Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

10th Class Diaries (2022)
చిత్రం: 10 th క్లాస్ డైరీస్ (2022)
సంగీతం: సురేష్ బొబ్బిలి 
నటీనటులు: శ్రీకాంత్, అవిక గోర్
దర్శకత్వం: గరుడవేగ అంజి 
నిర్మాత: పి.అచ్యుత్ రామారావు, రవితేజా మన్యం 
విడుదల తేది: 2022Songs List:సిలకా సిలకా పాట సాహిత్యం

 
చిత్రం: 10 th క్లాస్ డైరీస్ (2022)
సంగీతం: సురేష్ బొబ్బిలి 
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: రేవంత్ 

సిలకా సిలకా ఎగిరే ఎగిరే పాట సాహిత్యం

 
చిత్రం: 10 th క్లాస్ డైరీస్ (2022)
సంగీతం: సురేష్ బొబ్బిలి 
సాహిత్యం: సురేష్ గంగుల 
గానం: చిన్మయి

హో, ఎగిరే ఎగిరే నా పాదాలు పైకెగిరే
దిగవే దిగవే… దిగమన్న ఆకాశమే
ఎగిరే ఎగిరే… లేరెవరంటూ మనకెదురే
ఎదురయ్యనులే సరికొత్త ఆనందమే

పదవే పదవే మనసా
పంజరమొదిలి వయస
పచ్చని కలలే తెలుసా
పల్లకీ తెచ్చెనే

వినవే వినవే సొగస
స్వేచ్ఛగా అడుగే వేసా
సంకెళ్లన్నీ తెంచి
దిక్కులే దాటవే

పరదా దాటేసిన
సరద చూపించన
వరదై ఈ వేగాన
ఓ రాగాన నేనే సాగనా

ఎన్నో వర్ణాల వానవిల్లే
నన్నే అల్లిందే స్నేహమల్లే
వచ్చి వాలిందే కళ్లముందే ఇవ్వాలే

కొమ్మారెమ్మల్లో కోయిలల్లే
కొత్త రాగాలె పొంగి పొర్లే
ఇంత ఆనందం లేదు ముందే నీవల్లే

గదిలో ఒదిగున్న నా ఊసులే
వదిలా సీతకోకచిలకై
మదిలో అనిగున్న నా ఆశలే
అలలై ఉవ్వెత్తునెగిసాయిలే

అదుపు మరిచా అడుగే విడిచా
పరుగె తీసా సెలయేరులా
కనులే తెరిచా కలలే కలిసా
మరల మనిషై నేడు పుట్టానిలా

ఒక్కో క్షణాన్నే ఒడిసిపడదాం
ఒక్కో రకంగా ఎగసిపడదాం
ఇంకో లోకంలో అడుగుపెడదాం ఇవ్వాలే

గతమే గుర్తంటు లేనంతగా
గడిపా ఒక్కో క్షణమే వరమై
ఇకపై ప్రతిరోజు నాదంటుగా
మనసే విరిసింది వాసంతమై

వీచేగాలై తోచే దిశగా
అడుగే కదిపా నలువైపులా
అడిగే వారే అసలే లేరుగా
కనుకే చినుకై చెలరేగిపోయానిలా

ప్రాయం అలల్లా పొంగిపోయే
ప్రాణం గాలుల్లో తేలిపోయే
భారం కనుల్లో తీరిపోయే ఈ వేళే
పియా పియా పాట సాహిత్యం

 
చిత్రం: 10 th క్లాస్ డైరీస్ (2022)
సంగీతం: సురేష్ బొబ్బిలి 
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: యశస్వి కొండేపూడి

పియా పియా పియ్యా
పియా పియా పియ్యా
పతంగిలా మనసేమో
హొయ్య హొయ్య హొయ్యా
హొయ్య హొయ్య హొయ్యా
తుళ్లి తుళ్లి ఎగిరిందమ్మో

నిను చూడని నా కనులకు
రంగులు కనపడవే
నీ నవ్వులే నా చూపులో ఓ కలలే

నిన్ను కలవని ఏ రోజున
సూర్యుడు రాడసలే
నీ నీడనే నను నడిపే వెలుగులే

పియా పియా పియ్యా
పియా పియా పియ్యా
పతంగిలా మనసేమో

నీ జడలకు నా గుండె
జడగంటే అయ్యిందే
నే ఊహల్నే మోసే
నిను తాకినా నా చెయ్యే
గుడిగంటను తలచిందే
నువ్వే నా దేవే

నువ్వు సురుకు సురుకుమని మండుటెండలా
అట్ట చిర్రుబుర్రులాడిన ముద్దుగుంటదే
ఒక్క మెరుపు మెరుపుతీగ సాగినట్టుగా
ఇంత సిత్రంగా ఎట్ట ఉంటవే

ఎహే పిల్లోడి నిద్దరంతా తెల్లవారుతుండగా
చప్పుడన్నా చెయ్యకుండా రెప్పల్లో చేరగ
కలయో నిజమో తెలియదులే చెలియా

పియా పియా పియ్యా
పియా పియా పియ్యా
పతంగిలా మనసేమో
హొయ్య హొయ్య హొయ్యా
హొయ్య హొయ్య హొయ్యా
తుళ్లి తుళ్లి ఎగిరిందమ్మో

నీతోటి సావాసం నాకెంతో సంతోషం
నా పుట్టుకకే అర్ధం
ఓ అల్లరి ఆరాటం కాస్తంత మోమాటం
ఒకటే వింతే

నేను పరుగు పరుగు తీసి పిల్లగాలిలా
నిన్ను పట్టుకొని ఆటలాడ బుద్ధి పుట్టేనే
నువ్వు ఉరుకు ఉరుకుతుంటే కొండవాగులా
గట్టు దాటేసి తట్టుకోలేనే

నువ్వు ఎప్పుడు ఎదురుంటే పూటకొక్క పండగే
ఊపిరంత మూటగట్టి కానుకిచ్చుకుంటనే
దూరమైతే నువ్వు… బతకనులే చెలియా

పియా పియా పియ్యా
పియా పియా పియ్యా
పతంగిలా మనసేమో
హొయ్య హొయ్య హొయ్యా
హొయ్య హొయ్య హొయ్యా
తుళ్లి తుళ్లి ఎగిరిందమ్మో
కుర్రవాడ కుర్రవాడ పాట సాహిత్యం

 
చిత్రం: 10 th క్లాస్ డైరీస్ (2022)
సంగీతం: సురేష్ బొబ్బిలి 
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: నూతన్ మోహన్ 

కన్నుల్లోనా దాచా నిన్ను
రోజూ ఎదుటనే చూడగా
శ్వాసల్లోనా మోసా నిన్ను
నువ్వే నాతోడై రాగా

వింటున్నా నిన్నటి
గురుతులన్ని తలచుకుంటూ
నీతో ప్రతి నిమిషం ఉంటూ
తిరిగేస్తున్నా నీ చేయి నేను పట్టుకుంటు
నీ కలలెన్నో కంటూ

కుర్రవాడ కుర్రవాడ నువ్వే అడుగుజాడ
గుండె గోడ మీద ఉన్న బొమ్మ నీదిరా
కుర్రవాడ కుర్రవాడ నువ్వే వెలుగు నీడ
మనసునిండా పూలు పూసే కొమ్మ నువ్వురా.

ఓ, మబ్బులో సినుకే, ఏ ఏఏ
మన్నులోన మొలకలేసెలే
దూరమై ఉన్న నింగి నేల ఏకమయ్యెలే.

చిన్నారి చల్లగాలి ఉండుండి మీద వాలి
నీ వెచ్చనైన ఊపిరూదే ఇప్పుడే
సన్నంగ మంచు రాలి నా కురులపైన తేలి
నీలాగ అల్లరేదో చేసే గుప్పెడే

నువ్ ఎప్పుడొచ్చినా తెలియదు
చప్పుడైనా చేయకుండా
రెప్పలు మూసినావులే
ఓ కొత్త లోకమే మళ్ళీ
ప్రేమలోన చూపుతుంటే
చీకటైనా నాకు పండువెన్నెలే

కుర్రవాడ కుర్రవాడ… నువ్వే అడుగుజాడ
గుండె గోడ మీద ఉన్న బొమ్మ నీదిరా
కుర్రవాడ కుర్రవాడ… నువ్వే వెలుగు నీడ
మనసునిండా పూలు పూసే కొమ్మ నువ్వురా

చీకటే కాదే… వేకువే వస్తుందిలే
గిర్రున తిరిగే భూమి నీదే
గెలుపు ఉందిలే.

నీ వేళ్ళు తాకినట్టి ఆ పుస్తకాలు తట్టి
ఆకాశమందుకోను రెక్కలొచ్చెనే
ఆశల్ని మూటకట్టి… పక్కన్నే కూర్చోబెట్టి
నువ్వన్న మాటలన్నీ బాటలయ్యెనే

నువు చెంత లేవనే సంగతి
ఇంత కూడా గురుతు రాదు
నా ఊహలన్ని నీవిలే

ఒక్కసారి నే చదివితే
మరచిపోను పాఠమైన
ప్రాణమెట్లా నేను మరువగలనులే

కుర్రావాడ కుర్రవాడ… నువ్వే అడుగుజాడ
గుండె గోడ మీద ఉన్న బొమ్మ నీదిరా
కుర్రావాడ కుర్రవాడ… నువ్వే వెలుగు నీడ
మనసునిండా పూలు పూసే కొమ్మ నువ్వురా
ఎన్నెన్నో అందాల పాట సాహిత్యం

 
చిత్రం: 10 th క్లాస్ డైరీస్ (2022)
సంగీతం: సురేష్ బొబ్బిలి 
సాహిత్యం: చైతన్య ప్రసాద్ 
గానం: మంగ్లీ 

ఎన్నెన్నో అందాల బంగారు చిలుక
నీ మోము చిన్నబోయెనా
ఆ ముద్దు ఈ ముద్దు సరిహద్దు చెరిగి
నీ గుండె బద్దలాయెనా

నీలోని ఆశలే… మోసాన్ని చేసెలే
నువు కన్న కలలే… కడతేరి ముడిసెలే
స్నేహాల బాసలే… ద్రోహాలు చేసెలే
చిరునవ్వులన్నీ చితులాయే

ఎన్నెన్నో అందాల బంగారు చిలుక
నీ మోము చిన్నబోయెనా

ఓ ఓ, ఏ దారి లేదుగా… ఎదురాయె ఓ దగా
వ్యధలే మూగగా… ఎద మూగదాయెగా
ఇన్నాళ్ళ వేదన… ఈ మౌన రోదన
అర్ధాలే లేని వ్యర్ధంగా మారెగా

చెలివో శిలవో… పోల్చే వీలు లేదా
కలవో కధవో… నీవనుకోమా
అలలై ముసిరే… అలనాటి జ్ఞాపకాలే
కలకే శిలువే… వేసె సుమా

ఎన్నెన్నో అందాల బంగారు చిలుక
నీ తోడు వీడిపోయెనా
ప్రేమించి ప్రేమించి ప్రాణాలు అలసి
నీ గుండె బద్దలాయెనా

No comments

Most Recent

Default