చిత్రం: రామారావు (On Duty) (2022) సంగీతం: మహతి స్వర సాగర్ నటీనటులు: రవితేజా, రాజిష విజయన్ , దివ్యన్ష కౌషిక్ దర్శకత్వం: శరత్ మండవ నిర్మాత: సుధాకర్ చెరుకూరి విడుదల తేది: 17.06.2022
Songs List:
బుల్ బుల్ తరంగ్ పాట సాహిత్యం
చిత్రం: రామారావు (On Duty) (2022) సంగీతం: మహతి స్వర సాగర్ సాహిత్యం: రాకేందు మౌళి గానం: సిద్ శ్రీరాం ఓ ఓ ఓ ఓహో హో ఓ ఓ ఓ తూలే గిరగిరమని బుర్రే ఇట్టా తేలిందే నెలవంతా అడుగుల వెంటా ఓ ఓ ఓ ఓహో హో ఓ ఓ ఓ బుల్ బుల్ తరంగ్ బుల్ బుల్ తరంగ్ లోకం ఊగే గుండె లబ్ డబ్బు మాని నీపేరై మోగే ఏదేదో భాషల్లో… నవ్వే వాగే పిల్లా అల్లాడి నీవైపు మనసే లాగే నింగే రంగుల్ని వానై చల్లే ఉబ్బి తబ్బిబ్బై మబ్బే గాలే గంజాయి వాసనలే వీచే మత్తే చిత్తయ్యే ముద్దిచ్చినావే తూలే గిరగిరమని బుర్రే ఇట్టా తేలిందే నెలవంతా అడుగుల వెంటా కాలే పెదవులపై ముద్దుల చిట్టా వాలిందే ఎద గూటిన పాలపిట్ట అద్దానికి ఈ రాయికి ఓ వింత ప్రేమ మొదలయ్యే అద్దం అలా రాయినే ఇలా తాకంగా రాయి పగిలెనే పాతాళమా ఇది ఆకాశమా నీ ప్రేమలో పడుతూనే ఎగిరా నా బుజ్జి బంగారం నాప్రేమ నీతోనే బ్రతుకంతా చెరి సగమై బ్రతికేద్దామా తూలే గిరగిరమని బుర్రే ఇట్టా తేలిందే నెలవంతా అడుగుల వెంటా కాలే పెదవులపై ముద్దుల చిట్టా వాలిందే ఎద గూటిన పాలపిట్ట బుల్ బుల్ తరంగ్ బుల్ బుల్ తరంగ్ లోకం ఊగే గుండె లబ్ డబ్బు మాని నీపేరై మోగే ఏదేదో భాషల్లో… నవ్వే వాగే పిల్లా అల్లాడి నీవైపు మనసే లాగే
సొట్టల బుగ్గల్లో పాట సాహిత్యం
చిత్రం: రామారావు (On Duty) (2022) సంగీతం: మహతి స్వర సాగర్ సాహిత్యం: కళ్యాణ్ చక్రవర్తి గానం: హరిప్రియ, నకుల్ అభయంకర్ నేనేనా నేనేనా నిన్న మొన్న ఉన్నది మరి నేనేనా నిన్నేనా నిన్నేనా ఇన్నాళ్ళుగా చూస్తున్నది నిన్నేనా ఆ, మీసాల ఆసామివేరా మీటితే నవ్వుల నగార పొంగని బంగారం నా కొంగున ముడివేరా మాయగా ఉన్నాదిలేరా మాయనీ నీ ప్రేమ పహారా నీతోటి ఏకాంతాలే చాలని నిడివేరా సొట్టల బుగ్గల్లో రాసుకుపోయావే నన్నే నీ పేరా రాసానుగా రాసానుగా నిన్ను నన్ను చేర ఈ సరదా ఈ సరదా ఎపుడో మన పేరా గుమ్మోడిని చెబుతారా నిన్నిదిగా వలచారా నను నీలో మనసారా కలిపేశారా చిగురించా నలుసారా నీ పోలికే నను చేరా అది నీలో చూస్తుంటే బాగుందిరా చాటుగా ఇన్నాళ్లనుంచి దాచినా ఈ మాటలన్నీ చెప్పనీ నీకే నన్నే మోమాటాన్నే దాటి ఈ వేళ సొట్టల బుగ్గల్లో రాసుకుపోతారా నన్నే నీ పేరా రాసానుగా రాసానుగా నిన్ను నన్ను చేర ఈ సరదా ఈ సరదా ఎపుడో మన పేరా గురువాత అనకుండా దరువేది పడకుండా కురులై నే కురిశారా నీ ఎదపైన ఎదరాలి పొడులంతా ఎదురయ్యి పరిచార దరి చేరి దరిమిళనే నీకందించారా ఎవరు రాలేనంత దగ్గరై ఉంటె నీ చెంత చాలుగా చెంపకు చారెడు కన్నుల కాటుక నీకే అంటేలా హ చిక్కని చీకట్లో చిక్కని వయ్యారం చిక్కించుకోరా రాసానుగా రాసానుగా నిన్ను నన్ను చేర ఈ సరదా ఈ సరదా ఎపుడో మన పేరా
No comments
Post a Comment