Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Bangaru Sankellu (1968)
చిత్రం: బంగారు సంకెళ్లు (1968)
సంగీతం: ఎం. పూర్ణచంద్రరావు
నటీనటులు: హరనాథ్, జమున, జి. వరలక్ష్మి
దర్శకత్వం: గుత్తా రామినీడు
నిర్మాత: వి. సత్యన్నారాయణ
విడుదల తేది: 01.11.1968Songs List:అందం ఉరికింది పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు సంకెళ్లు (1968)
సంగీతం: ఎం. పూర్ణచంద్రరావు
సాహిత్యం: ఆత్రేయ
గానం: ఘంటసాల, పి.సుశీల 

అందం ఉరికిందీ 
వయసుతో పందెం వేసింది.
మనసులో బందీ అయింది
ఇదేమి బంధం అంటుంది 
అందాలొలుకు చంద్రుని అందుకోవాలనుకొని 
ఎగసే అలలు తెలిపే దేమని ?
రోహిణి : ఏమని?
రవి : జగమంతా ప్రేమ బంధం
సొగసంతా నీది నీదే రారమ్మని !
రోహిణి : విరిసే నిండు జాబిలి కడలి పూచిన పూవులే
ఎగసే అలలబాల అదే కడుపున సంటలే
అది అన్నా చెల్లి బంధం
హృదయాల జన్మ జన్మల అనుబంధం .....
రవి : ఎదిగే మావి కొమ్మల కౌగలించాలనుకొని
ఒదిగే మాధవీలత వలపు పిలుపే యేమని?
రోహిణి : ఏమని?
రవి : తనలోనే కరిగి పొమ్మని
తనువంతా నీదినీదే రా రమ్మని !
రోహిణి : ఎదిగే గున్న మావిని పుడమితల్లే కన్నది
ఒదిగే మాధవీలత తోడబుట్టిన చిన్నది
అది అన్నా చెల్లి బంధం
హృదయాల జన్మ జన్మల అనుబంధం ..
ఆడితప్పని వాడని (పద్యాలు) పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు సంకెళ్లు (1968)
సంగీతం: ఎం. పూర్ణచంద్రరావు
సాహిత్యం: పింగళి నాగేంద్రరావు
గానం: కొండల్రావు, సుమిత్ర, అప్పారావు 

హరి:
ఆడితప్పని వాడని యశముగాంచ
అఖిల రాజ్యమ్ము విడనాడి - ఆలి నమ్మి
కడకు నన్నమ్ముకొన వీధి బడితి నేడు
భానువంశ హరిశ్చంద్ర ప్రభుడ నేను -
నన్ను కొనరండి ! రండి కొనండి! రండి 

నక్షత్ర : 
కొండంత యేనుగు కుంభస్థలము మీద
తాడియంత మనిషి తాను నిలిచి
రత్నమొకటి నింగి రయ్యని విసిరిన
ఎంత దవ్వుపోవు, అంత ఎత్తు ధనము
కుప్పపోసి వీని కొనగవలయు .

వీర : 
తొలగండె హె బాబు .. తొలగండెహె!
సిన్నోల్లో పెద్దోల్లో - తొలగండె హె !
మందు మీదున్నాను మత్తెక్కి వున్నాను మక్కిలిరగదన్నేను 
ఏపాటి ఓళ్లైనా ఏనాటి ఓళ్లైనా
ఎప్పటికో అప్పటికి చేరేటి చోటికి
ఆ కాటికి - వల్ల కాటికి కాపరిని - యీరబాహువుని...
ఎవరికి పుట్టిన పాప పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు సంకెళ్లు (1968)
సంగీతం: ఎం. పూర్ణచంద్రరావు
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి
గానం: ఘంటసాల 

ఎవరికి పుట్టిన పాప చివరికి ఎవరికి దక్కిన పాపా యీ పాప
శాపానికి ప్రతిశాపమా. పుణ్యానికి మణి దీపమా
నెత్తుట తడిసిన యీ చేతులతో
నీకు పాలు పట్టేనా? పాపా ! నేను పాలు పట్టేనా ?
నిప్పులు చెరిగిన యీ గొంతుకతో
నీకు జోల పాడేనా, పాపా !  నేను జోల పాడేనా ?

లాలీ జోగో లాలీ 

ఎన్ని గండములు ఎదురౌతున్నా
నిన్ను వదలు కోగలనా పాపా !
నిన్ను మరువ గలనా
కరచిన పాము కోరలు తీయక
కన్ను మూయగలనా పాపా !
కన్ను మూయగలనా |

లాలీ జో లాలీ
చతురాశాంత పరీత (పద్యం) పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు సంకెళ్లు (1968)
సంగీతం: ఎం. పూర్ణచంద్రరావు
సాహిత్యం: పింగళి నాగేంద్రరావు
గానం: కొండల్రావు

చతురాశాంత పరీత భూరి వసుధన్ శాసించు చిహ్నంబుగా
క్షితి రాజిల్లేడు రాజదండము బదుల్ చేతనే రహించెన్ గదా,
చితిలో కాలేడు కాష్టమంచు నకటా ! చింతించకన్ సాహసో
ద్ధతి, సత్కీర్తి గణించి, మించి, ఘన సత్యశ్రీని కాపాడుమా 
చిన్నవాణ్ని చూడగనే పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు సంకెళ్లు (1968)
సంగీతం: ఎం. పూర్ణచంద్రరావు
సాహిత్యం: పింగళి నాగేంద్రరావు
గానం: ఎల్.ఆర్. ఈశ్వరి, పి.సుశీల

చిన్నవాణ్ని చూడగనే ఏలనే మది ఊగెనే 
రాగాలు సాగెనే మొహాలు మూగెనే
అవేనే శృంగార శృంఖలాలు బంగారు సంకెలలు 

నూనూగు మీసమూ జానైన వేసమూ
వానిగని, వాని విని మనసు జారి పోయెనే 
దినుసె మారి పోయెనే ఏమేమో ఆయెనే
దీపముగని మిణుగురులు రూపముగని కన్నియలు 
ఒళ్లు మరచి పోయారే ఒళ్ళోవాలి సోలేరే 
అది ప్రేమే అంటావా ? కాదే, అది కామమే 
నాలో వగ మొదలాయె అది గోదావరి వరదాయె
పరువముతో రొమ్ము చరచి చొరవగాను చేరగనే
ఆ కోడెగాని చూపులలో అది యేమో తోచెనే
ఒక్క నెమలి కన్నులో ఎన్ని వన్నె చిన్నెలో
యువకుని ఒక భంగిమలో అన్ని కళలు మెరయునే 
పెళ్లిగాక ఆ ప్రేమల సంగతికే పోరాదే పోరాదేమనసైన నాసామి పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు సంకెళ్లు (1968)
సంగీతం: ఎం. పూర్ణచంద్రరావు
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి
గానం: పి.సుశీల

మనసైన నా స్వామి రాడేలనే !
నా మదిలోని నెలరాజు లేడేలనే !
జిలిబిలి నవ్వులు చిలికినవాడే
వలపే తానై పిలిచిన వాడే
నంద శోరుడే నా వగ కాడే
వేణుగాన ఝరిలోన ముంచెనే
నితాంత లతాంత వసంత వేళల
మరులు గొలిపినాడే - మరచినాడే
దరికిరాడే - మగువరో

అల్లరి గాలి చల్లగ వీచె
సిగలో పూలె నగవులు దాచే
విరివిలుకాడె తరుణము వేచె
పొంచి పొంచి పులకించి మించి
బిరబిరాన వరాల శరాలు దూసె

కలల బరువు పెరిగె - నిదుర తరిగె
రేయి కరిగె చెలియరో ...


రండయ్యా రండయ్యా (బుర్రకథ) పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు సంకెళ్లు (1968)
సంగీతం: ఎం. పూర్ణచంద్రరావు
సాహిత్యం: పింగళి నాగేంద్రరావు
గానం: ఎల్. ఆర్. ఈశ్వరి బృందం
నిర్వహణ: రాఘవకుమార్ అండ్ పార్టీ విజయనగరం.

క్రిష్ణ వేణి : 
రండయ్యా ! రండయ్యా !
పిన్నలు పెద్దలు రారండయ్యా: ఎన్నడు వినని ఎన్నడు కనని
మహా ద్రోహి కధ వినరండీ ! ప్రజలే రాజ్యం చేసే రోజులు
ప్రజలే తీర్పును చెప్పాలి, ప్రజలే న్యాయం చెయ్యాలి..

వంతలు : 
రండయ్యా రండయ్యా పిన్నలు పెద్దలు రారండయ్యా !

క్రిష్ణ వేణి : ఊరుకు పట్టిన గ్రహచారం ఘోరకలీ ! ఘోరకలీ !
వచనం : కధకాదు, కట్టుకథకాదు, ఉట్టుట్టి కథకాదు !
ఊరికి నడి బొడ్డున నడిచిన మహా పాపికధ !

వంతలు : రండయ్యా రండయ్యా  పిన్నలు పెద్దలు రారండయ్యా

క్రిష్ణ వేణి : ఖూనీల్ చేసిన పాపం పోవగ - చందాల్తో గుడి కట్టిస్తాడు 
కుప్పలు కాల్చిన పాపం పోవగ అన్న దానములు చేయిస్తాడు
మగువల చెరచిన పాపం పోవగ పూజలు భజనలు చేయిస్తాడు
పొగిడే వారిని చేరదీస్తడు తెగడు వాని పై తుపాకి తీస్తడు

వంతలు : అమ్మలారా వినుడీ ! యీ అన్యాయము గనుడీ !

క్రిష్ణవేణి : రావణుని మించేటివాడు - కీచకుని తలదన్ను వారు
కామ క్రోదాలతో వాడు కన్నె పడచుల చరచువాడు,
ముందు నీతులు చెప్పి - వెనక గోతులు తీయ పెద్ద మనిషిని తెలుసుకొండయ్యా 
ఆ పెద్ద మనిషికి సోదరా - ఇద్దరు నమ్మిన బంట్లురా
బుద్ధిలేని ఒక కుంటి నక్కరా - బుర్రలేని ఒక గడేకారిరా 
పైసా కోసం ఫలహారంగా - పచ్చగడ్డినే తింటారా !

వంతలు : భళానంటి భళి తమ్ముడా - మేల్ భళానోయ్ దాదానా !
క్రిష్ణ వేణి వచనం : ఈ బలగంతో ఆ పెద్ద మనిషి సాగించిన దురంతాలు ఎట్లాంటి వనగా
ఎడ్ల పందెం వేయదలచి - పేద రైతును కోరి పిలిచి
పందెమందున ఓడిపోయి - పౌరుషంబున పగలబడ్డాడా
పగబట్టి పామై బుసలు కొట్టాడా !
పరువు నిలవదని గడేకారినే - రయమున పిలిపించె
దొంగ చాటుగా రైతు కొంపకే - అగ్గిని పెట్టించే !
కణకణ మండే మంటల - రైతు కనుల జూచినాడా
ఇంట సావిడిని పందెపు బెడ్లు - యిరుకున బడ్డాయి
వాటి రక్షణకు తెగించి రైతు - మంటల దూకాడా!
పేరు మోసిన పందెపు టెడ్లు పేద రైతుకూడా
భగ భగ పొగ లెగ జిమ్మే మంటల బూడిద అయినారా !
ఆ గ్రామానికి ఏమి వచ్చినా - పెద్ద మనిషియే గతి అన్నట్టు
పిల్లల నిద్దరి సాకే బాధ్యత - పెద్ద మనిషి కే కైవశమయ్యిందా !
 అనాధలకు ఆశ్రయమిచ్చిన పెద్దమనిషి 
ఆ కన్నెపై తాను - కన్నేసి వున్నాడా !
ఇంట నెవ్వరులేని - అదునుకై జూచాడా
చీకటే ముసిరింది - కోరికే రేగింది.
క్రూరంగా చెరబట్టి ఘోరమే చేశాడా
అతి నేరమే చేశాడా

వచనం : పాపం ! ఆ దురదృష్టవంతురాలు 

కృష్ణవేణి : మానం పోయిన ప్రాణ మేలయని
వంతలు : రామరామ శ్రీరామ రాఘవా !
కృష్ణవేణి : ఆత్మహత్యకై సాహసించగా
వంతలు : రామ రామ శ్రీరామ రాఘవా !
కృష్ణవేణి : గడేకారి గని రక్షించెను - ఆ దీనురాలినండీ !
వచనం : విపరీతం, విడ్డూరం అన్నట్టు - యింకా ఏం జరిగింది .
కృష్ణవేణి : పెద్ద మనిషి చెరపట్టగా - కన్య గర్భవతి ఆయెరా !
నెలలు నిండి ఒక బిడ్డనుగని - తా కన్ను మూసెనయ్యో :
వంతలు : జాలిగుండెగల సోదరా! - యీ కరుణ గాధనే విన్నావా !
విషాద గాధనే విన్నావా !
వంతలు వచనం : మరి ఆగడేకారి పసి బిడ్డను ఏం చేశాడు ?
వంతలు వచనం : ఒక అభాగ్యవతి గడపలో పసిపాపను వదలి పెట్టి
పెద్ద మనిషి పుణ్యాన గడేకారి - జైలు పాలయ్యాడు.

కృష్ణవేణి : తల్లి కాని తనలోటు తీరగా తల్లి తనము పై తీపివారగా
ముద్దు ముద్దుగా పెంచినపాప కళకళలారుతు పెరిగి పెద్దదై
కళారంగమున గజ్జేనుకట్టి - నర్తకిగానే ఆరితేరినది.
వంతలు : అమ్మలారా వినుడు అయ్యలరా వినుడీ

కృష్ణవేణి వచనం :  ఇంకా శోచనీయమైన విషయం ఏం జరిగింది ?
శాంతినికేతన్ చదువు పూర్తియై తిరిగి వచ్చిన నవీన యువకుడు
పెద్దమనిషి ఏకైక పుత్రుడు - నర్తకి నేగని ప్రేమించాడండి! -
ఎవరు చేసిన పాపం వారిని - చివరికి మానదని
తెలిసి వచ్చినది నర్తకి జన్మ - తెలిసి వచ్చినది నర్తకి జన్మ
తెలిసి వచ్చినది కొడుకు పట్టుదల
తా కన్న కూతురే తన యింటి కోడలా దారుణంబని మధన పడ్డాడు
తన పాపమే పండి బ్రద్దలై యీ నాడు తన పరువు నట్టేట గలియునన్నాడు
కూడని ధర్మం సాగడమాయని - కొర కొర లాడాడ 
కఠిన చిత్తుడై నర్తకి నే - మటు మాయం చేశాడా ?
ప్రజలే రాజ్యం చేసేరోజులు - ప్రజలే తీర్పును చెప్పాలి
ప్రజలే న్యాయం చెయ్యాలి !

లోకమెల్ల నీది (అభినవ కుచేల పిల్లల నాటిక) పాట సాహిత్యం

 

చిత్రం: బంగారు సంకెళ్లు (1968)
సంగీతం: ఎం. పూర్ణచంద్రరావు
సాహిత్యం: శ్రీశ్రీ
గానం: ఉడుతా సరోజిని, సుమిత్ర 

లోకమెల్ల నీది లోకమే నీ పంచు
కల్లబొల్లి కబురులల్లి తొల్లి
మానవులను చాటు మాటు మాయచేశావు
దేవుడసలు నీవు కావు కావు...

తిండిని దాచే వ్యాపార్లు
లంచం మరిగిన అధికార్లు
మోసంచేసే మొనగాళ్లు
లోకం నిండా నిండారు,

తాండవించుచుండె దారిద్ర్య దేవత
కాలి యినుప గజ్జె ఝల్లుమనగ
ఆటలాడసాగె ఆకలి రాకాసి
జనుల గుండె ఝల్లు ఝల్లుమనగ 

శ్రీ కృష్ణ :
నీవు పలికెడి మాటలు నిక్కువములు
కాని తొందర పాటును మాని, దీని
అసలు నిగ్గును తేల్చుటే అవసరమ్ము
బుద్ధి బలమించుక చూపుము కుచేలా 
ప్రజలే ప్రభువులై రాజ్య పాలనమ్ము
జరుపు కొనెడు ప్రజాస్వామ్య జగతి నీది
నీ ప్రభుత్వము నీవె నిందింతువేని
నీవె నిన్ను నిందించు చున్నావు వినుము


No comments

Most Recent

Default