Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Inti Gowravam (1970)




చిత్రం: ఇంటి గౌరవం (1970)
సంగీతం: ఎస్. పి. కోదండపాణి 
నటీనటులు: శోభన్ బాబు, చంద్రమోహన్, జానకి, జయకుమారి, విజయ భాను
దర్శకత్వం: బాపు
నిర్మాత: పి. మల్లికార్జున రావు
విడుదల తేది: 14.08.1970



Songs List:



నారుపోసి ఊరకుంటే పాట సాహిత్యం

 
చిత్రం: ఇంటి గౌరవం (1970)
సంగీతం: ఎస్. పి. కోదండపాణి
సాహిత్యం: కొసరాజు
గానం: సుశీల - ఘంటసాల

బుద్ధి కలిగి వుండాలమ్మా
శ్రద్ధగా చదవాలమ్మా
పెద్దలు బాటను నడచీ
వృద్ధికి రావాలమ్మా
నారుపోసి ఊరకుంటే
తీరిపోదు. బాధ్యత
నీరుపోసి పెంచడమే
నిజమగు మమతా

తుమ్మెదా పూవూ
విందు చేసుకొను వేళా
పిందె ఒకటి పుడుతుందని
అనుకున్నా లేకున్నా
తొమ్మిది మాసాలు మోసి
కన్నామే చిన్నారి
అమ్మ రుణం నాన్న రుణం
తీర్చవేమిటంటారు
పెద్దల కెపుడు పిలలు రుణపడి లేరూ
కన్నందుకు ఏ కాస్తో  వారే రుణముంటారు 

తనకు మించి ఎవ్వర నే ధన
గర్వము పనికి రాదు
వినయమ్మును చూపకుండ విర్రవీగరాదు
మంచితనము లేకుంటే
కొంచమైన విలువ లేదు 
తప్పటడుగు వేయు చిన్న పాపాలకు
తప్పుటడుగు పడకుండా
నడవడి సరిదిదాలీ
అదుపున పెరిగిన బిడలు
అభివృద్ధికి వస్తారు
హద్దు దాటి పోనిస్తే 

అథోగతికి పోతారు
ఆ పాపం - ఆ లోపం
అంతా తలిదండ్రులదే





ఓ నో డార్లింగ్ పాట సాహిత్యం

 
చిత్రం: ఇంటి గౌరవం (1970)
సంగీతం: ఎస్. పి. కోదండపాణి
సాహిత్యం:  శ్రీ దాశరధి
గానం: ఎల్. ఆర్. ఈశ్వరి

ఓ నో డార్లింగ్ 
నో ప్లీజ్ డార్లింగ్ 
వద్దురా....
అందానికీ - చందానికి
పరదా వుంటేనే సరదారా

అందీ అందని పెదవులలో
చిందీ చిందని మధువుందీ
కలిసి కలియని మనసులలో
తెలిసీ తెలియని వలపుందీ
ఆ మధువులూ - ఈ వలపులూ
అందించు సమయాలు ఇవి కావులే

దాచీ దాచని వొంపులలో
తోచీ తోచని సొగసుందీ
తగిలీ తగలని తనువులలో
రగిలీ రగలని కై పుంది
రగిలించకు కోర్కె రగిలించకు
పది మందిలో నన్ను కవ్వించకు



హవ్వ హవ్వ సిరి సిరి మువ్ పాట సాహిత్యం

 
చిత్రం: ఇంటి గౌరవం (1970)
సంగీతం: ఎస్. పి. కోదండపాణి
సాహిత్యం:  ఆరుద్ర
గానం: సుశీల 

హవ్వ హవ్వ సిరి సిరి మువ్వ నువ్వా నువ్వా
గువ్వలాంటి పిల్ల మీద లవ్వా ల వ్వా

మోటు సరసము ముదిరిపోయిందా
నీ నీటు నీటు తలకాసా పండిపోయిందా
లేటు వయసులో ఘాటు వలపులా 
నీ వాటమైన నడుమయ్యో వాలిపోయిందా
నీ నాటకాల బూటకాల ఆట నీకే చేటు తెచ్చిందా 
ఆడపిల్లను అలుసు చేయకు – నువ్వు
ఆవలిస్తే పేగులెన్నో లెక్క పెడుతుందోయ్

చిలిపి చేష్టలు వలపు అల్లురి
మనసు మనసు కలిసినపుడు మధుర మౌతుందోయ్
ఈ వేషా లెందుకు మోసాలెందుకు వేళాకోళం
మనకూ తెలుసునోయ్
దోర మనసును  దోచబోయేనా
దొంగను పట్టె దోరగారు దొంగ వైనావా
కమ్మ కమ్మగా ఖైదు చేయనా
కంటి చూపు సంకెలేసి జంటకటనా
అందమైన డెందమందు బందీచేసి విందు చేయనా 




చింత పువ్వు ఎరుపు పాట సాహిత్యం

 
చిత్రం: ఇంటి గౌరవం (1970)
సంగీతం: ఎస్. పి. కోదండపాణి
సాహిత్యం:  ఆరుద్ర
గానం: సుశీల , బాల సుబ్రహ్మణ్యం

చింత పువ్వు ఎరుపు
చిలక ముక్కు ఎరుపు
చేయి చేయి కలుపు
లేత వలపు తెలుపు
మల్లె మొగ్గ తెలుపు
మంచి మనసు తెలుపు
చేయి చేయి కలుపు
నిండువలపు నిలుపు
అబ్బ వూరించు పెదవులు ఎరుపు
అవి నాలోన ఆశలు రేపు
ఆగాలి పెళ్ళయిన వరకు
ఆ పెన తమదే గెలుపు
వలచే వేళ తొలగే వేల
ఈ ఎడమోము పెడమోము రుచి చూడు పులుపు 
అబ్బ నీ చేయి చిదిమిన చోట
అయ్యో నా బుగ్గ కందేను చూడు

నీ నవ్వు వెలిగిన పూట
నా మేను పొంగేను చూడు
నీలో నాలో ఒకటే ఆశ
అవి పండేను మురిపాలు నిండేను రేపు

No comments

Most Recent

Default