికినా ఏమిసామ్రాజ్యమే కొన్నాళ్ళకోరామచిలుకా

మూణ్ణాళ్ల బ్రతుకునకు, మురిసేవు త్రుల్లేవు
ముందుగతి కానవే చిలుకా
కఱ్ఱలే చుట్టాలు కట్టెలే బంధువులు
కన్నతల్లెవ్వరే చిలుకా 

మోసేరు నలుగురు! వెంబడిని పదిమంది (నిన్ను)
వెంటనెషరూరారు చిలుకా
కాలిపోయేదాక కావలుందురుగాని
కడకు తొలగొత్తురె చిలుకా 
వెంటనెవరూరారు చిలుకా
రామచిలుక రామచిలుక






కీచక వధ పాట సాహిత్యం

 
చిత్రం: కన్యాశుల్కం (1955)
సంగీతం: ఘంటసాల 
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: మాధవపెద్ది సత్యం,  ఎన్.ఎల్.గాన సరస్వతి 

వచనం: 
ఈ ప్రకారంబుగా సుధేష్ఠాదేవి కొలువులోనున్న ద్రౌపదిని
గాంచి - కీచకుడు మోహింప - తమ్ముని మనస్సును మార్పజాలక మద్యం తెచ్పు నెపంబున, సుధేష్ణ ఆమెను కీచకుని మందిరంబున కనుప ద్రౌపది వెడలుచున్న తెరంగెట్టిదనిన --

సైరంధ్రి వెడలె సైరంధీ సభకూ
మదమరాణిగమన - వెడలే
కాలియందియలు ఘలుఘలుఘల్లన
కనిన చూపరులగుండెలు ఝల్లన
సైరంధ్రి-మద్యము తెమ్మని మహారాణి నన్నంపె
మన్నించి వేవేగ పంపించుమన్నా రాణీ
తాపము తొలగించుమన్నా -
కీచక - తరుణికొ నినుగని తాపము గొనియుంటి
కరుణించి పగదీర్చవే - బయ్యారిభామా !
కౌగిటనను జేర్చవే

సైరంధ్రి.మగనాలిగోరా - మరణమె నీకగురా .
కీచక - ఏమైనాగానీ భామరొ నిను వీడనే
సైరంధ్రి విడరా
శ్రీచక వీడనే

No comments

Most Recent

Default